Posts

Showing posts with the label కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం

Millions of Years Ago: The Manifestation of Kashi Vishweshwara | కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం!

Image
కోట్ల సంవత్సరాల క్రితం కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం! ‘కాశీ’ గురించి ఈ ఆశ్చర్యకర నిజాలు మీకు తెలుసా? ఆ పరమేశ్వరుడు వెలసిన పరమ పుణ్య క్షేత్రాలలో కాశీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జీవికి ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా, మోక్షాన్ని ఇచ్చే పవిత్ర స్థలంగా కాశీని పేర్కొంటారు. న గాయత్య్రా సమో మంత్రమ్‌ న కాశీ సదృశీ పురీ ! న విశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునః !! గాయత్రీ మంత్రంతో సరిసమానమైన మంత్రమూ, కాశీ నగరానికి సరితూగే పుణ్య క్షేత్రమూ, అక్కడి విశ్వేశ్వర లింగంతో పోల్చదగ్గ శివస్వరూపమూ మరొకటి లేదని ఈ శ్లోక తాత్పర్యం. కాశీ ఎంత పురాతనమైనదో అంత సనాతనమూ, ఎంత పవిత్రమైనదో అంత మహిమాన్వితమైనదని శాస్త్ర విదితము. సాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడే కొలువైన భూ కైలాసము. జీవన్మరణ చక్రంలో జీవికి ముక్తిని ప్రసాదించే జీవన్ముక్తి కారకం కాశీ, లేక వారణాసి గా వాడుకలో ఉన్న వారాణసి. కాశీనే మహా శ్మశానము అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టమని అంటారు. ఇది మహా పవిత్ర క్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రములో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్య...