Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, June 9, 2025

PARACAS TRIDENT OF PERU - RAMAYANA LINK రామాయణంలో చెప్పబడిన పాతాళ లోకం


 రామాయణంలో చెప్పబడిన పాతాళ లోకం నేటి దక్షిణ ఆమెరికానా!

పెరూ దేశంలోని Candelabra of the Andes గురించి కిష్కింధకాండలో ఏముంది?

స్వతంత్ర భారతావని లోని మేధావులూ, మహా నాయకులూ, భావి తరాలకు నేర్పించింది ఏముందని తరచి చూస్తే, అక్బర్ గొప్పవాడు, ఔరంగజేబ్ హిందూ ద్వేషి కాదు, కేవలం ఒక రాజుగా తన రాజ్య విస్తీర్ణం మాత్రమే కోరుకున్నాడు లాంటి అవాస్తవాలే.. మనం ఇతర మతాల గురించి కానీ, వాళ్ళు చేసిన, చేస్తున్న ఆగాయిత్యాల గురించి గానీ మాట్లాడితే తప్పు.. అదే వాళ్ళు హిందూత్వాన్ని తిట్టడం, మనపై దాడి చేయడం గ్రేట్ ఫ్రీడం ఆఫ్ స్పీచ్, లౌకిక వాదం. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ వంటి నర రూప రాక్షసుడిని ఉత్తమోత్తముడిగా భారతీయుల హృదయాలలో పచ్చ బొట్టులా శాశ్వతంగా ముద్రించి వేశారు. పైగా మన పురాణాలు కల్పితాలుగా, మన పూర్వీకులు ఆటవికులుగా, మనకు పడవలు తయారు చేసుకోవడం కూడా రాని సమయంలో, మన దేశానికి ఎవడో Vasco da Gama అనే యూరోపియన్ వ్యక్తి సముద్ర మార్గం కనిపెట్టాడనీ, అంతవరకూ మనకు సముద్ర యానం ఎలా ఉంటుందో కూడా తెలియదనీ అన్నట్లు, చరిత్రను వక్రీకరించి మరీ పాఠశాలల్లో పాఠాలు నేర్పారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. నిజం అనే నిప్పు దావానలంలా ఎప్పటికైనా బయటకు తన్నుకు రాక మానదు. అలా నేడు బయటకు తన్నుకు వచ్చిన నిజమే, రామాయణం మన ఆమోఘమైన చరిత్ర అన్న విషయం. రామగాథ మన పూర్వీకుల వాస్తవిక చరిత్ర.. అతి ప్రాచీన నాగరికతకు ఆనవాళ్ళతో, కొన్ని యుగాల పూర్వమే భారతీయులు సాధించిన మేథో సంపత్తిని నిరూపించే అద్భుత చరిత్ర రామాయణం. మన గత వీడియోలో, భారత దేశానికి సముద్ర మార్గం కనుగొన్నది Vasco da Gama అని ప్రచారం చేసిన వెధవలు కావాలని దాచిన రోమన్, భారతీయ వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాము. అందులో మన భారత దేశం వల్ల అతిపెద్ద రోమన్ సామ్రాజ్యం ఎలా పతనమయ్యినదో చూశాము. ఆ చరిత్ర సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం జరిగినది మాత్రమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వివారాల ప్రకారం, మన పురాణాలలో పేర్కొనబడిన పాతాళ లోకానికి, కొన్ని యుగాలకు పూర్వమే, అంటే రామాయణ కాలంలోనే వెళ్లారు మనవారు. ఆ వివరణ ప్రకారం, అది నేడు మనం చూస్తున్న దక్షిణ అమెరికా అని తెలుస్తోంది. ఈ మాటలు వినగానే, యుగాలకు పూర్వమే మన భారతీయులకు దక్షిణ అమెరికా గురించి తెలుసనే విషయంపై ఏవయినా ఆధారాలున్నాయా..? పాతాళ లోకానికీ, దక్షిణ అమెరికా ప్రాంతానికీ ఉన్న సంబంధమేమిటి.. వంటి సందేహాలు కలగడం సహజం. ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Vw0ymp9D5JU ]


రామాయణం అంటే కేవలం సీతారాముల గాథ మాత్రమే కాదు, అది మన దేశ చరిత్ర, శస్త్ర.. శాస్త్ర, వైద్య విజ్ఞానం, మన జీవితాలకు ఓ గూగుల్ మ్యాప్ కూడా అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఒక్కసారి రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎన్నో ప్రాంతాల వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. సీతమ్మ పుట్టింది నేటి నేపాల్ లో, రామయ్య పుట్టింది నేటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అనీ తెలుస్తోంది. భరత శత్రుఘ్నులు రామ రాజ్యాన్ని ఈజిప్ట్ వరకూ విస్తరింప జేసి, ఈజిప్ట్ ఫారో వంశానికి మూల పురుషులు అయ్యారు. ఇక హనుమ పుట్టింది కిష్కింధలో.. ఆ ప్రాంతం ఉన్నది నేటి కర్ణాటక రాష్ట్రంలో. దండకారణ్యం, నేటి దక్షిణ భారతం. ఇది రావణ సోదరులైన ఖర దూషణుల రాజ్యం. ఇందులో ఆంధ్ర, తమిళ రాజ్యాలూ, ఇక్కడి సామంత రాజుల గురించిన వివరణ కూడా ఉంది. ఇకపోతే నాడు రావణుడేలిన సువర్ణ లంక గురించిన వివరాలు మరింత స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆ రావణ లంక నేడు ఉన్న శ్రీ లంక కాదనీ, ఆ లంక ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయిందనీ మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాము. చూడని వారి కోసం ఆ లింక్, కింద description లోనూ, పైన icards లోనూ పొందుపరుస్తున్నాను.

ఇప్పటి వరకూ మనం చెప్పుకున్నది, నాటి అఖండ భారతంలోని ప్రాంతాల వివరాలు. ఇక రామాయణంలో పాతాళ లోకం గురించి కూడా చెప్పబడింది. వాల్మీకి రామాయణంలోని ఓ అద్భుత ఘట్టం కిష్కింధ కాండ. ఈ కాండలోనే రాముడు, హనుమంతుడు మొదటిసారి కలుసుకున్నారు. సుగ్రీవుడితో స్నేహం, వాలి వధ కూడా ఇదే కాండలో రాయబడి ఉంది. ఆ తర్వాత వానర రాజు సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం తన సేనను పంపడం కూడా ఇదే కాండలో కనిపిస్తుంది. మనం చూసిన సినిమాలలో, సీరియల్స్ లో, అంగదుడి నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నల, నీలులతో పాటు మరికొంతమంది వానర సేన మాత్రమే సీతాన్వేషణ కోసం వెళ్ళినట్లు చూశాము. తమిళనాడులోని మహేంద్ర గిరి ప్రాంతానికి చేరుకున్న హనుమంతుల వారు, తన శక్తి యుక్తులను తెలుసుకుని, సముద్రాన్ని లంఘించి లంకను చేరుకున్నారనీ, అక్కడ సీతామాతను కనుగొని, లంకను కాల్చి, ఆ సమాచారాన్ని రాముల వారికి చేరవేశారనీ మాత్రమే దర్శక రచయితలు చూపించారు.

కానీ రామాయణంలోని కిష్కింధ కాండను క్షుణ్ణంగా పరిశీలిస్తే, సుగ్రీవుడు పంపినది హనుమంతుడి బృందాన్ని మాత్రమే కాదు. మొత్తం 4 బృందాలను ప్రపంచం నలుమూలలకూ పంపినట్లు తెలుస్తుంది. వారిలో దక్షిణం దిక్కుగా వెళ్ళిన వారు, హనుమంతుల వారి బృందం. అలా వెళ్లేముందు, సుగ్రీవుడు ప్రతి బృందానికీ వారు వెళ్ళే దారిలో ఉండే వివిధ ప్రాంతాల గురించీ, ఆ ప్రాంత స్వభావాలూ, అక్కడి గుర్తులూ, ఆపై అక్కడ ఉండే వింత జీవుల గురించి కూడా స్పష్టంగా విశద పరచినట్లు తెలుస్తోంది. ఇలా సుగ్రీవుడి ఆజ్ఞమేరకు తూర్పు దిక్కుగా ప్రయణమైన వారు వెళ్ళిన చివరి ప్రదేశమే పాతాళ లోకంగా పేర్కొనబడింది. అదే నేటి దక్షిణ అమెరికా. అదెలాగో, రామాయణంలోని ఈ రెండు శ్లోకాలలో ఏం చెప్పబడినదో చూద్దాము..

త్రిశిరాః కాంచనః కేతుస్తాలస్తస్య మహాత్మనః | 

స్థాపితః పర్వతస్యాగ్రే విరాజతి సవేదికః || ౫౩ ||

కిష్కింధ కాండలోని 40వ సర్గలోని 53వ శ్లోకం ఇది. దీని అర్ధం ఏమిటంటే, త్రీశూలం లాంటి, బంగారం లాంటి, భారీ జెండాలాంటి ఆకారం ఒక భారీ పర్వతంపై ఉంటుంది. దాని కింది భాగంలో ఒక వేద పీఠం లాంటి వేదిక కూడా ఉంటుందని దాని అర్థం.

పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం తత్ త్రిదశేశ్వరైః |

తతః పరం హేమమయః శ్రీమానుదయపర్వతః || ౫౪ ||

ఇది 54వ శ్లోకం. దీని అర్ధం ఏమిటంటే, తూర్పు ముఖంగా దేవేంద్రుడి చేత సృష్టింపబడిన గుర్తులాంటిది, ఆ పర్వతంపై కనిపిస్తుంది. దానిని దాటుకుని ముందుకు వెళ్తే, మీకు ఉదయ పర్వతం కనిపిస్తుంది! అని దీని అర్థం.

ఇదంతా విని కొంత అయోమయ పరిస్థితి నెలకొనవచ్చు. సుగ్రీవుడు తూర్పు దిక్కుగా వెళ్ళే సేనను పిలిచి చెప్పిన ప్రకారం, వారు అలా వెళ్ళిన తర్వాత నేటి వియత్నాం, ఇండోనేషియా వంటి ప్రాంతాలను దాటి మహా సాగరంలో కొన్ని రోజులపాటు ప్రయాణించిన తర్వాత, వారికి మొదటగా కనిపించే దృశ్యం, బంగారు వర్ణపు కొండపై సువర్ణ కాంతులను విరజిమ్మే త్రీశూలం వంటి ఆకారం కనిపిస్తుందనీ, అది ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలి ఉంటుందనీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పోల్చి చూసుకుంటే, ఆ ఆకారం నేటి దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న Candelabra of the Andes ఆకారంగా తెలుస్తోంది. 54 వ శ్లోకంలో చెప్పినట్లు, ఈ Candelabra of the Andes ని దాటితే వచ్చే ప్రాంతాన్ని ఉదయ పర్వతం అని ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఆ ఉదయ పర్వతమే, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హిమ శిఖరాలలో ఒకటైన Andes పర్వతాలని తెలుస్తుంది.

ఈ రెండు శ్లోకాలను బట్టే, కొన్ని యుగాలకు పూర్వమే మన భారతీయులకు ప్రపంచం మొత్తం తెలుసని నిరూపితమవుతోంది. అంతేకాదు, వాళ్ళు సముద్ర యానం కూడా ఎంతో సులువుగా చేసేవారని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, రావణుడు సునాయాసంగా పాతాళ లోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడని వాల్మీకి రామాయణంలో ప్రస్థావించబడి ఉంది. ఎందుకంటే, రావణుడి సోదరుడైన అహిరావణడేలిన ప్రాంతం ఈ పాతాళ లోకమే. అందువల్ల ఆయన చాలా సార్లు పాతాళ లోకానికి వెళ్ళి వచ్చి నట్లు వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. యుద్ధ కాండలో చెప్పబడినట్లు, రామ లక్ష్మణులను వధించి తన అన్నకు విజయం చేకూర్చాలనే తలంపుతో, క్షుద్ర, తంత్ర శాస్త్రాలలో నిష్ణాతుడైన అహిరావణడు మాయా రూపంలో వచ్చి, రామ లక్ష్మణులను మూర్ఛిల్లజేసి, పాతాళ లోకానికి తీసుకెళ్ళి, క్షుద్ర దేవతకి బలి ఇవ్వడానికి సిద్ధపడటం, ఆయన వెనుకే హనుమంతుల వారు వెళ్ళి వారిని రక్షించడం గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాము. ఇక్కడ పాతాళ లోకానికి మనవారు వెళ్ళి వచ్చారని తెలియజేయడమే కాకుండా, రావణుడు ఆ ప్రాంతాన్ని తరుచుగా సందర్శించేవాడని కూడా స్పష్టం అవుతుంది.

కాబట్టి, మన దేశ వాస్తవ చరిత్రను అన్ని కోణాలలో వక్రీకరించి, మనవారి గొప్పదనాన్ని నిరూపించే ఆధారాలను రూపుమాపి, విదేశీయులు శునకాలకు వేసే బిస్కెట్ల కోసం ఆశపడే నాయకులూ, వారి మోచేతి నీళ్ళు తాగి బ్రతికే కుహనా మేధావులూ, ఇన్నేళ్ళూ మన బుర్రలలోకి ఎక్కించిన అసత్య, అర్ధ సత్య చరిత్రను పక్కకు నెట్టి, ప్రతి ఒక్కరూ అసలైన, మహోన్నతమైన భారతీయ చరిత్రను తెలుసుకోవాలన్నదే నా ఆశ, ప్రయాస.

ॐ🚩 జై శ్రీరామ 🙏

Monday, June 2, 2025

CURSE OF THE GODDESS: A Curse that ruined countless lives


సీతమ్మ కిరీటంలోని నీలమణిని తాకినా వినాశనమేనా?
ఇన్ని మరణాలకు కారణం, శాపగ్రస్థమైన ఆ వజ్రమేనా?

‘వరం’ కూటికి గతిలేనివాడిని కూడా, అపరకుబేరుడిని చేస్తుంది. కానీ శాపం, జీవితాలను నాశనం చేస్తుంది, కుటుంబాలను కబళించి వేస్తుంది, ఆఖరికి వంశాలకు వంశాలనే తుడిచివేస్తుంది, వెరసి లెక్కలేనంతమందిని యమపురికి పంపిచేస్తుంది. అందుకే, వరం వల్ల వచ్చే సంతోషం కంటే, శాపం వల్ల కలిగే నష్టం భరించలేదనీ, అందుకే మానవులకు శాపం అంటే చచ్చేంత భయమనీ పెద్దలు చెబుతుంటారు. అయితే, వీటి వెనుక నిజమెంతుందో తెలియదు కానీ, నేటికీ ప్రపంచంలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం నమ్మడమే కాదు.. వాటి వెనుక జరిగిన చరిత్ర వింటే, నిజంగా అవి శాపగ్రస్త వస్తువులని నమ్మక తప్పదు. అటువంటి వాటిలో, స్వయంగా ఆ శ్రీరాముని భార్య ‘సీతా మాత’ శపించిన ఓ వజ్రం కూడా ఉంది. సీతామాత, ఓ వజ్రాన్ని శపించడమా? నిలువెత్తు శాంత మూర్తిగా పేరుపొందిన సీతాదేవి, అసలు శపించడమేంటి? ఈ కథ రామాయణంలో ఉందా? లేక ఆ తర్వాత ఎప్పుడైనా జరిగిందా? ఇంతకీ ఆ వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? దాని వల్ల ఎలాంటి ఘోరాలు సంభవించాయి - వంటి అనేక ప్రశ్నలు, మన మదిలో మెదులుతాయి. వాటన్నిటికీ సరైనా సమధానం తెలియాలంటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1_ynAKC2sog ]


ఒకప్పుడు ఋషులూ, గంధర్వులూ, దేవతలూ... వరాలూ, శాపాల వంటి వాటిని ఇచ్చేవారని, పురాణాలలో చెప్పడింది. వాటి వెనుక ఉన్న నిజానిజాలను పక్కన పెడితే, ఏదైనా వస్తువుని కొన్నప్పుడుగానీ, కనీసం వాటిని ముట్టుకున్నప్పుడు కానీ, ఎవరికైనా తీవ్రమైన కీడు జరిగితే, వాటిని Cursed Objects అని, నేటికాలంలో పిలవడం జరుగుతోంది. ఒకప్పుడు మన దేశంలోనే దొరికి, ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్న కోహినూర్ వజ్రం వెనుక కూడా, ఎంతో విషాదగాధ దాగివుందని చెప్పడంలో, ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో, కొల్లూరు వజ్రాల గనులలో దొరికిన ఆ కోహినూర్ వజ్రాన్ని ధరించిన రాజులందరూ, సర్వనాశం అయినట్లు చరిత్ర చెబుతోంది. అయితే, ఈ కోహినూర్, రాణులను మాత్రం ఏమీ చేయలేదనీ, అందుకే అది ధరించిన లండన్ రాణులు, ఇంకా తమ రాజ్యాలను ఏలుతున్నారనీ, చరిత్రకారులు చెబుతున్నారు.

కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వజ్రం మాత్రం, ఆలాంటిలాంటిది కాదు! ఈ వజ్రాన్ని ఆభరణంగా చేసుకుని ధరించిన వారే కాదు, దాన్ని చేతితో తాకిన వాళ్ళని కూడా, ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా, యమపురికి పంపింది. దానినే, నేడు Hope Diamond గా పిలవడం జరుగుతోంది. ఇది నేడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద Blue Diamonds లో ఒకటిగా, పేరుగాంచింది. అయితే, ఆంగ్లేయుల పేరుతో ఉన్న నీల వజ్రానికీ, సీతా దేవి శాపానికీ ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే, ఒక్కసారి దాని పూర్తి చరిత్ర తెలుసుకోవలసిందే. దాదాపు, 17వ శతాబ్దం మధ్యలో, ఫ్రాన్స్ కి చెందిన Jean-Baptiste Tavernier అనే వజ్రాల వ్యాపారి, మేలైన వజ్రాల కోసం, ప్రపంచం మొత్తం తిరుగుతూ, భారత దేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఆలయంలో ఉన్న సీతాదేవి కిరీటానికి అలంకరించి ఉన్న అతిపెద్ద నీలి వజ్రాన్ని చూసి, ఆకర్షితుడై, మొదట దాన్ని కొనడానికి ప్రయత్నిచాడు. అయితే, ఆ వజ్రం అమ్మవారి ఆభరణం అవ్వడం వల్ల, అతని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాంతో, Tavernier దొంగచాటుగా, అమ్మవారి విగ్రహం నుంచి ఆ వజ్రాన్ని పెకలించి, వెంటనే స్వదేశానికి పారిపోయాడు.

ఆ విధంగా, ఫ్యాన్స్ కి చేరుకున్న Tavernier, ఇతర చిన్నా పెద్దా వజ్రాలతో పాటు, దాదాపు 112 క్యారెట్ల బరువున్న ఈ Uncut నీలి వజ్రాన్ని కూడా, నాటి ఫ్రాన్స్ రాజుకి అమ్మడం జరిగింది. ఆ తర్వాత, Tavernier  రష్యాకు పయనమవగా, మార్గమధ్యలో అతడ్ని అడవి కుక్కలు ముక్కలు ముక్కలుగా చీల్చి, చంపేశాయట. అలా, సీతమ్మవారి నీలి వజ్రాన్ని దొంగలించిన వ్యాపారికి ఘోరమైన గతిపట్టడమే కాదు, ఈ వజ్రానికి సంబంధించి జరిగిన మరణాలలో, అతిభయంకరమైన మొదటి మరణంగా, చరిత్రలో నిలిచిపోయిందని, చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆ వజ్రాన్ని కొన్న ఫ్రాన్స్ రాజు Louis XIV, దానిని తన కిరీటంలో పొందుపరచమని ఆజ్ఞాపించాడు. దాంతో, మొదటిసారి అంతపెద్ద Uncut నీలి వజ్రానికి మెరుగులు పట్టడంతో, దాని బరువు తగ్గిపోయింది.

ఇదిలా ఉండగా, ఫ్రాన్స్ రాజు ఆ వజ్రాన్ని సొంతం చేసుకున్న తర్వాత నుంచీ, రాచరికానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యామాలు, జోరందుకున్నాయి. అంతేకాదు, ఆ వజ్రం వచ్చిన కొన్నేళ్ళకే, అతడు మంచం పట్టడం.. దాంతో, Louis XIV మనవడు Louis XV, వెంటనే రాజ్య పరిపాలన స్వీకరించడం జరిగిందని, చరిత్ర కారులు చెబుతున్నారు. అయితే, Louis XV కూడా, కొన్నేళ్ళకే అర్ధాంతరంగా చనిపోవడంతో, అతడి కొడుకు Louis XVI పై, రాజ్య భారం పడింది. కొత్తగా పీఠమెక్కిన రాజు భార్యకు, బంగారు ఆభరణాలపై మోజు ఎక్కువ ఉండటం, అందులోనూ, అత్యంత అమూల్యమైన నీలి వజ్రం అంటే మరింత ఇష్టం ఉండటంతో, Louis XIV హయాంలో మెరుగుపెట్టిన ఆ వజ్రానికి మరింత సానపట్టించి, మేడలో వేసుకునే అభరణంగా చేయించి, తన భార్యకు బహుకరించాడు, Louis XVI. ఇది జరిగిన అతికొద్ది కాలానికే, French revolution కారణంగా, Louis XVI, మరియూ అతడి భార్య Marie Antoinette ని, public గా తల నరికి చంపారు. ఆ సమయంలో జరిగిన దొంగతనాలలో, ఈ నీలి వజ్రం, దొంగతనానికి గురైందని, చరిత్ర చెబుతోంది.

ఆ విధంగా, ఫ్రాన్స్ రాచరిక వ్యవస్థే, ఈ వజ్రం కారణంగా మట్టిలో కలిసిపోయినట్లు, ప్రజలలో ఓ నమ్మకం నేటికీ ఉంది. అయితే, నాడు దొంగలించబడ్డ నీలి వజ్రం, ఆ తర్వాత తెలియని ఎంతో మంది చేతులు మారి, 20వ శతాబ్దం మొదట్లో, టర్కీ సుల్తాన్ అబ్దుల్ హమీద్ చేతికి చేరింది. ఆ నీలి వజ్రాన్ని పొందిన కొన్నేళ్ళకే, హమీద్ రాజ్య బ్రష్టుడవ్వడం, అతడి భార్య అత్యంత దారుణంగా చనిపోవడం, జరిగింది. ఆ తర్వాత ఈ నీలి వజ్రం, Simon Montharides అనే గ్రీకు వజ్రాల వ్యాపారి చేతుల్లోకి వెళ్లగా, దాన్ని పొందిన అతికొద్ది రోజుల్లోనే, Simon తో పాటు, అతని భార్యా, కొడుకూ కూడా, ఓ లోయలో పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నీలి వజ్రాన్ని, London లో ఉండే అత్యంత ధనవంతుడైన Henry Thomas Hope, దక్కించుకున్నాడు. అప్పటి నుంచే, దానికి Hope Diamond అనే పేరు వచ్చినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఈ నీలి వజ్రం ఎప్పుడైతే వారి ఇంట చేరిందో, Hope కుటుంబం, ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడటంతో పాటు, Hope మనవడు, అత్యంత దారిద్ర్యాన్ని అనుభవించి, చనిపోయాడు. ఆ తర్వాత ఈ Hope Diamond ని, రష్యాకు చెందిన Mademoiselle Ledue అనే actress కొనడం జరిగింది. అయితే, ఆ Hope Diamond ని కొన్న కొన్ని రోజులకే, దాన్ని ధరించి, ఓ stage performance ఇవ్వడానికి stage పైకి ఎక్కగానే, Mademoiselle ని, తుపాకీతో కాల్చి చంపడం జరిగిందని, చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ తర్వాత, Hope Diamond, మరికొన్ని చేతులు మారి, 1950 లలో, Harry Winston అనే ధనికుడి చేతికి వెళ్లగా, అతడు దానివెనుక ఉన్న దారుణమైన కథ తెలుసుకుని, 1958 లో, అమెరికాలోని National Museum of Natural History కి, దానం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి, Hope Diamond, అదే Museum లో, ప్రజల సందర్శనార్ధం ఉంచేశారు. భారత దేశంలో, వజ్రాల వ్యాపారి Tavernier దొంగలించిన 112 క్యారెట్ల నీలి వజ్రం, అనేక మంది చేతులు మారి, వివిధ ఆకారాలు సంతరించుకుని, చివరికి National Museum కి చేరే సమయానికి, ఆ Hope Diamond బరువు, 45 క్యారెట్లయ్యిందని, నిపుణులు చెబుతున్నారు. అయినా, నేడు ప్రపంచంలోనే, అత్యంత విలువైన, అత్యంత బరువైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా, Most Dangerous and Cursed Diamond గా కూడా, ఈ Hope Diamond పేరు తెచ్చుకుంది.

🚩 జై శ్రీరామ 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...