మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం! Rudraprashna - రుద్రప్రశ్న!
అందరికీ శ్రావణమాసారంభ శుభాభినందనలు 🙏 మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం! శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శత రుద్రీయం, యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకూ, మృత్యువుకూ అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేదీ, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం, అన్ని రకాల ప్రయోజనాల కోసం, అన్ని దోషాలనూ, కష్టాలనూ తొలగించడానికి సహకరిస్తుంది. పూజలు, హోమాలలో, దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీ రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. 'నమో' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల, నమకం అని పిలుస్తారు. రెండవ భాగం, యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. 'చమే' అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల, దీనిని చమకం అని పిలుస్తారు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2GuNRVW62rk ] నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ | నిత్యం త్రయం ప్రయుంజనో బ్రహ్మలోకే మహీయతే || నమకం చమకం ఎవరైతే మూడు సార్లు, పురుష సూక్తంతో ప్రతి దినం చ