Posts

Showing posts with the label Significance of Kathopanishad

కఠోపనిషత్తు! Significance of Kathopanishad

Image
కఠోపనిషత్తు! ఎందుకంత ముఖ్యం? ‘యమధర్మరాజు’ సూటిగా, సందేహాలకు తావు లేకుండా చెప్పిన విషయాలేంటి? సమస్త మానవాళికీ, వారి వారి స్థాయిలలో ఉద్ధరింప బడటానికి మార్గాలను చూపేవి, ‘వేదాలు’. పరిపక్వం చెందిన సాధకులకూ, వైరాగ్య భావనగల వారికీ, మోక్షంకోసం తపించేవారికీ చక్కగా ఉపకరించేవి, ‘ఉపనిషత్తులు’. ‘ఉపనిషత్తు’ అనే శబ్దం వినిపించగానే, ఎవరిలో అయితే ఒక పారవశ్యం, పులకరింత కలుగుతాయో, వారే ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధిని కలిగి వుంటారు. ఉపనిషత్తు అంటే, అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసేదని ఒక అర్థమయితే, వైరాగ్యవంతుడైన సాధకుని, పరమాత్మ సన్నిధికి చేర్చి, ఆ పరమాత్మతో ఐక్యత కలిగించేదే ఉపనిషత్తని, మరొక అర్థం. నాలుగు వేదాలలోనూ ‘జ్ఞాన భాండాగారాలు’ అనదగిన ఉపనిషత్తులు, 1180 ఉన్నాయి. అయినా ఇప్పుడు అన్ని పేర్లూ లభించడం లేదు. ముక్తికోపనిషత్తులో, శ్రీరాముడు ఆంజనేయునికి, 108 ఉపనిషత్తుల పేర్లను తెలియజేయడం జరిగింది. అందులో 10 ఉపనిషత్తులను, అత్యంత ప్రధానమైనవిగా భావించి, ముగ్గురు ఆచార్యులు వాటికి భాష్యాలు వ్రాశారు. అవే, దశోపనిషత్తులుగా ప్రఖ్యాతిగాంచాయి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య,