Posts

Showing posts with the label రామాయణంలో చెప్పబడిన పాతాళ లోకం

PARACAS TRIDENT OF PERU - RAMAYANA LINK రామాయణంలో చెప్పబడిన పాతాళ లోకం

Image
  రామాయణంలో చెప్పబడిన పాతాళ లోకం నేటి దక్షిణ ఆమెరికానా! పెరూ దేశంలోని Candelabra of the Andes గురించి కిష్కింధకాండలో ఏముంది? స్వతంత్ర భారతావని లోని మేధావులూ, మహా నాయకులూ, భావి తరాలకు నేర్పించింది ఏముందని తరచి చూస్తే, అక్బర్ గొప్పవాడు, ఔరంగజేబ్ హిందూ ద్వేషి కాదు, కేవలం ఒక రాజుగా తన రాజ్య విస్తీర్ణం మాత్రమే కోరుకున్నాడు లాంటి అవాస్తవాలే.. మనం ఇతర మతాల గురించి కానీ, వాళ్ళు చేసిన, చేస్తున్న ఆగాయిత్యాల గురించి గానీ మాట్లాడితే తప్పు.. అదే వాళ్ళు హిందూత్వాన్ని తిట్టడం, మనపై దాడి చేయడం గ్రేట్ ఫ్రీడం ఆఫ్ స్పీచ్, లౌకిక వాదం. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ వంటి నర రూప రాక్షసుడిని ఉత్తమోత్తముడిగా భారతీయుల హృదయాలలో పచ్చ బొట్టులా శాశ్వతంగా ముద్రించి వేశారు. పైగా మన పురాణాలు కల్పితాలుగా, మన పూర్వీకులు ఆటవికులుగా, మనకు పడవలు తయారు చేసుకోవడం కూడా రాని సమయంలో, మన దేశానికి ఎవడో Vasco da Gama అనే యూరోపియన్ వ్యక్తి సముద్ర మార్గం కనిపెట్టాడనీ, అంతవరకూ మనకు సముద్ర యానం ఎలా ఉంటుందో కూడా తెలియదనీ అన్నట్లు, చరిత్రను వక్రీకరించి మరీ పాఠశాలల్లో పాఠాలు నేర్...