Roman Empire Gold Found in Sri Padmanabhaswamy Vaults! | రోమ్ పతనానికి మన భారత దేశమే కారణమా?

అనంత పద్మనాభుడి గుప్త నిధులలో రోమన్ నాణాలు ఏం నిరూపిస్తున్నాయి? రోమ్ పతనానికి మన భారత దేశమే కారణమా? ప్రపంచంలోనే అతిగొప్ప నాగరికత కలిగిన ప్రదేశంగా ‘రోమ్’ని అభివర్ణిస్తారు, పాశ్చాత్య చరిత్రకారులు. వారి నిర్మాణ శైలి, పాలనా విధానం, వారికున్న విజ్ఞానం మరెక్కడా లేదన్నట్లు చెప్పుకొస్తారు. ఇక ఆ రోమన్ జాతిలో పుట్టిన అలెగ్జాండర్ ని ఈనాటికీ విశ్వవిజేతగా అభివర్ణిస్తారు. ఈ విషయంపై మనం గతంలో చేసిన వీడియో లింక్ description లోనూ, icards లోనూ పొందుపరుస్తున్నాను. చూడనివారు తప్పక చూడండి. ఇక మన దేశం విషయానికొస్తే, ఆ పాశ్చాత్య చారిత్రకారులలో చాలా మంది, నేటికీ భారత దేశానికీ ఆఫ్రికా ఖండంలోని ఆటవిక రాజ్యాలకూ తేడా లేదనీ, రెండు ప్రాంతాలవారూ అడవులలో జీవించే వారిగానూ, పెద్దగా నాగరికత తెలియని మనుష్యులుగానూ భావిస్తుంటారు. వారి అహంకారాన్నీ, అంచనాలనూ తల్లక్రిందులు చేసే ఆధారాలు నేడు వెలుగులోకి వచ్చాయి. ఎంతో గొప్ప నాగరికతకు చిహ్నంగా భావిస్తున్న రోమ్ పతనం, మన భారత దేశం వల్లనే జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియో ప్రకారం, వారి గొప్ప రాజైన అలెగ్జాండర్ కూడా మన దేశంలో ఘోర పరాజయం ఎలా ఉంటుందో రుచి చూశాడు. అలెగ్జాండర్ వ...