Posts

Showing posts with the label లక్ష్మీ కటాక్షం

లక్ష్మీ కటాక్షం - Avoid doing these things on bed..

Image
  మంచంపై ఈ పనులు చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంటే స్థిరంగా ఉంటుందని మీకు తెలుసా? గత కొన్నేళ్లుగా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆధునీకరణ నేపద్యంలో, నగరాలలో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దాంతో, ఒకప్పుడు విశాలంగా ఉండే ఇళ్ళు కాస్తా, ఇరుకు గదులుగా తయారవుతున్నాయి. అందువల్ల, నేడు చాలా మంది నేర్చుకుంటున్న కొత్త అలవాటు, మంచాలను ఎక్కవగా వాడటం. అవసరం ఉన్నా లేకపోయినా, మనలో చాలా మంది, మాట్లాడితే మంచంపైనే ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే, కొన్ని పనులు మాత్రం, మంచంపైన అస్సలు చేయకూడదనీ, అలా చేస్తే, అష్ట కష్టాలనూ కోరి తెచ్చుకున్నట్లవుతుందనీ, పండితులు చెబుతున్నారు. అసలు మంచంపైన ఏ పనులు చేయవచ్చు? ఏ పనులు చేయకూడదనే విషయంపై, మనలో చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల, శాస్త్రానుసారం, మంచం పై చేయాల్సిన, చేయకూడని పనుల గురించి, తెలుసుకుందాము. ఈ మధ్య కాలంలో గదులు చిన్నగా ఉండటం వల్లనో, బెడ్ రూమ్ లోనే టీవీ ఉందనో, మంచం మీద బాగా కంఫర్ట్ గా ఉందనో, చాలా మంది, ఉదయం టిఫిన్ నుంచి, రాత్రి భోజనం వరకు, మంచాలపైనే కుర్చుని తింటున్నారు. ఆ విధంగా అస్సలు చేయకూడదని, పండితులు చెబుతున్నారు. మంచంపై కుర్చుని తినడం వల్ల,