Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, November 16, 2026

అత్యంత రహస్యమైన అష్టావక్ర గీత! The Untold Secrets of Ashtavakra Gita

అత్యంత రహస్యమైన అష్టావక్ర గీత! అత్యంత రహస్యమైన ఈ గీత.. భగవద్గీత కన్నా కఠినమైనదా? The Untold Secrets of Ashtavakra Gita

అత్యంత రహస్యమైన అష్టావక్ర గీత!
అత్యంత రహస్యమైన ఈ గీత.. భగవద్గీత కన్నా కఠినమైనదా?
The Untold Secrets of Ashtavakra Gita


భగవద్గీత, కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధ. ఇది మనందరికీ తెలుసు. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు అని చెప్పిన ఆ గీతామృతాన్ని, ప్రపంచమంతా కీర్తిస్తోంది. కానీ... సనాతన ధర్మంలో భగవద్గీత ఒక్కటే గీత కాదు. ఉద్ధవ గీత ఉంది, శివ గీత ఉంది, అను గీత ఉంది, గణేశ గీత ఉంది... కానీ వీటన్నింటికీ భిన్నమైన, అత్యంత కఠినమైన, కేవలం సత్యాన్ని మాత్రమే నిర్మొహమాటంగా, ముఖం మీద కొట్టినట్టు చెప్పే ఒక మహా గీత ఉంది. అదే... త్రేతాయుగం నాటి ‘అష్టావక్ర గీత’.

ఎవరైనా సన్యాసం తీసుకోవాలని అనుకుంటే, లేదా వేదాంతం చదవాలని అనుకుంటే, గురువులు ముందుగా భగవద్గీతనూ, ఉపనిషత్తులనూ బోధిస్తారు. కానీ అష్టావక్ర గీతను మాత్రం, ప్రారంభంలో ఎవరికీ బోధించరు. అది ఎందుకో తెలుసా? ఇది చదివితే... మనకి ఈ ప్రపంచం మీద ఉన్న భ్రమలు ఒక్క క్షణంలో పగిలిపోతాయి. 'నేను' అనే అహంకారం బూడిదైపోతుంది. అసలు దేవుడు ఎక్కడో లేడు, 'నువ్వే దేవుడివి' అని ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా డైరెక్ట్ గా చెప్పే ఏకైక గ్రంథం ఇది.

ఒకసారి ఊహించుకోండి... ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన స్వామి వివేకానంద సైతం తన తొలిరోజుల్లో ఈ గీతను చదవడానికి భయపడ్డారు. అవును! తన గురువు రామకృష్ణ పరమహంస అష్టావక్ర గీతను చదవమని ఇస్తే, 'నేనే బ్రహ్మను ఏంటి? ఈ సృష్టి అంతా నాలోనే ఉండటం ఏంటి? ఇది నాస్తికత్వం, అహంకారం.. నేను దీన్ని చదవను' అని భయపడి పక్కన పెట్టేశారట వివేకానందుడు. కానీ ఆ తర్వాత కాలంలో అదే గ్రంథం ఆయన ఆలోచనలను సమూలంగా మార్చేసి, విశ్వవిజేతగా నిలబెట్టింది. అంతటి మహానుభావుడినే తొలిచూపులో వణికించిన పవర్ఫుల్ గ్రంథం ఇది.

మనం రోజూ చేసే పూజలు, జపాలు, తీర్థయాత్రలు... ఇవన్నీ దేవుడిని చేరుకోవడానికి వేసే తొలి మెట్లు మాత్రమే. కానీ, ఆ మెట్లన్నీ ఎక్కేశాక, గర్భగుడి తలుపులు తెరిచి చూస్తే అక్కడ దేవుడు కాదు... 'నువ్వే ఉన్నావు' అని మీ ముఖానికి అద్దం పెట్టి చూపించే అల్టిమేట్ 'రెడ్ పిల్ (Red Pill)' ఈ అష్టావక్ర గీత. అందుకే, పచ్చి సత్యాన్ని తట్టుకునే గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను ముందుకు చూడండి. మీ నమ్మకాలనూ, 'నేను' అనే మీ అహాన్నీ ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టే ప్రయాణం ఇది.

ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. 8 వంకరలతో పుట్టిన ఒక అష్టావక్రుడు, జనక మహారాజుకు చేసిన బ్రహ్మ జ్ఞాన బోధ... అష్టావక్ర గీతలోని అనంతమైన రహస్యాలనూ, సనాతన ధర్మంలో దానికున్న స్థానాన్నీ, ఈరోజు డీకోడ్ చేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి.. ఎందుకంటే ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయబోతోంది.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/p_h_iDf4KXI ]


ఈ కథ మహాభారత కాలం నాటికన్నా ముందుది. కహోళుడు అనే గొప్ప వేద పండితుడు, తన ఆశ్రమంలో శిష్యులకు వేదాలు బోధిస్తున్నాడు. ఆయన భార్య సుజాత గర్భవతి. ప్రతిరోజూ కహోళుడు చేసే వేద పఠనాన్ని, ఆ గర్భంలో ఉన్న శిశువు వినేవాడు.

ఒకరోజు కహోళుడు వేదం చదువుతుండగా, ఒక మంత్రాన్ని తప్పుగా ఉచ్చరించాడు. అప్పుడు గర్భంలో ఉన్న ఆ శిశువు అన్నాడు... 'తండ్రీ! మీరు చదువుతున్న మంత్రం తప్పు. దాని అసలైన అర్థం అది కాదు..' అని గర్భం నుంచే తండ్రిని సరిదిద్దాడు.

తనని గర్భంలో ఉన్న కొడుకు అవమానించాడన్న అహంకారంతో రగిలిపోయిన కహోళుడు, కోపంతో ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు. 'గర్భంలో ఉండి నాకే వంకర బుద్ధులు నేర్పుతావా? నువ్వు పుట్టేటప్పుడే శరీరంలో ఎనిమిది వంకరలతో (Deformities) పుడతావు గాక!' అని శపించాడు."

"మిత్రులారా... ఆలోచించండి. జ్ఞానం ఉన్నచోట అహంకారం ఉండకూడదు. అహంకారం శాపాలకు దారితీస్తుంది. అలా తండ్రి శాపం వల్ల, ఎనిమిది వంకరలు తిరిగిన శరీరంతో పుట్టినవాడే... మన కథా నాయకుడు అష్టావక్రుడు.

అష్టావక్రుడు పుట్టే సమయానికే, కహోళుడు జనక మహారాజు ఆస్థానంలోని 'వంది' అనే పండితుడితో వాదించి ఓడిపోయి, జలసమాధి చేయబడ్డాడు. తన తండ్రి మరణానికి కారణమైన వారిని జయించడానికి, 12 ఏళ్ల వయసులో ఆ అష్టావక్రుడు జనక మహారాజు కొలువుకు బయలుదేరాడు.

మిథిలా నగరంలో, జనక మహారాజు కొలువు. భారతదేశంలోనే అత్యంత ఉద్దండ పండితులు, ఋషులు అక్కడ ఉన్నారు. ఆ సభలోకి నడుచుకుంటూ వచ్చాడు, 12 ఏళ్ల అష్టావక్రుడు. ఆ వంకర శరీరాన్నీ, అతని నడకనూ చూసి సభలోని పండితులంతా ఫక్కున నవ్వారు. జనక మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు.

సభ మొత్తం నవ్వుతోంది... కానీ అష్టావక్రుడు, వాళ్ళకన్నా బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టాడు. ఆ నవ్వుకి సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్.

అప్పుడు జనక మహారాజు అడిగాడు.. 'బాలకా, మేమంతా నీ శరీరాన్ని చూసి నవ్వాము. మరి నువ్వెందుకు నవ్వుతున్నావు?' అని. దానికి అష్టావక్రుడు ఇచ్చిన సమాధానం, సనాతన ధర్మంలోనే ఒక మైలురాయి.

'మహారాజా! నేను వచ్చింది జ్ఞానుల సభకు అనుకున్నాను.. కానీ ఇక్కడంతా చర్మకారులు (Cobblers - చెప్పులు కుట్టేవారు) మాత్రమే ఉన్నారు.' ఆ మాట వినగానే సభ ఉలిక్కిపడింది. అష్టావక్రుడు కంటిన్యూ చేశాడు.. 'ఒక చర్మకారుడు, చర్మాన్ని చూసి ఇది మంచి చర్మం, ఇది చెడ్డ చర్మం అని ఎలా కొలుస్తాడో... అలాగే మీరంతా నా శరీరంలో ఉన్న మాంసాన్ని, చర్మాన్ని, ఎముకల వంకరలను చూస్తున్నారు. నాలోపల ఉన్న ఆత్మ వంకరగా ఉందా? నది వంకరగా ఉంటే, అందులోని నీరు వంకరగా ఉంటుందా మహారాజా? కుండ వంకరగా ఉంటే, అందులోని నీటిలో ప్రతిబింబించే ఆకాశం వంకరగా ఉంటుందా?'

వాట్ ఏ స్టేట్ మెంట్! ఎంతటి అద్భుతమైన మాట! దేహాన్ని కాదు, దేహిని చూడమన్న ఆ మాటకి, జనక మహారాజు సింహాసనం దిగి అష్టావక్రుడి పాదాలపై పడ్డాడు. తన గురువుగా స్వీకరించాడు. అక్కడ మొదలైంది... ఈ భూమండలంపై ఎప్పటికీ నిలిచిపోయే బ్రహ్మజ్ఞాన సంవాదం... అదే ‘అష్టావక్ర గీత’.

జనకుడు అష్టావక్రుడిని మూడు ప్రశ్నలు అడిగాడు:

1. జ్ఞానాన్ని ఎలా పొందాలి?
2. ముక్తి (Liberation) అంటే ఏమిటి?
3. వైరాగ్యం ఎలా కలుగుతుంది?

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 18 అధ్యాయాలలో, కర్మ యోగం, భక్తి యోగం, ధ్యాన యోగం అని ఎన్నో మార్గాలు చెప్పాడు. కానీ అష్టావక్రుడు ఆప్షన్లు ఇవ్వలేదు. డైరెక్ట్ ఎటాక్ చేశాడు.

అష్టావక్ర ఉవాచ:

ముక్తిమిచ్ఛసి చేత్తాత విషయాన్ విషవత్ త్యజ |
క్షమార్జవదయాశంతోష సత్యం పీయూషవద్ భజ ||

'ఓ జనకా! నీకు ముక్తి కావాలంటే, ఈ ప్రాపంచిక విషయాలను, అంటే, నచ్చినవి, కోరికలు, విషం లాగా వదిలెయ్యి. క్షమ, దయ, సత్యం, సంతోషాలను అమృతంలా స్వీకరించు.'

కానీ అసలైన అద్వైతం తర్వాతి శ్లోకంలో చెప్పాడు. 'నువ్వు బ్రాహ్మణుడివి కావు, క్షత్రియుడివి కావు, వైశ్యుడివి కావు. నువ్వు ఈ కంటికి కనిపించే శరీరానివి అసలే కావు. నువ్వు కేవలం ఒక సాక్షివి (The Observer). ఈ విశ్వం మొత్తం నీలోనే ఉంది. పాపం, పుణ్యం, స్వర్గం, నరకం ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఆత్మకు ఎలాంటి బంధాలు లేవు. నువ్వు బంధించబడ్డానని అనుకుంటే బంధీవి అవుతావు, ముక్తుడను అనుకుంటే ముక్తుడివి అవుతావు.'

హితులారా, ఇది వినడానికి సులభంగానే ఉన్నా, జీర్ణించుకోవడం చాలా కష్టం. మనం రోజూ, 'నా కారు, నా ఇల్లు, నా దేహం, నా బంధాలు' అని బ్రతుకుతున్నాము. కానీ అష్టావక్రుడు చెప్తున్నది, నువ్వు చేసేది ఏమీ లేదు, జరిగేదంతా జరుగుతూనే ఉంటుంది, నువ్వు కేవలం చూసేవాడివి (Observer) మాత్రమే అని. ఇదే క్వాంటం ఫిజిక్స్ లో చెప్పే "Observer Effect". లక్షల ఏళ్ల క్రితమే, అష్టావక్ర గీతలో ఈ సైన్స్ ఉంది.

సనాతన ధర్మంలోని ప్రాచీన గ్రంథాలన్నీ ఒక లెక్కైతే, అష్టావక్ర గీత మరో లెక్క! ఉదాహరణకు, పతంజలి యోగ సూత్రాలు ఏం చెబుతాయి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి... ఇలా ఎనిమిది కఠినమైన అంగాలు ఆచరిస్తే కానీ, ముక్తి రాదని చెబుతాయి. కానీ అష్టావక్రుడు ఈ సంప్రదాయ పద్ధతులన్నింటినీ ఒక్క దెబ్బతో పక్కనపెట్టేశాడు!

'ఓ జనకా! నువ్వు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, అడవులకు వెళ్లి కళ్ళు మూసుకుని కూర్చోవలసిన పనే లేదు. ఎందుకంటే, ధ్యానం చేయడం కూడా ఒక పనే అంటే కర్మే. నువ్వు స్వచ్ఛమైన ఆత్మవి కదా? ఆత్మకు ధ్యానంతో పనేంటి? ఈ క్షణంలో, ఇక్కడే నువ్వు ముక్తుడివి అని తెలుసుకో' అని కుండ బద్దలు కొట్టాడు. ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పిన 'తత్ త్వమ్ అసి' – ‘అదే నువ్వు’ అనే బ్రహ్మ రహస్యాన్ని, ఇంతకంటే బోల్డ్ గా ఎవరూ చెప్పలేదు.

ఈ విశ్వం ఎలా నడుస్తోంది? అనే దానికి అష్టావక్రుడు వాడిన 'సముద్రం - అలల' ఉదాహరణ అత్యద్భుతం. సముద్రంలో ఎన్నో అలలు పుడతాయి, మళ్ళీ ఆ నీటిలోనే కలిసిపోతాయి. అలలకీ, సముద్రానికీ ఏమైనా తేడా ఉందా? లేదు! ఆకారం వేరు కావచ్చు.. కానీ రెండూ నీరే. అలాగే, ఈ బ్రహ్మాండం అంతా నీలోనే పుడుతోంది, నీలోనే లయమవుతోంది. సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు... అంతా ఒకటే. దీనినే ఆదిశంకరాచార్యులు 'అద్వైతం' అంటే రెండు కానిది, ఒకటే అని ప్రపంచానికి చాటి చెప్పారు. అద్వైత వేదాంతానికి అష్టావక్ర గీత ఒక ప్రాథమిక పునాది రాయి.

ఈ మాటలు వింటున్న జనక మహారాజుకు ఒక అద్భుతమైన మ్యాజిక్ జరుగింది. ఏళ్ల తరబడి మునులు తపస్సు చేసినా దొరకని ఆ బ్రహ్మజ్ఞాన స్థితిని, జనకుడు ఆ మాటలు విన్న మరుక్షణమే అనుభవించాడు. సభ మధ్యలో కూర్చున్న జనకుడు మైమరచిపోయి అరిచాడు...'అహో! నేను ఎంత అద్భుతమైన వాడిని! నాకు మరణం లేదు. ఈ జగత్తు అంతా నా ఇచ్ఛామాత్రంగానే నడుస్తోంది' అని ఆనంద పారవశ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక శిష్యుడు గురువు మాట వింటూనే, క్షణాల్లోనే జ్ఞానోదయం (Instant Enlightenment) పొందడం, సనాతన ధర్మ గ్రంథాల చరిత్రలోనే ఒక అపూర్వ, అరుదైన ఘట్టం.

ఇక సనాతన ధర్మంలో మనకు ఎన్నో గీతలు ఉన్నాయి. వాటన్నింటికీ, అష్టావక్ర గీతకూ ఉన్న తేడా ఏంటి?

1. భగవద్గీత (Bhagavad Gita) vs అష్టావక్ర గీత: భగవద్గీతలో అర్జునుడు ఎమోషనల్ గా వీక్ అయిపోయాడు. తన బంధువులను చంపలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అతన్ని మోటివేట్ చేయడానికి ముందుగా కర్మ యోగం చెప్పి, మెల్లగా పై మెట్టుకు తీసుకెళ్లి జ్ఞానం బోధించాడు. భగవద్గీత ఒక అద్భుతమైన మెట్ల మార్గం (Staircase). కానీ ఇక్కడ జనక మహారాజు ఆల్రెడీ ఒక పక్వతకు వచ్చిన జ్ఞాని. ఆయనకు మెట్లు అవసరం లేదు.. డైరెక్ట్ గా లిఫ్ట్ కావాలి. ఆ లిఫ్టే అష్టావక్ర గీత. ఇందులో భక్తి ఉండదు, పూజలు ఉండవు, కర్మలు చేయమని చెప్పడు. ‘జ్ఞానం’... అచ్చమైన జ్ఞానం మాత్రమే ఉంటుంది.

2. ఉద్ధవ గీత (Uddhava Gita): కృష్ణుడు తన అవతారం చాలించే ముందు, తన భక్తుడైన ఉద్ధవుడికి చేసిన బోధ ఇది. ఇది భాగవతంలో ఉంటుంది. ఇందులో కృష్ణుడు వైరాగ్యాన్ని, భక్తిని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పాడు. ఇది పూర్తిగా భక్తి మార్గం.

3. శివ గీత (Shiva Gita): ఇది పద్మ పురాణంలో వస్తుంది. రామాయణంలో సీతను కోల్పోయి రాముడు బాధపడుతున్నప్పుడు, అగస్త్య ముని సూచనతో, రాముడు శివుడిని ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు స్వయంగా శ్రీరాముడికి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాడు. ఇందులో శివుడే సుప్రీం బ్రహ్మ అని చెప్పబడింది.

కానీ అష్టావక్ర గీతలో... దేవుడు అనే కాన్సెప్ట్ బయట ఎక్కడో లేదు. 'అహం బ్రహ్మాస్మి', నేనే బ్రహ్మను అనే ఉపనిషత్ మహావాక్యానికి ప్రాక్టికల్ గైడ్, ఈ అష్టావక్ర గీత. అందుకే స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఓషో లాంటి మహాత్ములు, అష్టావక్ర గీతను అత్యున్నత శిఖరంగా అభివర్ణించారు.

ఇంతటి గంభీరమైన అష్టావక్ర గీత, ఈనాటి మోడరన్ సొసైటీకి అవసరమా..? అంటే, వంద శాతం అవసరం! ఈరోజు మనం దేనికోసం పరిగెడుతున్నాము? డబ్బు, పేరు, సోషల్ మీడియాలో లైక్స్. మన సంతోషం అంతా పక్కవాడి అప్రూవల్ మీద ఆధారపడి ఉంది. ఒకరు మనల్ని పొగడగానే సంతోషిస్తాము, తిట్టగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము.

కానీ అష్టావక్రుడు ఏమంటున్నాడు?“నువ్వు దేహానివి కావు... నువ్వు స్వచ్ఛమైన స్పృహవు.. అంటే, Pure Consciousness. చీకటి గదిలో తాడును చూసి పాము అనుకుని భయపడతాము. లైట్ వేయగానే, అది పాము కాదు, తాడు అని తెలుస్తుంది. ఈ ప్రపంచం, ఈ కష్టాలు, అన్నీ ఆ చీకటి గదిలో పాము లాంటివే. జ్ఞానం అనే వెలుగు రాగానే, అన్నీ మాయ అని తెలుస్తుంది.

స్నేహితులారా.. అష్టావక్ర గీత మనకు నేర్పే అతి పెద్ద పాఠం, "Letting Go" అంటే, వదిలేయడం. దీని అర్థం ప్రపంచాన్ని వదిలేసి అడవులకు వెళ్ళమని కాదు.. ప్రపంచం మీద ఉన్న అటాచ్మెంట్ నీ, 'నేను' అనే ఈగోని వదిలేయడం.

జనక మహారాజు అష్టావక్రుడి బోధ విన్న తర్వాత, రాజ్యాన్ని వదిలేసి వెళ్లలేదు. ఒక సన్యాసి లాగా రాజ్యాన్ని పరిపాలించాడు, రాజర్షి అయ్యాడు. మనం కూడా మన కుటుంబంలో, మన వృత్తిలో ఉంటూనే, తామరాకు మీద నీటిబొట్టులా జీవించవచ్చు అని, అష్టావక్ర గీత నిరూపిస్తుంది.

ఇదీ... శరీరానికి ఎనిమిది వంకరలున్నా, ఆలోచనలో ఏ మాత్రం వంకరలేని ఒక మహా బ్రహ్మజ్ఞాని, సనాతన ధర్మానికి అందించిన అద్భుతమైన వరం, 'అష్టావక్ర గీత'. భగవద్గీత మనకు ఎలా బతకాలో నేర్పిస్తే, అష్టావక్ర గీత అసలు మనం ఎవరో గుర్తుచేస్తుంది.

ఈ వీడియో మీలో ఒక చిన్న ఆలోచననైనా రగిలించి ఉంటే, తప్పకుండా లైక్ చేయండి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సనాతన ధర్మంలోని ఇలాంటి మరెన్నో అద్భుతమైన రహస్యాల కోసం, మన వాయిస్ ఆఫ్ మహీధర్ ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్ లో మీకెలా అనిపించిందో చెప్పండి. 'అహం బ్రహ్మాస్మి' అని కామెంట్ చేయండి.

🚩 ఓం శ్రీ గురుభ్యో నమః 🙏

No comments:

Post a Comment

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...