4000-Year-Old Aryan City Found in Russia? 5 Shocking Secrets of Arkaim: Did Aryans Migrate from Russia? (Tilak's Theory)
రష్యాలో బయటపడ్డ 4000 ఏళ్ళ నాటి 'హిందూ' నగరం! స్వస్తిక్ ఆకారంలో ఉన్న ఆ నగరం ఎవరిది? - ఆర్యుల జన్మస్థానం పై సంచలన నిజాలు! 4000-year-old Aryan city discovered in Russia చరిత్ర అనేది పుస్తకాలలో దాగి ఉన్న పాఠాలు మాత్రమే కాదు... త్రవ్వేకొద్దీ బయటపడే అనంతమైన సత్యమది. సనాతన ధర్మం, లేదా హిందూ సంస్కృతి, కేవలం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం అని అనుకోవడం, మన పూర్వీకులు కాశీ నుండి కన్యాకుమారి వరకు మాత్రమే నడిచారని అనుకోవడం మూర్ఖత్వమే.. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో... మంచుతో కప్పబడిన రష్యా దేశంలో... దాదాపు 4000 సంవత్సరాల క్రితం, ఒక నగరం ఉండేది. ఆ నగరం సామాన్యమైనది కాదు. ఆకాశం నుండి చూస్తే అది ఒక బ్రహ్మాండమైన చక్రంలా, లేదా ఒక యంత్రంలా కనిపిస్తుంది. అక్కడ త్రవ్వకాలు జరిపిన శాస్త్రవేత్తలకు ఏం దొరికాయో తెలుసా? భారీ శివలింగాలా? కాదు. విగ్రహాలా? కాదు. అక్కడ దొరికింది... అగ్ని హోమ గుండాలు! అవును, మనం పెళ్లిళ్లలో, యాగాలలో వాడే అగ్ని గుండాలు. అక్కడ దొరికిన కుండల మీద 'స్వస్తిక్' గుర్తులు ఉన్నాయి. వాళ్ళు చనిపోయిన వారిని ఖననం చేసే పద్ధతి మన ఋగ్వేదంలో చెప్పబడిన పద్ధతిని పోలి ఉంది. అదే......