The Fiercest Goddess in Kerala? The Untold Story of Thiruvarkadu Bhagavathi Temple | మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం!
మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం!
ఎన్నో ఆలయాలను తురకలనుండి కాపాడిన ఆ కలరీ యోధుడు ఎవరు?
దేవాలయాలను సందర్శించి కొద్ది సేపు అక్కడ గడిపితే, మనం నిత్యం అనుభవించే బాదరబందీలను మరచిపోయి, మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇక అక్కడ వితరణ చేసే పులిహోర, దద్దోజనం, లడ్డు ప్రసాదాలు తినడానికి జనం క్యూలు కడుతుంటారు. ఆ ప్రసాదాల రుచే అలాంటిది మరి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయానికి వెళ్ళడానికి మాత్రం ధైర్యం సరిపోదు.. అలా అని అదేదో భయంకర క్రూర మృగాలు, అడవి జంతువులు, విష కీటకాలు తిరుగాడే నిర్మానుష్య అరణ్య ప్రాంతాలలో లేదు.. సాధారణ జనావాసల మధ్య ఉన్న ఆలయమే. ఇక అక్కడ పెట్టే ప్రసాదం గురించి తెలిస్తే దిగ్భ్రాంతికి లోనవ్వడం ఖాయం. అలాగని అదేదో నవతరం కుర్రాళ్లు కట్టిన వింత గుడి అనుకుంటే పోరాబాటే.. అది మన దేశంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే, శక్తి క్షేత్రాలకు మూలం ఆ ఆలయమే అని కూడా అంటారు. ఈ మాటలు వినగానే, ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడికి వెళ్తే భయం ఎందుకు కలుగుతుంది..? అసలు ఆ ఆలయంలో పెట్టే ప్రసాదం ఏమిటి..? ఆ ఆలయ చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలగక మానవు. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gHyAMcqvv6I ]
వెలుగు నీడ.. రాత్రి పగలు.. ముందు వెనుక.. అనుకూల ప్రతికూల.. ఇలా ఈ సృష్టిలోని ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని బాహ్య ప్రపంచంలో అందరకీ కనిపించే విధంగా ఉంటే, కొన్ని మాత్రం అత్యంత గుప్తంగా ఉంటాయి. ఈ రహస్య విధానాలు సాధారణ ప్రజలకి అర్ధంకావు.. అర్ధమైనా ఆచరించడం కష్టతరమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయం వెనుక ఒక అర్ధం, దాని వెనుక మరో పరమార్ధం ఖచ్చితంగా దాగి ఉంటాయి. అయితే, వాటిని కనుగొనడం మేధావుల వల్ల కూడా కాని పని. అందుకే నేటి తరం శాస్త్రవేత్తలు, తాము కనుగొన్న విషయాలు మాత్రమే సరైనవనీ, తక్కినవన్నీ అభూత కల్పనలనీ కొట్టిపారేసి, సగటు మనుషులను వాస్తవాలకు దూరంగా ఉంచుతుంటారు. అయితే వారికి కూడా తెలుసు.. మానవ మేధస్సుకు అందని శక్తి ఏదో ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుందని.. ఇప్పడు మనం చెప్పుకుంటున్న ఆలయం గురించి తెలియాలంటే, ఈ ఉపోద్ఘాతం తప్పనిసరి.. ఈ ఆలయం సాధారణమైనది కాదు. సకల చరాచర జగత్తు పుట్టుకకు కారణమైన ఆ మహాశక్తికి ప్రతిరూపం, సాధారణ అర్చన విధులకు దూరం, ఈ ఆలయం. అదే Thiruvarkadu Bhagavathi ఆలయం.
కేరళలోని Kannur జిల్లాలో ఉన్న Pazhayangadi అనే ఊరిలోని మాడాయి కావు ఆలయం గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. ఈ ఆలయాన్నే Thiruvarkadu Bhagavathi ఆలయం అని కూడా అంటారు. ఇది ఒక శివాలయమే కానీ ప్రధాన మూర్తి మాత్రం ఆ శివుడి వెనుక వున్న భద్రకాళీ అమ్మవారు. ఈ మాట కాస్త వింతగానే అనిపించవచ్చు.. కానీ ఆలయం గురించి తెలిస్తేనే ఆ మాటకు అర్ధం బోధపడుతుంది. మన ఆలయాలలో ఎక్కడికి వెళ్ళినా పులిహోర, దద్దోజనం వంటి సాత్విక ఆహారాలనే దైవానికి నివేదించి, మనకు ప్రసాదంగా పంచుతారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కోడి మాంసంతో చేసిన పదార్ధాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. మన తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు ఏ సమయంలో వెళ్ళినా ప్రసాదం అందుబాటులో ఉంటుంది. మన నేతలు ఆధ్యాత్మికతను కూడా వ్యాపారం చేస్తే, మనం ఆ వ్యాపారానికి పరోక్షంగా వత్తాసు పలుకుతాము. కానీ ఈ దేశంలో ఇంకా కొన్ని ఆలయాలు కుహనా ప్రభుత్వాల వ్యాపార కాంక్ష నుంచి కాస్తంత దూరంగా ఉండి, మనుగడ సాగిస్తున్నాయి. అటువంటి వాటిలో Thiruvarkadu Bhagavathi ఆలయం కూడా ఒకటి. అందుకే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వెళితే ప్రసాదం ఇవ్వరు. ఇక్కడి చికెన్ ప్రసాదం తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. అయితే చికెన్ ప్రసాదం దొరుకుతుంది కదా అని ఎగేసుకుని వెళ్తే, ముచ్చెమటలు పట్టడం ఖాయం.. ఈ ఆలయంలో భక్తితో పాటు, అదనంగా భయం కూడా దొరుకుతుంది. ఇది చాలా వింతగా అనిపిస్తుంది.. మరి ఆ విషయాలు వివరంగా తెలియాలంటే, ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకోవాలి.
సాక్ష్యాత్తు విష్ణువు అవతారమైన పరశురాముడు సృష్టించిన కేరళ రాష్ట్రం గురించి మనం గతంలో చెప్పుకున్నాము. అయితే, ఆ కేరళ రాష్ట్ర ఆవిర్భావం ఒక్కసారిగా జరగలేదు, అంచలంచగా జరిగిందని చెప్పడానికి, ఈ ఆలయ చరిత్రే ఆధారం. పూర్వం Pazhayangadi ప్రాంతంలో, దరికుడు, దానవేంద్రుడనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిలో అత్యంత క్రూరుడు పెద్దవాడైన దరికుడు. వారు బ్రహ్మ దేవడికై తపస్సు చేసి, మానవుల నుంచి దేవతల వరకు ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేని వరాన్ని పొందారు. యుద్ధం చేసేది ముఖ్యంగా పురుషులే కావడమూ, స్త్రీలకు యుద్ధ విద్యలు తెలిసినా, తమను చంపే బలం ఉండదనే ధైర్యంతో ఆ వారాన్ని పొందారు. ఇక వరప్రభావంతో దరికుడు, దానవేంద్రుడు అందరినీ నానారకాల ఇబ్బందులకు గురిజేస్తూ, నరకయాతనలు పెట్టేవారు. అడ్డు వచ్చిన ప్రతి మగవాడినీ తెగనరికే వారు. దేవతలు ఎన్నో సార్లు వారితో యుద్ధం చేసినా ఓటమి పాలయ్యేవారు. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించమని వారు శివయ్యను కోరగా, పార్వతీ మాత ఉగ్ర స్వరూపమైన కాళీ మాతను పంపించాడు. అలా దరికుడు, దానవేంద్రుడి పై పోరాటానికి వెళ్ళిన కాళీ మాతకు, దేవతలు తమ విశిష్ట ఆయుధాలు ఇచ్చి పంపించారు. ఆ తల్లి తన శక్తిని వినియోగించి వారిద్దనీ సంహరించింది. ఆ తర్వాత అక్కడి తపస్వులు ఆమెను అక్కడే వెలయమని కోరారు. దానికి ఆమె, తాను వెలయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలనీ, తనతోపాటు శివయ్యను కూడా తోడుగా ఉండమనీ కోరింది. కాళీ మాత కోరికను మన్నించిన శివయ్య, పరశురాముడికి విషయం చెప్పి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయమని కోరాడు. పరశురాముడు తన ఖడ్గాన్ని సముద్రంలోకి విసిరి, ఇంకొంత స్థలం ఉద్భవించేలా చేశాడు. అదే నేడు ఉన్న Pazhayangadi కోస్టల్ ప్రాంతం. అలా నాడు శివయ్య కాళీమాతతో పాటు, రాజరాజేశ్వరీ అమ్మవార్లతో కలిసి వెలిశారు. అలా పురాణాల ప్రకారం Thiruvarkadu Bhagavathi ఆలయంలోని భద్రకాళీ మాతే కేరళలో వెలసిన తొలి విగ్రహం అనీ, ఆ తర్వాతే తక్కిన కాళీ మాత ఆలయాలు వెలిశాయనీ చరిత్ర విదితం. అందుకే ఆ ఆలయాన్ని శక్తి క్షేత్రాల మూల స్థానంగా చెబుతారు.
అయితే, ఈ ఆలయంలో స్వామి వెలసినప్పుడు, ఉగ్ర స్వరూపమైన కాళీమాతతో పాటు, శాంతమూర్తి అయిన రాజరాజేశ్వరీ మాత కూడా వెలసినట్లు ముందు చెప్పుకున్నాము. ఒకనాడు ఆ ప్రాంతాన్ని పాలించే Chirakkal వంశ రాజు కలలో దర్శనమిచ్చిన కాళీ మాత.. తనకు శాకాహార భోజనం కంటే మాంసాహార భోజనమే ఇష్టమని చెప్పి, ప్రత్యేకంగా మరో ఆలయం నిర్మించమని కోరిందట. దాంతో ఆ మర్నాడే రాజు వెళ్ళి పూజారులకు ఆ విషయం చెప్పగా, అప్పటికప్పుడు అమ్మవారి కొరికమేరకు ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. అలా అక్కడ రాజరాజేశ్వరీ మాతకు ఒక ఆలయం ఉంటే, తనతో పాటు ఉండమని అడిగినందుకు, శివుడికీ కాళీమాతకూ మరో ఆలయం ఉంటుంది. 11వ శతాబ్దంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు శాశనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం, ఆ ఆలయం కేరళ ప్రభుత్వ Malabar Devaswom Board ఆధీనంలో ఉన్నా.. Chirakkal రాజవంశీయుల ఆధిపత్యం ఇంకా ఆలయంపై ఉన్నట్లూ, వారి పూర్వకులు రాసిన విధివిధానాలనే నేటికీ కొనసాగుతున్నట్లూ తెలుస్తోంది.
అలా ఆ నాడు అక్కడి నంబూద్రిలు తమ తపోశక్తితో నెలకొల్పి, ఆ తల్లికి మాంసాహారాన్ని, ముఖ్యంగా కోడి మాంసాన్ని వండి నైవేద్యంగా సమర్పించడం, ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టడం మొదలు పెట్టినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మన ఆలయాలలో పూజలు నిర్వహించే పూజారులనే, కేరళలో నంబూద్రిలని అంటారు. అయితే, వీరి పూజా విధానాలకూ, మన ఆలయాలలోని పూజారుల విధానాలకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ శక్తి క్షేత్రాలలో పూజలు చేసే నంబూద్రిలకు తంత్ర విద్యలపై కూడా పట్టు ఉంటుంది. అయితే తంత్ర విధ్యను అభ్యసించే విధానాలలో చాలా స్థాయిలు ఉంటాయని నిపుణుల ద్వారా తెలుస్తోంది. అలా తంత్ర విద్యను అభ్యసించిన వారిని తాంత్రిక నంబూద్రిలని పిలుస్తారు. Thiruvarkadu Bhagavathi ఆలయంలో కనిపించే పూజారులందలందరూ తాంత్రిక నంబూద్రిలే..
కేరళ టెంపుల్ స్టైల్ చాలా బాగుంటుంది.. అందులోనూ వండిన కోడి మాంసాన్ని ప్రసాదంగా పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి నాలుగు ఫోటోలు తీయించుకుని, ఇచ్చిన ప్రసాదాన్ని ఓ పట్టు పడదాం అనుకుంటున్నారా..? అయితే.. మీకు Thiruvarkadu Bhagavathi ఆలయం గురించి మరో నిజం, దాని వెనకున్న చరిత్ర తెలియాలి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు, లోపలకి ప్రవేశించగానే రాజరాజేశ్వరీ మాత, ఇతర దేవతలూ దర్శనమిస్తారు. ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్ళగానే, ముందుగా శివయ్య కనిపిస్తాడు. ఆయన వెనక ఉన్న గర్భాలయంలో భద్రకాళి అమ్మవారు ఉగ్రాకారంలో కరుణామూర్తిగా దర్శనమిస్తారు. సాధారణంగా స్వామి వారు, అమ్మవారు, ఒకే గర్భాలయంలో పక్క పక్కన ఉంటారు, లేదా వేరు వేరు ఆలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం, ముందు స్వామి వారు, ఆ వెనుక అమ్మ వారు ఉండటం కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. దానికి కారణం, ఇక్కడి కాళీ మాత బ్రాహ్మణ స్త్రీ తత్వంతో ఉంటుంది. అంటే, పూర్వం బ్రాహ్మణ స్త్రీలు ఇంట్లో మాత్రమే ఉండేవారు. బయటకు వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా, పరదాల మధ్య ఆమె భర్త, లేదా తండ్రి, లేదా సోదరుల ఆధ్వర్యంలో, చుట్టూ అంగరక్షకుల మధ్య వచ్చేవారు. అదే విధంగా ఇక్కడి కాళీ మాతను బ్రాహ్మణ స్త్రీ మూర్తిగా చూస్తారు. అందువల్ల ఇక్కడ వెలసిన తల్లిని బ్రాహ్మణ స్త్రీలకు మాతృమూర్తిగా, శివయ్యను తండ్రిగా పూజారులు చెబుతారు.
ఇక చరిత్ర విషయానికొస్తే, కేరళ రాష్ట్రంలో 11వ శతాబ్దం నుంచే ముస్లింల దండయాత్రలు మొదలయ్యాయి. అంతేకాకుండా, కేరళ ప్రాంతానికి వ్యాపార నిమిత్తం రోమ్ నుంచి వ్యాపారులూ, వారికి తోడుగా వారి అంగరక్షకులూ వచ్చేవారు. ఇక కేరళలో ముస్లింల చొరబాటు, బందిపోట్లుగా వారు చేసే అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. మన దేశంలో స్త్రీ అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఆమెను లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుట్టినా, కొత్త కోడలు వచ్చినా, లక్ష్మీ దేవి వచ్చిందని సంబరాలు చేసుకుంటారు. స్త్రీ మూర్తిని ఆ ఇంటి పురుషుడి గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఆ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లినా, పరిణామాలు తీవ్రంగా ఉండేవి. అందువల్ల వారిని రక్షించుకోవడం పురుషులకు ప్రధమ కర్తవ్యంగా ఉండేది. అందువల్లే ఈ కట్టుబాట్లు మన దేశంలో పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో స్త్రీలు ముఖం కనిపించకుండా పరదాలు కప్పుకోడానికి ముస్లింల అఘాయిత్యాలే కారణం అని తెలుస్తోంది. క్రూరమైన ముస్లిం రాజుల కళ్ళ పడకుండా స్త్రీల ముఖాలు కప్పి ఉంచడానికి పరదాలు మొదలు పెట్టి, కాలగమనంలో అదో ఆచారంగా మారిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. అదే విధంగా కేరళలో బ్రాహ్మణ స్త్రీల చుట్టూ కట్టుబాట్లు పెరిగినట్లు కొంతమంది చరిత్రకారులు బలమైన ఆధాలను చూపుతున్నారు.
ముస్లిం చొరబాటు దారులు ఎంత దారుణంగా ప్రవర్తించేవారో చెప్పడానికి మన గత వీడియోలను చూడండి. అలాగే Thiruvarkadu Bhagavathi ఆలయంలో జరిగిన ఒక దారుణం గురించి కూడా తెలియాలి. మన దేశాన్ని ఆక్రమించి దోచుకోడానికి వచ్చిన ఇస్లాం రాజులలో, Hyder Ali ఒకడు. అతని సేనలు కేరళ రాష్ట్రంపై దండెత్తినప్పుడు, Pazhayangadi ప్రాంతాన్ని పాలించే రాజు ఓడిపోయాడు. Pazhayangadi రాజు చాలా చిన్న సామంత రాజు కావడం చేత, పిశాచాల సమూహంలాంటి వారిని ఎదిరించి నిలువలేకపోయాడు. ఆ సమయంలో Pazhayangadi లోని ఆలయాలను కూడా దోచుకుని, Thiruvarkadu Bhagavathi ఆలయంలోని బంగారంతో పాటు, ఆలయంలోని గోవులను కూడా తీసుకెళ్లిపోయారు. ఒక గోవును వధించి దాని రక్త మాంసాలను ఆలయం గోడలపై వెదజల్లి, ప్రేగులను గర్భాలయంలోని విగ్రహాలపై వేశారు ఆ ధూర్తులు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిజేసింది. దాంతో Vengayil Chathukutty Nair అనే కలరీ వీరుడు తురకల స్థావరానికి వెళ్ళి, తర్వాత వారు చేయబోయే దాడికి సన్నద్ధమవుతున్న ఆ కిరాతకుడినీ, వాడి 50 మంది సైన్యాన్నీ ఒక్కడే ఎదిరించి పోరాడి వధించాడు. ఆ నాడు అతడిని ఆ భద్రకాళి శక్తి ఆవహించిందనీ, Vengayil Chathukutty చేసిన రుద్రతాండవం గురించి నేటికీ స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటూ, జానపద గేయాలుగా పాడుకుంటుంటారు. అలా నాడు Vengayil Chathukutty, ఆ కసాయి వాడి తలను నరికి, ఆలయ పూజరుల ఎదుట పడేశాడు. ఆ తరువాత Vengayil Chathukutty, కేరళ, తమిళ నాడు ప్రాంతాలలోని ఎన్నో ఆలయాలను ముస్లింల దాడుల నుంచి రక్షించాడని చరిత్ర చెబుతోంది. ధర్మాన్ని కాపాడటం కోసం ఎడతెరిపి లేని పోరాటాన్ని కొనసాగించిన Vengayil Chathukutty ని, Nayanar అనే బిరుదుతో గౌరవించారు. Nayanar అంటే హైందవ ధర్మాన్ని రక్షించే ఋషులని అర్ధం. చరిత్ర ప్రకారం, హైందవ ధర్మాన్ని రక్షించి, ముందు తరాలకు కూడా కొనసాగించే పని ఈ Nayanar లు చేసేవారనీ, వారు మొత్తం 69 మంద ఉన్నారనీ చరిత్ర ద్వారా తెలుస్తోంది.
నాడు Vengayil Chathukutty కి అంతటి బలాన్ని ఇచ్చిన తల్లి, సాధారణమైన ఆలయాలలో కనిపించే విగ్రహమూర్తి కాదు. అత్యంత తీవ్రమైన శక్తితో కూడుకున్న కాళీ స్వరూపం. ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, రురుజిత రూపంలో జరిగినట్లు, ఆలయ చరిత్ర చెబుతుంది. రురుజిత అంటే, భద్రకాళి యొక్క రౌద్ర రూపం. అందుకే ఇక్కడి పద్దతులన్నీ, రురుజిత విధానంలోనే ఉంటాయి. శ్రీ విద్యాతంత్రంలో భాగమైన ఒక తంత్ర సాధన ఇది. అందుకే ఈ Thiruvarkadu Bhagavathi ఆలయం, తంత్రసాధకులకు అతి ముఖ్యమైన ప్రదేశం.
ఈ కారణాల వల్లనే మాడాయి కావు ఆలయానికి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. తంత్రసాధన చేసే ఆలయం అయితే మాత్రం, అమ్మను దర్శించుకోడానికి ఇబ్బందేమిటని కొందరు అడగవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఏవీ ఇబ్బందులు కావు.. కానీ అక్కడికి వచ్చేవారితోనే అసలు చిక్కంతా. ఎందుకంటే, అక్కడికి వచ్చే భక్తులలో సాధారణ భక్తులతో పాటు, ప్రేతాలు ఆవహించిన వారు కూడా ఉంటారు. Thiruvarkadu Bhagavathi ఆలయంలోని కాళీ మాత తంత్ర స్వరూపిణి కావడం చేత, ఆమె ఎదుట దుష్ట శక్తులు నిలబడలేవు. దెయ్యం పట్టినవారిని మాడాయి కావు కి తీసుకువచ్చి, అక్కడి పూజారులతో ప్రత్యేకమైన తంత్ర పూజలు జరిపిస్తే, ఆ ప్రేతాలనుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకే అక్కడికి ప్రతిరోజూ అలా దెయ్యం పట్టినవారు చాలా మంది, దేశ విదేశాల నుంచి వస్తారు. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆ ఆలయంలో దాదాపు అందరూ దెయ్యం పట్టినవారే ఉంటారని కూడా తెలుస్తోంది. అందుకే ఈ ఆలయానికి వెళ్లాలంటే ధైర్యం చాలా అవసరం. కేరళ వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుని, ప్రసాదం తిని వచ్చిన వారికి అన్ని విధాలుగా శుభం చేకూరిందని భక్తులు చెబుతున్నారు.
ॐ 🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏
Comments
Post a Comment