Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Wednesday, February 26, 2025

మంత్ర రాజం Mantra Rajam

 

మంత్ర రాజం: నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే! TELUGU VOICE

'సాంబా' అని పిలిస్తే  చాలు.. శివుడు వెంటనే కరిగిపోతాడు. 

మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి  శివదీక్ష ఇస్తూ...

”నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...
య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్” అనే మంత్రాన్ని ఉపదేశించారు.

చాలా గొప్పదయిన ఈ మంత్రం, శివపురాణంలో కూడా వస్తుంది.

నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే..

ఈ నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.

1). నమః శివాయ...

(శివాయ నమః) మహాపంచాక్షరీ మంత్రం.
శివ భక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.

అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మ ప్రణవం.. న, మ, శి, వా, య అనే అయిదు అక్షరాల శివ మంత్రం స్ధూల ప్రణవం. పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది.

2). సాంబాయ...

అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్నీ సమృద్ధిగా పొంద వచ్చును.

3). శాంతాయ...

ఆయనను తలంచుకుంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే.

"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.

4). పరమాత్మనే నమః...

చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటినీ కలిపి నాలుగు నామాలతో పొదిగిన 'మంత్ర రాజం' ఈ శ్లోకం..!

Monday, February 24, 2025

Battle of the Ten Kings in Rigveda | Dasaragna War | దశరాజ్ఞ యుద్ధం


ఆఫ్ఘనిస్థాన్ లో సనాతన ధర్మం! TELUGU VOICE
‘దశరాజ్ఞ యుద్ధం’ ‘Battle of The Ten Kings’ గురించి ఋగ్వేదంలో ఏమని పేర్కొనబడింది?

ఈ ప్రపంచంలో నేటికీ మనుగడలో ఉన్న ఏకైక పురాతన నాగరికత, అత్యంత ఉత్కృష్టమైన విలువలు కలిగిన ధర్మం ఏదైనా ఉంది అంటే, దానికి ఒకేఒక్క సమాధానం మన ‘సనాతన ధర్మం’. అయితే, తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచం మొత్తం వ్యాపించిన మన ధర్మం, ఉత్థాన పతనాలను ఎన్నింటినో చవి చూసింది. అద్భుతమైన రాజ భవనాలతో, ఆమోఘమైన శిల్ప కళలతో కూడుకున్న అందమైన ఆలయాలూ, నేటి metropolitan సిటీలను కూడా తలదన్నే ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించిన నగరాలూ, వర్తక వ్యాపారాలూ, ప్రాచీన కళలతో మన హిందూ ధర్మం పాదం మోపిన ప్రతి చోట, దేదీప్యమానంగా వెలుగొందింది. అయితే, స్వార్ధపూరిత, మానవస్థాపిత కొత్త మతాల పుట్టుక మనుషులలో క్రూరత్వాన్ని నింపడమే కాకుండా, ఎంతో అద్భుతమైన మన సనాతన ధర్మాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దాదాపు తుడిచి పెట్టేసింది. అందుకు నేటికీ మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకప్పుడు సనాతన ధర్మం పరిఢవిల్లిన ఆ ప్రాంతం, ఇప్పుడు ఎందుకని ఎడారి మతం పాలైంది? ఒకప్పుడు అద్భుతమైన శిల్ప సంపదకూ, ఆమోఘమైన ఆలయాలకూ, రాజ ప్రసాదాలకూ అలవాలమైన ఆఫ్ఘనిస్థాన్, నేడు మట్టి దిబ్బల నిలయంగా ఎందుకు మారిపోయింది? ఎంతో ఘనమైన సనాతన సంస్కృతి వెలుగొందిన ఆఫ్ఘనిస్థాన్ నుంచి హిందూ ధర్మం పూర్తిగా ఎలా తుడిచిపెట్టుకు పోయిందనే సందేహాలు కలుగుతాయి. వాటి వెనుక ఉన్న అసలు సంఘటనలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/uKbb2uF8UM0 ]


మన పురాణాలనూ, ఇప్పుడిప్పుడే నేటి పరిశోధకులు వెలికి తీస్తున్న మన ప్రాచీన చరిత్రనూ పరిశీలిస్తే, ఒకప్పుడు యావత్ ప్రపంచం మన సనాతన ధర్మం దేదీప్యమానంగా పరిఢవిల్లిందని తెలుస్తోంది. అటువంటి ప్రదేశాలలో ఆఫ్ఘనిస్థాన్ అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దేశం పేరు వినగానే, పురాణాలలో చెప్పబడిన రాక్షల వంటి తాలిబన్ మూకలూ, లోయ ప్రాంతాలలో కాలం వెళ్ళ దీస్తున్న ఇస్లామిక్ ట్రైబల్స్, ఎటు చూసినా మట్టి దిబ్బలూ కనిపిస్తూ, తుపాకీ మోతలూ, అమాయక ప్రజల ఆర్తనాదాలూ మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ, కొన్ని యుగాలకు పూర్వం, ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండేదక్కడ. ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయాలూ, ఉన్నత శ్రేణి వర్తక వ్యాపార ప్రదేశాలూ, భారీ రాజ భవనాలూ, ఎంతో వైభవంగా కనువిందుజేసేవి. అక్కడి రాజులు ఎంత ఆధ్యాత్మిక పరులంటే, తమ నాణాలపై కూడా ఆ శివయ్య ముఖచిత్రాన్నీ, శివ లింగ ప్రతిమనూ ముద్రించుకునే వారు. మరి అలాంటి ప్రదేశం నేడు ఉన్న పరిస్థితికి ఎలా దిగజారిందో తెలియాలంటే, మహా భారత కాలానికంటే ముందూ, రామావతారం కూడా పురుడు పోసుకోక ముందు నుంచి నేటి వరకు ఏం జరిగిందో, సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

ఆది నుంచి ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు స్పష్టంగా ఉండేవి. అందులో నేడు ఆఫ్ఘనిస్థాన్ గా పిలుచుకుంటున్న ప్రదేశంలో, సనాతన ధర్మం మరింత ఉత్కృష్టమైనదిగా ఉండేదని తెలుస్తోంది. నేడక్కడున్న కొన్ని తెగలవారు, త్రేతాయుగంలో జరిగిన కొన్ని సంఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. రాముడి సోదరులైన భరతుడు, శత్రుఘ్నుడు, రాజ్య విస్తరణలో భాగంగా, మధ్య ఆసియా, ఈజిప్ట్ ప్రాంతాల వరకు వెళ్లారు. ఆ ప్రదేశాలలో తమ రాజ్యాలను స్థాపించారు. ఒకప్పుడు ఈజిప్ట్ ను పాలించిన ఫారో రాజులు కూడా, రాములవారి చిన్న తమ్ముడైన శత్రుఘ్నుడి వంశస్థులే అని, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మనం ఆఫ్ఘనిస్థాన్ గురించి మాట్లాడకుంటున్నాం కాబట్టి, ఈజిప్ట్ గురించి మరో సందర్భంలో తెలుసుకుందాము.

ఇక రామావతారం ముగిసిన చాలా ఏళ్ల తర్వాత, ద్వాపర యుగం మొదలయ్యే సమయంలో, మన భరత ఖండంపై కురుక్షేత్ర యుద్ధం వంటి మరో భారీ యుద్ధం జరిగింది. అదే ‘దశరాజ్ఞ యుద్ధం’గా ఋగ్వేదంలో పేర్కొనబడింది. ఆ యుద్ధాన్నే ఆధునిక చరిత్రకారులు, Battle of The Ten Kings అనే పేరుతో, ఆంగ్లంలో కొన్ని పుస్తకాలను ప్రచురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ ఘన చరిత్రకు మంచి గుర్తింపు తీసుకు వచ్చారు. నాడు జరిగిన ఆ యుద్ధంలో, భరత వంశానికి చెందిన సామ్రాట్ సుదాసుడూ అతని మద్దతుదారులతో కలిపి, మరి కొంతమంది ట్రైబల్ రాజులు పాలుపంచుకున్నారు. ఆ భయంకర యుద్ధంలో సుదాసుడి వర్గం గెలవడంతో, ఓడిపోయిన తెగల రాజులలో కొంతమంది మన దేశంలోనే ఉండిపోయినా, కొంతమంది రాజులు నేడు ఉన్న భారత ప్రాంతాన్ని వదిలి, సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలా వెళ్ళిన వారిలో, Pakhta, Bhalana, Druhyu వంటి తెగలవారు ముఖ్యం.

వీరిలో ముఖ్యంగా చెప్పుకునే తెగ, నేడు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వరకు, చాలా ప్రాంతాలలో నేటికీ మనుగడలో ఉన్న తెగ, Pakhta తెగ. వీరినే నేటి కాలంలో Pactyan తెగగా పిలుస్తున్నారు. ఇక Bhalana తెగ, నేడు పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ తెగగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, వీరిలో అతి ముఖ్యమైన తెగగా, దృహ్యు తెగను చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, వీరివల్లనే గాంధార రాజ్యం ఏర్పడిందని చరిత్ర తెలియజేస్తోంది.

ఈ పేరు వినగానే, మనకు మరో విషయం గుర్తుకు వస్తుంది. మహా భారత కాలంలో కౌరవుల తల్లి అయిన గాంధారి, ఈ దృహ్యు వంశానికి చెందిన మహిళ. దృహ్యు తెగకు చెందిన రాజులు, నేడు ఉన్న ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోనే గాంధార రాజ్యాన్ని నెలకొల్పారు. సంస్కృతంలో ‘గాంధార’ అనే పదానికి, The land of Fragrance అని అర్ధం. ఆ కాలంలో గాంధార రాజ్యం, ఈనాటి చైనా యూరోప్ లను కలిపే సిల్క్ రూట్ కి మధ్యలో ఉన్న అతిపెద్ద మార్కెట్ గా ఉండేది. ఇక్కడి నుంచే మన దేశంలో దొరికే ఎర్ర చందనం నుంచి, యాలుకలు, మిరియాల వంటి మసాలా దీనుసుల వరకు, సమస్తం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవనీ, అందుచేత ఆ ప్రాంతం మొత్తం సువాసనలతో నిండి ఉండేదనీ, అందుకే ఆ రాజ్యానికి గాంధార రాజ్యం అనే పేరు వచ్చిందనీ చరిత్రకారులు చెబుతున్నారు.

అంతేకాదు, గాంధార రాజ్యం అద్భుతమైన శిల్ప సంపదకూ, కళలకూ ఆలవాలంగా ఉండేది. సంస్కృత భాషపై ఎంతో పరిశోధన చేసి, నేటికీ ఆ భాష బ్రతికి ఉండటానికి కారణమైన మహానుభావులలో ఒకరైన, ఆచార్య పాణిని కూడా ఈ గాంధార రాజ్యానికి చెందిన వ్యక్తే అని, చరిత్ర చెబుతోంది. దృహ్యు వంశానికి చెందిన రాజులు మహా శివ భక్తులవ్వడంతో, ఆ ప్రాంతమంతా ఎన్నో అద్భుతమైన శివాలయాలను నిర్మించారు.

ఇక గౌతమ బుద్ధుడి రాక ఆనంతరం, ఆసియాలోని చాలా ప్రాంతాలకు బౌద్ధ ధర్మం మెల్ల మెల్లగా వ్యాపించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా అశోక చక్రవర్తి, కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి, ఆ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేయడం వల్లనే, నేడు ఆసియాలోని అనేక దేశాలలో బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విధంగా బుద్ధిజం అనేది ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతానికి కూడా పాకడం జరిగింది.

గౌతమ బుద్ధుడి సమయానికి కలియుగం ఆరంభమై ఉంది. ఇక అశోకుడి సమయంలో హిందూత్వం నుంచి బౌద్ధ మతం పుట్టినట్లు, మధ్య ఆసియా వంటి అనేక ప్రాంతాలలో, Babylonian, Sumerian వంటి అనేక నాగరికతలు పుట్టుకొచ్చాయి. ఈ మతాల వారు మన దేవుళ్ళకే, అక్కడి స్థానిక భాషలలోని పేర్లను మార్చుకుని పూజించడం మొదలు పెట్టారు. అందుకే హైందవ ధర్మ మూలం వారిలో అలాగే ఉండిపోయింది. అయితే, Alexander కారణంగా Babylonia మహా సమారాజ్యం నాశనం అవ్వడంతో, ఆ ప్రాంతంలో ఉన్న రాజ్యాలన్నీ చిన్న చిన్న ట్రైబల్ రాజ్యాలుగా మారిపోయాయి. దాంతో అబ్రహామిక్ మతాలు విస్తరించడానికి అనువైన అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక అశోకుడి కాలానికి, నేడు ఉన్న సౌదీ, ఇరాక్, ఇరాన్ వంటి అనేక ప్రాంతాలలో, అబ్రహామిక్ మతాల విజృంభణ కాస్త ఎక్కువగానే ఉండిందని చెప్పాలి. అయినా అక్కడి ప్రజలలో సనాతన ధర్మానికి చెందిన వాసనలు పోలేదు.

ఇదిలా ఉంటే, అశోకుడి కాలంలో, ఆఫ్ఘనిస్థాన్ లో బౌద్ధ ధర్మం బలంగా విస్తరించడంతో, అక్కడున్న రాజులు, ప్రజలు, ఇరు మతాలనూ సొంతం చేసుకుని, రెండు మతాల కలయికతో జీవించారు. ఇక మొదటి శతాబ్దంలో కుషాణుల రాకతో, అఖండ భారత చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. వారిలో ప్రముఖుడైన కనిష్క చక్రవర్తి, గాంధార రాజ్యం గొప్పదనాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన కూడా బౌద్ధ ధర్మాన్ని బలంగా నమ్మేవాడైనా, హైందవ ధర్మ విలువలను కాపాడటానికీ, హిందూ ధర్మ అభివృద్ధికీ ఎంతగానో పాటు పడ్డాడు. దానితో  ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఎన్నో బౌద్ధ క్షేత్రాలతో పాటు, హిందూ ఆలయాలు కూడా వెలిశాయి. ఆ సమయంలో హిందూ ఆధ్యాత్మిక రూపాలను యూరోపియన్ శైలిలో చెక్కించి, గాంధార శిల్ప కళను మరో స్థాయికి తీసుకెళ్ళారు.

కాలగమనంలో ఎంతో మంది రాజులు ఆఫ్ఘనిస్థాన్ ని ఏలారు. ఎన్నో వంశాలు మారాయి. వారందరూ ఆఫ్ఘనిస్థాన్ లో హిందూ ధర్మ పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. శివుడు, విష్ణువులకు సంబంధించిన పెద్ద పెద్ద ఆలయాలను కట్టించడం, నాణాలపై ఆ ప్రతిమలను ముద్రించి చలామణీ చేయడం, ఇలా ఎన్నో సంస్కరణలు చేశారు. కానీ, ఇది కలికాలం.. ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త కొత్త అధర్మ శక్తులు పుట్టుకొస్తాయని, మన వేదాలలో ఏనాడో చెప్పబడింది. ఆ విధంగానే 7వ శతాబ్దం నాటికి, ఇస్లాం మతానికి చెందిన దూరాక్రమణ దారులు అఖండ భారతావని పై దాడులు చేయడం మొదలు పెట్టారు. ఆ దాడులను, అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్ ను పాలిస్తున్న షాహీ హిందూ రాజైన ఖింగిలా వీరోచితంగా ఎదిరించి పోరాడి, వారిని ఓడించి వెనక్కి పంపించాడు. అయితే ఈ టర్కీ దూరాక్రమణదారుల ఆక్రమణలు పేరుగుతాయని భావించిన నాటి రాజులు, ఆలయాలను సైతం కోటల్లా మార్చి, శత్రువులపై దాడి చేయడానికి అనువైన ప్రదేశాలుగా ఏర్పాటు చేసుకున్నారు.

ముహమ్మద్ ఘజిని తండ్రి సబుక్తిజిన్ ఘజిని, అప్పట్లో హిందూ రాజ్యాలుగా ఉన్న Uzbekistan, ఆఫ్ఘనిస్థాన్ ల పై ఎన్నో దాడులు చేశాడు. వాటిలో కొంతవరకు మాత్రమే విజయం సాధించాడు. ఇక ముహమ్మద్ ఘజిని ఆఫ్ఘనిస్థాన్ వరకూ, అన్ని ప్రాంతాలలో హిందూ ధర్మం జాడలను దాదాపుగా తుడిచేసి, కొన్ని లక్షల మందిని చంపి రక్తపుటేరులు పారించినట్లు చరిత్ర విదితం. కోట్లాది మందిని బలవంతంగా మతం మార్చారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రతి హిందూ ఆలయాన్నీ పూర్తిగా నెలమట్టం చేశారు. కొన్ని ఆలయాలను ఆక్రమించుకుని మసీదులుగా మార్చారు. మరికొన్నింటిని భారతీయ ఆలయాలనుండి దోచుకున్న సంపదతో నిర్మించారు. అలాంటి వాటిలో నేడు ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో అతి పెద్దదయిన Pul-e Khishti Masjid ను చెప్పుకోవాలి. 1756 లో మథుర శ్రీకృష్ణ మందిరాన్నీ, 1762 లో అమృత్సర్‌ పై దాడి చేసి స్వర్ణ దేవాలయాన్నీ దోచుకున్న సంపదతో, 18వ శతాబ్దం చివరలో దీనిని కట్టడం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా ఒకప్పుడు ఎంతో ఘనమైన హైందవ సామ్రాజ్యంగా వెలుగొందిన ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతం, నేడు మట్టి దిబ్బల నిలయంగా, తీవ్రవాదులకు ఆవాసంగా మారిపోయింది. దోచుకున్న ఆలయాల నిధులతో నిర్మించబడిన దేశం కాలక్రమేణా నాశనం అవుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే కోవలో ఉన్న ఆ మిగతా దేశాలేమిటో మీరే ఆలోచించి కామెంట్ చేయండి.

🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🙏

Wednesday, February 19, 2025

ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi


అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐 TELUGU VOICE

స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛ‌త్ర‌ప‌తి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్ర‌వ‌రి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంప‌తుల‌కు జ‌న్మించాడు. శివాజీ తండ్రి, వ్య‌వ‌సాయ బోస్లే కులానికి చెందిన వారు. అత‌ను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. త‌ల్లి జిజాబాయి యాద‌వ క్ష‌త్రియ వంశ‌పు ఆడ ప‌డుచు. శివాజీకి ముందు పుట్టిన వారంద‌రూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వ‌తీ దేవి మరోపేరైన శివై పేరును క‌లిపి శివాజీకి పెట్టింది. ఆమె సంర‌క్ష‌ణ‌లో పెరిగిన శివాజీ, రామాయ‌ణ‌ మ‌హాభార‌తాల‌ విశిష్ట‌తనూ, హిందూమ‌తం యొక్క గొప్ప‌త‌నాన్నీ తెలుసుకున్నాడు. ప‌ర‌మ‌త స‌హ‌నం, స్త్రీలను గౌర‌వించ‌డం, శివాజీకున్న గోప్ప ల‌క్ష‌ణం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ]


దాదాజీ ఖాండ్ దేవ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి ప‌రాజ‌యాల‌కు గ‌ల కార‌ణాల‌ను క్షుణ్ణంగా తెలుసుకుని, యుద్దతంత్రంలో నిష్ణాతుడ‌య్యాడు. స‌క‌ల విద్యా పారంగ‌తుడైన శివాజీ, మ‌రాఠా సామ్రాజ్య స్థాప‌నకు న‌డుం బిగించాడు. భవానిదేవి భక్తుడు అయిన‌ప్ప‌టికీ, తన సామ్రాజ్యంలో ఉన్న‌ అన్ని మతాల వారినీ సమానంగా చూసేవాడు శివాజీ. త‌న రాజ్యంలో కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా, ఎన్నో మసీదులను కట్టించిన ఘ‌న‌త శివాజీకే సొంతం. ఆయ‌న‌ సైన్యంలో మూడొంతుల మంది ముస్లిములు ఉన్నారు. ఎందరో ముస్లిములకు, ఉన్నత పదవులు క‌ట్ట‌బెట్టారు శివాజీ. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికీ, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికీ, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ అనే ఇద్దరూ కూడా ముస్లింలే. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తీ, మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే. త‌న రాజ్యంలోని, ఎంతో ముఖ్య‌మైన ప‌ద‌వుల‌ను సైతం, ప‌ర‌ మ‌తాల వారికి అప్ప‌గించిన ఘ‌న‌త, శివాజీకే దక్కుతుంది.

ఛ‌త్ర‌ప‌తి శివాజీ, యుద్ద తంత్రాల‌లోనే కాదు, ప‌రిపాల‌నా విధానాలు రూపోందించ‌డంలో కూడా నిష్ణాతుడు. ప్రజలకోసమే ప్రభువు, అన్న సూత్రాన్ని అనుస‌రించి, వ్యక్తిగత విలాసాలను ప‌క్క‌న‌పెట్టి, ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డ మ‌హా వ్య‌క్తి. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాల వారికీ  అనుకూలంగా ఉంటూ, అన్ని మతాల ప్రజలనూ ఆద‌రించేవాడు. మ‌రాఠా సామ్రాజ్య స్థాప‌న‌ కోసం, ఎంతో  మంది ముస్లింలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసినప్పటికీ, ఆయన పాలనలో ఉన్న‌ ముస్లింలను, తగిన విధంగా స‌త్క‌రించేవాడు. అనేక మసీద్ లు నిర్మించిన ఏకైన హిందూ రాజు కూడా ఛ‌త్ర‌ప‌తి శివాజీనే. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావంతో ఉండ‌డం, మచ్చలేని ఆయ‌న వ్యక్తిత్వమే, అనుచరులకూ, ప్రజలకూ, ఆదర్శంగా నిలిచాయి. మ‌న భారతదేశాన్ని ఎందరో రాజులు పాలించిన‌ప్ప‌టికీ, శివాజీలో ఉన్న ఈ లక్షణాలే అత‌న్ని చ‌రిత్ర లో చిరస్మరణీయుడిగా చేసాయి. ఛ‌త్ర‌ప‌తి శివాజీ, ఎన్నో విరోచిత‌మైన యుద్దాలుచేసి విజ‌యాన్ని సాధించి, మ‌రాఠా రాజ్యాన్ని విస్త‌రించాడు.

17 ఏళ్ళ వయసులో, మొట్టమొదటి యుద్ధం చేసిన శివాజీ, బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన, తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. త‌రువాత మూడేళ్ళలోనే, కొండన, రాజ్‌ఘడ్ కోటలను కూడా సొంతం చేసుకొని, పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తమ కోటలను సొంతం చేసుకున్నాడ‌న్న కోపంతో, ఆదిల్షా సుల్తాన్, శివాజీ తండ్రి షాహాజీని, మోస‌పూరిత కుట్ర‌తో బంధించాడు. అంతేకాదు, శివాజీనీ, బెంగుళూరులో ఉన్న అత‌ని అన్న‌ శంభాజీనీ పట్టుకోవడానికి, రెండు సైన్యాలను పంపాడు ఆదిల్షా. అయితే, అన్నదమ్ములిద్ద‌రూ, ఆ సైన్యాలను ఓడించి, తమ తండ్రిని విడిపించుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ ఆదిల్షా, యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను, శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ చేసిన మెరుపుదాడులూ, గెరిల్లా యుద్ధ నీతినీ తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్, అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి, శివాజీని రెచ్చకొట్టే ప్ర‌య‌త్నం చేసాడు. శివాజీకి ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చేశాడు అఫ్జ‌ల్‌.

ఆల‌యాల‌ను కూల్చేశాడ‌న్న‌ విష‌యాన్ని తెలుసుకుని, తాను యుద్ధానికి సిద్దంగా లేననీ, అఫ్జ‌ల్‌ను చర్చలకు ఆహ్వానించాడు శివాజీ. దాంతో, ఇరు వ‌ర్గాల వారూ, ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ మోస బుద్ధి తెలిసిన శివాజీ, ఉక్కు కవచాన్ని ధరించి, పిడిబాకును లోపల దాచుకున్నాడు. ఇద్దరూ తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా, అఫ్జల్ ఖాన్ త‌న వెంట ర‌హ‌స్యంగా తెచ్చుకున్న కత్తితో, శివాజీ పైన దాడి చేసాడు. ఉక్కు కవచం ధ‌రించ‌డం వ‌ల్ల, శివాజీ తప్పించుకున్నాడు. వెంట‌నే లోప‌లికి రావడానికి ప్రయత్నించిన అఫ్జ‌ల్ ఖాన్ సైన్యాధికారులను, శివాజీ సైన్యం అడ్డుకుంది. శివాజీ, తన‌తోపాటు తెచ్చుకున్న పులి గోర్ల‌తో, అఫ్జ‌ల్ ఖాన్ పొట్ట‌ను చీల్చేశాడు. గుడారం నుండి బ‌య‌ట‌కు పారిపోదామ‌ని ప్ర‌య‌త్నించిన అఫ్జ‌ల్ త‌ల‌ను, ఒకే వేటుకు న‌రికేశాడు. ఇక మిగిలిన అఫ్జ‌ల్ సేన‌ను కూడా, శివాజీ సేన మెరుపు దాడులు చేసి, వారిని అంత‌మొందించింది.

అఫ్జ‌ల్ ఖాన్‌ పై విజ‌యంతో, శివాజీ పేరు మ‌రాఠా యోధుడిగా, మహారాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయింది. దీంతో, ఎలాగైనా శివాజీ పై ప‌గ సాధించాల‌ని వేచి ఉన్నాడు, బీజాపూర్ సుల్తాన్‌. అందుకోసం, యుద్ధ‌వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పష్తున్ సైనికులను, శివాజీపై యుద్ధానికి పంపాడు. శివాజీ సేన, పష్తున్ ల‌ను కూడా మ‌ట్టిక‌రిపించి, ఈ యుద్ధంలో కూడా విజ‌యం సాధించింది. ఇక‌ ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు, భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు శివాజీ మ‌హారాజ్‌. పష్తున్ ల‌పై శివాజీ విజ‌యాన్ని స‌హించ‌లేని బిజాపూర్ సుల్తాన్, అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ ల నుండి, మెరికల్లాంటి 10,000 మంది, కిరాయి సైనికులను తెప్పించాడు. వారిని శివాజీపై యుద్ధానికి పంపించాడు. అప్పుడు శివాజీ, తన వద్దనున్న 5,000 మంది మరాఠా యోధులతో కలసి, కొల్హాపూర్ వద్ద, వారి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ', అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి, శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో, కేవలం సుల్తానులకే కాక, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కు సైతం, శివాజీ అంటే భయం పుట్టింది.

శివాజీ నుండి, ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబ్ భావించి, శివాజీని అంత‌మొందించ‌డానికి, సన్నాహాలు మొదలు పెట్టాడు. ఔరంగజేబ్ తన మేన మామ Shaista Khan ను, శివాజీ పై యుద్ధానికి పంపాడు. రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న Shaista Khan, మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి, అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అప్ప‌గించి, కొల్హాపూర్ పంపించాడు. అప్ప‌టికే కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో, శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు.  అయితే, సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ, ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని, త‌న సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొని, సిద్దితో యుద్ధం చేయడానికి వ్యూహం ర‌చించాడు. కానీ, అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో, తాను యుద్ధానికి సిద్దంగా లేననీ, దయ తలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు శివాజీ. అది తెలుసుకొన్న‌ సిద్ది జోహార్ సైనికులు, నిఘా సరళం చేసి, విశ్రాంతి తీసుకున్నారు. ఇక శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని, తన సైన్యం ఉన్న విశాల్ ఘ‌డ్ కోటవైపు పయనించాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్, తన బలగాలతో శివాజీని వెంబడించాడు.

శివాజీ సేన కోటకు చేరుకొనేలోపు, శత్రువులు తమను సమీపిస్తున్నార‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన‌ బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్, 300 మంది అనుచరులతో కలసి, తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామనీ, శివాజీని తన అంగరక్షకులతో స‌హా ఎలాగయినా కోట చేరుకోమనీ చెప్పి, ఒప్పించాడు. శివాజీని కోట వైపు పంపిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే, త‌న రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని, శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి, అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. వీరి యుద్ధం ముగిసే స‌రికి, శివాజీ తన కోట చేరుకున్నాడు.

కోటలో తన అనుచరులతో చర్చించిన శివాజీ, అనంతరం, తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించి, సంధికి అంగీకరించాడు. ఈ సంధిలో భాగంగా, శివాజీ సామ్రాజ్యం, స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా, పన్‌హాలా కోటను ఇచ్చాడు శివాజీ. త‌న యుద్ధ‌నీతికీ, రాజ‌నీతికీ గుర్తుగా, జూన్ 6, 1674 న, రాయఘడ్ కోటలో, వేద పఠనాల మధ్య, శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ, 'ఛత్రపతి’ అనే బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు, 50,000 బలగంతో, దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి, వెల్లూరు, గింగీ లను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి, హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి, సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ, మూడు వారాలపాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ, 1680, ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాయఘడ్ కోటలో స్వర్గస్థులైనారు. శివాజీ త‌ద‌నంత‌రం, ఆయన పెద్దకొడుకయిన శంభాజీ, రాజ్యాధికారాన్ని చేపట్టి, మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని, రాజ్యాన్ని పరిపాలించాడు.

ఈ శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా నిర్మించిన 'చావా' అనే చిత్రాన్ని ఈ వారం విడుదల చేశారు. ప్రతి భారతీయుడూ తప్పనిసరిగా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది.. తెలుసుకో వలసిన చరిత్ర ఇది..

ॐ 🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🚩జై జగదంబా 🙏

Monday, February 17, 2025

దయ్యాలు కట్టిన భారీ శివాలయం Forgotten Shiva Temple Built by Ghosts in One Night


ఒకే రాత్రిలో ‘దయ్యాలు కట్టిన భారీ శివాలయం’! TELUGU VOICE
Forgotten Shiva Temple Built by Ghosts in One Night

మన దేశంలో ఎంతో అద్భుత శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ఎటువంటి క్రేన్ లూ, ఆధునిక పరికరాలూ లేని కాలంలోనే మన పూర్వికులు, ఎంతో అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. అటువంటి ఆలయాలను చూడటానికీ, ఆ నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికీ, మన దేశం నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తుంటారు. కానీ, కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో నిర్మింపబడిన ఓ ఆలయాన్ని, ఏ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడంలేదు. కనీసం దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతున్నారు. ఎటువంటి ఆధునిక పరికరాలూ, సాంకేతికతా లేని ఆ కాలంలో, అంత భారీ ఆలయం కేవలం ఒక్క రాత్రిలో నిర్మించబడిందంటే నమ్మశక్యం కాదు. శాస్త్రవేత్తలకు ఆ ఆలయం జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో అంత భారీ ఆలయాన్ని ఎవరు, ఎలా నిర్మించారు? అంతటి అద్భుత కట్టడంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే కట్టారా? అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది? దాని చరిత్ర ఏమిటి - వంటి సందేహలెన్నో కలుగుతాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6_HQMJgx3CY ]


విద్యకు పుట్టినిల్లు మన భారత దేశమని సగర్వంగా చెప్పుకోవచ్చు. అందుకే మన దేశం విశ్వ గురువు అనే పేరు గడించింది. నేటి అధునిక శాస్త్రవేత్తల దగ్గర కూడా లేని పరిజ్ఞానాన్ని, మన ఋషులు, మహర్షులు ఏనాడో సాధించారు. ఆ పరిజ్ఞానంతోనే, మన దేశంలో ఎన్నో అధ్బుతమైన కట్టడాలు కట్టారు. మరీ ముఖ్యంగా, మానవ సమాజం ధర్మ బద్ధంగా జీవించడానికి అవసరమయ్యే శక్తిని ఇచ్చే ఆలయాలను అద్భుతంగా నిర్మించడానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అందుకే ఏళ్ళు కరిగిపోయినా, శతాబ్దాలు గడిచిపోయినా, ఇప్పటికీ చెక్కు చెదరని పురాతన ఆలయాలు ఎన్నో, మన దేశంలో నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒకటే, కకన్ మఠ్ ఆలయం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరేనా జిల్లాలోని సిహోనియా అనే ఊరికి సమీపంలో, ఈ కకన్ మఠ్ ఆలయం ఉంది. ఇది కేవలం పురాతనమైన ఆలయమే కాకుండా, ఒకప్పటి మన మహర్షుల మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకూ, అంతకు మించి ఎన్నో రహస్యాలకూ నెలవు. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయంపై పరిశోధనలు చేయడానికి, నేటి ఆధునిక శాస్త్రవేత్తలు సాహసం చేయడంలేదు. వారు ఎందుకని ఆ ఆలయాన్ని ముట్టుకోడానికి భయపడతున్నారో తెలుసుకోవాలంటే, ముందు ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం,  11వ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలించిన కచ్చపఘాటా రాజ వంశానికి చెందిన కీర్తి రాజా, కకన్ మఠ్ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం మధ్య ప్రదేశ్ లోని  పురాతన నగరాలలో ఒకటైన Gwalior లో దొరికిన ఒక శిలా శాశానంలో, ఈ కకన్ మఠ్ ఆలయం గురించిన వివరణ ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం, కీర్తి రాజా అనే మహారాజు, సింహపానీయ అనే నగరం దగ్గర, పార్వతి పతి శివయ్య కోసం భవ్యమైన మహా ఆలయాన్ని నిర్మింపజేశాడు. ఇప్పటి సిహోనియా నగరాన్నే ఒకప్పుడు సింహపానీయ అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందనే విషయంలో ఎటువంటి ఆధారాలూ లభించకపోయినా, దాదాపు 120 అడుగుల ఎత్తు ఉండే ఈ శివాలయం కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించబడిందని స్థానికంగా వినిపిస్తున్న కథల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఈ కకన్ మఠ్ ఆలయాన్ని నిర్మించాడానికి వినియోగించిన బలమైన గ్రానైట్ రాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా దొరికేవి కావనీ, కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి అవి అక్కడికి తీసుకురాబడ్డాయనీ నిపుణులు చెబుతున్నారు. ఎంతో బరువుండే ఆ రాళ్ళను ఎటువంటి ఆధునిక పరికరాలూ, వాహనాలూ లేని ఆ కాలంలో, అంత దూరం నుంచి ఎలా తీసుకువచ్చారు? అలా తెచ్చిన వాటిని, అంత ఎత్తుకి ఎలా పేర్చారనే విషయాలు ఇప్పటికీ వీడని మిస్టరీయే. వీటన్నింటినీ మించి, ఇవన్నీ జరిగింది ఒక్క రాత్రిలోనే. కకన్ మఠ్ ఆలయ నిర్మాణంలో ఉన్న మరో వింత ఏమిటంటే, ఆ ఆలయ నిర్మాణంలో ఎటువంతో సిమెంట్, సున్నం లాంటి పదార్ధాలను వాడకుండా, కేవలం ఒక రాయిపై మరో రాయిని పేర్చి, బృహదీశ్వరాలయం నిర్మించిన పద్ధతిలోనే నిర్మించారు. అన్ని శతాబ్దాల క్రితం, ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మనుషులు నిర్మించడమే కష్టం అయితే, ఒక్క రాత్రిలో నిర్మించడం అసాధ్యం అనీ, ఇది కేవలం అతీత శక్తులు కలిగిన వ్యక్తుల పనో, లేక శక్తి వంతమైన దెయ్యాలపనో అయ్యి ఉంటుందని స్థానికుల నమ్మకం. మన పురాణాల ప్రకారం శివుడిని కేవలం మానవులే కాకుండా, ఎన్నో రకాలైన శక్తులు ఆరాధిస్తూ ఉంటాయనీ, అందులో దెయ్యాలూ పిశాచాలూ కూడా అతీతం కావనీ చెప్పబడింది. స్మశాన వాసి అయిన ఆ పరమేశ్వరుడు, అక్కడ ఉండే దెయ్యాలను తన ఆధీనంలో ఉంచుకుని, మానవులకు ఎటువంటి హానీ కలగకుండా చేస్తాడని కూడా మన పురాణాలలో పేర్కొనబడింది. ఆ స్వామిపై ఉన్న భక్తి వల్లనే దెయ్యాలు, రాత్రికి రాత్రి మధ్యప్రదేశ్ లో కకన్ మఠ్ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి జానపదాలలో వినిపిస్తుంది.

ఇక కకన్ మఠ్ ఆలయం పేరు వెనుక కూడా, కొన్ని కథనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన సూరజ్ పాల రాజు భార్య అయిన కకనావతి పేరు మీదనే ఈ ఆలయానికి కకన్ మఠ్ అనే పేరు వచ్చిందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. రాణీ కకనావతి ఆ శివాలయంలో క్రమం తప్పకుండ విశేష పూజలు నిర్వహిస్తూ, ఆలయ అభివృద్ధికై ఎంతగానో కృషి చేసిందని అంటారు. అందువల్లనే ఆమె భర్త ఆ ఆలయానికి కకన్ మఠ్ అనే పేరు పెట్టాడని స్థానికులు చెబుతారు.

అయితే, ఈ గాధను చాలా మంది చరిత్రకారులు అంగీకరించడం లేదు. రాణీ కకనావతి పేరు మీద ఈ ఆలయానికి కకన్ మఠ్ అనే పేరొచ్చిందని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదని వారి వాదన. ఒకప్పుడు కకన్ మఠ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాకుండా, మఠం లాగా కూడా భాసిల్లింది. ఆ కాలంలో ఈ మఠాన్ని కనక్ మఠ్ అని పిలిచేవారని కొందరు చరిత్రకారులంటున్నారు. సంస్కృత భాషలో కనక్ అంటే బంగారం అని అర్ధం. బంగారం వంటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించే ప్రదేశం గనుక, ఈ ఆలయాన్ని కనక్ మఠ్ అని పిలిచేవారనీ, ఆ పేరే కాలగమనంలో కకన్ మఠ్ గా మారిపోయిందనీ చరిత్రకారుల అభిప్రాయం.

మన దేశంపై ముస్లిం రాజులు చేసిన దండయాత్రలలో ఎన్నో ఆలయాలు ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే కకన్ మఠ్ ఆలయాన్ని కూడా వారు చాలా వరకూ నాశనం చేసినట్లు చరిత్ర నిరూపితం. మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని మొఘలులు ఆక్రమించుకునే సమయానికి, కకన్ మఠ్ ఆలయం ఎనలేని సంపదలతో తులతుగేది. దానితో మొఘల్ సేనలు కకన్ మఠ్ ఆలయాన్ని దోచుకుని, ధ్వంసం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ఎంతో పటిష్ఠంగా నిర్మించబడిన కకన్ మఠ్ ఆలయాన్ని సాధారణ కత్తులూ, బరిసెలూ, గడ్డపారలతో కదలించలేకపోవడంతో, చివరకు ఆలయంపై ఫిరంగులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో అప్పట్లో కకన్ మఠ్ ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలను పూర్తిగా నాశనం చేసి, ప్రధాన ఆలయాన్ని మాత్రం కుల్చలేకపోయారని చరిత్రకారులంటున్నారు. అలా ఆ నాటి నుంచీ కకన్ మఠ్ ఆలయం ఒక శిధిలాలయంగా మిగిలిపోయింది.

నాడు ముష్కరుల దాడికి పాక్షికంగా ధ్వసం అయినా, నేటికీ ఆ ఆలయం కూలిపోకుండా అలాగే నిలబడి ఉండటం ఒక విశేషమయితే, ఎన్నో భారీ ప్రకృతి విపత్తులను సైతం తట్టుకుని కకన్ మఠ్ ఆలయం ఈ నాటికీ స్థిరంగా నిలబడి ఉండటం మరో అద్భుతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) ఆధీనంలో ఉన్న కకన్ మఠ్ ఆలయం, మన దేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. మొఘలుల దాడులలో బాగా దెబ్బ తిన్న ఈ ఆలయం, తాము పరిశోధనలు చేసే క్రమంలో రాళ్ళను కదలిస్తే, పూర్తి నిర్మాణం కూలిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్లనే కకన్ మఠ్ ఆలయాన్ని శాస్త్రవేత్తలు ముట్టుకోవడానికి భయ పడుతున్నారు.

అంతేకాదు, కేవలం శాస్త్రవేత్తలనే కాకుండా, సాధారణ ప్రజలను కూడా భయపట్టే మరో విశేషం కకన్ మఠ్ ఆలయంలో ఉంది. అదేమిటంటే, రాత్రి వేళల్లో ఈ ఆలయం దగ్గర ఎవరైనా పొరబాటునయినా ఉండిపోతే, తెల్లవారే సరికి భయంతో వారికి మతి భ్రమించడమో, లేక గుండె ఆగి చనిపోవడమో జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో కకన్ మఠ్ ఆలయం దగ్గర దెయ్యాలు తిరుగాడుతాయనీ, పోరబాటునో, గ్రహ పాటునో అక్కడ ఉండిపోయిన మనుషులను అవి భయంకరంగా వేధిస్తాయనీ స్థానికులంటున్నారు. రాత్రి వేళల్లో అక్కడ ఉండిపోయిన ఎంతో మందికి అటువంటి అనుభవం ఎదురయ్యిందని కూడా చెబుతున్నారు.

ఈ విషయంపై స్థానికంగా రెండు కథనాలు వినిపిస్తునాయి. ఒకప్పుడు ఆ గుడిని దెయ్యాలు నిర్మించడం వల్ల, రాత్రి వేళలలో దెయ్యాలు అక్కడికి వచ్చి శివయ్యకు సేవ చేసుకుంటాయనీ, అందువల్ల ఆ సమయంలో మనుషులు వెళ్తే, తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తుందనీ ఒక కథనమయితే, మరో కథనం ప్రకారం, పూర్వం మొఘల్ దుండగుల దాడుల సమయంలో, కకన్ మఠ్ ఆలయం దగ్గర తీవ్రమైన నరమేధం జరిగిందనీ, ఆ సమయంలో ఆలయం దగ్గర ఉన్న ప్రజలనూ, అక్కడ పూజలు నిర్వహిస్తున్న పూజారులనూ ఆ పాషాండ హృదయులు పరమ కిరాతకంగా చంపారనీ, అలా ఆనాడు చనిపోయిన వారి ఆత్మలే, నేటికీ అక్కడ రాత్రి వేళల్లో సంచరిస్తున్నాయనీ చెబుతారు. ఈ కారణాల వల్లనే నేటికీ కకన్ మఠ్ ఆలయానికి రక్షగా ఉండే సెక్యురిటి సిబ్బంది, రాత్రి వేళల్లో మాత్రం, దగ్గరలో ఉండే గ్రామాలలోకి వెళ్లి, తిరిగి సూర్యోదయం అయ్యాకే గుడి దగ్గరకు వస్తారని, స్థానికులంటున్నారు.

🚩 ఓం నమః శివాయ 🙏

Monday, February 10, 2025

Hidden Facts of Vikramaditya: The Legendary King of Ancient India | విక్రమాదిత్యుడి భైరవసేన!


విక్రమాదిత్యుడి భైరవసేన! TELUGU VOICE
ఈజిప్ట్ ను వణికించిన ‘విక్రమాదిత్యుడు’! అరబ్ చరిత్ర పుటలలో కీర్తించబడిన హిందూ మహాపురుషుడు! The Great Wall Of China కీ విక్రమాదిత్యుడు చక్రవర్తి కావడానికీ సంబంధం ఉందా?

 భూమి పొరల్లో మరుగుతూ దాగుండే లావా, సమయం వచ్చినప్పుడు ఎలా అయితే ఒక్కసారిగా ఉబికి బయటకు వస్తుందో, అలాగే చరిత్ర కూడా! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, తనలో దాచుకున్న మహాత్ముల గాధలను, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తుంది. అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళను తెరిపిస్తుంది. అలా నేడు మళ్ళీ మన ముందుకు, చరిత్ర పదిలంగా దాచుకున్న ఓ మహా విరుడి గాధను తీసుకు వచ్చింది. భారత దేశంతో పాటు, ఆంగ్లేయుల సరిహద్దుల వరకు వ్యాపించిన ఆయన మహా సామ్రాజ్యపు ఎల్లలను మనకు చూపిస్తోంది. కలియుగంలో రామ రాజ్యాన్ని స్థాపించిన ఓ అజానాబాహుడి ఔచిత్యాన్ని నిరూపిస్తోంది. భారతీయ పురాతన గ్రంధాలలోనే కాకుండా, ఇస్లామిక్ చారిత్రక పుస్తకాలలో సైతం మహా పురుషుడిగా కీర్తించబడిన ఆ చక్రవర్తి గాధనూ, మనలో చాలా మందికి తెలియని ఆయన చరిత్రనూ, కుహనా మేధావులు దాచాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఇతిహాసాన్నీ, కేవలం చందమామ కథల్లో వినిపించే కాల్పనిక పాత్రగా మార్చాలనే ప్రయత్నాన్నీ, ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఆయన మరెవరో కాదు.. సాక్ష్యాత్ సామ్రాట్ విక్రమాదిత్య. చరిత్ర సగౌరవంగా చెప్పుకునే ఆ రాజు గురించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/B2x1lEOmKPM ]


బేతాళ విక్రమాదిత్యుల కథలూ, భట్టి విక్రమార్కుల కథలూ వినని భారతీయుడు ఉండడు. తర తరాలుగా ఈ కథలు జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. విక్రమాదిత్యుడనే మహా రాజు గురించి మనలో చాలా మంది, చందమామ కథల్లో ఒక పాత్ర గానే గుర్తు పెట్టుకున్నాము. కానీ ఆయన ఓ కథానాయకుడు మాత్రమే కాదు.. భారతీయ చరిత్రను మార్చిన మహా వీరుడు, మన ఘన కీర్తిని ప్రపంచపు నలుమూలలకూ చాటిన మహానుభావుడు, కలియుగంలో రామ రాజ్యాన్ని పునరుద్ధరించిన ఓ మహా చక్రవర్తి. అసలు ఆయన చరిత్ర గురించి తెలియాలంటే, సామాన్య శకానికి దాదాపు 300 ఏళ్ల పూర్వం చైనాలో జరిగిన కొన్ని పరిణామాలు తెలీసుకోవాలని, చరిత్రకారులు చెబుతున్నమాట.

విక్రమాదిత్యుడి శూరత్వం ప్రపంచానికి తెలియడానికీ, చైనాలో నిర్మించబడిన The Great Wall Of China కీ ఉన్న సంబంధం తెలియాలి. అదెలా అంటే, ఒకప్పుడు చైనా నేలపై Xiongnu అనే ట్రైబల్ ప్రజలు ఉండేవారు. వారు అత్యంత క్రూరమైన వ్యక్తులుగా చైనా చరిత్రకారులు చెబుతుంటారు. Xiongnu ట్రైబ్ ప్రజలు తరుచుగా తమ మనుగడ కోసం, చైనాలోని అనేక గ్రామాలపై, పట్టణాలపై దాడులు చేసి, అక్కడ వారికి కావాల్సిన ఆహార పదార్ధాలతో పాటు, బంగారం వంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం, ఆడవారని చెరపట్టడం వంటి ఎన్నో దారుణాలకు తెగబడేవారు. Xiongnu తెగ నుంచి తన ప్రజలనూ, తన రాజ్యాన్నీ రక్షించుకోవడానికి, Qin Shi Huang అనే చైనా రాజు, చైనా వాల్ ని నిర్మించడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రపంచ వింతలలో ఒకటైన The Great Wall Of China నిర్మాణం వెనుక అసలు కారణం ఇదే.

ఇలా మొదలైన చైనా వాల్, కొద్ది కొద్దిగా పెరుగుతూ మహా నిర్మాణంగా మారింది. దాంతో ఈ Xiongnu ప్రజలకు చైనాలోకి వెళ్ళడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ సంఘటన వల్ల వారు మెల్ల మెల్లగా పశ్చిమ దిక్కుకు వలస వెళ్ళడం మొదలు పెట్టారు. జనాలను హింసించి బ్రతికే స్వభావం కలిగిన Xiongnu తెగ, మధ్య ఆసియా నుంచి యూరోప్ వరకు విస్తరించడం మొదలు పెట్టారు. Xiongnu తెగను కొంతమంది చరిత్రకారులు, Huns అనే పేరుతో కూడా పిలుస్తారు. కొంతమంది, అవి రెండూ వేరు వేరు తెగలనీ, ఆ ఇద్దరూ కలిసి మధ్య ఆసియా నుంచి యూరోప్ వరకూ దండయాత్రలు చేశారనీ చెబుతారు. ఏది ఏమైనా, చైనాను విడిచి దారి మళ్లిన Xiongnu తెగ, మధ్యలో ఉన్న ఎన్నో చిన్నా చితకా ఆటవిక తెగలను నాశనం చేసింది. ఈ క్రమంలో ఒక తెగ ప్రజలు, Xiongnu దెబ్బకు భయపడి, Syr Darya నదీ పరీవాహక ప్రాంతానికి వలస వెళ్లారు.

Syr Darya అనే నది, మధ్య ఆసియాలోని Tajikistan, Uzbekistan వంటి దేశాలలో ప్రవహిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో, Syr Darya ప్రవహించే ప్రాంతం, శక అనే రాజ వంశపు ఆధీనంలో ఉండేది. ఈ స్థానిక తెగ వెనకే వచ్చిన Xiongnu తెగ, శక వంశపు ఆధీనంలో ఉండే అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. ఆ తెగ యుద్ధ ప్రతిభ, క్రూరత్వం కారణంగా, శక రాజ వంశం చాలా ఏళ్లు ఓటమిని చవి జూసింది. అయితే, తమ శక్తిని మొత్తం కూడగట్టుకున్న శక రాజలు, Xiongnu తెగను నాశనం చేయడమే కాకుండా, తమ రాజ్య కాంక్షను మరింతగా పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు, నాటి మధ్య ఆసియాలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన Bactria రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. ఒకప్పుడు ఆ రాజ్యం, ప్రస్తుతం ఉన్న  Turkmenistan, Afghanistan, Uzbekistan, మరియూ Tajikistan తో పాటు, కొంత భాగం పాకిస్తాన్ లో కూడా ఉండేది.

ఇలా Bactria ని కైవసం చేసుకున్న శక రాజులకు, భారత దేశంలోకి రావడానికి వీలు దొరికింది. ఎన్నో రాజ్యాలను ఒడిస్తూ, దారిలో కలిసివచ్చిన వివిధ తెగలను తమ దళంలో కలుపుకుంటూ, అత్యంత క్రూరమైన యుద్ధాలు చేస్తూ ముందుకు సాగిన శక రాజులు, భారత దేశంపై కూడా పూర్తి పట్టు సాధించారు. ఇక్కడొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, మధ్య ఆసియా నుంచి వచ్చిన ఈ శక వంశస్థులు పూజించేదీ, అనునిత్యం ఆరాధించేదీ శివుడిని. అవును.. మీరు విన్నది నిజమే.. శక రాజులూ, వారి ప్రజలూ, మహా శివ భక్తులు. హిందూత్వం అంటే కేవలం భారత దేశానికే పరిమితం, దీనికి ప్రపంచంలో మరెక్కడా స్థానం లేదని తప్పుడు ప్రచారం చేసే కుహనా చరిత్రకారులు, ఇన్నేళ్లుగా దాచిన నిజాలలో ఇది కూడా ఒకటి. ఈ లెక్కన మన సనాతన ధర్మం ఎంత పురాతనమైనది, ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించి ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

నేటి పాశ్చాత్య చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకునే వారి క్రీస్తు పుట్టుకకు సరిగ్గా 57 ఏళ్ల ముందు, శక రాజులు మన దేశంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. Moga అనే రాజు నేతృత్వంలో భారత దేశంపై దాడి చేసిన శకులు, నాటి కాలంలో మన దేశంలో అతిపెద్ద సామ్రాజ్యమైన ఉజ్జయినీని ఆక్రమించుకున్న తర్వాతే, మన దేశంపై పూర్తి పట్టు సాధించడానికి వారికి అవకాశం దొరికినట్లు, చరిత్ర చెబుతోంది. ఈ Moga అనే రాజునే, Maues అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రెండు పదాలకూ, హీరో లేదా పులి అనే అర్ధం వస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. అతను అత్యంత క్రూరమైన, అత్యంత సమర్ధవంతమైన యుద్ధం చేయగల రాజుగా గుర్తింపు పొందాడు. అందుకే అతనికి పులి అనే అర్ధం వచ్చే Moga పేరును పెట్టడం జరిగినట్లు చరిత్ర నిరూపితం.

ఇదిలా ఉంటే, Moga మన దేశంపై దండెత్తిన సమయంలో, ఉజ్జయినీని పాలిస్తున్నది, మహేంద్ర ఆదిత్యుడు. అతనే భారత దేశపు దశా దిశా మార్చిన విక్రమాదిత్యుడి తండ్రి. మహేంద్ర ఆదిత్యుడు ఒడిపోయే సమయానికి, విక్రమాదిత్యుడు చాలా చిన్న పిల్లవాడు. తన తండ్రి ఓడిపోవడం, శకుల చేతిలో ఘోరమైన అవమానాలు పొందటం చూసిన విక్రమాదిత్యుడు, ఆ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసినట్లు, చరిత్ర చెబుతోంది.

అయితే రాజ్యాన్ని కోల్పోయిన పసి విక్రమాదిత్యుడు, మాల్వా రాజైన భర్తృహరి దగ్గరకు చేరాడు. ఆయన విక్రమాదిత్యుడికి అన్న వరస అవుతాడని చరిత్ర చెబుతోంది. ఇదిలా ఉంటే, భర్తృహరికి సంతానం లేకపోవడం వల్ల, విక్రమాదిత్యుడు వచ్చిన కొద్ది రోజులకే ఆయనను మాల్వాకు కాబోయే రాజుగా ప్రకటించాడు. దానితో విక్రమాదిత్యుడికి యుద్ధ శిక్షణ, రాజ్య పాలనా వంటి వాటిపై పట్టు సాధించడానికి సమయం దొరికింది. విక్రమాదిత్యుడు పెరిగి పెద్దవ్వగానే, రాజ్యాన్ని అతనికి అప్పగించి, హరిద్వార్ వెళ్ళి తన శేషాజీవితాన్ని అక్కడ ప్రశాంతంగా గడిపినట్లు తెలుస్తోంది.

మాల్వా భాధ్యతలను పూర్తిగా స్వీకరించిన తర్వత విక్రమాదిత్యుడు, కొత్త రకమైన, అత్యంత బలమైన, క్రూరమైన సేన స్థాపనకు నాంది పలికాడు. దానినే భైరవ సేన అనే పేరుతో పిలిచారు. ఆ కాలంలో మాల్వా దగ్గరలో ఉన్న అనేక ఆటవిక తెగల ప్రజలనూ, నాగ సాధువులనూ తన సేనలో భాగం చేసుకున్నాడు. శకులు కూడా శివుడి ఆరాధకులే కదా, మరి నాగ సాధువులకు వారిపై కోపం ఎందుకు వచ్చింది..? హిందూ ధర్మం అపాయ స్థితిలో పడినప్పుడే కదా ఈ నాగ సాధువులు ముందుకు వచ్చి యుద్ధాలు చేసేది! అనే సందేహాలు కలుగుతాయి. అందుకు సమాధానం, శకుల జీవన విధానం. వారు మధ్య ఆసియాతో పాటు, నాటి రోమన్ కల్చర్ కి కూడా దగ్గరగా బ్రతకడంతో, వారి జీవన విధానంలో విశృంఖలత్వం పెచ్చుమీరి ఉండేది. వారి జీవన విధానం, ఇక్కడున్నవారితో నడుచుకున్న తీరు కారణంగా, సనాతన ధర్మానికి చేటు జరుగుతుందనే ఉద్దేశంతో, నాగ సాధువులు, భైరవ సేనలో భాగం అయ్యారు.

ఈ సైనిక కూటమి జరిగిన కొద్ది రోజులకే మహా కుంభమేళా రావడంతో, నదీ స్నానాలు ఆచరించిన భైరవసేన, ఆ వెంటనే శకుల పై విరుచుకు పడ్డారు. చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం, ఆ సమయంలో భారత దేశం నాలుగు దిక్కులనూ నలుగురు శక రాజులు పాలించేవారు. వారందరనీ ఈ భైరవ సేన, యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించి, ప్రాణాలతో పట్టుకుని, విక్రమాదిత్యుడి ముందుకు తీసుకొచ్చి, చంపడం జరిగింది. కేవలం వారినే కాకుండా, భారత దేశ వ్యాప్తంగా ఉన్న శక రాజ వంశస్తులందరనీ వెతికి వేటాడి, 40 ఏళ్ళలలో అఖండ భారతావనిని తన గుప్పెటలోకి తెచ్చుకున్నాడు. దానితో రాజా విక్రమాదిత్యుడు, చక్రవర్తిగా ఎదిగాడు. అంతేకాదు, తమ భైరవసేనతో శకులపై మొదలు పెట్టిన విజయయాత్రను విక్రమాదిత్యుడు, మధ్య ఆసియా మీదుగా, ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినట్లు చరిత్ర విదితం.

నేడు మధ్య ఆసియా దేశాలుగా పిలవబడుతున్న Pakistan, Turkmenistan, Afghanistan, Uzbekistan, Tajikistan, Iran, Arabia దేశాల వరకూ ఉన్న మొత్తం భూభాగాన్ని, తన ప్రత్యక్ష పాలన క్రిందకు తీసుకువచ్చాడు. అంతేకాదు, విక్రమాదిత్యుడి విజయ యాత్ర గురించి తెలుసుకున్న ఈజిప్ట్ రాజులు, ఆయనతో సంధి కుదుర్చుకుని కప్పం కట్టడం మొదలు పెట్టారు. విక్రమాదిత్యుడు కదన రంగంలో ఎంతటి అరివీర భయంకరుడో, సుభిక్షమైన పాలన అందివ్వడంలో అంతే సమర్ధుడనీ, కలియుగంలో రామ రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి విక్రమాదిత్యుడనీ, చరిత్రకారులు కొనియాడతారు.

అంతటి మహా విరుడి గాధను, ఆధునిక భారతంలోని కుహనా మేధావులు తొక్కేయడానికి ఎంతో విశేషంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా ఆయన అఖండ చరిత్రను గురించి తెలిపే పుస్తకాలను బయటకు రానివ్వడం కానీ, ఆయన ఘన కీర్తిని ప్రచారం చేసే సాధనలు కానీ మన గత నాయకులు చేయలేదు. ఆఖరికి పిల్లలు చదివే పాఠ్య పుస్తకాలలో కూడా, భారతీయ మహిళ చేతిలో చావు దెబ్బలు తిని, తప్పించుకుని బయటపడ్డ అక్బర్ గురించి గొప్పగా రాశారు కానీ, రామ రాజ్యాన్ని స్థాపించి, దాదాపు ఆసియాను మొత్తం తన ఏక పాలనకిందకు తెచ్చుకున్న చక్రవర్తి విక్రమాదిత్యుడి గురించి ఒక్క అక్షరం కూడా రాయలేదు. అంతేకాకుండా, ఇన్నేళ్లుగా ఆయనను చందమామ కథల్లో నాయకుడిగా మాత్రమే చిత్రించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది.

అయితే, సహాయం పొందినవాడి చెయ్యి మాత్రం ఊరుకోలేదు.. విక్రమాదిత్యుడి ఘన కీర్తి గురించి, తమ భాషలో స్పష్టంగా రాసుకున్నారు. ఇప్పటికీ టర్కీ రాజధాని İstanbul లో ఉన్న Maktab-e-Sultania అనే ప్రాచీన గ్రంధాలయంలోని కొన్ని పురాతన అరబిక్ పుస్తకాలలో, విక్రమాదిత్యుడు ఎంతో విశేషంగా కీర్తించబడ్డాడు. ‘ఆయన కాలంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులని’ ఆ పుస్తకాలలోని ఒక వాక్యం. విక్రమ శకం, లేదా విక్రమాదిత్య శకం అని ఈ శకం వ్యవహరించబడడం కూడా సాధారణ విషయం కాదు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఒక శక కర్త ఉనికినే కొన్ని తరాలుగా మరుగు పరిచేశారని. ఇప్పటికైనా భారతీయ యువత మేలుకుని, కుహనా మేధావుల కుళ్ళు రాతలూ, మాటల నుంచి బయటపడి, మన ఘన చరిత్ర గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే, వారందరికీ ఈ వీడియో చేరాలి. విక్రమాదిత్యుడికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు కూడా చూడండి..

🚩 జై భారత్ 🙏

Saturday, February 8, 2025

భీష్మ ఏకాదశి 2025 Bhishma Ekadashi


ఈ రోజు 08-02-2025 'భీష్మ ఏకాదశి' విశేషం TELUGU VOICE

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.

భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు.  దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండిపోయాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.

భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.

ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం.

మఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్యాణం జరిగిన రోజు. మరుసటి ఏకాదశి ఆ మహానుభావుని పేరిట ఏర్పాటు చేయబడిన తిథి. అది ఆయనకి దక్కిన గౌరవం. కావున నేడు మనమంతా భీష్మ పితామహుల ద్వారా లభించిన విష్ణు సహస్ర నామ పారాయణం చేసి పునీతులమవుదాం.

🚩 శుభంభూయాత్ 🙏

Monday, February 3, 2025

RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!


సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక! TELUGU VOICE

కుబేర నిర్మితం, స్వర్ణ శోభిత భవంతులతో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశం, ఆ యుగం చూడని అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నగరం, రావణ ఆక్రమిత ‘లంక’. అసుర రాజు ఏలిన లంక.. సీత మాత కన్నీటితో మలినమైన లంక.. హనుమ దహించిన లంక.. రాముడి చేతిలో పరాజయం పొందిన లంక.. నేడు మనకు కనిపిస్తున్న శ్రీలంక కాదా..? మరి రావణ పాలిత లంక నేడు ఉన్న శ్రీలంక కానప్పుడు, అసలు లంక ఎక్కడ ఉంది..? అలాంటప్పుడు ధనుష్కోటి నుంచి శ్రీలంకను కలుపుతున్న రామసేతు, రాముడు నిర్మించినదెలా అయ్యింది? రావణ లంక కుమారీ ఖండంలో భాగమా..? మరి ఇప్పుడున్న శ్రీలంక ఏమిటి? అసలు శ్రీలంకను రావణ లంకగా ఎందుకు భావిస్తున్నారు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZgGKSd_PD_Q ]


నేటి శ్రీలంక రావణ లంక కాదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అసలు రామాయణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియడానికి మనకు ముందుగా కనిపించే ఆధారం వాల్మీకి రామాయణం. అసలు త్రేతాయుగంలో రామాయణం జరిగిందని చెప్పడానికి ఉన్న ఏకైక ఆధారం, వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యం. అయితే, అసలైన రావణ లంక గురించిన స్పష్టత రావడానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చరిత్ర, భౌగోళిక మార్పులు, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంపై కూడా కాస్తంత పట్టు ఉండాలని నిపుణులంటున్నారు.

రామాయణం.. భారత దేశ చరిత్రలో ఓ ముఖ్య ఘట్టం. ప్రపంచ మానవాళికి ఆదర్శ ఇతిహాసం. అయితే, వాల్మీకి లిఖిత రామాయణంలో, సీతా రాములు, తక్కిన పాత్రల పుట్టుపూర్వోత్తరాలే కాకుండా, నాడు రామాయణం జరిగిన ప్రదేశాల గురించీ, నాటి ప్రపంచ స్థితిగతుల గురించీ, భౌగోళిక విశేషాల గురించీ, ఎంతో స్పష్టంగా తెలియజేశారు వాల్మీకి మహర్షి. నేడు ఉన్న సీరియల్స్, సినిమాల దయవల్ల, సీతా మాత అన్వేషణ కోసం సుగ్రీవుల వారు కేవలం ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడిని మాత్రమే పంపినట్లు అందరూ అనుకుంటారు. కానీ నిజానికి, వాల్మీకి రామాయణంలోని కిష్కింధ కాండను పరిశీలించినప్పుడు, ఆయన మొత్తం నాలుగు దళాలను సిద్ధం చేసి, నలు వైపులకూ పంపడం జరిగింది. ప్రతి దళంలో, తన దగ్గర ఉన్న అత్యంత శ్రేష్టులైన దళపతులను నియమించాడు. వారు బలంలో హనుమంతుల వారికి ఏ మాత్రం తీసిపోరు. ఒక విధంగా చెప్పాలంటే, అప్పటికి ఇంకా హనుమకు తన పూర్తి శక్తి తెలియదు కాబట్టి, ఆ సమయంలో ఆ దళపతులు ఒకింత హనుమకంటే బలమైన వారని, వాల్మీకి రామాయణంలో పేర్కొనబడింది. ఇది హనుమంతుల వారిని కించపరచే ఉద్దేశం కాదనేది మనం గమనించాలి. కేవలం ఆ సమయానికి హనుమ పూర్తి శక్తి ఆయనకే తెలియదు కాబట్టి, నాడున్న పరిస్థితీ, అప్పటి బాలాబలాల రీత్యా ఈ పొంతన వ్యక్త పరచడం జరిగింది.

ఇలా సిద్ధం చేసిన ప్రత్యేక వానర దళాలను భూమిపై నాలుగు దిక్కులకు పంపుతూ, వారి వారి దిక్కుల్లో ఎటువంటి ప్రదేశాలు వస్తాయి, ఎటువంటి ఆటంకాలు ఉంటాయి, అక్కడ బౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉండే ప్రజలు, వింతలు, విశేషాల వంటి అన్నిటి గురించీ సుగ్రీవ మహారాజు తన సేనలకు చెప్పి పంపాడు. ఈ క్రమంలో అంజనేయుడి దళాన్ని దక్షిణ దిక్కుకు వెళ్ళమని అజ్ఞాపించి, వారికి దక్షిణ దిక్కులో ఉన్న అన్ని ప్రదేశాల గురించీ స్పష్టంగా తెలియజేశారు. అందులో భాగంగా, మన ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళ నాడు ప్రాంతాల గురించీ, అక్కడ ఉండే నదులూ, వింతలూ విశేషాల గురించీ చెబుతూ, ఆఖరున దాదాపు నూరు యోజనాల దూరంలో, సముద్రం మధ్యలో నూరు యోజనాల విస్తీర్ణం కలిగిన ప్రాంతంగా లంక గురించీ, దానిని రావణుడు పరిపాలిస్తుండడం గురించీ చెప్పారు.

అలా సుగ్రీవుడు చెప్పిన ఆనవాళ్ళను పట్టుకుని వెళ్ళిన హనుమంతుల వారి దళం, మన దేశానికి దక్షిణ దిక్కున ఉన్న ప్రతి ప్రాంతాన్ని అత్యంత వేగంగా జల్లెడ పడుతూ వెళ్ళి, ఆఖరికి తమిళ నాడు చివరన ఉన్న మహేంద్రగిరి పర్వత ప్రాంతంలో ఆగారు. ఇక అక్కడితో భూమి అంతమై, విశాలమైన సముద్రం కనిపించ సాగింది. సముద్రం మధ్యలో లంక అనే ప్రాంతం ఉందని తెలిసినా, అక్కడికి వెళ్ళే మార్గం లేక, సీతామాత జాడలు కనిపించలేదన్న నిరాశతో కూర్చున్నప్పుడు, ఆ తల్లి జాడలు తెలియజేసింది సంపాతి అనే పక్షి. సీతా మాతను అపహరిస్తూ, వాయు మార్గంలో పుష్పక విమానంపై వెళ్తున్న అసుర రాజును అడ్డుకునే ప్రయత్నంలో అసువులు బాసిన జటాయువుకు స్వయానా అన్న ఈ సంపాతి. ఈ వివరాలతో మనం గతంలో చేసిన వీడియో link ను, చూడని వారికోసం icards లోనూ, description లోనూ పొందుపరుస్తున్నాను.

ఆ సమయంలో ఆంజనేయుడు, జాంబవంతుడి ప్రోద్బలంతో తన శక్తిని తెలుసుకుని, మహేంద్రగిరి పర్వతం ఎక్కి, అక్కడి నుంచి దక్షిణ పశ్చిమ దిశలో ఉన్న రావణ లంకకు, నూరు యోజనాల మేర సముద్రాన్ని దాటి వెళ్ళినట్లు, వాల్మీకి రామాయణంలో పేర్కొనబడి ఉంది. ఇక్కడ ఒక యోజనం అంటే 12.8 కిలోమీటర్లు. ఆ విధంగా చూసుకుంటే, వంద యోజనాలంటే దాదాపు 1280 కిలోమీటర్ల దూరం. అలా హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతం నుంచి, 1280 కిలోమీటర్ల దూరం ఎగిరి లంకను చేరుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంక, భారత భూభాగం నుంచి మహా అయితే 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలా చూస్తే, నాడు హనుమంతుడు వెళ్ళింది నేటి శ్రీలంకకు కాదు.

నేటి శ్రీలంక నాటి రావణ పాలిత లంక కాదని చెప్పడానికి మరిన్ని ఆధారాలున్నాయి. మనం ముందు చెప్పుకునట్లు, సుగ్రీవుడు రావణ పాలిత లంక గురించి చెప్పినప్పుడు, దాని విస్తీర్ణం కూడా దాదాపు 100 యోజనాలు, అంటే, 1280 చదరపు కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకున్నాము. ఆ విధంగా చూసుకున్నా, నేడు శ్రీలంకగా పేర్కొంటున్న ద్వీప దేశం విస్తీర్ణం, కేవలం 50 నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ లెక్కన కూడా నేటి శ్రీలంక, ఆనాటి రావణ లంక కాదని అర్ధం అవుతూ ఉంది.

ఇక మూడవ ఆధారంగా, మన పురణాలతో పాటు, నేటి శ్రీలంక చరిత్రను పరిశీలిస్తే.. ఎక్కడా కూడా నాటి లంకను శ్రీలంక అని పిలవలేదు. ఆధునిక చరిత్రకారుల దగ్గరున్న ఆధారాల ప్రకారం చూసుకున్నా, సామాన్య శకం కంటే ముందు, అంటే, 266 బిసిలో, నేడు శ్రీలంకగా పిలవబడుతున్న ప్రాంతాన్ని, Devanampiya Tissa అనే మహారాజు ఆక్రమించుకుని చక్రవర్తిగా పేరుగాంచాడని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ప్రాంతం సింహళ దేశంగా పేర్కొన బడింది. మన పురాణాలలో కూడా సింహళ దేశం గురించి వివరింపబడివుంది. అలాగే శ్రీలంక గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్థావించబడింది. అప్పటి నుంచి బ్రిటీషర్లు, డచ్, ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు, నేటి శ్రీలంకను సింహళ దేశంగానే పిలిచేవారు. 80, 90 దశకాలవరకూ భారత దేశ Map ని పరిశీలిస్తే, శ్రీలంక పేరు సింహళ గానే ఉండేది. ఇదిలా ఉంటే, మన భాష లోని పేర్లను పలకడం రాని తెల్ల సన్నాసులు, సింహళను సిలోన్ గా పిలవడం మొదలు పెట్టారు. అధికారిక రికార్డ్స్ లో కూడా అదే పేరును పెట్టేవారు. నేటికీ మన దేశంలో చాలా గ్రామాలూ, పట్టణాల పేర్లు వింతగా మారిపోడానికి ఆ బ్రిటిష్ దొరల నాలుక మందమే కారణం.

అయితే, బ్రిటీషర్లు పోతూ పోతూ చేసిన వెధవ పనుల్లో ఒకటి, సిలోన్ ని కూడా ఓ ప్రత్యేక దేశంగా మార్చడం. ఇదిలా ఉంటే, స్వాంతంత్ర్యం పొందిన కొన్నేళ్లకే, అంటే 1950లలోనే, నాటి సిలోన్ ప్రభుత్వం తమ దేశం పేరును లంకగా మార్చుకోవడం జరిగింది. సంస్కృతంలో లంక అంటే, దీవి అని అర్ధం. సంస్కృతం నుంచి వచ్చిన ఈ పదాన్నే, మన దేశంలోని అనేక స్థానిక బాషలు కూడా ఇంజెక్ట్ చేసుకున్నాయి. ఉదాహరణకు మన తెలుగులో కూడా island ని లంక అని పిలుస్తాము. మన దేశంలో రెండవ అతిపెద్ద నది అయిన గోదావరిని పరిశీలిస్తే, ఆంధ్రపదేశ్ లోని రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్న అఖండ గోదావరి మధ్యలో చాలా దీవులు కనిపిస్తాయి. వాటిలో కాస్త పెద్ద దీవులలో నేటికీ జనాలు నివాసముంటుంటే, వాటిలో కొన్నిటికి బొబ్బరలంక, పిచ్చుక లంక వంటి పేర్లను గమనించవచ్చు. దానిని బట్టి లంక అనే పదానికి అర్ధం island అని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. అలానే నాటి సిలోన్ ప్రభుత్వం, 1950ల నుంచి తమ దేశాన్ని లంక అని పిలుచుకోవడం మొదలు పెట్టగా, 1972 లో.. శుభ సూచకంగా శ్రీ లంక అనే పేరును పెట్టుకున్నారు. అప్పటి నుంచి మాత్రమే, సింహళ దేశం శ్రీలంకగా మారింది. దీనిని బట్టి కూడా, నాటి రావణ పాలిత శ్రీలంక నేటి శ్రీలంక కాదని, స్పష్టంగా తెలిసిపోతుంది.

మరి అసలు లంక ఎక్కడుంది..? అనేదే ఇప్పుడు మనకు తెలియాల్సి వుంది.. దానికి సమాధానం కూడా, మన పురాణాలూ, చారిత్రక గ్రంధాలలోనే కాకుండా, భారతీయ ఖగోళ శాస్త్ర పండితులు లిఖించిన పుస్తకాలలో కూడా ఉంది. మన దేశంలో ఆది కాలంలోనే ఖగోళ శాస్త్రంపై లిఖించ బడిన గ్రంధం, సూర్య సిద్ధాంతం. నేటి ప్రపంచం, ముఖ్యంగా ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంతగానో కొలిచే మన భారతీయ ప్రాచీన ఋషులైన ఆర్య భట్ట, వరాహమిహిర, బ్రహ్మ గుప్తుడు వంటి ఎంతో మంది రాసిన పుస్తకాలలో, ప్రత్యేకంగా చెప్పబడిన విషయం మధ్య రేఖ. దానినే నేటి కాలంలో, Prime Meridian Line అని పిలుస్తున్నారు. దాదాపు 150 ఏళ్ల క్రితం, ఈ Prime Meridian Line తమ దగ్గర నుంచి వెళ్తుందని బ్రిటిష్ వారు వాదించి ప్రచారం చేసుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఆ Prime Meridian Line, లండన్ నుంచి వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ, ఈ తెల్లదొరలకు అసలు భూమి ఏ షేప్ లో ఉందో కూడా తెలియని ఆ కాలంలోనే, ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మన శాస్త్రవేత్తలు, మధ్య రేఖ మన దేశంలో ఉన్న కురుక్షేత్రం, ఉజ్జయిని వంటి ప్రదేశాల గుండా వెళ్తుందనీ, అదే లైన్ లో లంక ఉందనీ చెప్పడం జరిగింది. ఆ లెక్కన పరిశీలించినా నేటి శ్రీలంక, నాటి రావణ లంక కాదని మరోసారి రూఢీ అవుతుంది. ఎందుకంటే, మన పూర్వీకులు చెప్పిన ఆ మధ్య రేఖకూ, నేడు ఉన్న శ్రీలంకకూ చాలా దూరం ఉంది.

వాల్మీకి మహర్షి వివరణ ప్రకారం, మహేంద్రగిరి పర్వతం నుంచి దక్షిణ పశ్చిమ దిశలో, నూరు యోజనాల దూరంలో, మధ్య రేఖ మీదుగా వెళ్తున్న ఏకైక ప్రాంతం, నేడు మనకు తెలిసిన మాల్దీవ్స్ అనే ప్రాంతం. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం, నాటి రావణ లంక, నేటి మాల్దీవ్స్ కి అతి సమీపంలో ఉండేదనీ, ప్రస్తుతం అది సముద్ర గర్భంలో కలిసిపోయిందనీ భావిస్తున్నారు. అందుకే ఆ పరిసరాలలోని చాలా ప్రాంతాలలో అస్సలు లోతు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది పరిశోధకుల అంచనా ప్రకారం, రామాయణం జరిగి దాదాపు 11 నుంచి 12 వేల సంవత్సరాలు అయ్యి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఇన్నేళ్లల్లో భూమిపై వచ్చిన చాలా మార్పుల కారణంగా, ఎన్నో తీర ప్రాంతాలూ, మరెన్నో దీవులూ సముద్ర గర్భంలో కలిసి పోయాయి. వాటిలో రావణ లంక కూడా ఒకటని తెలుస్తోంది. అంతేకాదు.. నాటి లంక కనుమరుగు కావడానికి అగ్ని పర్వతాలు కూడా కారణం అయ్యి ఉండవచ్చని ఒక అంచనా. ఎందుకంటే, దీవులలో ఉన్న అగ్ని పర్వతాలు భారీ స్థాయిలో విస్పోటనం చెందినప్పుడు, ఆ ప్రభావం కారణంగా దీవులు కూడా ముక్కలు ముక్కలై, నీటిలో కలిసిపోతాయని, ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, 1883లో జరిగిన భారీ అగ్ని పర్వతం పేలుడును చెప్పుకోవచ్చు. కొన్ని వేల ద్వీపాల సమూహంగా ఏర్పడ్డ దేశం, ఇండోనేషియా అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికీ ఆ దేశంలోని ఎన్నో దీవులలో అగ్ని పర్వతాలున్నాయి. అయితే, వాటి వల్ల Krakatoa అనే దీవి 70 శాతం నాశనమై సముద్ర గర్భంలో కలిసిపోయింది. అదే విధంగా, నాటి రావణ లంక నీట మునగడానికి కూడా అలాంటి భయంకరమైన అగ్ని పర్వతాల పేలుళ్ళో, భారీ సునామీలో, భూమి పొరల్లోని Tectonic Plates కదలికల వంటి పలు కారణాలుండవచ్చని నిపుణుల అంచనా.

అయితే కొంతమంది చరిత్రకారులు, రావణ లంక ఒకప్పటి కుమారీ ఖండంలో భాగమా! అనే సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది పాశ్చాత్య చరిత్రకారులు, కుమారీ ఖండం ఉనికిపై పలురకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తమిళ ప్రాచీన చరిత్రలో, అక్కడి పల్లె పాటల్లో, కుమారీ ఖండం ప్రస్థావన ఉంటుంది. తమిళ భాషలో రాసిన ఎన్నో పురాతన గ్రంధాలలో కూడా కుమారీ ఖండం ప్రస్థావన ఉంది. ఉదాహరణకు, 2వ శతాబ్దంలో రాసిన Manimekalai అనే పుస్తకంలోనూ, 5వ శతాబ్దంలో రాసిన Silappathikaaram అనే పుస్తకంలోనూ, కుమారీ ఖండం గురించి ప్రస్థావించబడి వుంది. మన దేశ చరిత్రకారులు చాలా మంది, దాదాపు 25 వేల సంవత్సరాల ముందు వరకూ కుమారీ ఖండం ఉండేదనీ, తర్వాత ఆ ఖండం మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయిందనీ, అందులో మిగిలి పోయిన భాగమే నాటి రావణ లంక అయ్యి ఉండవచ్చనీ అంటున్నారు. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుంది.

ఇదంతా విన్న తర్వాత, నేటి శ్రీలంక రావణ లంక కానప్పుడు, నేడు కనిపిస్తున్న రామ సేతు మానవ నిర్మితం కాదా? మరి అసలైన రామ సేతు ఎక్కడ ఉంది? అనే సదేహం కలుగుతుంది. దానికి సమాధానం, వాల్మీకి రామాయణంలోనే స్పష్టంగా చెప్పబడింది. రామ రావణ యుద్ధానంతరం, లంక నుంచి రాక్షసులు సులువుగా భారత దేశంలోకి రాకుండా కట్టడి చేయడానికి, స్వయంగా రాముడే రామ సేతును నాశనం చేశాడని ఉంది.

అయితే చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం, ఇప్పుడున్న రామ సేతుని రావణుడి తమ్ముడూ, రామ బంటు అయినటువంటి విభీషణుడు, రాముడి జ్ఞాపకార్ధం, సింహళ ద్వీపం నుంచి ధనుష్కోటి వరకు కట్టించడం జరిగింది. ఆ విధంగా ఈ నిర్మాణానికి రామ సేతు అనే పేరు రావడంతో పాటు, ఆనాటి మన ఘన చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కొంతమంది చరిత్రకారుల పరిశోధనల ప్రకారం, ఒకప్పుడు రావణ రాజ్యం, నేటి మన మహారాష్ట్ర వరకు ఉండేది. దానితో సింహళ దేశం కూడా వారి ఆధీనంలోనే ఉండేది. భారత భూ భాగానికి అతి సమీపంలో ఉండటం చేత, ఆ కాలంలోనే రావణుడు, సింహళ దేశంలో ఓడ రేవులూ, తన పుష్పక విమానం దిగడానికి వీలుగా హేలీ ప్యాడ్ వంటివి నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. దానితో సింహళ దేశంలో నాటి నుంచి జనావాసాలు ఏర్పడ్డాయి. అయితే రావణ లంక అంతమైన తర్వాత, మిగిలిన కొద్దిమందినీ విభీషణుడు సింహళ దేశానికి తరలించినట్లూ, ఆ తర్వాత సేతు నిర్మాణం చేసి దానికి రామ సేతు అనే పేరు పెట్టినట్లూ భావిస్తున్నారు.

విభీషణుడు నిర్మించిన కాలంలో నేడు చూస్తున్న రామ సేతు చాలా పెద్దగా, బాగా విశాలంగా ఉండేది. కాల గమనంలో వచ్చిన మార్పుల వల్ల రామ సేతు కుచించుకుపోతూ వచ్చింది. దాదాపు 15, 16 శతాబ్దాల వరకూ రామ సేతుపై నడుచుకుంటూ సింహళ దేశం వెళ్ళడానికి అవకాశం ఉండేది. సిక్కు మత స్థాపకుడూ, సిక్కుల ఆది గురువూ, శ్రీరామ భక్తుడూ అయిన గురు నానక్ కూడా, 1511లో రామ సేతుపై నడుచుకుంటూ శ్రీలంక వెళ్ళడం జరిగినట్లు, సిక్కుల చారిత్రక గ్రంధాలలో పేర్కొనబడి ఉంది. చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలో సంభవిస్తున్న సైక్లోన్స్ కారణంగా రామ సేతు కొద్ది కొద్దిగా నాశనమవుతూ వస్తుండగా, 1964లో వచ్చిన భారీ సైక్లోన్ కారణంగా, పూర్తిగా నాశనమైనట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, 1964లో వచ్చిన సైక్లోన్ కారణంగా, అతి ప్రాచీనమైన ధనుష్కోటి పట్టణం కూడా పూర్తిగా నాశనం అయ్యింది.

నాటి తమిళనాడు ప్రభుత్వం, ధనుష్కోటిని మళ్ళీ బాగు చేయడం మానేసి, దాన్ని ఒక Ghost Town గా ప్రకటించి, చేతులు దులుపుకుంది. కానీ, హైందవ చరిత్రలో రామయణంతో ముడిపడి ఉన్న ధనుష్కోటి లేకపోతే, భావితరాలకు మన ఘన చరిత్ర తెలిసే అవకాశం లేదని భావించిన కొంతమంది హిందువులూ, కొన్ని హిందూ సంఘాల వారూ పూనుకుని, ధనుష్కోటిని కొంత వరకూ బాగు చేసి, అక్కడ ఉన్న వింతలను వెలికి తీశారు. నేడు మనం ధనుష్కోటిని చూడగలుగుతున్నాం అంటే, అది వారి చలవే అని చెప్పుకోవాలి.
ఎంతో ఘనమైన మన చరిత్ర నేటి యువతకు తెలియకపోడానికి కారణం, గడచిన వెయ్యి సంవత్సరాలుగా మనపై జరిగిన భౌతిక, సాంస్కృతిక దాడులే. నాటి ముస్లిం పాలకులు మన చరిత్రకు ఆలవాలంగా నిలిచే లక్షలాది ఆలయాలనూ, వేలాది గ్రంధాలయాలనూ నాశనం చేయడం వల్ల, మన అసలు చరిత్ర చాలా వరకూ మరుగున పడిపోగా, రెండువందల ఏళ్ల బ్రిటిష్ దొరల పాలన కారణంగా మరింతగా దారి మళ్ళింది.

అయితే, ‘నిజం నివురు గప్పిన నిప్పు’ అది ఎప్పటికైనా తెలిసి తీరుతుందనే నానుడిని నిరూపిస్తూ, నేడున్న ఆధునిక పరిజ్ఞానం సహాయంతో కొంతమంది చరిత్రకారులూ, నిపుణులూ అసలు చరిత్రను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో బయట పడిన వాస్తవాలే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్. అయితే, అతి పురాతనమైన భారత దేశ చరిత్రను పూర్తిగా వెలికి తీసేంత వరకూ ఈ పరిశోధనలు కొనసాగాలనీ, దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలనీ కోరుకుంటున్నాను.

🚩 జై శ్రీరామ 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...