ఏది నీది? What belongs to you? భగవద్గీత Bhagavadgita
ఏది నీది? సమాజంలో ఉండే నాలుగు రకాలైన మనుష్యులు ఎవరు? 'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/V53m_Aej3zs ] అసురీ లక్షణాలను కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు.. 00:48 - ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ । ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ।। 13 ।। 00:58 - అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి । ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।। 01:08 - ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా । యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।। ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు.. ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను. నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే. రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ