Posts

Showing posts with the label భూత-భవిష్యత్-వర్తమానాలు!

భూత-భవిష్యత్-వర్తమానాలు! Bhagavadgita భగవద్గీత

Image
  భూత-భవిష్యత్-వర్తమానాలు! భగవానుడి విశ్వరూపంలో అర్జునుడు ఏం చూశాడు? 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (26 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 26 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/JQCy-zl-l0M ] 00:41 - అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః। భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ।। 26 ।। 00:54 - వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని । కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ।। 27 ।। ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడూ, ద్రోణాచార్యుడూ, కర్ణుడూ, ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలక్రిందులుగా, నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు, నేను చూస్తున్నాను. గొ