'2023 శ్రావణ మాసం' ప్రారంభమైంది..
2023 శ్రావణ మాసం ప్రారంభమైంది.. ఈ నెలలో నాగ పంచమి, రాఖీతో సహా ఏయే పండుగలొచ్చాయో తెలుసా? మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మాసానికీ ఒక ప్రత్యేకత ఉంది. అయితే, శ్రావణ మాసానికి ఉన్న విశిష్ఠతే వేరు. ఈ మాసాన్ని, ఉపవాసాలూ, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లూ, ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులూ, వంకలూ, సరస్సులూ, చెరువులూ, నదులూ పొంగి పొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం, ఆగస్టు 17వ తేదీ నుంచి, నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది. ఈ సందర్భంగా, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలూ, వ్రతాలేంటి? అవి ఏయే తేదీలలో వచ్చాయి? వాటి ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాము.. శ్రావణ సోమవారం.. పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి, ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మంగళవారం.. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పె