సంపాతి కథ Story of Sampati
యుగాలు నిరీక్షించిన ‘సంపాతి’.. సంపాతికి నిశాకర మహర్షి చూపిన మార్గమేమిటి? కశ్యప ప్రజాపతి, వినత దంపతులకు కలిగిన సంతానమైన అనూరుడు, శ్యేని ద్వారా, సంపాతి, జటాయువులనే కుమారులను పొందాడు. వీరి పాత్ర రామాయణంలోని ముఖ్య ఘట్టాలలో కనిపిస్తుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సందర్భంలో, జటాయువు ఆమెను కాపాడబోయి, మరణించిన విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఇక సంపాతి తన రెక్కలను ఎందుకు కొల్పోయాడు? వానరులను ఎలా కలిశాడు? సంపాతి రెక్కలు తిరిగి రావడానికి నిశాకర మహర్షి ఉపదేశించిన మార్గం ఏమిటి - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fuBE0AZCoNA ] సీతమ్మను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాది మహావీరుల బృందానికి, అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రమే, నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శించడం గమనార్హం. అది తప్పితే, మిగిలిన అన్ని సందర్భాలలోనూ అతని రాజ భక్తీ, రామకార్యం పట్ల నిరతీ, చాలా దృఢంగా ప్రదర్శించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఆ సమయంలో అంగదుడు, "శ్రీ రాముడి కార్యం నె