Posts

Showing posts with the label సందిగ్ధావస్థ

సందిగ్ధావస్థ! భగవద్గీత Bhagavadgita

Image
సందిగ్ధావస్థ! వేర్వేరు యుగాలలో మంచి చెడుల తారతమ్యం! 'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 5 నుండి 8 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/zEORvI6uU9s ] ఆసురీ గుణాల పూర్తి వివరణను, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు.. 00:46 - దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా । మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ।। 5 ।।  దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి. కానీ, ఆసురీ గుణములు, బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా.. నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు. శ్రీ కృష్ణుడు ఈ రెండు స్వభావాల పరిణామాలను వివరిస్తున్నాడు. ఆసురీ గుణములు, వ్యక్తిని జన్మ-మృత్యు-సంసార బంధనాలకు కట్టివేస్తాయని చెబుతున్నాడు. అదే సమయంలో, దైవీ గుణములను పెంపొందించు కోవటం, మాయా బంధనము నుండి విముక్తి