Posts

Showing posts with the label Adi Shankaracharya

జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి.. Adi Shankaracharya Jayanthi 2025

Image
జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు 💐  దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే | స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః || లోకంలో దుష్టాచారాన్ని నశింపజేయడానికి సాక్షాత్తు కైవల్య నాయకుడైన శివుడు శంకరాచార్యుని రూపంలో భూమండలం మీద అవతరించారు. Don't miss to Watch:  https://youtu.be/srTCWknBC7Q ఆదిశంకరాచార్య జయంతి నేడు. వారికి సునమస్సులు.. అద్భుతమైన వ్యక్తీకరణ ------------------------------- "విషమ విషయమార్గే గచ్ఛతోऽనచ్ఛ బుద్ధేః ప్రతిపదమభిఘాతో మృత్యురప్యేష విద్ధి హిత సుజన గురూక్త్యా గచ్చతస్స్వస్య యుక్త్యా ప్రభవతి ఫలసిద్ధిస్సత్యమిత్యేవ విద్ధి" అంటూ కల్మష బుద్ధితో క్రూరవిషయ మార్గాల్లో  వెళుతుండే వాడికి ఈ మృత్యువు ప్రతి అడుగులోనూ దెబ్బకొడుతూంటుందని తెలుసుకో; హితులు, సుజనులు,‌ గురువులు చెప్పిన దానివల్లా, సొంత యుక్తివల్లా వెళ్లేవాళ్లకు ఫల‌ప్రాప్తి అవుతోంది. దీన్నే సత్యంగా తెలుసుకో అని 'మన జాతి గురువు' ఆదిశంకరచార్యులవారు తమ వివేకచూడామణి 83వ శ్లోకంలో ఒక అద్భుతమైన వ్యక్తీకరణను చేశారు. 'తత్త్వాన్నీ , సత్వాన్నీ , సత్యాన్నీ శంకురులు చెప్పిన స్థాయిలో మఱెవ్వరూ చెప్పలేదు. ...