Posts

Showing posts from February, 2023

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

Image
పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? వారికి రోజూ నైవేద్యం పెట్టాలా? పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల జన్మించిక తప్పదని, భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో, మనమంతా కేవలం పాత్రధారులము మాత్రమే అని పెద్దలంటూ ఉంటారు. ఇది నాటకమో, జీవితమో చెప్పడం కష్టంకానీ, పోయిన వాళ్ళను తలుచుకుంటూ, బ్రతికున్న రక్త సంబంధీకులూ, ఆత్మీయులూ, తక్కిన జీవితం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో, పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే, ఈ ఫోటోలకు రోజూ నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలోనే పెట్టుకుని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను, ఏ దిక్కున పెట్టుకోవాలి? వంటి సందేహాలేన్నో మనలో చాలా మందికి కలుగుతుంటాయి. మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో పాటించాల్సిన కొన్ని నియమాలను, మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులోనూ, జనన మరణాల విషయంలో, ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడంలో, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆ తర్వాత సంభవించే పరిణామాలు, ఎంతో దారుణంగా ఉంటాయని, పెద్దలు చెబుతున్నారు. మరీ ముఖ

శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? Abhisheka Mantra

Image
శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని, శాస్త్ర వచనం. అంతేకాదు, ఆ శివయ్యకు.. పాలు, నీళ్ళు, పంచదార, పంచామృతాలు, ఇలా ఒక్కో రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే, ఒక్కో విధమైన ఫలితం ఇస్తాడాని, వేదాలు చెబుతున్నాయి. అందులోనూ, మహా శివరాత్రి లాంటి పర్వదినంలో, పరమేశ్వరుడికి చేసే అభిషేకాలు, మరింత పుణ్యం చేకూరుస్తుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల, రాబోయే శివరాత్రి నాడు, భక్తకోటి మొత్తం, స్వయంగా శివ లింగానికి అభిషేకం చేయాలని, ఆశిస్తారు. అయితే, ఇలా అభిషేకం చేసే సమయంలో, ఏ విధమైన మంత్రాలు చదవాలి? ఏ మంత్రాలు చదివితే స్వామిని ప్రసన్నం చేసుకోగలం? అనే సందేహాలు, మనలో చాలా మందికి ఉంటాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు చూడండి. భక్తితో, త్రికరణ శుద్ధిగా పోసే చెంబెడు నీళ్ళు చాలు, ఆ భోళా శంకరుడి కరుణకు పాత్రులవ్వడానికని, పెద్దలు చెబుతూ ఉంటారు. అభిషేక ప్రియుడిగా పేరు తెచ్చుకున్న ఆ పరమేశ్వరుడికి, ఎన్ని పూజలు చేసినా, కాసిన్ని నీళ్ళతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే, మన బాధలన్నీ దూరం చేసేస్తాడు. అందుకే, ఆ స్వామికి ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి రోజు అభిషేకాలు జరుగుతూనే

సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి! Karma Siddhantha

Image
మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే! ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా, నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం! రాముడు దండకారణ్యంలో 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహా పతివ్రత శాపం! సత్య యుగంలో దేవాసుర సంగ్రామ సమయంలో, మృత సంజీవనీ మంత్ర బలంతో, చావు లేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుద ముట్టించడానికి, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుచుందా ఋషి పత్ని! విధి లేక శ్రీమహావిష్ణువు, ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా, తన సుదర్శన చక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన మహా తపోధనుడైన ఆమె భర్త, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ, శ్రీమహావిష్ణువును శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు పత్నీ వియోగం కల్పించినందుకు గాను, అతడు కూడా భార్యా వియోగంతో బాధపడాలని శపించాడు! అందుకే త్రేతాయుగంలోని రామావతారంలో, రాముని వనవాసానికి కైక, మందర లేదా దశరథుడు కారణం కాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది. ఇక్కడ మనం గమనించ వలసినది, అవతార పురుషుడైన శ్రీరాముడికి

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

Image
37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? సకల లోక రక్షకుడూ శిక్షకుడూ ఆ పరమేశ్వరుడొక్కడే అని, వేదాలు సుస్పష్టంగా చెబుతాయి. కంటికి కనపడని సూక్ష్మ జీవుల నుంచి, సృష్టిని నడిపించే శక్తుల వరకూ, అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే యుగ యుగాలుగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోడానికీ, ఆయన కరుణకు పాత్రులవ్వడానికీ, సమస్త ప్రాణి కోటీ ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన శివ రాత్రి పర్వదినం నాడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్త కోటి మొత్తం ఆయనను విశేషంగా పూజిస్తారు. అందులోనూ, ఈ సారి శివరాత్రి పర్వదినంతో పాటు, శనిత్రయోదశి కూడా వచ్చింది. అందుకే ఈ 2023 మహాశివరాత్రి చాలా విశేషమయినది, అరుదైనది. ఇటువంటి కలయిక, ఇంతకు మునుపు 26-2-1881, 23-2-1952, 8-3-1986 తేదీలలో, ఇప్పుడు 18-2-2023 న, తరువాత ఈ శతాబ్దిలో మళ్ళీ 34 ఏళ్లకు, అంటే 3-3-2057 న, ఆ తరువాత 37 ఏళ్ళకు అంటే, 13-2-2094 న ఏర్పడుతుంది. ఇదొక అద్భుత యోగం, మరియు అత్యంత పుణ్యకాలం. ఇది మన తరానికి రావటం మన అదృష్టం. దినదిన గండంగా జీవనం సాగిస్తున్న ఈ కాలంలో, మరో 34 ఏళ్ల నిరీక్షణ అందరికీ సాధ్యపడకపోవచ్చు. కావున, ఈ అవకాశాన్ని అందరూ సద్విన

శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా? Worshiping Shiva Linga at home

Image
శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా? శివుడు అభిషేక ప్రియుడనే నానుడి యుగయుగాలుగా, భక్తుల మనస్సులలో నాటుకుపోయి ఉంది. క్షీర సాగర మధనంలో, లోక సంకటమైన కాలకూట విషం ముందుగా ఉద్భవించగా, ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని, గరళకంఠుడనే పేరును స్థిరపరుచుకున్నాడా పరమేశ్వరుడు. అలా తాను మింగిన విషం వలన కలిగే తాపం నుంచి రక్షించుకోవడానికే, ఆ స్వామి హిమగీరులపై నివశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అదే కారణాన ఆయన అభిషేక ప్రియుడిగా కూడా పేరుగాంచాడు. అలా అభిషేకం చేయడం ద్వారా శివయ్య త్వరగా ప్రసన్నం చెంది, కోరిన కోర్కెలు తిరుస్తాడాని, శాస్త్ర వచనం. అందుకే అనాదిగా మానవులనుంచి, దేవతల వరకు, ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోడానికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అందులోనూ శివ రాత్రి నాడు స్వామికి చేసే అభిషేకం వల్ల మరింత పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే, శివరాత్రి నాడు తమ ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేసుకోవాలనుకునే వారిలో చాలా మందికి, అసలు ఆ స్వామికి ఏవిధమైన లింగం పెట్టుకుని అభిషేకం చేయాలి? అసలు ఇంట్లో శివ లింగానికి అభిషేకం చేసుకోవచ్చా, లేదా? అనే సందేహాలు కలుగుతుంటాయి. ఈ సృష్టిలో ఉన్న అతి శక్తివంతమైన ప్రతిమలలో,