Posts

Showing posts with the label Garuda Puranam

GARUDA PURANA - The Ultimate Science of Life After Death: The Cosmic Algorithm of Karma & Quantum Physics - గరుడపురాణం!

Image
  గరుడపురాణం ప్రకారం ‘కాస్మిక్ అల్గారిథం’!  మరణం అనేది అంతం కాదు, అదొక ట్రాన్సిషన్. అది మరొక డైమెన్షన్ కు ఇన్ఫర్మేషన్ వెళ్లే అద్భుతమైన ప్రక్రియ.. The Ultimate Science of Life After Death: The Cosmic Algorithm of Karma & Quantum Physics ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సామాన్యమైనది కాదు. ఇది సైన్స్ కు అంతుచిక్కని ఒక మహా రహస్యం. అలాగే మన సనాతన ధర్మం వేల ఏళ్ల క్రితమే డీకోడ్ చేసిన ఒక అద్భుతమైన కాస్మిక్ అల్గారిథం. మనం తరచుగా అనుకుంటూ ఉంటాం... ఆధునిక క్వాంటం ఫిజిక్స్, మరియు ఆస్ట్రోఫిజిక్స్, ఇప్పుడిప్పుడే విశ్వ రహస్యాలను ఛేదిస్తున్నాయని. కానీ, వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఎలాంటి అత్యాధునిక పరికరాలు లేకుండా, కేవలం తమ తపోశక్తితో, మరణం అనే అతిపెద్ద ఈవెంట్ హొరైజన్ వెనుక ఉన్న అసలైన సైన్స్ ను గ్రంథస్థం చేశారు. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక పురాణ గాథ కాదు... మన ప్రాచీన సనాతన ధర్మానికీ, నేటి ఆధునిక శాస్త్రవేత్తలను సైతం తలలు పట్టుకునేలా చేస్తున్న క్వాంటం ఈక్వేషన్స్ కూ మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం! మృత్యువు... ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? సైన్స్ ప్రకారం శరీరం మట్టిలో కలుస్తుంది, ఎనర...

Garuda Puranam: Terrifying Signs Before Death! గరుడ పురాణం ప్రకారం ప్రాణం పోయే ముందు కనిపించే సంకేతాలు!

Image
గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు మనకు అందే సంకేతాలు! మరణానికి ముందు మనకు భగవంతుడు ఏర్పాటు చేసిన ఆ సంకేతాలు ఏమిటి? Garuda Puranam: Terrifying Signs Before Death! మరణం... ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఖచ్చితంగా ఎదురయ్యే ఒకే ఒక్క సత్యం. "నేను ఎప్పటికీ బ్రతికే ఉంటాను" అని విర్రవీగే చక్రవర్తుల నుంచి, పూరి గుడిసెలో బ్రతికే సామాన్యుడి దాకా... ఎవరైనా కాలం తీరాక, ఆ మృత్యుదేవత ఒడిలోకి చేరాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు, "జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ".. అంటే, పుట్టిన వాడికి మరణం తథ్యం, మరణించిన వాడు మళ్ళీ జన్మించకా తప్పదు. ఇదే సృష్టి ధర్మం. మానవ కల్పిత మతాలవారు ఏం చెప్పుకున్నా, ఇది మాత్రమే సత్యం.. కానీ... మరణం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఆఖరి శ్వాస విడిచే ముందు మనిషికి ఏమవుతుంది - వంటి ప్రశ్నలు, మానవాళిని వేలాది సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. మోడరన్ సైన్స్ నేటికీ మరణం తర్వాత ఏమవుతుందనే దానికి కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతోంది. కానీ, మన సనాతన ధర్మంలో... సాక్షాత్తూ ఆ శ్రీ మహా విష్ణువు, తన వాహనమైన గరుత్మంతుడికి, ఈ మృత్యు రహస్యాలను పూ...

MIND-BLOWING Secrets of HELL (Narakam) Punishments Revealed నరకము - శిక్షలు!

Image
నరకము - శిక్షలు!  TELUGU VOICE ఇక్కడే మనం ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మళ్ళీ నరకము, శిక్షలు అవసరమా? దైవం కరుణాసముద్రుడు. సకల ప్రాణికోటికీ ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తాననుకున్న పనులను చేసుకుంటూనే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఆ పరమేశ్వరుడు కోపగించుకోడు, ద్వేషంతో దండించడు. కానీ, ఆయన రచించిన వ్యవస్థలో, జీవులు తమ తప్పులకు తగిన దండనను అనుభవించ వలసి రావటం అనేది, భవిష్యత్తులో మనం ఎక్కువ యోగ్యతను పొందటం కోసమే. స్వర్గ నరకాల వ్యవస్థ ఈ దృష్టికోణంతో రచింప బడినదే. మృత్యువు తరువాత వెంటనే మరో దేహం ధరించటం వీలుకాదు. నూతన దేహ ప్రాప్తికి ముందు జీవి, మనోమయ, ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణంలో, కఠోపనిషత్తు వంటి గ్రంధాలలో చెప్పబడిన వివరణతో, గతంలో మనం కొన్ని వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు అవి కూడా చూస్తే మరికొంత అవగాహన వస్తుంది. ఇక వాస్తవంగా స్వర్గ నరకాలేమిటి, అక్కడి శిక్షలు, భోగాల వంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.....

Rules of Impurity (Sutaka or Ashoucha) as per Garuda Puranam గరుడ పురాణం ప్రకారం మృత్యు మైల!

Image
మృత్యు మైల!?  TELUGU VOICE గరుడపురాణంలో పరాశరుడు చెప్పిన ధర్మకర్మాలేమిటి? ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచము లేక మైల వుంటుంది? అతి ప్రాచీన జోతిష్య శాస్త్రానికి ఆద్యుడూ, పరాశర హోర గ్రంథకర్త, వ్యాస భగవానుడి తండ్రి, పరాశర మహర్షి. అటువంటి మహనీయుడు చెప్పిన ధర్మసూక్ష్మాల విషయానికి వస్తే.. గరుడపురాణం ప్రకారం, నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ, తన గురువైన వ్యాస మహర్షికి, ఆయన తండ్రి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా చెప్పనారంభించాడు. “శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ, అన్నీ నశించిపోతాయి. కల్ప ప్రారంభంలో, మన్వాది ఋషులు వేదాలను స్మరించి, బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. అంటూ ప్రారంభించి, మానవాళికి ఆయన వ్యక్తపరచిన విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/K0OBiPNIEsU ] త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్‌ । ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ।। కలియుగంలో దానమే ధర్మము. పాపమూ, శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ క...

The Varna and Caste System as per Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం కులము!?

Image
కులము!? – గరుడపురాణంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలేమిటి?  TELUGU VOICE శూద్రులు తపస్సు చేయడం? వేదాలు చదివి బ్రాహ్మణులవ్వడం? బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం? ఈ సువిశాల విశ్వం లాగానే, ఆది తెలియనిది, అంతం లేనిది, సనాతన ధర్మం. నాలుగు వేదాలను స్థంభాలుగా చేసుకుని సుస్థిరంగా నిలబడిన సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే హిందువులను గెలువలేక, పాశ్చాత్య ధూర్తులు పన్నిన ఒకానొక దౌర్భాగ్యపు పన్నాగం, 'కులం'! 1947 లో పేరుకు వారు వదిలి వెళ్ళినా, Secularism పేరిట హిందువుల ముసుగులో ఇప్పటికీ వారి ప్రయత్నాన్నీ, వారసత్వాన్నీ కొనసాగిస్తూనే వున్నారు కొందరు ద్రోహులు. మరి సాక్షియత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలను, వ్యాస మహర్షి మనకందించిన అష్టాదశ పురాణాలలో ఒకటయిన గరుడపురాణంలో, ఆ పైత్యం గురించి ఏం చెప్పబడింది? వర్ణాశ్రమ ధర్మాలేమిటి? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yF1smKwsNqo ] వర్ణమంటే కులం కాదు. పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ, నేటి కలికాల...

గరుడ పురాణం - మనిషి పాపపుణ్యాలను లెక్కించే శ్రవణులు - Garuda Puranam

Image
‘గరుడ పురాణం’ ప్రకారం.. మనిషి పాపపుణ్యాలను లెక్కించే ‘శ్రవణులు’!?  TELUGU VOICE ఈ కలియుగంలో, అన్ని పురాణాలలోకీ ప్రముఖమైనవిగా పరిగణించబడేవి, మూడు. వాటిలో ప్రధానదీ, ప్రజలకు శుభాలనందించేదీ, శ్రీమద్ భాగవతం. అందుకే అన్ని పురాణాలలో భాగవతం, అత్యున్నతమైనది. తరువాత విష్ణు పురాణం, ఆ తరువాత, గరుడ పురాణంగా చెప్పవచ్చు. అటువంటి గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వీడియోలుగా, ఇది వరకు కొన్నింటిని అందించి ఉన్నాను. వాటి playlist ను, వీడియో క్రింద description లో పొందుపరుస్తున్నాను. మనిషి సన్మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి స్వయంగా తెలియజేసిన మరికొన్ని విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ATV1ynLPOGs ] “జ్ఞానసాగరా! శ్రీ మహావిష్ణూ! యమలోకంలో శ్రవణులనే వారుంటారనీ, వారు సర్వజ్ఞులనీ విని ఉన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను.” అని అన్న గరుత్మంతుడితో విష్ణుభగవానుడు.. “గరుడా! ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినపుడు, నేను దానిని ఆత్మ లీనం చేసుకుని, పాల సముద్రంలో శయనించా...

అంతిమ యాత్ర! ‘గరుడ పురాణం’ Garuda Puranam - Antim Yatra

Image
అంతిమ యాత్ర! జీవిత సత్యాలు..  TELUGU VOICE ‘గరుడ పురాణం’ ప్రకారం వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులు! మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ గురించి మన గత వీడియోలో తెలుసుకున్నాము. అటువంటి ఉత్తమమైన జన్మ అంత్య కాలంలో, సశాస్త్రీయంగా చేయాల్సిన విధులను, పాశ్చాత్య పోకడలలో పడో, పద్ధతులు తెలియకో, Secular మూర్ఖుల ప్రభావం వలన ఇవన్నీ మూఢ నమ్మకాలుగా భావించో, అంతిమ యాత్రకు సంబంధించిన విధి విధానాలను విస్మరిస్తున్నాము. అందరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, అసలైన పద్ధతులను తెలుసుకుంటారనీ, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారనీ ఆశిస్తున్నాను.. ప్రతి హిందువూ తెలుసుకుని, తప్పక పాటించాల్సిన ఇటువంటి అత్యవసర విషయాలను అందరికీ చేరేలా ప్రయత్నిద్దాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1s3K7fXEf_A ] శ్రీమహావిష్ణువును గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు.. “హే భగవన్‌! మృత్యువు ఆసన్నమైనప్పుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని వుంది. కరుణించండి” అని ప్రార్ధించాడు.. దాన...

మనిషి జన్మ! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ Garuda Puranam

Image
మనిషి జన్మ! జీవిత సత్యాలు..  TELUGU VOICE ‘గరుడ పురాణం’ ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ ఏమిటో తెలుసా? మన సనాతన ధర్మంలోని పురాణాలు, మన మహర్షులు మనకు అందించిన వరాలు. అందులోనూ వ్యాస భగవానుడి కృతులైన అష్టాదశ పురాణాలలోని గరుడ పురాణం, మనిషి జీవన గమనానికి మార్గ దర్శకం. సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్లభమైన మనుష్య జన్మకు సంబంధించి, గరుడుడికి సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు తెలియజేసిన ఆ విషయాలలో, మనిషిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు? అప్పుడు ఇంద్రియాలు ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ, ఎలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి, ఎలా వెళ్తాడు? యమలోకానికీ విష్ణులోకానికీ ఏయే మార్గాలలో వెళతాడన్న గరుడుడి సందేహాలకు, శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2eMvV6mcSnU ] “ఓయీ వినతనందనా! పరస్త్రీనిగానీ, బ్రాహ్మణుని ధనాన్నిగానీ అపహరించినవాడు, ని...

గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? Garuda Puranam

Image
సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ!  TELUGU VOICE గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? మనిషి జీవన గమనంలో ఇటువంటి తప్పులు చేస్తే, వాటికి శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసుకుని, సన్మార్గంలో నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో, గరుడుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన అమృత వాకులను, అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘గరుడ పురాణం’ పేరిట మనకు అందించారు, కృతికర్త అయిన వ్యాస భగవానుడు. ఇక అందులోని ఏడవ అధ్యాయంలో నిక్షిప్తమైవున్న ‘సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ’లోకి వెళితే.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gPM542QYpBA ] విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని వుందని గరుత్మంతుడు వేడుకోగా, ఆతనిని అనుగ్రహించి ఇలా చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు.. “గరుత్మంతా! పూర్వకాలంలో సంతప్తకుడనే తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన తన తపోబలం వల్ల, పాపరహితుడయ్యాడు. ఈ ‘సంసారం’ పేరులోనే గానీ, తత్త్వంలో సారం లేనిదని తెలుసుకుని, అడవులలోకి పోయి, వైఖానస మునుల వృత్తినే తానూ పాలిస్తూ, అరణ్యంలోనే చరిస్తుండే వాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని, తద్ద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో,...

‘గరుడ పురాణం’ - గర్భస్థ శిశువు! Garuda Puranam

Image
గర్భస్థ శిశువు! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ ప్రకారం తల్లి గర్భంలో శిశువు పడే ‘నరక యాతన’ తెలుసా? మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి, తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో, స్త్రీ మృత్యువు అంచులవరకూ చేరుకుని, ప్రాణికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాలు స్త్రీమూర్తికి ఎంతో ప్రాముఖ్యతనూ, వెలకట్టలేని గౌరవాన్నీ ఆపాదించాయి. కానీ, గర్భంలో ఉన్న శిశువు గురించి మనం ఏనాడైనా ఆలోచించామా! నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందనే విషయాల గురించి, మనలో చాలామందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. వేల ఏళ్ళ క్రితం రచించబడిన గరుడ పురాణంలో, గర్భస్థ శిశువు గురించీ, ఆ సమయంలో అది పడే బాధల గురించీ, స్పష్టంగా వివరించబడివుంది. గర్భస్థ శిశువు యొక్క అనుభవాలేంటి? చీకటి ఆగాధంలో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటి? ప్రసూతి సమయంలో శిశువు శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు గరుడుడికి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధిం...