Posts

Showing posts with the label ధన్వంతరి జయంతి

2024 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు

Image
  అందరికీ 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు 🙏 @Voice of Maheedhar సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ 'ధన్వంతరి' ఒకటి! క్షీర సాగర మధన సమయంలో, విష్ణు అంశతో సాగర గర్భం నుండి యువకుడిగా ఉదయించాడు 'ధన్వంతరి'. లేలేత బాహు దండాలు, విశాలమైన వక్షస్థలి కలిగివున్నాడు. పద్మాలవంటి ఎర్రని కన్నులతో, చిక్కనైన కేశజాలంతో, నీలగాత్ర తేజంతోనూ కనిపించాడు. పీతాంబరాలలను కట్టుకున్నాడు. మణికుండలాలతోనూ, పుష్పమాలాతోనూ సమలంకృతుడై ఉన్నాడు. అమృత కలశాన్ని ఒక చేత్తోనూ, వనమూలికల్ని మరొక చేత్తోనూ పుచ్చుకుని ఆవిర్భవించాడు. ముక్కోటి దేవతలూ ఆ రూపాన్ని రెప్ప వాల్చకుండా చూశారు. "ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశహస్తాయా ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్..." అని ధన్వంతరీ గాయత్రి జపించారు. శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించే వాడు ధన్వంతరి. సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది. భాగవత పురాణం ధన్వంతరిని విష్ణుమూర్తి 12వ అవతారంగా పేర్కొంది. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంత...