Posts

Showing posts with the label మృత్యువు

Perception of DEATH! మృత్యువు!

Image
మృత్యువు! Perception of DEATH! రెండు జన్మల మధ్య అత్యధిక అంతరం ఎన్ని సంవత్సరాలో మీకు తెలుసా? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।। పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించినవానికి మరల జన్మము తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ విషయాన్ని గురించి శోకించ వద్దని అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం, మనం ఏదో ఒకరోజు మృత్యువు ఒడికి చేరాల్సిందే అన్నది. తప్పించుకోలేనిది, ఎప్పుడు వచ్చేదీ తెలియనిది ‘మరణం’. కాబట్టి, అనివార్యమైన మృత్యువును గూర్చి తెలివైన వాడు శోకించడని, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. కల్పాంతరాల జీవాత్మ ప్రయాణంలో, ఇప్పుడు మనం చూస్తున్న జీవితం ఒకానొక మజిలీ మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎందరో మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నా, ఏదో ఒక రోజు మనమూ చనిపోతామని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. అసలు ఈ జీవితం ఏమిటి? జీవన ప్రక్రియ యొక్క ముగింపును సూచించే ఆ మరణం సంభవించిన తరువాత ఏం జరుగుతు...

Death: A Curse or a Blessing? | మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?

Image
మరణం! మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?  TELUGU VOICE ఆత్మ నిరంతర ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అయిన ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? 'చిరంజీవత్వం' అన్నది సాధారణ విషయం కాకపోయినా, సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు కూడా. ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో, వారు అకల్పాంతం వరకూ, అంటే, ఎల్లప్పటికీ ‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు. ఈ విధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ, ఇంకా ఎంతో మంది యోగులు, ‘చిరంజీవులు’ గా ఇప్పటికీ భూమిపై నడయాడుతూ ఉన్నారు. అందరూ మరణాన్ని గురించి భయపడటం సహజమే. కానీ, జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ రెండూ విశ్వం యొక్క సమతౌల్యతను కాపాడటానికి అత్యవసరం. లేకపోతే, మనుషులు ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో, సృష్టి అల్లకల్లోలమవుతుంది. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LrkjH4viRsU ] మూల చైతన్యాన్ని తెలుసుకోలేని మానవుడు, సృష్టిలో అనివార్యమైన మరణాన్న...