Posts

Showing posts with the label Goloka & Krishna Mystery

864 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే ఆ కృష్ణుడు ఎవరు?

Image
  864 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భూమిపైకి వచ్చే ఆ కృష్ణుడు ఎవరు? Goloka & Krishna Mystery - Difference between Goloka Krishna & Dwaraka Krishna మనం ఇప్పటివరకు ఎన్నో రహస్యాలనూ, చరిత్రలనూ ఛేదించాము. కానీ ఈ రోజు... మనం ఈ భౌతిక విశ్వాన్ని దాటి, సమయానికి (Time) కూడా అందనంత దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి ప్రయాణించబోతున్నాము. చాలామందికి 'స్వర్గం' తెలుసు, 'వైకుంఠం' తెలుసు. కానీ వీటన్నింటికంటే పైన... సృష్టి మొత్తానికీ మూలమైన ఒక రహస్య సామ్రాజ్యం ఉందని మీకు తెలుసా? అదే 'గోలోకం'. మనం మహాభారతంలో కృష్ణుడిని చూశాము... యుద్ధనీతిని చెప్పేవాడిగా, అర్జునుడికి రథసారధిగా, కంసుడిని చంపిన వీరుడిగా, ఇలా ఎన్నో.. కానీ మీకు తెలుసా? ఆ కృష్ణుడు వేరు... మనకు తెలియని, శాస్త్రాలలో మాత్రమే దాగి ఉన్న 'గోలోక కృష్ణుడు' వేరు! ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? కృష్ణుడు ఒక్కడే కదా, ఇద్దరు ఎలా ఉంటారని? పురాణాలు, ముఖ్యంగా లఘు భాగవతామృతం మరియు బ్రహ్మ సంహిత, ఒక విస్మయపరిచే రహస్యాన్ని చెబుతున్నాయి. కురుక్షేత్రంలో గీత చెప్పిన కృష్ణుడూ, గోలోకంలో రాధతో ఆడుకునే కృష్ణుడూ ఒక్కరే అయినా......