పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home
పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? వారికి రోజూ నైవేద్యం పెట్టాలా? పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల జన్మించిక తప్పదని, భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో, మనమంతా కేవలం పాత్రధారులము మాత్రమే అని పెద్దలంటూ ఉంటారు. ఇది నాటకమో, జీవితమో చెప్పడం కష్టంకానీ, పోయిన వాళ్ళను తలుచుకుంటూ, బ్రతికున్న రక్త సంబంధీకులూ, ఆత్మీయులూ, తక్కిన జీవితం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో, పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే, ఈ ఫోటోలకు రోజూ నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలోనే పెట్టుకుని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను, ఏ దిక్కున పెట్టుకోవాలి? వంటి సందేహాలేన్నో మనలో చాలా మందికి కలుగుతుంటాయి. మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో పాటించాల్సిన కొన్ని నియమాలను, మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులోనూ, జనన మరణాల విషయంలో, ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడంలో, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆ తర్వాత సంభవించే పరిణామాలు, ఎంతో దారుణంగా ఉంటాయని, పెద్దలు చెబుతున్నారు. మరీ ముఖ