Posts

Showing posts with the label భరత వర్షం

KHAGOLA SHASTRA: Ancient Indian Astronomical Science Facts | జంబూ ద్వీపం! భరత వర్షం! అంటే?

Image
జంబూ ద్వీపం! భరత వర్షం! అంటే..? నిత్య దైవ పూజ సంకల్పంలో ‘ఖగోళ శాస్త్రం’ ఎందుకుంది? ఈ నాటికీ మన హిందువుల ఇళ్ళలో పూజలు చేసుకునేటప్పుడు, పూజ ప్రారంభంలో “మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య..” అంటూ సంకల్పం చెప్పుకుని, అక్షతలను నీళ్ళతో పక్కన పెట్టుకున్న పాత్రలో వదులుతూ ఉంటాము. ఇలా ఆ సంకల్పాన్ని చెప్పుకున్నప్పుడల్లా, అదేదో దేవుడికి చేసే పూజలో భాగమైన మంత్రంగానే అనుకుంటాము. అయినా చాలామంది దృష్టి అందులోని కొన్ని పదాలవైపు ఆకర్షింపబడుతుంది.. అవే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అనే పదాలు. ఇందులో భరతఖండం అంటే మన భారత దేశం అని సులువుగానే గుర్తించ వచ్చు. కానీ భరత వర్షం అంటే ఏమిటి, జంబూ ద్వీపం ఎక్కడుంది.. వంటి ఆలోచనలు కలిగిన వారు కామెంట్ చేయండి. ఈ సంకల్పాన్ని సరిగ్గా పరిశీలిస్తే, అది దేవుడి పూజలో భాగమైన మంత్రం కాదు. కొన్ని యుగాల క్రితమే మన భారతీయ ఋషులకు ఉన్న ఖగ...