Invincible King Durjaya and Maharshi Gauramukha
ముల్లోకాలనూ జయించిన రాజుతో యుద్ధానికి దిగిన ముని పుంగవుడెవరు? తన వరప్రభావంతో జన్మించిన అతనిని విష్ణువు ఎందుకు సంహరించాడు? మన పురాణాలలో కొందరు అసురులూ, రాక్షసులూ దేవుని భక్తులుగానే కనిపిస్తుంటారు. అనన్యమైన, అమోఘమైన దైవచింతన ఉన్నప్పటికీ, వారి స్వార్థపూరిత ఆలోచనలతో, ఇతరులను హింసించేటటువంటి క్రూరమైన స్వభావంతో, దైత్యులుగా నిందింపబడేవారూ ఉన్నారు. ఇక మునులలో కూడా శాంత స్వభాంతో, తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసిన వారున్నారు, అసురులను సైతం ఎదిరించి, దైవ బలంతో వారిని అంతమొందించిన వారూ ఉన్నారు. అసుర లక్షణాలు కలిగిన రాజుతో, ఒక ముని ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? రాజుతో యుద్ధానికి దారి తీసిన కారణాలేంటి? ముని జరిపిన యుద్ధం ఫలించిందా? వరాహపురాణంలో వివరించబడిన ఈ కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tbv0awTt3E0 ] కృతయుగంలో సుప్రతీకుడనే రాజు ఉండేవాడు. అతనికి విద్యుత్ప్రభ, కాంతిమతి అనే ఇద్దరు భార్యలున్నారు. సంతానహీనుడైన సుప్రతీకుడు, చిత్రకూట పర్వతంపై ఉన్న ఆత్రేయుడనే మున