The Fiercest Goddess in Kerala? The Untold Story of Thiruvarkadu Bhagavathi Temple | మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం!

మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం! ఎన్నో ఆలయాలను తురకలనుండి కాపాడిన ఆ కలరీ యోధుడు ఎవరు? దేవాలయాలను సందర్శించి కొద్ది సేపు అక్కడ గడిపితే, మనం నిత్యం అనుభవించే బాదరబందీలను మరచిపోయి, మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇక అక్కడ వితరణ చేసే పులిహోర, దద్దోజనం, లడ్డు ప్రసాదాలు తినడానికి జనం క్యూలు కడుతుంటారు. ఆ ప్రసాదాల రుచే అలాంటిది మరి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయానికి వెళ్ళడానికి మాత్రం ధైర్యం సరిపోదు.. అలా అని అదేదో భయంకర క్రూర మృగాలు, అడవి జంతువులు, విష కీటకాలు తిరుగాడే నిర్మానుష్య అరణ్య ప్రాంతాలలో లేదు.. సాధారణ జనావాసల మధ్య ఉన్న ఆలయమే. ఇక అక్కడ పెట్టే ప్రసాదం గురించి తెలిస్తే దిగ్భ్రాంతికి లోనవ్వడం ఖాయం. అలాగని అదేదో నవతరం కుర్రాళ్లు కట్టిన వింత గుడి అనుకుంటే పోరాబాటే.. అది మన దేశంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే, శక్తి క్షేత్రాలకు మూలం ఆ ఆలయమే అని కూడా అంటారు. ఈ మాటలు వినగానే, ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడికి వెళ్తే భయం ఎందుకు కలుగుతుంది..? అసలు ఆ ఆలయంలో పెట్టే ప్రసాదం ఏమిటి..? ఆ ఆలయ చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలగక మానవు. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలి...