The Dark Reign of Aurangzeb | Forgotten Chapters of Indian History of Destruction and Faith | ఔరంగ్ జేబ్
ఔరంగ్ జేబ్ ధ్వంసరచన! ఔరంగ్ జేబ్ ధ్వంసం చేయించి సమూలంగా దోచుకున్న 9 ప్రాచీన క్షేత్రాలు! అసలైన చరిత్రను తెలుసుకుని జాగ్రత్త పడడం మనకు అత్యవసరం. ఈ భూతలం పై ఈనాడు మనకు తెలిసిన ఏ నాగరికతా పురుడు పోసుకోక మునుపే, మన భారత దేశంలో నాగరికత తారా పథంలో ఉండేది. ఈ విషయాన్ని మన గత వీడియోలలో చాలాసార్లు చర్చించుకున్నాము. ఆదీ అంతం లేని సనాతనధర్మ ఔన్నత్యానికీ, ఆధునిక Technology తో తలపట్లు పట్టినా అంతుచిక్కని ఎన్నో అద్భుత కట్టడాలకూ మన భారతావని శాశ్వత చిరునామాగా నిలిచింది. యుగ యుగాలుగా ఎన్నో రకాలుగా రాక్షసుల దాడులు జరిగినప్పటికీ, నిరాటంకంగా, దేదీప్యమానంగా వెలుగొందిన చరిత్ర మనది. ఈ కలియుగంలో మాత్రం 11వ శతాబ్దిలో మొదలయి, ఎందరో నరరూప రాక్షసుల వల్ల శతాబ్దాల తరబడీ ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. మధ్య ఆసియా ప్రాంతం నుంచి మన దేశంపై దండెత్తి వచ్చిన తురుష్కులు, మన సంస్కృతికి పట్టుగొమ్మలైన వేలాది పురాతన ఆలయాలను నాశనం చేసి, వెలకట్టలేని సంపదలను దోచుకున్న విషయం, ప్రతి హిందువుకూ తెలిసినదే. అలా హిందూ ఆలయాలను నాశనం చేసి వాటిలోని సంపదలను కొల్లగొట్టడంలో అందెవేసిన రాక్షస హస్తాలు ఎన్నో ఉన్నా, అందులో ఔరంగ్ జేబ్ ది ప్...