Perception of DEATH! మృత్యువు!

మృత్యువు! Perception of DEATH! రెండు జన్మల మధ్య అత్యధిక అంతరం ఎన్ని సంవత్సరాలో మీకు తెలుసా? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।। పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించినవానికి మరల జన్మము తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ విషయాన్ని గురించి శోకించ వద్దని అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం, మనం ఏదో ఒకరోజు మృత్యువు ఒడికి చేరాల్సిందే అన్నది. తప్పించుకోలేనిది, ఎప్పుడు వచ్చేదీ తెలియనిది ‘మరణం’. కాబట్టి, అనివార్యమైన మృత్యువును గూర్చి తెలివైన వాడు శోకించడని, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. కల్పాంతరాల జీవాత్మ ప్రయాణంలో, ఇప్పుడు మనం చూస్తున్న జీవితం ఒకానొక మజిలీ మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎందరో మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నా, ఏదో ఒక రోజు మనమూ చనిపోతామని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. అసలు ఈ జీవితం ఏమిటి? జీవన ప్రక్రియ యొక్క ముగింపును సూచించే ఆ మరణం సంభవించిన తరువాత ఏం జరుగుతు...