Posts

లక్ష్మీ కటాక్షం - Avoid doing these things on bed..

Image
  మంచంపై ఈ పనులు చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంటే స్థిరంగా ఉంటుందని మీకు తెలుసా? గత కొన్నేళ్లుగా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆధునీకరణ నేపద్యంలో, నగరాలలో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దాంతో, ఒకప్పుడు విశాలంగా ఉండే ఇళ్ళు కాస్తా, ఇరుకు గదులుగా తయారవుతున్నాయి. అందువల్ల, నేడు చాలా మంది నేర్చుకుంటున్న కొత్త అలవాటు, మంచాలను ఎక్కవగా వాడటం. అవసరం ఉన్నా లేకపోయినా, మనలో చాలా మంది, మాట్లాడితే మంచంపైనే ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే, కొన్ని పనులు మాత్రం, మంచంపైన అస్సలు చేయకూడదనీ, అలా చేస్తే, అష్ట కష్టాలనూ కోరి తెచ్చుకున్నట్లవుతుందనీ, పండితులు చెబుతున్నారు. అసలు మంచంపైన ఏ పనులు చేయవచ్చు? ఏ పనులు చేయకూడదనే విషయంపై, మనలో చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల, శాస్త్రానుసారం, మంచం పై చేయాల్సిన, చేయకూడని పనుల గురించి, తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో గదులు చిన్నగా ఉండటం వల్లనో, బెడ్ రూమ్ లోనే టీవీ ఉందనో, మంచం మీద బాగా కంఫర్ట్ గా ఉందనో, చాలా మంది, ఉదయం టిఫిన్ నుంచి, రాత్రి భోజనం వరకు, మంచాలపైనే కుర్చుని తింటున్నారు. ఆ విధంగా అస్సలు చేయకూడదని, పండితులు చెబుతున్నారు. మంచంపై కుర్చుని తినడం వల్ల,

సవ్యసాచి - భగవద్గీత | Savyasachi - Bhagavadgita

Image
'సవ్యసాచి'! రెండు చేతులతోనూ సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలవాడు! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఈ విధంగా ప్రణమిల్లుతున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6LckBaTv098 ] 00:47 - ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తు తే దేవవర ప్రసీద । విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ।। 31 ।। ఓ భయంకర రూపము కలవాడా, నీవెవరో తెలియచేయుము. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికన్నా ముందే ఉన్న నీ గురించీ, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే, నీ స్వభావము, మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. ఇంతకు క్రితం అర్జునుడు, విశ్వ రూపమును చూడాలని ప్రార్

దీపారాధన ఇలా చేయకపోతే ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం! Deeparadhana Process

Image
దీపారాధన ఎలా చేయాలి?  Deeparadhana or Lighting Lamps or Diyas Importance in Telugu మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. అయితే, మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి? ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి? దీపపు కుందిలో ఎన్ని ఒత్తులు వేయాలి? దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి? ఎటువంటి కుందులలో దీపారాధన చేయాలి? దీపారాధనకు ఏ నూనెను వాడాలి? దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి - అని ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే, ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీపారాధన చేసే ముందు, దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులనూ, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు, ఇత్తడి తో కానీ, పంచ లోహాలతో కానీ, వెండితో కానీ చేసినవే వాడాలి తప్ప, స్టీలు వంటి మరే ఇతర లోహాలూ వాడకూడదు. ఇవి కొనే స్థోమత లేని వారు, మట్టితో చేసిన దీపపు కుందులను వాడవచ్చు. ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా, మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యినీ, లేదా కల్తీ లేని కొబ్బరి నూనెనూ ఉపయోగించాలి.

భూత-భవిష్యత్-వర్తమానాలు! Bhagavadgita భగవద్గీత

Image
  భూత-భవిష్యత్-వర్తమానాలు! భగవానుడి విశ్వరూపంలో అర్జునుడు ఏం చూశాడు? 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (26 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 26 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/JQCy-zl-l0M ] 00:41 - అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః। భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ।। 26 ।। 00:54 - వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని । కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ।। 27 ।। ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడూ, ద్రోణాచార్యుడూ, కర్ణుడూ, ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలక్రిందులుగా, నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు, నేను చూస్తున్నాను. గొ

‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! Jaabaali Maharshi

Image
‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం ఏమిటి? మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మునులూ, రుషులూ ఉన్నా, వారిలో జాబాలి మహర్షి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. ప్రకృతి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి, గొప్ప వ్యక్తిగా కీర్తిని గడించిన జాబాలికి, ఒక వ్యాపారస్థుడు తెలియజేసిన ధర్మ సూక్ష్మం ఏంటి? జాబాలి గోత్రానికే మూలమైన ఆయనకు, ధర్మదేవతలు ఎందుకు గుణపాఠం నేర్పారు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L4UeG2rUorU ] ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే, జాబాలికి కూడా జ్ఞానాన్ని ఆర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని, గౌతమ మహర్షి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. అప్పుడు గౌతముడు, అతడి తల్లిదండ్రులూ, గోత్ర నామాదుల వివరాలు అడిగాడు. ఆ ప్రశ్నకు జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే, చిన్ననాటి నుంచి, అతను తన తండ్రిని ఎరుగడు. ఇక తన గోత్రమూ, తనకు తెలియదు. అందుకని, దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి, గౌత

యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'

Image
రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ! గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ] మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము.. రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునిక

మార్గశిర మాసం - Significance of Margasira Masam

Image
రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత! ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది. [ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ] శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు.. పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం.. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.