Posts

Showing posts from November, 2022

యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'

Image
రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ! గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ] మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము.. రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునిక

మార్గశిర మాసం - Significance of Margasira Masam

Image
రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత! ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది. [ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ] శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు.. పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం.. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.

మీకు తెలుసా?

షాడో ఇన్ బోర్నియో Shadow in Borneo by Madhubabu

Image
త్వరలో..  ' షాడో ఇన్ బోర్నియో ' Shadow in Bornio - షాడో స్పై అడ్వెంచర్ - మధుబాబు 02nd డిసెంబర్ నుండి ప్రారంభం.. Only on SMBAB కిల్లర్స్ గ్యాంగ్ వలలో చిక్కుకున్న బోర్నియో చక్రవర్తి, ఆర్ధిక, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులలో చిక్కుకుని విలవిలలాడుతూ, ద్వీపాన్ని అశాంతి, అల్ల కల్లోలం నుంచి రక్షించ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇంటర్‌పోల్ అభ్యర్థన పై ఆ ద్వీపంలో అడుగు పెట్టిన షాడో, అనుక్షణం ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కున్నాడు? అనుకోని అతిథిలా తరచూ షాడోకి తారస పడుతున్న ఆ బోర్నియో విలాస సుందరి ఎవరు? అన్ని దుర్మార్గాలకు మూలకారణమైన చిన్ లీ చాన్ కథ ఎలా ముగిసింది? కిల్లర్ గ్యాంగ్ సుప్రీం కమాండ్ ప్రలోభాలనూ, ప్రతిహింసనూ షాడో ఎలా తిప్పి కొట్టాడు? 'షాడో ఇన్ బోర్నియో’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

Image
గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం? ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి, గోపాలుడిగా, వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అన్ని లోకాలలో కెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణమేంటి? అసలు మహాభారతంలో, గోవు విశిష్ఠత గురించి ఏం వివరించబడి ఉంది - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iT2XRwhIgLQ ] పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె

చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. Facts about Shivaji Maharaj

Image
స్కూళ్ళలో చెప్పే చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన యోధుడు: https://youtu.be/it7JY1jp20A ది గ్రేట్ ఎస్కేప్ - ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి: https://youtu.be/ay2IFCn95Wo చాలామంది ఆయన గురించి ఏమనుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు: "కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో, నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ, భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ అతన్ని మోకాళ్ల మీదకు తీసుకురాలేకపోయాను.. యా అల్లాహ్, నువ్వు నాకు నిర్భయుడైన, మరియు నిటారుగా నిలబడ్డ శత్రువును ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి తలుపులు తెరిచి ఉంచండి. ఎందుకంటే, ప్రపంచంలోని అత్యుత్తమ, మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు" - ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ) "ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు. కానీ, నా అహంకారాన్ని నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం" - షాహిస్తా ఖాన్. "నా రాజ్యం

అష్ట సాత్విక భావములు! భగవద్గీత Bhagavadgita

Image
అష్ట సాత్విక భావములు! హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు భక్తులలో కనిపించే లక్షణాలేంటి? 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (10 – 14 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 10 నుండి 14 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. అర్జునుడి, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని, సంజయుడు ఇలా వివరిస్తున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/aUdwm4wMXo4 ] 00:46 - అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ । అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ।। 10 ।। 00:56 - దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ । సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం ।। 11 ।। ఆ యొక్క విశ్వ రూపములో, అర్జునుడు అనంతమైన ముఖములూ, మరియు కనులనూ దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములనూ, మరియు అనేక రకాల దివ్య ఆయుధములనూ కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది, మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్

సకల వేదాంగ విదుడైన ‘బ్రాహ్మణుడికి సమానం’ ఎవరు? Who is equivalent to a brahmin?

Image
సకల వేదాంగ విదుడైన ‘బ్రాహ్మణుడికి సమానం’ ఎవరు? అశ్వినులకు దేవతా స్థానం కల్పించిన ‘చ్యవనుడి వృత్తాంతం’! బ్రహ్మ మానస పుత్రుడూ, సప్తర్షులలో ఒకడైన భృగు మహర్షీ, కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన పులోమాదేవి సంతానం, చ్యవనుడు. దివ్య తేజో సంపన్నుడైన చ్యవనుడు, ఆయుర్వేద ప్రవీణుడు. మన ఇతిహాసాలలో సుస్థిర స్థానం దక్కించుకున్న గొప్ప మహర్షి. చ్యవనుడు వృద్ధాప్యంలో, నవ యవ్వనవతి అయిన రాకుమార్తెను ఎందుకు వివాహం చేసుకున్నాడు? దేవతా వైద్యులైన అశ్వినులకు సోమపాన అర్హత కలిగించి, వారిని ఎందుకు దేవతలుగా చేశాడు? అశ్వినీ దేవతలు, చ్యవనుడి భార్యకు పెట్టిన పరీక్షలో ఆమె నెగ్గిందా - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yCZKmQP1wxQ ] చ్యవనుడు ఆయుర్వేద ప్రవీణుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప మహర్షి కూడా. అందుకు నిదర్శనం, ఆయన కఠోర తపస్సు. ఆయన చేసిన దీర్ఘకాల తపస్సు కారణంగా, ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు ఏర్పడి, అది పూర్తి తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య వన విహారానికి వచ్చిన సమయంలో, చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని చూసింది. ఆ

తరతరాల సనాతన సాంప్రదాయాలు! Ancient Hindu Traditions

Image
  మనం మరచి పోతున్న కొన్ని, తరతరాల సనాతన సాంప్రదాయాలు! సోమవారం తలకు నూనె రాయరాదు. ఒంటి కాలిపై నిలబడ రాదు. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు. గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి. ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు. మధ్యాహ్నం తులసి ఆకులను కోయరాదు. సూర్యాస్తమయం తరువాత కసవు వూడ్చరాదు, తల దువ్వరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు. వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు. భోజనం మధ్యలో లేచిపోరాదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు. రాత్రి  వేళలో బట్టలుతకరాదు. విరిగిన గాజులు వేసుకోరాదు. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి. చేతి గోళ్ళను కొరకరాదు. అన్న తమ్ముడు,తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి (సింగిల్) అరిటాకును తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మరచిపోరాదు. ఇంటి గడపపై కూర్చోరాదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని, కాళ్ళు చాపుకుని కూర్చోరాదు. చేతులు కడిగి

దివ్యదృష్టి! భగవద్గీత Bhagavadgita Chapter 11

Image
దివ్యదృష్టి! అనంతమైన బ్రహ్మాండములనూ, వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా భూత భవిష్యత్తులను చూడగలగటం! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (06 – 09 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 06 నుండి 09 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. తన విశ్వరూప దర్శనము గురించి శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/-QLqNbfl5Hs ] 00:44 - పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా । బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ।। 6 ।। నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, పన్నెండుగురు అదితి పుత్రులనూ, ఎనిమిది మంది వసువులనూ, పదకొండు రుద్రులనూ, ఇద్దరు అశ్వినీ కుమారులనూ, అంతే కాక, నలభై తొమ్మిది మరుత్తులూ, మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము. భగవంతుని విశ్వ రూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక, పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూ

శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు? Why Did Lord Rama Kill Shambuka?

Image
  శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు? డా. బి.ఆర్. అంబేద్కర్ ‘శంభూక వధ’ గురించి ఏమని వివరించారు? లోకాభిరాముడిగా, అవతార పురుషుడైన శ్రీ రామచంద్రమూర్తి, మచ్చలేని చందమామగా, మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాడు. అయితే, ఆ అయోధ్య రాముడి జీవితంలో తీసుకున్న రెండు నిర్ణయాలను, కొంతమంది వ్యతిరేకిస్తారు. అటువంటి వాటిలో ఒకటి, గర్భవతియైన సీతామాతను అడవులలో వదిలివేయడం, రెండవది, తపస్సు చేసుకుంటున్న శూద్రుడైన శంభూకుడిని వధించడం. అయితే, మనం ఈ రోజు శంభూకుడిని రాముడు ఎందుకు వధించాడు? అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా, తపస్వి అయిన శంభూకుడిని సంహరించాల్సి వచ్చిందా? శంభూక వధ గురించి, ఉత్తరకాండ లో, 74, 75, 76 వ సర్గలలో ఏం ఉంది - అనే విషయాలతో పాటు, శంభూక వధ, త్రేతా యుగంలోని యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైంది? ఈ కలియుగంలోని యుగధర్మము గురించి కూడా, అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తంగా పరిశీలిద్దాము. వీడియొను పూర్తిగా చూడకుండా, తొందపడి కామెంట్ చేయవద్దని ప్రార్ధిస్తున్నాను. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jrfF6ofOlfY ] ఆనాటి యుగ ధర్మం ప్రకారం, ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే, ఆ రాజ్యంలో అకాల మరణాల

విశ్వరూప దర్శనం! భగవద్గీత Bhagavadgita

Image
విశ్వరూప దర్శనం! అనంతమైన ఆకృతులూ, మరియు వర్ణములతో కూడిన భగవానుడి విశ్వరూపము! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 1 నుండి 5 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/F3yPQAg34Q4 ] ఈ పదకొండవ అధ్యాయంలో అర్జునుడు, శ్రీ కృష్ణుడి విశ్వ రూపమును చూడాలని ప్రార్ధిస్తున్నాడు. సమస్త విశ్వములూ తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వ రూపాన్ని, శ్రీ కృష్ణుడు అర్జునుడి దివ్య దృష్టికి చూపించాడు. 00:54 - అర్జున ఉవాచ । మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ । యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ।। 1 ।। నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. శ్రీ కృష్ణుడి విభూతులనూ, మరియు పరమేశ్వరుని యొక్క జ్ఞానమునూ విన్న పిదప, అర్జునుడు ఆనందముతో ఉప్పొంగ