Posts

Showing posts with the label Savyasachi

సవ్యసాచి - భగవద్గీత | Savyasachi - Bhagavadgita

Image
'సవ్యసాచి'! రెండు చేతులతోనూ సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలవాడు! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఈ విధంగా ప్రణమిల్లుతున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6LckBaTv098 ] 00:47 - ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తు తే దేవవర ప్రసీద । విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ।। 31 ।। ఓ భయంకర రూపము కలవాడా, నీవెవరో తెలియచేయుము. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికన్నా ముందే ఉన్న నీ గురించీ, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే, నీ స్వభావము, మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. ఇంతకు క్రితం అర్జునుడు, విశ్వ రూపమును చూడాలని ప్రార్