The Mysterious Puri Vimaladevi Temple — Where Goddess Accepts Meat Offering! | పూరీ విమలాదేవి క్షేత్రం!

పూరీ విమలాదేవి క్షేత్రం! ఈ క్షేత్రంలో అమ్మవారికి మాంసం నైవేద్యంగా పెడతారు! విష్ణుమూర్తి సంబంధిత వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, మనకు ఎక్కువగా కనిపించే దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం, తులసీమాలలను తాకుతూ వీచే చల్లటి గాలి, స్వామి వారి కోసం ప్రత్యేకంగా పూయించిన వివిధ రకాల పువ్వుల నుంచి వెలువడే సుగంధ పరిమళాలు, ఆ దేవదేవుడి కోసం సిద్ధంచేసి ఉంచిన రకరకాల నైవేద్యాల నుంచి వచ్చే కమ్మటి వాసనలు, వీటన్నిటినీ మించి.. చూపులను మరల్చనీయకుండా ఎంత చూసినా తనివితిరని ముగ్ధ మనోహరమైన స్వామివారి విగ్రహం. జన్మజన్మల పాపాలను తొలగించే ఆ స్వామి దర్శనం, ఎలాంటి బాధలనైనా తొలగించి, నీకు నేనున్నానని ధైర్యమిచ్చే అభయ హస్తం.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆ స్వామి వర్ణననికి కోటి జన్మలైనా సరిపోదు. అంతటి ప్రభావం ఉండటం వల్లనే ప్రతి ఒక్కరూ ఆ స్వామి ఆలయానికి పదే పదే వెళ్లాలని పరితపిస్తుంటారు. ఆ తపన తాలూకు ఉచ్ఛస్థితి ఎలా ఉంటుందో చవిచూడాలంటే, ఒక్కసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళివస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. అయితే.. మన దేశంలోని ఒక ప్రముఖ వైష్ణవాలయంలో ఈ పద్ధతికి భిన్నంగా జంతు బలులు ఇచ్చే ఆచారం ఉందని మీకు తెలుసా.. పైగా ఇచ్చిన బలిని రు...