Rewriting Destiny - Influence of Rahu | మృత్యువును తప్పించిన దానం!
మృత్యువును తప్పించిన దానం! - ఒక చిన్న కథ.. కొన్ని ఆపదలను తప్పించుకోవడానికి మంచి పనులు చేయడమెలా మార్గం? మంచి కథలు మనిషి జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి. మంచితనం, గ్రహ దేవతలనూ, బ్రహ్మ రాతను సైతం మార్చేంత శక్తిని ఎలా కలిగి ఉంటుంది? వంటి విషయాలతో కూడుకున్న, అటువంటి ఒక మంచి కథను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో comment చేసి చెబుతారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1YDunsrZIio ] ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజూ అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి, వాటిని అమ్ముకుని జీవనం గడుపుతుండేవాడు. ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. అతను రోజూ అడవికి వెళ్లే దారిలో, ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి చిన్న విగ్రహం పెట్టుకుని, తులసి ఆకులతో అర్చన చేయడం గమనిస్తుండేవాడు. అది చూసి ఆ వ్యక్తి చాలా ముచ్చట పడేవాడు. తను కూడా అలా తులసి ఆకులతో పూజ చేయాలని నిత్యం అనుకుంటుండేవాడు. కానీ ఏదో ఒక కారణం చేత చేయలేక పోయేవాడు. ఒక రోజు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే, తులసి చెట్టు కనిపించింది