దివ్యదృష్టి! భగవద్గీత Bhagavadgita Chapter 11
దివ్యదృష్టి! అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా భూత భవిష్యత్తులను చూడగలగటం! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (06 – 09 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 06 నుండి 09 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. తన విశ్వరూప దర్శనము గురించి శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/-QLqNbfl5Hs ] 00:44 - పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా । బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ।। 6 ।। నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, పన్నెండుగురు అదితి పుత్రులనూ, ఎనిమిది మంది వసువులనూ, పదకొండు రుద్రులనూ, ఇద్దరు అశ్వినీ కుమారులనూ, అంతే కాక, నలభై తొమ్మిది మరుత్తులూ, మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము. భగవంతుని విశ్వ రూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక, పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూ