Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, September 29, 2025

The Fiercest Goddess in Kerala? The Untold Story of Thiruvarkadu Bhagavathi Temple | మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం!


మాంసాన్ని ప్రసాదంగా పెట్టే ఆలయం!
ఎన్నో ఆలయాలను తురకలనుండి కాపాడిన ఆ కలరీ యోధుడు ఎవరు?

దేవాలయాలను సందర్శించి కొద్ది సేపు అక్కడ గడిపితే, మనం నిత్యం అనుభవించే బాదరబందీలను మరచిపోయి, మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇక అక్కడ వితరణ చేసే పులిహోర, దద్దోజనం, లడ్డు ప్రసాదాలు తినడానికి జనం క్యూలు కడుతుంటారు. ఆ ప్రసాదాల రుచే అలాంటిది మరి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయానికి వెళ్ళడానికి మాత్రం ధైర్యం సరిపోదు.. అలా అని అదేదో భయంకర క్రూర మృగాలు, అడవి జంతువులు, విష కీటకాలు తిరుగాడే నిర్మానుష్య అరణ్య ప్రాంతాలలో లేదు.. సాధారణ జనావాసల మధ్య ఉన్న ఆలయమే. ఇక అక్కడ పెట్టే ప్రసాదం గురించి తెలిస్తే దిగ్భ్రాంతికి లోనవ్వడం ఖాయం. అలాగని అదేదో నవతరం కుర్రాళ్లు కట్టిన వింత గుడి అనుకుంటే పోరాబాటే.. అది మన దేశంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే, శక్తి క్షేత్రాలకు మూలం ఆ ఆలయమే అని కూడా అంటారు. ఈ మాటలు వినగానే, ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది..? అక్కడికి వెళ్తే భయం ఎందుకు కలుగుతుంది..? అసలు ఆ ఆలయంలో పెట్టే ప్రసాదం ఏమిటి..? ఆ ఆలయ చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలగక మానవు. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gHyAMcqvv6I ]


వెలుగు నీడ.. రాత్రి పగలు.. ముందు వెనుక.. అనుకూల ప్రతికూల.. ఇలా ఈ సృష్టిలోని ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని బాహ్య ప్రపంచంలో అందరకీ కనిపించే విధంగా ఉంటే, కొన్ని మాత్రం అత్యంత గుప్తంగా ఉంటాయి. ఈ రహస్య విధానాలు సాధారణ ప్రజలకి అర్ధంకావు.. అర్ధమైనా ఆచరించడం కష్టతరమే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయం వెనుక ఒక అర్ధం, దాని వెనుక మరో పరమార్ధం ఖచ్చితంగా దాగి ఉంటాయి. అయితే, వాటిని కనుగొనడం మేధావుల వల్ల కూడా కాని పని. అందుకే నేటి తరం శాస్త్రవేత్తలు, తాము కనుగొన్న విషయాలు మాత్రమే సరైనవనీ, తక్కినవన్నీ అభూత కల్పనలనీ కొట్టిపారేసి, సగటు మనుషులను వాస్తవాలకు దూరంగా ఉంచుతుంటారు. అయితే వారికి కూడా తెలుసు.. మానవ మేధస్సుకు అందని శక్తి ఏదో ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుందని.. ఇప్పడు మనం చెప్పుకుంటున్న ఆలయం గురించి తెలియాలంటే, ఈ ఉపోద్ఘాతం తప్పనిసరి.. ఈ ఆలయం సాధారణమైనది కాదు. సకల చరాచర జగత్తు పుట్టుకకు కారణమైన ఆ మహాశక్తికి ప్రతిరూపం, సాధారణ అర్చన విధులకు దూరం, ఈ ఆలయం. అదే Thiruvarkadu Bhagavathi ఆలయం.

కేరళలోని Kannur జిల్లాలో ఉన్న Pazhayangadi అనే ఊరిలోని మాడాయి కావు ఆలయం గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. ఈ ఆలయాన్నే Thiruvarkadu Bhagavathi ఆలయం అని కూడా అంటారు. ఇది ఒక శివాలయమే కానీ ప్రధాన మూర్తి మాత్రం ఆ శివుడి వెనుక వున్న భద్రకాళీ అమ్మవారు. ఈ మాట కాస్త వింతగానే అనిపించవచ్చు.. కానీ ఆలయం గురించి తెలిస్తేనే ఆ మాటకు అర్ధం బోధపడుతుంది. మన ఆలయాలలో ఎక్కడికి వెళ్ళినా పులిహోర, దద్దోజనం వంటి సాత్విక ఆహారాలనే దైవానికి నివేదించి, మనకు ప్రసాదంగా పంచుతారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కోడి మాంసంతో చేసిన పదార్ధాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. మన తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు ఏ సమయంలో వెళ్ళినా ప్రసాదం అందుబాటులో ఉంటుంది. మన నేతలు ఆధ్యాత్మికతను కూడా వ్యాపారం చేస్తే, మనం ఆ వ్యాపారానికి పరోక్షంగా వత్తాసు పలుకుతాము. కానీ ఈ దేశంలో ఇంకా కొన్ని ఆలయాలు కుహనా ప్రభుత్వాల వ్యాపార కాంక్ష నుంచి కాస్తంత దూరంగా ఉండి, మనుగడ సాగిస్తున్నాయి. అటువంటి వాటిలో Thiruvarkadu Bhagavathi ఆలయం కూడా ఒకటి. అందుకే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వెళితే ప్రసాదం ఇవ్వరు. ఇక్కడి చికెన్ ప్రసాదం తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. అయితే చికెన్ ప్రసాదం దొరుకుతుంది కదా అని ఎగేసుకుని వెళ్తే, ముచ్చెమటలు పట్టడం ఖాయం.. ఈ ఆలయంలో భక్తితో పాటు, అదనంగా భయం కూడా దొరుకుతుంది. ఇది చాలా వింతగా అనిపిస్తుంది.. మరి ఆ విషయాలు వివరంగా తెలియాలంటే, ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకోవాలి.

సాక్ష్యాత్తు విష్ణువు అవతారమైన పరశురాముడు సృష్టించిన కేరళ రాష్ట్రం గురించి మనం గతంలో చెప్పుకున్నాము. అయితే, ఆ కేరళ రాష్ట్ర ఆవిర్భావం ఒక్కసారిగా జరగలేదు, అంచలంచగా జరిగిందని చెప్పడానికి, ఈ ఆలయ చరిత్రే ఆధారం. పూర్వం Pazhayangadi ప్రాంతంలో, దరికుడు, దానవేంద్రుడనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిలో అత్యంత క్రూరుడు పెద్దవాడైన దరికుడు. వారు బ్రహ్మ దేవడికై తపస్సు చేసి, మానవుల నుంచి దేవతల వరకు ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేని వరాన్ని పొందారు. యుద్ధం చేసేది ముఖ్యంగా పురుషులే కావడమూ, స్త్రీలకు యుద్ధ విద్యలు తెలిసినా, తమను చంపే బలం ఉండదనే ధైర్యంతో ఆ వారాన్ని పొందారు. ఇక వరప్రభావంతో దరికుడు, దానవేంద్రుడు అందరినీ నానారకాల ఇబ్బందులకు గురిజేస్తూ, నరకయాతనలు పెట్టేవారు. అడ్డు వచ్చిన ప్రతి మగవాడినీ తెగనరికే వారు. దేవతలు ఎన్నో సార్లు వారితో యుద్ధం చేసినా ఓటమి పాలయ్యేవారు. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించమని వారు శివయ్యను కోరగా, పార్వతీ మాత ఉగ్ర స్వరూపమైన కాళీ మాతను పంపించాడు. అలా దరికుడు, దానవేంద్రుడి పై పోరాటానికి వెళ్ళిన కాళీ మాతకు, దేవతలు తమ విశిష్ట ఆయుధాలు ఇచ్చి పంపించారు. ఆ తల్లి తన శక్తిని వినియోగించి వారిద్దనీ సంహరించింది. ఆ తర్వాత అక్కడి తపస్వులు ఆమెను అక్కడే వెలయమని కోరారు. దానికి ఆమె, తాను వెలయడానికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలనీ, తనతోపాటు శివయ్యను కూడా తోడుగా ఉండమనీ కోరింది. కాళీ మాత కోరికను మన్నించిన శివయ్య, పరశురాముడికి విషయం చెప్పి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయమని కోరాడు. పరశురాముడు తన ఖడ్గాన్ని సముద్రంలోకి విసిరి, ఇంకొంత స్థలం ఉద్భవించేలా చేశాడు. అదే నేడు ఉన్న Pazhayangadi కోస్టల్ ప్రాంతం. అలా నాడు శివయ్య కాళీమాతతో పాటు, రాజరాజేశ్వరీ అమ్మవార్లతో కలిసి వెలిశారు. అలా పురాణాల ప్రకారం Thiruvarkadu Bhagavathi ఆలయంలోని భద్రకాళీ మాతే కేరళలో వెలసిన తొలి విగ్రహం అనీ, ఆ తర్వాతే తక్కిన కాళీ మాత ఆలయాలు వెలిశాయనీ చరిత్ర విదితం. అందుకే ఆ ఆలయాన్ని శక్తి క్షేత్రాల మూల స్థానంగా చెబుతారు.

అయితే, ఈ ఆలయంలో స్వామి వెలసినప్పుడు, ఉగ్ర స్వరూపమైన కాళీమాతతో పాటు, శాంతమూర్తి అయిన రాజరాజేశ్వరీ మాత కూడా వెలసినట్లు ముందు చెప్పుకున్నాము. ఒకనాడు ఆ ప్రాంతాన్ని పాలించే Chirakkal వంశ రాజు కలలో దర్శనమిచ్చిన కాళీ మాత.. తనకు శాకాహార భోజనం కంటే మాంసాహార భోజనమే ఇష్టమని చెప్పి, ప్రత్యేకంగా మరో ఆలయం నిర్మించమని కోరిందట. దాంతో ఆ మర్నాడే రాజు వెళ్ళి పూజారులకు ఆ విషయం చెప్పగా, అప్పటికప్పుడు అమ్మవారి కొరికమేరకు ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. అలా అక్కడ రాజరాజేశ్వరీ మాతకు ఒక ఆలయం ఉంటే, తనతో పాటు ఉండమని అడిగినందుకు, శివుడికీ కాళీమాతకూ మరో ఆలయం ఉంటుంది. 11వ శతాబ్దంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు శాశనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం, ఆ ఆలయం కేరళ ప్రభుత్వ Malabar Devaswom Board ఆధీనంలో ఉన్నా.. Chirakkal రాజవంశీయుల ఆధిపత్యం ఇంకా ఆలయంపై ఉన్నట్లూ, వారి పూర్వకులు రాసిన విధివిధానాలనే నేటికీ కొనసాగుతున్నట్లూ తెలుస్తోంది.

అలా ఆ నాడు అక్కడి నంబూద్రిలు తమ తపోశక్తితో నెలకొల్పి, ఆ తల్లికి మాంసాహారాన్ని, ముఖ్యంగా కోడి మాంసాన్ని వండి నైవేద్యంగా సమర్పించడం, ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టడం మొదలు పెట్టినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మన ఆలయాలలో పూజలు నిర్వహించే పూజారులనే, కేరళలో నంబూద్రిలని అంటారు. అయితే, వీరి పూజా విధానాలకూ, మన ఆలయాలలోని పూజారుల విధానాలకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ శక్తి క్షేత్రాలలో పూజలు చేసే నంబూద్రిలకు తంత్ర విద్యలపై కూడా పట్టు ఉంటుంది. అయితే తంత్ర విధ్యను అభ్యసించే విధానాలలో చాలా స్థాయిలు ఉంటాయని నిపుణుల ద్వారా తెలుస్తోంది. అలా తంత్ర విద్యను అభ్యసించిన వారిని తాంత్రిక నంబూద్రిలని పిలుస్తారు. Thiruvarkadu Bhagavathi ఆలయంలో కనిపించే పూజారులందలందరూ తాంత్రిక నంబూద్రిలే..

కేరళ టెంపుల్ స్టైల్ చాలా బాగుంటుంది.. అందులోనూ వండిన కోడి మాంసాన్ని ప్రసాదంగా పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి నాలుగు ఫోటోలు తీయించుకుని, ఇచ్చిన ప్రసాదాన్ని ఓ పట్టు పడదాం అనుకుంటున్నారా..? అయితే.. మీకు Thiruvarkadu Bhagavathi ఆలయం గురించి మరో నిజం, దాని వెనకున్న చరిత్ర తెలియాలి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు, లోపలకి ప్రవేశించగానే రాజరాజేశ్వరీ మాత, ఇతర దేవతలూ దర్శనమిస్తారు. ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్ళగానే, ముందుగా శివయ్య కనిపిస్తాడు. ఆయన వెనక ఉన్న గర్భాలయంలో భద్రకాళి అమ్మవారు ఉగ్రాకారంలో కరుణామూర్తిగా దర్శనమిస్తారు. సాధారణంగా స్వామి వారు, అమ్మవారు, ఒకే గర్భాలయంలో పక్క పక్కన ఉంటారు, లేదా వేరు వేరు ఆలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం, ముందు స్వామి వారు, ఆ వెనుక అమ్మ వారు ఉండటం కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. దానికి కారణం, ఇక్కడి కాళీ మాత బ్రాహ్మణ స్త్రీ తత్వంతో ఉంటుంది. అంటే, పూర్వం బ్రాహ్మణ స్త్రీలు ఇంట్లో మాత్రమే ఉండేవారు. బయటకు వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా, పరదాల మధ్య ఆమె భర్త, లేదా తండ్రి, లేదా సోదరుల ఆధ్వర్యంలో, చుట్టూ అంగరక్షకుల మధ్య వచ్చేవారు. అదే విధంగా ఇక్కడి కాళీ మాతను బ్రాహ్మణ స్త్రీ మూర్తిగా చూస్తారు. అందువల్ల ఇక్కడ వెలసిన తల్లిని బ్రాహ్మణ స్త్రీలకు మాతృమూర్తిగా, శివయ్యను తండ్రిగా పూజారులు చెబుతారు.

ఇక చరిత్ర విషయానికొస్తే, కేరళ రాష్ట్రంలో 11వ శతాబ్దం నుంచే ముస్లింల దండయాత్రలు మొదలయ్యాయి. అంతేకాకుండా, కేరళ ప్రాంతానికి వ్యాపార నిమిత్తం రోమ్ నుంచి వ్యాపారులూ, వారికి తోడుగా వారి అంగరక్షకులూ వచ్చేవారు. ఇక కేరళలో ముస్లింల చొరబాటు, బందిపోట్లుగా వారు చేసే అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. మన దేశంలో స్త్రీ అంటే కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, ఆమెను లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుట్టినా, కొత్త కోడలు వచ్చినా, లక్ష్మీ దేవి వచ్చిందని సంబరాలు చేసుకుంటారు. స్త్రీ మూర్తిని ఆ ఇంటి పురుషుడి గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఆ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లినా, పరిణామాలు తీవ్రంగా ఉండేవి. అందువల్ల వారిని రక్షించుకోవడం పురుషులకు ప్రధమ కర్తవ్యంగా ఉండేది. అందువల్లే ఈ కట్టుబాట్లు మన దేశంలో పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో స్త్రీలు ముఖం కనిపించకుండా పరదాలు కప్పుకోడానికి ముస్లింల అఘాయిత్యాలే కారణం అని తెలుస్తోంది. క్రూరమైన ముస్లిం రాజుల కళ్ళ పడకుండా స్త్రీల ముఖాలు కప్పి ఉంచడానికి పరదాలు మొదలు పెట్టి, కాలగమనంలో అదో ఆచారంగా మారిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. అదే విధంగా కేరళలో బ్రాహ్మణ స్త్రీల చుట్టూ కట్టుబాట్లు పెరిగినట్లు కొంతమంది చరిత్రకారులు బలమైన ఆధాలను చూపుతున్నారు.

ముస్లిం చొరబాటు దారులు ఎంత దారుణంగా ప్రవర్తించేవారో చెప్పడానికి మన గత వీడియోలను చూడండి. అలాగే Thiruvarkadu Bhagavathi ఆలయంలో జరిగిన ఒక దారుణం గురించి కూడా తెలియాలి. మన దేశాన్ని ఆక్రమించి దోచుకోడానికి వచ్చిన ఇస్లాం రాజులలో, Hyder Ali ఒకడు. అతని సేనలు కేరళ రాష్ట్రంపై దండెత్తినప్పుడు, Pazhayangadi ప్రాంతాన్ని పాలించే రాజు ఓడిపోయాడు. Pazhayangadi రాజు చాలా చిన్న సామంత రాజు కావడం చేత, పిశాచాల సమూహంలాంటి వారిని ఎదిరించి నిలువలేకపోయాడు. ఆ సమయంలో Pazhayangadi లోని ఆలయాలను కూడా దోచుకుని, Thiruvarkadu Bhagavathi ఆలయంలోని బంగారంతో పాటు, ఆలయంలోని గోవులను కూడా తీసుకెళ్లిపోయారు. ఒక గోవును వధించి దాని రక్త మాంసాలను ఆలయం గోడలపై వెదజల్లి, ప్రేగులను గర్భాలయంలోని విగ్రహాలపై వేశారు ఆ ధూర్తులు. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిజేసింది. దాంతో Vengayil Chathukutty Nair అనే కలరీ వీరుడు తురకల స్థావరానికి వెళ్ళి, తర్వాత వారు చేయబోయే దాడికి సన్నద్ధమవుతున్న ఆ కిరాతకుడినీ, వాడి 50 మంది సైన్యాన్నీ ఒక్కడే ఎదిరించి పోరాడి వధించాడు. ఆ నాడు అతడిని ఆ భద్రకాళి శక్తి ఆవహించిందనీ, Vengayil Chathukutty చేసిన రుద్రతాండవం గురించి నేటికీ స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటూ, జానపద గేయాలుగా పాడుకుంటుంటారు. అలా నాడు Vengayil Chathukutty, ఆ కసాయి వాడి తలను నరికి, ఆలయ పూజరుల ఎదుట పడేశాడు. ఆ తరువాత Vengayil Chathukutty, కేరళ, తమిళ నాడు ప్రాంతాలలోని ఎన్నో ఆలయాలను ముస్లింల దాడుల నుంచి రక్షించాడని చరిత్ర చెబుతోంది. ధర్మాన్ని కాపాడటం కోసం ఎడతెరిపి లేని పోరాటాన్ని కొనసాగించిన Vengayil Chathukutty ని, Nayanar అనే బిరుదుతో గౌరవించారు. Nayanar అంటే హైందవ ధర్మాన్ని రక్షించే ఋషులని అర్ధం. చరిత్ర ప్రకారం, హైందవ ధర్మాన్ని రక్షించి, ముందు తరాలకు కూడా కొనసాగించే పని ఈ Nayanar లు చేసేవారనీ, వారు మొత్తం 69 మంద ఉన్నారనీ చరిత్ర ద్వారా తెలుస్తోంది.

నాడు Vengayil Chathukutty కి అంతటి బలాన్ని ఇచ్చిన తల్లి, సాధారణమైన ఆలయాలలో కనిపించే విగ్రహమూర్తి కాదు. అత్యంత తీవ్రమైన శక్తితో కూడుకున్న కాళీ స్వరూపం. ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, రురుజిత రూపంలో జరిగినట్లు, ఆలయ చరిత్ర చెబుతుంది. రురుజిత అంటే, భద్రకాళి యొక్క రౌద్ర రూపం. అందుకే ఇక్కడి పద్దతులన్నీ, రురుజిత విధానంలోనే ఉంటాయి. శ్రీ విద్యాతంత్రంలో భాగమైన ఒక తంత్ర సాధన ఇది. అందుకే ఈ Thiruvarkadu Bhagavathi ఆలయం, తంత్రసాధకులకు అతి ముఖ్యమైన ప్రదేశం.

ఈ కారణాల వల్లనే మాడాయి కావు ఆలయానికి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. తంత్రసాధన చేసే ఆలయం అయితే మాత్రం, అమ్మను దర్శించుకోడానికి ఇబ్బందేమిటని కొందరు అడగవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఏవీ ఇబ్బందులు కావు.. కానీ అక్కడికి వచ్చేవారితోనే అసలు చిక్కంతా. ఎందుకంటే, అక్కడికి వచ్చే భక్తులలో సాధారణ భక్తులతో పాటు, ప్రేతాలు ఆవహించిన వారు కూడా ఉంటారు. Thiruvarkadu Bhagavathi ఆలయంలోని కాళీ మాత తంత్ర స్వరూపిణి కావడం చేత, ఆమె ఎదుట దుష్ట శక్తులు నిలబడలేవు. దెయ్యం పట్టినవారిని మాడాయి కావు కి తీసుకువచ్చి, అక్కడి పూజారులతో ప్రత్యేకమైన తంత్ర పూజలు జరిపిస్తే, ఆ ప్రేతాలనుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకే అక్కడికి ప్రతిరోజూ అలా దెయ్యం పట్టినవారు చాలా మంది, దేశ విదేశాల నుంచి వస్తారు. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఆ ఆలయంలో దాదాపు అందరూ దెయ్యం పట్టినవారే ఉంటారని కూడా తెలుస్తోంది. అందుకే ఈ ఆలయానికి వెళ్లాలంటే ధైర్యం చాలా అవసరం. కేరళ వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుని, ప్రసాదం తిని వచ్చిన వారికి అన్ని విధాలుగా శుభం చేకూరిందని భక్తులు చెబుతున్నారు.

ॐ 🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏

Monday, September 22, 2025

The Demon's Lingam That Split into 5 Temples | The Sacred Pancharamas & Pancharangas పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు!

 

పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు!
శివకేశవులకు ఇష్టమైన కార్తీకమాసంలో ఈ వీడియో చూసినా పుణ్యమే!

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ।।
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః ।
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ।।

విష్ణురూపుడైన శివుడికీ, శివరూపుడైన విష్ణువుకూ నమస్కారం. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. విష్ణువు శివమయుడైనట్లుగానే, శివుడు కూడా విష్ణుమయుడే. వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు మనకు శుభం, ఆయుష్షు కలుగుతాయన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అందువల్ల శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అంటే, శ్రీ మహా విష్ణువుకు కూడా అంతే ప్రీతి అని శాస్త్ర విదితం. శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్లే, శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్లే. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలోని వారితో పాటు, కార్తీక మాసంలో మన తెలుగు వారు కూడా శివ క్షేత్రాలైన పంచారామ క్షేత్రాలను ఏ విధంగానైతే చూడాలని అనుకుంటారో, అదే విధంగా పంచ రంగనాథ క్షేత్రాలను కూడా దర్శించాలని పరితపిస్తుంటారు. ఈ మాట వినగానే, పంచారామ క్షేత్రాలేమిటి? పంచ రంగనాథ క్షేత్రాలేమిటి? అవి ఎక్కడున్నాయి? వాటిని ఏ వరుసలో చూడాలి? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/3G8ltOzrWDE ]


మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని, ఒక నాడు పార్వతీదేవి పరమ శివుణ్ణి అడిగినప్పుడు ఆ ముక్కంటి...

శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ।।

అని చెబుతూ.. రామ నామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్ర నామాలు చదివిన ఫలితం దక్కుతుందని సెలవిచ్చాడు. శివకేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటడానికే పరమేష్ఠి అలా చెప్పాడనేది ఇక్కడ మనం గమనించాలి. ఇదొక్కటే కాదు.. మన పురాణేతిహాసాలు ఎన్నో సందర్భాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. శివకేశవులకు భేదం లేదని స్కంద పురాణం లోనూ స్పష్టంగా ఉంది. శివుడు లయకారుడైతే, విష్ణువు స్థితి కారకుడు..

చంద్రుడికి ప్రాణ భిక్ష పెట్టినవాడూ, రావణుడికి సువర్ణ లంకనోసగినవాడూ, దక్ష యజ్ఞ ధ్వంసకుడూ, హాలాహలాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడైన ఆది దేవుడూ ఆ పరమేశ్వరుడు. అచంచలమైన భక్తితో ఒక్క మారేడు దళాన్ని సమర్పించి, పంచాక్షరిని తలచినంతనే ప్రసన్నమై, కోరిన వరాలిచ్చేవాడు ఆ భోళాశంకరుడు. అందుకే ఆ స్వామి ఆలయం లేని ఊరు లేదు, మనసారా తలవని హైందవుడు లేడు. అటువంటి స్వామికి ఎంతో ఇష్టమైన మాసం, కార్తీక మాసం. అందుకే అనాదిగా, కార్తీక మాసంలో శివయ్యకు విశేషమైన పూజాది కార్యక్రమాలు చేస్తారు. అంతేకాక, ఈ మాసంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలగటంతో పాటు, కోరిన కోర్కెలు తీరుతాయని పండితులు చెబుతారు. ఇలా కార్తీక మాసంలోగానీ, సోమవారాలలో గానీ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాలలో, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పంచారామాలు ప్రముఖమైనవి. శివకేశవులకు భేదం లేదనే పరమార్థాన్ని చెప్పేవి ఈ పంచారామాలు. మోక్షాలయాలుగా పేరుగాంచిన పంచారామ క్షేత్రాలను, ఒక నియమానుసారంగా దర్శిస్తే మరు జన్మ లేకుండా మోక్షం లభించి, శివ సాయుజ్యాన్ని పొందుతారని శాస్త్ర విదితం.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః ।
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహాబలః ।।

అని స్కంద పురాణంలో చప్పబడింది. అంటే, తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం ఐదు ఖండాలుగా విడివడింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలనూ ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. స్కంద పురాణం, భీమేశ్వర పురాణంలో పంచారామ క్షేత్రాల ఆవిర్భావం వెనుకవున్న గాధ సవివరంగా చెప్పబడింది. పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మకై తపస్సుజేసి, తనకు కేవలం శివ పుత్రుడైన బాలుడి చేతిలోనే మరణం ప్రాప్తించాలనే వరాన్ని పొందాడు. ఆ తర్వాత మరింత బలం కోసం 'శివుడి'కై ఘోర తపస్సు చేసి, శివుడి ఆత్మలింగాన్ని పొందాడు. ఆ వర బలంతో తారకాసురుడు దేవతలను అనేక విధాలా హింసించడం మొదలు పెట్టాడు.

దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడి చేతిలో మాత్రమే తారకుడి మరణం సంభవిస్తుందని తెలిసింది. దానితో వారు శివుడిని వేడుకోగా ఆయన మన్నించడంతో, శివ పార్వతులకు "కుమారస్వామి" జన్మించాడు. చిన్న తనంలోనే సకల యుద్ధ కళలలో ప్రావీణ్యుడై, కేవలం ఏడేళ్ళ వయసులో యుద్ధానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యుడు. అలా షణ్ముఖుడు తారకుడితో యుద్ధం చేసి కూడా సంహరించలేకపోయాడు. కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు. ‘తారకుడి కంఠంలో నా ప్రాణ లింగం ఉన్నంత వరకూ అతడు చావడు’ అన్న రహస్యాన్ని చెప్పాడు శివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్లీ తలపడి, అతడి గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలు కొట్టాడు. శివలింగం అయిదు ముక్కలైంది. ఆ శకలాలు గోదావరి, కృష్ణా తీరాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. అవే ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం.

వాటిలో మొదటిది ద్రాక్షారామం. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురానికి అతి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడి"గా కొలుస్తారు. స్వామి లింగాకారం, ఏకంగా 9 అడుగుల ఎత్తుంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి లింగాకారం సగ భాగం తెలుపు రంగులోనూ, తక్కిన సగం నలుపు రంగులోనూ ఉంటుంది. పురాణాల ప్రకారం, పూర్వం ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించడం వలన, ఈ ప్రాంతానికి దక్షారామం అనే పేరు స్థిరపడింది. కాలగమనంలో అది కాస్తా ద్రాక్షారామంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం, చాళుక్యరాజయిన భీముడు పునర్ నిర్మించాడని తెలుస్తోంది. అంతేకాదు, అనేక పురాణాలలో ఈ ఆలయం గురించి ప్రస్థావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలూ, రాజులూ స్వామి వారిని దర్శించుకుని తరించారని, 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడింది.

పంచారామాలలో రెండవది, 'అమరారామం'. ఇది గుంటూరు జిల్లాలోని అమరావతిలో, కృష్ణానదీ తీరంలో వెలసింది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు.  గర్భగుడిలో స్వామి విగ్రహం, 9 అడుగుల ఎత్తున,  తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడి ఉంటుంది. ఇక్కడున్న లింగాన్ని అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' ప్రతిష్టించడం వలన, ఆలయం ఉన్న ప్రాంతానికి అమరావతి అనే పేరు స్థిరపడిందని మన పురాణాలలో ప్రస్థావించబడి ఉంది.

ఇక పంచారామాలలో మూడవది, క్షీరారామం. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో నెలకొని ఉంది. ఇక్కడ శివుణ్ణి, "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి"గా కొలుస్తారు. ఇక్కడి స్వామివారిని త్రేతాయుగంలో,  'సీతా రాములు' ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా, ఒక గాధ ఉంది. ఒకానొక సమయంలో శివుడు భూమిలోకి బాణాన్ని వెయ్యగా అందులోనుంచి పాలధార పైకి వచ్చిందట. క్షీరం అంటే పాలు. అందుకే ఆ ప్రాంతానికి క్షీరపురి అనే పేరు నిలిచింది. కాలక్రమంలో 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. ప్రస్తుతం మనకు కనిపించే ఆలయాన్ని, 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయ గాలి గోపురం, 125 అడుగుల ఎత్తు ఉండి, '9' గోపురాలతో కట్టబడి, ఆ కాలంలో పాలకొల్లు పరిసర ప్రాంతాలలో అత్యంత ఎత్తైన కట్టడంగా కీర్తి గడించింది.

పంచారామాలలో నాలుగవది, "సోమారామం". ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్ల దూరంలోగల, గునుపూడి గ్రామంలో ఉంది. అయితే, గునుపూడి ఒకప్పుడు గ్రామంగా ఉండేది కానీ, కొన్నేళ్ళ క్రితమే ఆ గ్రామాన్ని భీమవరం పట్టణంలో కలిపేసినట్లు, అధికారులు చెబుతున్నారు. అక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" గా కొలుస్తారు. పూర్వం అక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు కాబట్టి, ఆ లింగాన్ని సోమేశ్వరుడిగా కొలవడం, ఆ క్షేత్రానికి 'సోమారామం' అనే పేరు స్థిరపడడం జరిగింది. సోమారామంలోని 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజులలో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి, గోధుమ రంగులోకి మారుతుంది. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి తిరిగి తెల్లగా మారుతుంది. ఈ వింత ఎలా జరుగుతోందనే విషయం నేటికీ మానవ మేధస్సుకి అందడంలేదు.

ఇక పంచారామాలలో ఆఖరిది, 'కుమార భీమారామం'. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు 1 కిలోమిటరు దూరంలో ఉంది. ఇక్కడ స్వామిని "కాల భైరవుడు" గా కూడా కొలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని కూడా, ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముడే నిర్మించాడని, శాసలనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినట్లుగా ఉంటుంది. శైవక్షేత్రాలైన ఈ పంచారామాలలో దాదాపు అన్నింటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం మరో విశేషం.

ఈ అయిదు ఆలయాలనూ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ, సోమవారం నాడు కానీ, తొలి సంధ్యలో మొదలుబెట్టి, సాయం సంధ్యలోపు దర్శించుకోగలిగిన వారికి, పునర్జన్మలు లేకుండా మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఇక కార్తీక మాసంలో దర్శించుకోవలసిన పంచరంగ క్షేత్రాల వివరణకి వస్తే, జలం ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్లు, భక్తులు ఏ రూపాన్ని కొలిస్తే ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడు భగవంతుడు. అలా పాలకడలిపై ఆదిశేషుని మీద శయనించే శ్రీ మహా విష్ణువును యుగయుగాలుగా రంగనాథస్వామిగా కొలుస్తున్నాము. మరీ ముఖ్యంగా ఉత్తరాది కంటే దక్షిణాదిన రంగనాథ స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో ఐదు అతి పురాతన క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. వాటినే పంచరంగ క్షేత్రాలుగా పిలుస్తారని ఆద్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ ఐదు క్షేత్రాలలో ఒకటి కర్ణాటకలో ఉంటే, మిగిలిన నాలుగూ తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, రంగనాథ స్వామికి అంకితం చేయబడిన ఈ అయిదు విష్ణు క్షేత్రాలూ కావేరీ నదీ తీరంలోనే ఉన్నాయి.

పంచ రంగనాథ క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీ రంగపట్నం. రంగనాధుడు స్వయంభువుగా వెలసిన ఆలయం కావడం చేత, ఆ స్వామి పేరుమీదే, ఈ నగరానికి శ్రీరంగపట్నం అనే పేరొచ్చింది. ఇక్కడ స్వామి వారు కావేరీ సహితంగా కొలువై ఉంటారు. సుమారు 1000 ఏళ్ల క్రితం పశ్చిమ గాంగేయుల కాలంలో పునర్ నిర్మించబడిన ఈ ఆలయం, కొన్ని వేల ఏళ్లనాటి చరిత్రను సొంతం చేసుకున్నది. ఇక్కడున్న రంగనాథుడిని ఆది రంగడని పిలుస్తారు. ఇక్కడ మాత్రమే శ్రీరంగనాథుడి పాదల చెంత కావేరీ మాత ఉండటం మనం గమనించవచ్చు. శ్రీకృష్ణ దేవరాయల వారితో సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం పరితపించినవారే.

ఈ వరుసలో రెండవ ఆలయం తిరుప్పునగర్‌. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామివారిని ‘శ్రీ అప్ప కుడుత్తాన్‌ పెరుమాళ్‌’ అనే పేరుతో పిలుస్తారు. స్థల చరిత్ర ప్రకారం, ఉభమన్యు అనే రాజుకు విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడు. తనకు ఆకలిగా ఉందని అడగ్గా, ఆకలే కదా అని రాజు గర్వంతో ఎన్నో వంటకాలు చేయించి పెట్టినా అతనికి ఆకలి తీరలేదు. చివరికి పరాశర మహర్షి సూచన మేరకు భక్తితో అప్పాలను అందించగా తృప్తి చెందినట్లూ, అందుకే స్వామిని ‘అప్ప కుడుత్తాన్ స్వామి’ అని పిలవడం మొదలు పెట్టినట్లూ పండితులు చెబుతారు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని పేర్కొంటారు.

పంచ రంగనాథ క్షేత్రాలలో మూడవది కుంభకోణం సారంగపాణి ఆలయం. కుంభకోణంలోని ఈ రంగనాథస్వామి దేవాలయంలో స్వామివారు పడుకున్న స్థితి నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు. దీనిని ఉత్థాన శయన భంగిమ అని అంటారు. ఇటువంటి రూపంలో ఉన్న విగ్రహం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, ఒకప్పుడు హేమ రుషి అనే మహర్షి, సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అందువల్ల ఆ లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో పిలుస్తారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే శ్రీ మహా విష్ణువు కూడా అక్కడే ఉంటారు కాబట్టి, ఆయన కూడా ఇక్కడే అవతరించి ఉండిపోయినట్లు తెలుస్తోంది. అందుకే స్వామివారిని ఇక్కడ ఇల్లరికపు అల్లుడిగా చెప్పుకుంటారు. అలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణిగా కొలుస్తారు.

ఈ వరుసలో నాలుగవది, మైలాదుత్తురై ఆలయం. ఇది తమిళనాడు లోని మైలాదుత్తురై పట్టణంలో ఉంది. చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ శ్రీ మహా విష్ణువు అవతరించినట్లు స్థల పురాణం చెబుతుంది. పరాకల్‌ అనే ఆళ్వారు భక్తికి మెచ్చి, స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పరాకల్ అనే ఆళ్వారు మొదట ఒక గజ దొంగ. అతనిని భక్తి మార్గంలో నడిపించడానికి శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఓ బ్రాహ్మణుడి వేషంలో ఆయనకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారని కథనం. అటుపై ఆ ఆళ్వారు కోరికమేరకు ఈ క్షేత్రంలో కలియుగాంతం వరకూ రంగనాథుడి రూపంలో కొలువై ఉంటానని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పారని చెబుతారు. ఇక్కడ స్వామి వారు వెలసి కొన్ని యుగాలు అవుతున్నా, ఇప్పుడు చూస్తున్న ఆలయ అభివృద్ధి మాత్రం దాదాపు వెయ్యేళ్ల క్రితం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి స్వామిని ‘పరిమళ పెరుమాళ్‌’ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం కూడా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒక్కటి. పూర్వం ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాద స్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని పండితులు చెబుతారు.

ఇక ఈ క్షేత్రాలలో ఆఖరిది శ్రీ రంగం.  పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని చివరి క్షేత్రంగా చెబుతారు కానీ, అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు ఆకృతిలో కనిపించే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైవుంది. ఇక్కడి మూలవిరాట్టును రావణ సోదరుడు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెబుతారు. భారత ఐతిహాసిక చరిత్రలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు. పరమ విష్ణు భక్తురాలైన గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే అని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత దాని నిర్మాణం. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికి ఏకంగా 300 ఏళ్లకు పైగా పట్టివుండవచ్చని చరిత్రకారులు చెబుతారు. భారత దేశంలోనే అతి విశాలమైన దేవాలయాల్లో ఇది మొదటిది. 108 దివ్య ఆలయాలలో ఇదీ ఒకటి. 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. రాజగోపురం 236 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడి మూలవిరాట్టుకు వస్త్రాలు సమర్పిస్తే, వివాహం కానివారికి వెంటనే వివాహమవుతుందని భక్తుల నమ్మకం.

ॐ 🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏

Monday, September 15, 2025

The Bengal Files: Uncovering The Darkest Chapter of India's Past | ఎవరు కారకులు?

 

బెంగాల్ ఫైల్స్.. ఆ నరమేధం గురించి తెలిస్తే చలిజ్వరం రావడం ఖాయం..!

‘Vivek Agnihotri’, ఇప్పుడు ఈ పేరు మరోమారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం ఈయన తీసిన కొత్త సినిమా.. Controversial డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న Vivek Agnihotri గతంలో తీసిన సినిమాలలో మూడు సినిమాలు కుహనా రాజకీయ నాయకులను కలచివేయగా, రెండు సినిమాలు మాత్రం యావత్ భారత దేశ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ఆకర్షించడమే కాదు, సామాన్యుల నుంచి రాజకీయనాయకుల వరకూ పెద్ద చర్చలే పెట్టుకున్నారు. అవే కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్. ఇవికాకుండా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయ్యింది. ఇది మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం ట్రైలర్ దెబ్బకే, ఆ సినిమాని తమ రాష్ట్రంలో ఆడనివ్వం అని ప్రకటన కూడా చేసింది. అదే Bengal Files. Vivek Agnihotri బెంగాల్ ఫిల్స్ పేరుతో సినిమా ఎందుకు తీశారు? అసలు బెంగాల్ లో ఆ నాడు ఏం జరిగింది..? మమతా బెనర్జీ ఈ సినిమాని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది? ఈ సినిమా విషయంలో ఆమె ఎందుకు భయపడుతోంది.. వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/KVSDAneFAS4 ]


Background లో తగలబడుతున్న అమ్మవారి బొమ్మను చూపిస్తుండగా.. If Kashmir Files Hurt You.. Bengal Files Will Haunt You.. అనే పదాలు ట్రైలర్ చివర గమనించవచ్చు. నిశితంగా చూస్తే అక్కడ తగలబడేది బొమ్మకాదనీ, చిత్ర హింసలు పెట్టి మాన ప్రాణాలు హరించబడిన ఒక స్త్రీని అలా కాళీ మాత బొమ్మగా తగలబెట్టినట్లు సినిమాలో వివేక్ చూపించబోతున్నారని కొంతమంది సినీ క్రిటిక్స్ అభిప్రాయం. ఈ మాటలు వినగానే, Bengal Files Will Haunt You అనే పదాలు ఎందుకు ట్రైలర్ ఆఖరున చెప్పాడో అర్ధం అయ్యే ఉంటుంది. కాశ్మీరీ పండిట్ లపై జరిగిన దారుణాల గురించీ, 90లలో వాళ్ళపై జరిపిన మారణ హోమం గురించీ వినే ఉంటారు. కేరళ లో ఇతర మతాలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ప్రేమపెళ్లి పేరుతో హిందూ మహిళలను క్రిస్టియానిటీలోకీ, ఇస్లాంలోకీ మారుస్తున్నారు. ఇతరమతాల వారు ధనబలం, మంది బలంతో.. హిందువులపై ఏదో ఒక విధంగా ప్రెజర్ తెచ్చి, వారిని ఆయా మతాలలోకి మారుస్తున్నారు. అందువల్ల పరశురామ నిర్మిత కేరళలో నేడు హిందువులే మైనారిటీలై పోయారనే విషయం తెలిసే ఉంటుంది.


ఇక బెంగాల్ లో జరిగిన ఓ దారుణం గురించి చాలా మందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే, నేటి తరం బెంగాల్ యువతలో కూడా చాలా మందికి ఆ దారుణం గురించి తెలిసి ఉండదు. అసలు బెంగాల్ లో జరిగిన మారణ హోమం ఏంటి..? Bengal Files Will Haunt You అని డైరెక్టర్ ఎందుకు అన్నాడో తెలియాలంటే, 70 ఏళ్ల క్రితం అక్కడ జరిగిన కొన్ని అమానవీయ సంఘటనల గురించి తెలుసుకోవాలి. 1947 అని అనగానే, అది భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం అని వెంటనే అంటారు. కానీ మన దేశంలో ఆ నాడు జరిగిన దారుణ మారణ హోమం, రాక్షస శక్తులు చేసిన వికృత విలయతాండవంతో ఉప్పొంగిన రుధిర సంద్రం గురించి, చాలా మందికి తెలియదు.

సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాద్, ఝాన్సీ లక్ష్మీ భాయి.. ఇలా ఎంతో మంది వీరులు మన దేశాన్ని బ్రిటిష్ భానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి, తమ తమ పద్దతులలో ఎన్నో పోరాటాలు చేశారు. ఆ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వాళ్ళ త్యాగాల ఫలితంగా మాత్రమే, మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ పాలకులు మనకు స్వాతంత్ర్యం ప్రకటిద్దామని అనుకున్న మరుక్షణం నుంచి, అతిపెద్ద కుట్రకు తెరతీశారు. అదే ఇండియా పాకిస్తాన్ విభజన. తాము వదిలిపోబోయే దేశాలు ఏదో ఒక రోజు అభివృద్ధిలో తమను దాటి పోతాయని భావించి, ఆయా దేశాలు ఆర్ధికంగా ఎదగకుండా ఉండటానికి ఏదో ఒక తీవ్రమైన సమస్యను సృష్టించేవారు. అదే విధంగా మన అఖండ భారత దేశంపై బ్రిటిష్ పాలకులు చేసిన కుట్ర, భారత్ ని ముక్కలు చేయడం.

ఆ ప్రయత్నంలోనే ముందుగా నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ వంటి దేశాలను వేరు చేశారు. కానీ మన దేశాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టడానికి అది సరిపోదు. అందువల్ల వారు రచించిన కొత్త వ్యూహం, హిందూ, ముస్లింల మధ్య చీలిక తేవడం. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి బ్రిటిష్ పెద్దలు మహ్మద్ అలీ జిన్నాను ఎంచుకున్నారు. పుట్టకతోనే ధనవంతుడు, విద్యావంతుడైన జిన్నా, మిగిలిన స్వాతంత్ర్యోద్యమకారుల లాగానే కాంగ్రెస్ లో చేరి బలం పుంజుకున్నాడు. అతని మనస్సు విషపూరితం కావడంతో, Muslim League అనే కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అందులో దాదాపు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అంతా సభ్యులుగా చేరారు. మరీ ముఖ్యంగా నేటి పాకిస్థాన్, బెంగాల్ లోని ముస్లిమ్స్ చాలా యాక్టివ్ గా ఉండేవారు.

దేశానికి స్వాంతంత్ర్యం వచ్చే రోజులు దగ్గరపడుతున్నకొద్దీ, ముస్లింల కోసం ప్రత్యేకమైన దేశం కావాలనే నినాదం బలపడుతూ వచ్చింది. ఆ క్రమంలో ఎన్నో మత ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా Muslim League పార్టీ కార్యకర్తలు, మన దేశంలో ఎంతమంది హిందువులను చంపితే అంత త్వరగా పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడుతుందనే విషాన్ని విరజిమ్మారు. పర్యవసానం ఎంత దారుణంగా ఉండిందో మాటల్లో చెప్పలేము.

జిన్నా, అతని మద్దతుదారుల ఒత్తిళ్ళూ, దేశంలో జరుగుతున్న నరమేధం, వెరసి పాకిస్తాన్ ఏర్పాటుకు మార్గం సుగుమం చేస్తున్న రోజులవి. ఇదంతా బ్రిటీష్ రాక్షసులు వెనకుండి ఆడించిన వికృత క్రీడ. అయితే, అప్పట్లో బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. దాన్ని East Pakistan అనీ, ఇప్పుడున్న పాకిస్తాన్ ని West Pakistan అనీ పిలిచేవారు. అయితే East Pakistan విభజన జరిగినప్పుడు, బెంగాల్ ని రెండు ముక్కలు చేయాలని నిర్ణయించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు మరికొన్ని చిన్నా చితకా ప్రాంతాలను కలిపి East Pakistan గా మార్చారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్నే బంగ్లాదేశ్ అంటున్నాం. ఇక బెంగాల్ లో పశ్చిమ భాగం, West Bengal పేరుతో మన దేశంలో ఒక రాష్ట్రంగా మారింది. East Pakistan లో పాడి పంటలతో పాటు వాణిజ్య పంటలైన పత్తి, చెరకు, వెదురు, పొగాకు లాంటి ఎన్నో రకాలైన పంటలు విరివిగా పండేవి. కానీ ఆ పంటలను process చేసి విదేశాలకు అమ్మి, భారీ లాభాలను తెచ్చిపెట్టే కంపెనీలు మాత్రం, కోల్‌కతాలో ఉన్నాయి. ఈ వ్యత్యాసమే చరిత్రలో అత్యంత దారుణమైన, అమానవీయ ఆధునిక రాక్షస చర్యకు దారితీసింది.

సాధారణంగా ఏదైనా కావాలంటే.. అడిగి తెచ్చుకోవడమో, దక్కని పక్షంలో శాంతియుతంగా  పోరాటాలో చేసి సాధించుకుంటాము. ఇతర దేశం వారితోనైతే సైనిక చర్యతో బలాబలాలు నిరూపించుకుని తెచ్చుకుంటాము. కానీ Muslim League అనుచరుల ఆలోచన మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. తమకు కావలసినవి ఎదుటి మతంలోని వారి మాన ప్రాణాలను ఎంత దారుణంగా హరిస్తే, అంతటి విజయం తమకు దక్కుతుందని వారు ఆలోచిస్తారు. కోల్‌కతా లేని East Bengal వేస్ట్ అని భావించాడు నాటి Muslim League నాయకుడు Huseyn Shaheed Suhrawardy. అతను దేశ విభజనకు ముందున్న బెంగాల్ ముఖ్య మంత్రి. బ్రిటిష్ ఇండియా మన దేశాన్ని పాలించిన సమయంలో, కోల్‌కతా Financial Capital గా ఉండేది. దాంతో ఆ నగరం సర్వ హంగులతో బాగా డెవలప్ అయ్యి ఉండేది. ముఖ్యంగా కోల్‌కతా పరిసర ప్రాంతాలలో నాడు లేని ఫ్యాక్టరీ లేదు. బ్రిటిష్ వారికి ఆ కాలంలో కోల్‌కతా భారీ ధనాన్ని ఆర్జించి పెట్టే బంగారు బాతు లాంటిది. ఆ బాతు తమ దగ్గర ఉంటేనే East Pakistan కి ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదని భావించాడు Suhrawardy. అయితే కోల్‌కతా హిందూ Dominated ప్రాంతం కావడం చేత, అది భారత దేశంలో కలిసిపోయింది. ఆ నగరాన్ని ఎలాగైనా లాక్కోవడానికి Suhrawardy హింస రచన చేశాడు.

ముందుగా ప్లాన్ ప్రకారం, పోలీస్ వ్యవస్థలో మార్పులు చేశాడు. నాడు కోల్‌కతా నగరంలో ఉన్న హిందూ పోలీసులను వేరే దూర ప్రాంతాలకు transfer చేయించాడు. ఆ తర్వాత వాళ్ళ స్థానంలో పోలీసులలో పనిచేస్తున్న ముస్లిమ్స్ ని తీసుకొచ్చాడు. అలా పోలీసుల transfers అయ్యాక ఒక తేదీని నిర్ణయించాడు. అదే August 16.. 1946. అంటే, మనకి స్వాతంత్ర్యం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు. ఆ రోజునే Suhrawardy ఎందుకు నిర్ణయించాడంటే, ఆ సమయంలో ముస్లింల రంజాన్ మాసం నడుస్తోంది. August 16, రంజాన్ మాసంలో 18వ రోజు. ఆ రోజున ముస్లిం మత స్థాపకుడైన Prophet Muhammad తన సైన్యంతో అతి పెద్దదైన Quraysh తెగను యుద్ధంలో ఓడించాడు. దానినే Battle of Badr అని పిలుస్తారు. ఆ విజయం ముస్లింల భవిష్యత్తును మార్చేసింది. ఆ విజయమే భవిష్యత్తులో ముస్లిమ్స్ చేతుల్లోకి మధ్య ఆసియా వెళ్ళేలా చేసింది. అందువల్ల ఆ రోజు హిందువులపై నరమేధం మొదలు పెడితే, కోల్‌కతా నగరం తమదౌతుందని Suhrawardy భావించాడు.

ముందు నుంచే ముస్లిం పెద్దల చేత హిందూవులపై విద్వేషం కక్కే ప్రసంగాలు చేయించడం మొదలు పెట్టాడు. ఆ ప్రసంగాలకు ముస్లింలు విపరీతంగా రెచ్చిపోయారు. కోల్‌కతా నగరంలో గొడవలు మొదలయ్యాయి. ముస్లింలు ఉండే ప్రతి వీధిలో, ప్రతి దర్గాలో ఒకటే నినాదం.. హిందువులను చంపి, కోల్‌కతాను సొంతం చేసుకోవాలి. అందుకు తగ్గ instructions కూడా Suhrawardy నాయకత్వంలోని Muslim League పార్టీ కార్యాలయం నుంచి నేరుగా అందేవి. ఉర్దూ న్యూస్ పేపర్స్ లో కూడా హిందువులను చంపి, కోల్‌కతాను సొంతం చేసుకుని, పాకిస్తాన్ గొప్పతనాన్ని చాటమని వార్తలు వచ్చేవి.

ఇక 16th August 1946 రానే వచ్చింది.. ఆ రోజు శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున జనాలు మొదటి నమాజ్ చేయడానికి మసీదులకు వెళ్లారు. ముందుగానే Suhrawardy ఆదేశాల ప్రకారం, మసీదులో కల్మా చదవాల్సిన మౌల్వీలు హిందువులను వేటాడే విధంగా ప్రసంగాలు ఇచ్చారు. అప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ తో పాటు ఆ రోజు మసీదుల్లో ఇచ్చిన తొలి ప్రసంగం ప్రతి ముస్లిం చేతికి ఒక ఆయుధం తీసుకునేలా చేసింది. ఇనుప రాడ్లు, సుత్తులు, కత్తులు, తుపాకులు.. ఇలా ఒక మనిషిని తీవ్రంగా గాయపరిచి చంపడానికి అనువుగా ఏ వస్తువు దొరికితే అది తీసుకుని నినాదాలు చేస్తూ, హిందువులు ఎక్కువుగా ఉండే ప్రాంతాలకు వెళ్ళడం మొదలు పెట్టారు.

హిందువులను చంపడానికి ముందు నుంచే ప్లాన్ చేసుకున్న Muslim League పార్టీ కార్యకర్తలు.. ముందుగానే హిందువుల ఇళ్లనూ, షాపులనూ మార్క్ చేసుకున్నారు. సాధారణ ముస్లిం ప్రజానీకానికి హిందువులను ఎలా హింసించాలి, ఎలా చంపాలి వంటి విషయాలను వివరించే కరపత్రాలను పంచారు. అందువల్ల August 16వ తేదీన మసీదుల నుంచి కత్తులు, కొడవళ్లతో బయలుదేరిన ముస్లిమ్స్ కి ఆ రోజు ఏం చేయాలో స్పష్టంగా తెలుసు. అలా దాడికి వచ్చే ముస్లిమ్స్ కి హిందువులు అందరూ దొరకాలని ఆ రోజున హాలిడే కూడా ప్రకటించాడు Suhrawardy. అందుకతను చెప్పిన కారణం, కోల్‌కతా ని ఈస్ట్ పాకిస్థాన్ లో కలపాలని భారీ ర్యాలీలు చేస్తారు కాబట్టే హాలిడే ప్రకటించానని. 16వ తేదీకి ముందే ఈ ర్యాలీకి వ్యతిరేకంగా మాట్లాడిన హిందువులపై దాడులు, హిందూ షాపులను దోచుకోవడం వంటివి చేశారు. ఇక ఆ రోజున Suhrawardy, ఇతర అధికారులతో కలిసి, లక్షలాది మంది ముస్లింలను ఉద్దేశిస్తూ, ఒక్క హిందువు కూడా కోల్‌కతాలో ఉండకూడదు, మొత్తం అందరినీ చంపేయమని చెప్పాడు.

Suhrawardy ఏర్పాటు చేసిన సభ నుంచి బయలు దేరిన ముస్లిమ్స్ ముందుగా దగ్గరలోని కత్తుల వంటి మారణాయుధాలు అమ్మే షాప్ కి వెళ్లారు. ఆ షాప్ ఓనర్ ని, అందులో పనిచేస్తున్న వ్యక్తులను కొట్టి, నడి రోడ్డుపై కూర్చోపెట్టి తలలు నరికేశారు. ఆ తర్వాత షాప్ ని దోచుకుని, కోల్‌కతాలో హిందువులు ఉండే ప్రతి ప్రాంతాలకు వెళ్లారు. ఇక అప్పటి నుంచి రెండు రోజులపాటు దొరికిన ప్రతి హిందువుని అత్యంత కిరాతకంగా చంపారు. ఇంట్లోని మగాళ్ల ముందే ఆడవారిని సామూహిక అత్యాచారం చేసి, మర్మాంగాలను కోసి చంపారు. తల్లి తండ్రుల ముందు పసిపిల్లల తలలు నరికి ఆ తలలతో ఆడుకున్నారు. ఇప్పటికీ నాడు జరిగిన దారుణాలు తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. రోజుల తరబడీ నిద్ర కూడా పట్టదు. కోల్‌కతా నగరం మొత్తం శవాల గుట్టలు. ఆ శరీరాలను ఖననం చేసేవారు లేరు. గంగానదిలో ఆ రోజు రక్తం ప్రవహించింది.

1946 August 16, 17 వ తేదీలలో Muslim League నాయకత్వంలోని ముస్లింలు కోల్‌కతా నగరంలో దాదాపు 20 వేల మందిని చంపినట్లు అంచనా. ఇది కేవలం అంచనా మాత్రమే. అసలు లెక్కలు తెలియకుండా నాటి బ్రిటిష్ ప్రభుత్వం కప్పిపెట్టేసిందనే ఆరోపణలున్నాయి. అన్ని వేలమంది చనిపోతే, కేవలం 3500 మందికి మాత్రమే దహన సంస్కారాలు జరిగాయి.

కోల్‌కతా లో ముస్లింలు ఎక్కువుగా ఉండే Lichubagan అనే ప్రాంతంలో బిర్లా గ్రూప్ కి చెందిన Kesoram Cotton Mills ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పడు ఆ ప్రాంతాన్ని మినీ పాకిస్తాన్ అని పిలుస్తారు. ఆ ఫ్యాక్టరీలో ఒకప్పుడు స్థానిక ముస్లిమ్స్ తో పాటు, ఒరిస్సా నుంచి వచ్చిన 600 మంది హిందువులు పనిచేసే వారు. ఆ 600 మందిలో ఒక్కరినీ వదలకుండా 16వ తేదీన దారుణంగా చంపేశారు. Syed Abdullah Farooqui ఆ కాటన్ మిల్ వర్కర్స్ కి ప్రెసిడెంట్, స్థానిక కమ్యూనిస్ట్ లీడర్. అతనికి Muslim League తో ఏ సంబంధం లేదు. కానీ ఆ రోజు 600 మంది ఒరిస్సా హిందూ వర్కర్స్ ని అత్యంత దారుణంగా చంపించింది అతడే. అప్పటి వరకు హిందువులతో తిరిగి, హిందువులతో స్నేహం చేసిన దాదాపు ప్రతి ముస్లిం, మారణాయుధం చేతపట్టి, తోటి కార్మికులను చంపాడు.

నాడు Suhrawardy నమ్మకం ఏంటంటే, హిందువులు పిరికివాళ్ళు, వాళ్ళు తిరిగి దాడి చేయరు, కోల్‌కతా వదిలి పారిపోతారని బలంగా నమ్మాడు. అసలు Suhrawardy ప్లాన్ కేవలం కోల్‌కతానే కాదు, పూర్తి బెంగాల్ ని East Pakistan లో కాలపాలని. కానీ నాడు కోల్‌కతాలో తప్ప, బెంగాల్ లోని చాలా ప్రాంతాలలో హిందువుల జనాభా చాలా ఎక్కువగా ఉండేది. హిందువుల ఆధిక్యం ఉన్న చోట నరమేధం సృష్టించడం కష్టం. కోల్‌కతాలో హిందువుల సంఖ్య ఎక్కువుగా ఉన్నా, ముస్లిం ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. Suhrawardy కేవలం కోల్‌కతాని టార్గెట్ చేయడానికి ఇది ఒక కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. Suhrawardy అంచనా ప్రకారం 10 వేల మంది హిందువులను చంపితే, మిగిలిన వారంతా కోల్‌కతా వదిలి వెళ్లిపోవాలి. అతననుకున్న విధంగానే హిందువులు ట్రైన్లు, బస్సులు, ఎడ్ల బండ్లు, ఇలా ఏది దొరికితే అది పట్టుకుని పారిపోవడం మొదలు పెట్టారు. Suhrawardy అనుకున్నది నిజం అవుతున్న సమయం అది.

ఆ సమయంలో హిందువుల పాలిట ఆశా దీపంగా, Gopal Chandra Mukherjee అనే వ్యక్తి రంగ ప్రవేశం చేశాడు. అసలు నేటి బెంగాల్ ప్రజలలో చాలా మందికి Gopal Chandra Mukherjee అనే పేరే తెలియదు. కానీ అతనే నాడు హిందువులను రక్షించిన యోధుడు. కోల్‌కతా నేటికీ భారత్ లో ఉండటానికి కారణం ఆ యోధుడే. Gopal Patha అని కూడా పిలుస్తారు. Gopal బెంగాల్ బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టాడు. అందువల్ల శాస్త్రాలన్నీ తెలిసినవాడు. అయితే వారి కుటుంబ వ్యాపారం మాంసం దుకాణాలు నడపడం. అతనికి చిన్నప్పటి నుంచి కుస్తీపై మక్కువ ఉండడంతో కుస్తీ నేర్చుకుని, బెంగాల్ లో నంబర్ 1 పహిల్వాన్ గా పేరు పొందాడు. తన కుటుంబానికి చెందిన మాంసపు దుకాణాలు చూసుకుంటూనే, ఒక వ్యాయామ శాల పెట్టుకుని, అక్కడ సంప్రదాయ వ్యయమాలతో పాటు, ఔత్సాహికులకు కుస్తీ కూడా నేర్పేవాడు. అతని దగ్గర దాదాపు 500 వందల నుంచి 800 మంది కుస్తీ యోధులు ఉండేవారు. సుభాష్ చంద్రబోస్ అంటే Gopal కి ప్రాణం. ఆయన అడుగుజాడల్లో నడిచే మనిషి. ఇతనికి ఎప్పుడు ముస్లిమ్స్ తో ఎలాంటి గొడవలు లేవు. వృత్తిలో భాగంగా Gopal ఎంతోమంది ముస్లింలతో కలిసి వ్యాపారం చేసేవాడు. సహాయం కోసం వచ్చి చేయి చాచిన వారికి లేదనకుండా సహాయం చేసిన దానకర్ణుడని స్నేహితులు కొనియాడే వారు.

16, 17 తేదీల్లో హిందువులపై జరిగిన దారుణాలు చూసిన Gopal హృదయం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఎలాగైనా హిందువులను రక్షించాలని నిర్ణయించుకుని, తన దగ్గర ఉన్న కుస్తీ యోధులతో పాటు, అవకాశమున్న ప్రతి హిందూ యువకుడిని పోగేసాడు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక కత్తిని పెట్టి, శ్రీ కృష్ణుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించినట్లు, హిందూ జన రక్షణ, ధర్మ రక్షణే తమ బాధ్యత అని బోధించాడు. అందుకోసం ఒక్కో హిందువు కనీసం 10 మంది ముస్లిమ్స్ ని చంపాలని తీర్మానం చేశాడు. స్త్రీలనూ, పిల్లలనూ ఏమీ చెయ్యవద్దని ఆదేశించాడు. అలా ఆ నాడు తనతో ఉన్న ప్రతి హిందువునూ ఒక యోధుడిలా మార్చి, నరమేధం సృష్టిస్తున్న రాక్షసులను చంపడం మొదలు పెట్టారు. Gopal నేతృత్వంలోని హిందూ యువకులు చేస్తున్న పోరాటం, ఒక్క బెంగాల్ లోనే కాకుండా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా వ్యాపించింది. ఆ రాష్ట్రాల యువత కూడా మేల్కొని  Gopal తో చేయి కలిపారు. ముస్లింల దాడుల్లో ఎక్కువగా మార్వాడీ కమ్యూనిటీ బాగా నష్టపోయారు. దాంతో వారంతా కలిసి Gopal కి కావాల్సిన డబ్బును అందించారు. మన గత వీడియోలో Go back Marwadi నినాదాన్ని గురించి మరోసారి ఆలోచించండి. తమ దూకణాలలో రాత్రింబవళ్ళు కష్టపడి, కావాల్సిన ఆయుధాలను తయారు చేశారు. ఆయుధాలు తయారు చేసే ఇతర హిందువులు కూడా అదే పని చేశారు. ఇలా వారిచ్చిన ఆయుధాలతో పాటు, మార్వాడీల డబ్బుతో తుపాకులు కూడా కొని, తన సేనకి ఇచ్చాడు Gopal. దాంతో కోపంగా ఉన్న బెబ్బులి ఉరిమీద పడితే ఎలా వేటాడుతుందో, అలా నాడు ప్రతి హిందూ యువకుడు Muslim League నాయకులను, వారికి సపోర్ట్ గా తిరిగే ముస్లిం యువకులను, వారికి వెన్నుదన్నుగా నిలిచిన పోలీసులను కూడా వదలకుండా వెంటాడి వేటాడి చంపారు.

16, 17 తేదీల్లో ముస్లింలు కోల్‌కతా నగరంలో విద్వంశం సృష్టించి విజయం తమదే అని మంచి జోష్ లో ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న ముస్లింలు, కోల్‌కతా లోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. కానీ 18 వ తేదీ వారి ఉత్సాహాన్ని పూర్తిగా అణచి వేసింది. Gopal నేతృత్వంలో హిందువులు సన్నద్ధం అవుతున్నారని Muslim League నేతలకు కానీ, వారి సపోర్టర్స్ కి కానీ తెలియదు. దాంతో వారు ఎప్పటిలాగానే 18 వ తేదీ తెల్లవారుజామునే, హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్ళగానే, Gopal సేన వారిని మట్టుబెట్టారు. ఇలా 18, 19, 20 తేదీల్లో Gopal సేన, హిందువు పై చేయి ఎత్తిన ప్రతి ఒక్కరినీ తుదముట్టించారు. అంతేకాదు, ముస్లింలను రెచ్చగొట్టి హిందువులపై దాడికి వ్యూహ రచన చేసిన ప్రతి Muslim League నేతలను వెతికి మరీ చంపించాడు. ఈ యుద్ధంలో Gopal కి Jugal Chandra Ghosh, Basanth Kaur అనే ఇద్దరు వ్యక్తులు కుడి భుజంలా మారారు. వారు కూడా Gopal తో పాటు కుస్తీ చేసే యోధులే. 20వ తేదీ వచ్చేసరికి చనిపోయిన వారి సంఖ్య హిందువుల కంటే ముస్లింలది పెరిగింది. ముస్లింలకు సపోర్ట్ గా అడ్డు వెళ్ళిన Suhrawardy నియమించిన పోలీసులు ఎవరూ తిరిగి రాలేదు. దాంతో మిగిలిన వారు స్టేషన్లకే పరిమితం అయిపోయారు.

బెంగాల్ చరిత్రకారుడైన Sandip Bandyopadhyay చెప్పిన వివారాల ప్రకారం, Gopal చేసిన ఆ దాడిలో ఒక్క ముస్లిం మహిళకు కానీ, పిల్లవాడికి కానీ హాని జరగలేదు. అతను మతవాది కాదనీ, కేవలం అన్యాయంగా చంపబడుతున్న హిందువులను రక్షించడానికే కత్తి పట్టడనీ తెలుస్తుంది. అంతేకాదు నాడు భర్తలను కోల్పోయిన హిందూ మహిళలను, అనాధలైన పిల్లలను Gopal చెరదీశాడు. వారందరికి వసతి కలిపించి, తిండి బట్టా ఇచ్చి, ముస్లిమ్స్ చేతిలో చంపబడకుండా, మతం మారకుండా రక్షించాడని, Sandip Bandyopadhyay రాసిన పుస్తకాలలో తెలియచేశాడు.

Gopal చేసిన ఆ తిరుగుబాటు, కట్టర్ ముస్లిమ్స్ వెన్నులో వణుకు పుట్టించింది. కేవలం రెచ్చగొడితే రెచ్చిపోయే తక్కిన ముస్లిమ్స్ ఆయుధాలను వదిలి బ్రతుకుజీవుడా అంటూ పరుగు తీశారు. మిగిలిన కొద్దిమంది, Gopal సేన దెబ్బకి 72 హూర్లను కలవడానికి వెళ్లిపోయారు. Suhrawardy ఈ తిరుగుబాటును అస్సలు ఊహించలేదు. దాంతో అతనికి భయంతో పాటు, పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. Suhrawardy 16, 17 తేదీల్లో కోల్‌కతాలో నరమేధం సృష్టించి, అక్కడినుంచి హిందువులను తరిమేసి, 18వ తేదీ నుంచి చుట్టూ ప్రక్కల గ్రామాలలోని హిందువులను కూడా చంపేస్తే, పూర్తిగా ఆ నగరం East Pakistan లో కలిసిపోతుందని ఆలోచించాడు. అతను అనుకున్నట్లు జరిగి ఉంటే, నేడు కోల్‌కతా బంగ్లాదేశ్ లో కలిసిపోయి ఉండేది. Gopal దెబ్బకి Suhrawardy ప్లాన్ బెడిసికొట్టింది. ఏం చేయాలో ఎక్కడికి పోవాలో తెలియని స్థితి. తాను నమ్మిన ముస్లిం యువకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోవడంతో, August 21 వ తేదీన కొట్లాటలను ఆపేయాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఆ కొట్లాటలు ఆపడానికి తగిన చర్చలు జరపమని, బంగ్లాదేశ్ జాతీపితగా పిలవబడే Sheikh Mujibur Rahman ని కోరాడు. అతను కూడా Muslim Leagueలో ప్రముఖ నేత, Muslim National Guard లో ఒక అధికారి కూడా. అతను స్వయంగా వెళ్ళి గొడవలు ఆపేద్దామని Gopal Paatha ని కోరాడు. దానికి ముస్లింలు ఆయుధాలు వదిలేసి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోతే, అప్పుడు తాము కూడా శాంతిస్తామని Gopal Patha షరతు పెట్టాడు. దానికి వారు కూడా అంగీకరించిన తరువాత బెంగాల్ లో జరుగుతున్న నరమేధం ఆగిపోయింది.

Suhrawardy చేసిన డ్యామేజ్ ని దాచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక వ్యూహం పన్నింది. దాని ప్రకారం Suhrawardy ని అధికారం నుంచి తొలగించి, అతని ప్రభుత్వాన్ని పూర్తిగా డిస్మిస్ చేసేసింది. August 21వ తేదీన నాటి భారత్ కి Viceroy గా చేస్తున్న Archibald Percival Wavell, బెంగాల్ ని, ముఖ్యంగా కోల్‌కతా ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ సెంట్రల్ కమాండ్ ని దించి అల్లర్లు జరగకుండా గస్తీ కాయించాడు.

నాటి Muslim League నాయకులు నరమేధాన్ని కోరుకుంటే, Gopal Chandra Mukherji అనే ఒకే ఒక్క వ్యక్తి, హిందువుల మాన ప్రాణాలను కాపాడాడు. ఆ Gopal Patha అనే వ్యక్తే లేకపోతే, నేడు మనకి కోల్‌కతా నగరం ఉండేది కాదు. ఆ నగరం భారత్ లో లేకపోతే, దేశ ఆర్ధిక వ్యవస్థ ఈ రోజు వేరేలా ఉండేది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, కుహనా మేధావులు, కమ్యూనిస్ట్ నాయకులు, Gopal Patha పేరును చరిత్ర లోంచి చెరిపేయడానికి తమకు తోచిన ప్రయత్నాలన్నీ చేశారు. అసలు బెంగాల్ లో ఎలాంటి నరమేధం జరగలేదన్నట్లు ప్రవర్తించారు. భావి తరాలకు ఆ చరిత్ర తెలియకుండా, చరిత్రకారులను, కవులను, కళాకారులను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బెదిరించారు. బెంగాల్ ప్రభత్వం Bengal Files సినిమాను అడ్డుకోడానికి కారణం, ఓట్ల రాజకీయం. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ని పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం, నేటి మమతా ప్రభత్వం మరో Suhrawardy లా మారి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ, ముస్లిం జనాభాను పెంచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్ ని పాలించిన నాయకులు, Gopal Patha అనే స్వాతంత్ర్య యోధుడికి గూండా అనే అపవాదు రుద్ది, అతని గొప్పతనాన్నీ, త్యాగాన్నీ కప్పిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు. Bengal Files సినిమా గురించి TMC నేతలు ఇప్పటికీ అదే కూత కుస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా స్థిరపడ్డ ప్రదేశాలలో, హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి, భావి తరాలను ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి సంసిద్ధం చేస్తారని ఆశిస్తున్నాను..

ధర్మో రక్షతి రక్షితః

Thursday, September 11, 2025

Most important traits that one should always practice in life


శ్రీ వైశంపాయన ఉవాచ (వైశంపాయనుని వ్యాఖ్య)

శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశ: |
యుధిష్ఠిర: శాంతనవం పునరే వాభ్యభాషిత: ||

తాత్పర్యం:

భీష్ముడు చెప్పిన అన్ని ధర్మ సూత్రములన్ని చక్కగా విని ధర్మరాజు ఇంకా తృప్తి చెందక శాంతనుని పుత్రుడితో (భీష్ముడితో) ఇలా అన్నాడు.

వివరణ:

ధర్మరాజు సకల శాస్త్రములు తెలిసిన మహాపండితుడు. అయినా పెద్దలయందు గల గౌరవముతో వ్యాసుని మరియు కృష్ణుని ఆదేశం మేరకు భీష్ముని వద్దకు వచ్చి ధర్మాన్ని, నీతిని తెలియగోరాడు. ఇక్కడ వ్యాసులవారు మనకి ఒక గొప్ప సందేశం అందించారు. మనిషి ఎంత గొప్పవాడైనా సరే, ఎంతటి పండితుడైనాసరే, తనకి అంతా తెలుసునని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. జ్ఞానం అనంతం. మనం ఎంత వెదికితే అంతకంతకూ దొరుకుతూనే వుంటుంది. పెద్దలయందు గౌరవం, వినమ్రత అనేవి చాల గొప్ప లక్షణాలు. మనం ఎల్లప్పుడు వాటిని గుర్తించి వాటిని ఆచరిస్తూ వుండాలి.

srutvaa dharmaan aseshena paavanaanicha sarvasaha |
Yudhishtirah Saantanavam punare vaabhyabhaashitaha ||

Meaning:

After hearing all aspects of dharma that can purify one's self Yudhishtira was still unsatisfied and questioned the son of Saantanu.

Explanation:

Yudhishtira himself was a great scholar. Still, he came to Bhishma and asked him to enlighten him on all dharmas and right practices. Vyasa delivered an excellent statement here. No matter how intelligent you are, always stay thirsty for knowledge. Knowledge is like an endless treasure. You will reap rich rewards as long as you stay on the quest for knowledge. Also, humility, respecting elders and obedience are some of the most important traits that one should always practice in life.

Monday, September 8, 2025

Marwadi Go Back Controversy: Who are Marwaris? | శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ సంబంధం!


శ్రీ రాముడి వంశానికీ మార్వాడీలకూ మధ్య సంబంధం ఏమిటి?
అసలు మార్వాడీలు ఎవరు? దేశ ఆర్ధికవ్యవస్థకీ వారికీ ఉన్న సంబంధం ఏమిటి?

‘Go Back Marwadi’ అనే నీనాదాన్ని గత కొద్ది రోజులుగా తెలంగాణా ప్రాంతంలో పదేపదే వింటున్నాము. తెలంగాణాలో మార్వాడీలు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఇక్కడ అసలు వాళ్ళు ఉండటానికే వీల్లేదని అంటూ, వారిని అతి పెద్ద క్రిమినల్స్ గా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మనలో చాలా మందికి అసలు మార్వాడీలంటే ఎవరు..? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు..? వారంతా ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎందుకున్నారు..? వైశ్యులు, మార్వాడీలు ఒకటేనా..? వారిపై తెలంగాణాలో ఉన్నట్టుండి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి. మార్వాడీల చరిత్రతో పాటు, ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద కుట్రకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P0URjg8F7AY ]


కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక మార్కెట్ ఏరియాలో మొదలైన ఒక చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానలా మారింది.. మారింది అనేకంటే మార్చారనుకోవడం భావ్యంగా ఉంటుంది. ఒక మార్వాడీ వ్యక్తి మార్కెట్ లోని ఒక రోడ్డులో తన కారును ఆపాడు. అది ఇరుకు సందు కావడం, అందులోనూ మార్కెట్ ఏరియా కావడంతో, ఆ కారు వెనకే ఆగిన ఒక బైక్ వ్యక్తి గట్టిగా హారన్ మ్రోగిస్తూ, ముందున్న కారులోని వ్యక్తిని దూషించడం మొదలుపెట్టాడు. దాంతో వారిద్దరి మధ్యా వాగ్వాదం మొదలై, అది కొట్టుకునేంత వరకు వెళ్ళింది. కారులో వచ్చిన వ్యక్తి మార్వాడీ అనీ, బైకుపై ఉన్న వ్యక్తి తెలంగాణా స్థానీకుడనీ గుర్తించిన కొంతమంది అవకాశవాదులు, అతిపెద్ద నాటకానికి తెరతీశారు. ఆ నాటకం ఏమిటో..? దాని వెనుకవున్న కుట్ర మేమిటో తెలియాలంటే, ముందుగా అసలు మార్వాడీలు ఎవరో, వారి పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకోవాలి.

మార్వాడీల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందుగా రాముడి వంశం గురించి తెలుసుకోవాలి. శ్రీరాముల వారికి లవ కుశులనే కొడుకులున్న విషయం తెలిసిందే. వారి తర్వాత ఆ వంశంలోని వారి గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఈ వివరాలతో మనం గతంలో చేసిన వీడియో (రాముని తర్వాత వారి వంశం ఏమైందో తెలుసా? https://youtu.be/q18fhoB8AoA) లింక్ ను చూడని వారి కోసం పొందుపరుస్తున్నాను.


రామావతారం తర్వాత లవుడు, కుశుడు నాటి రామ రాజ్యంలోని వివిధ ప్రాంతాలను పాలించారు. వారిలో ఒకరైన కుశుడి వంశంలో, నాలుగవ తరం వ్యకైన Vallabha Deva మహారాజు కుమారుడు అగ్రసేనుడే, మార్వాడిలను తీర్చిదిద్దిన వ్యక్తిగా చరిత్ర చెబుతోంది. ఆయన నేటి హర్యానా రాష్ట్రంలోని Agroha నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని, మహా సాంరాజ్యాన్ని నెలకొల్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నేటికీ Agroha ప్రాంతంలో వేల ఏళ్లనాటి చారిత్రక ఆధారాలు ఎన్నో, పురావస్తు శాఖవారికి దొరుకుతూనే ఉన్నాయి.

Agrasena మహారాజు కాలంలోనే గోత్రనామాలు ఏర్పడ్డాయని కొంతమంది చరిత్రకారులంటున్నారు. అగ్రసేనుడికి 18 మంది కుమారులు కాగా, వారు 18 యజ్ఞాలు చేయించారు. ఆ యజ్ఞాలు కూడా గర్గ మహర్షి నేతృత్వంలో, 18 మంది మహర్షులు చేశారు. అలా నాడు 18 యజ్ఞాలు చేసిన 18 మంది మహర్షుల పేర్ల మీదనే గోత్రనామాలు ఏర్పడినట్లు, ఉత్తరాది వారు నమ్ముతారు. వారిలో ముఖ్యుడైన గర్గ మహర్షి పేరుమీదే మొదటి గోత్రనామం ఏర్పడిందని అంటారు. రాముడి వంశంలో పుట్టిన వ్యక్తికి ఆయన ఉన్నతమైన ఆలోచనలు కొన్నైనా రాకమానవని అనడానికి, Agrasena మహారాజు ఒక ఉదాహరణ.

రామావతర పరిసమాప్తితోనే త్రేతాయుగం ముగిసి ద్వారపర యుగం మొదలైనట్లు చరిత్ర విదితం. యుగం మారడం అంటే, మానవుల ఆలోచనా విధానంలోనూ, జీవిన విధానంలోనూ మార్పూ, భూవాతారణంలో ఏర్పడేటటువంటి ఎన్నో మార్పులు గోచరిస్తాయి. అలా ఏర్పడే మార్పులకు అనుగుణంగా తన రాజ్యాన్నీ, ప్రజలనూ సమాయత్తం చేసి, ఉన్నత విలువలతో సుభిక్షమైన రాజ్యాన్ని స్థాపించనవాడే, చరిత్రలో గొప్ప రాజుగా కీర్తించబడతాడు. Agrasena మహారాజు కూడా ఆ కోవకు చెందినవాడే. ఆయన కాలం వరకు వివిధ వర్ణాల వారు, వేర్వేరు పనులు చేసుకుంటూ జీవించేవారు. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పంటలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. కానీ వాటితోపాటు దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాపారం, యుద్ధ కళలు కూడా తెలిసి వుండాలని తలచి ఆచరించిన వ్యక్తే Agrasena మహారాజు.

దాదాపు 108 ఏళ్ల పాటు Agrasena మహారాజు జీవించినట్లు చరిత్రకారుల అంచనా. ఆయన తన రాజ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు, రాజ్యంలోని ప్రతి ఒక్కరికీ వ్యవసాయం, పాడి పంటలు, ఇతర కుల వృత్తులతో పాటు, వ్యాపారం, యుద్ధ విద్యలపై పూర్తి అవగాహన ఇప్పించాడు. అంతేకాకుండా ప్రత్యేకమైన వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి, దేశ విదేశాలలో వ్యాపారాలు నిర్వహించడంలో ఎన్నో మెళకువలు నేర్పించాడు. అలా ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా Agrasena మహారాజు పాలించిన Agroha రాజ్యం భాసిల్లినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. Agrasena మహారాజు తీసుకువచ్చిన ఆ మార్పుల కారణంగా, కొన్ని యుగాలపాటు Agroha రాజ్యం విదేశీ శక్తుల చేతులలో చిక్కకుండా, అత్యంత పటిష్టంగా ఉన్నట్లు చరిత్రద్వారా తెలుస్తోంది.

ఆ తరువాత శ్రీకృష్ణ జననం, కురుక్షేత్ర యుద్ధంతో ద్వాపర యుగం చివరికి వచ్చింది.. మురళీధరుడి అవతార పరిసమాప్తితో, కలియుగం ప్రారంభమయ్యింది.. మళ్ళీ ఎన్నో మార్పులు చోటుజేసుకున్నాయి.. అలా కొన్ని వేల ఏళ్లు గడిచాయి. ఈ లోపు ప్రపంచంలో కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. అకారణంగా ఇతర రాజ్యాలపై దండెత్తడమూ, సంపదల దోపిడీలూ మొదలయ్యాయి. అలా 11వ శతాబ్దం వచ్చేసరికి, ఎడారి మతాలు తూర్పు, దక్షిణ ఆసియా దేశాలపై దండయాత్రలు, దమనకాండలూ మొదలు పెట్టాయి. అలా మన దేశంపై దండెత్తి వచ్చిన అతి క్రూరమైన వ్యక్తి మొహ్మద్ ఘోరీ. అతను మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు, హర్యానాలోని Agroha రాజ్యం బాగా దెబ్బతిన్నది. దాంతో నాడు అత్యధిక సంఖ్యలో అక్కడి వారు వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అలా వెళ్ళినవారిలో కొంతమంది ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్ళగా, అధిక సంఖ్యలో జనం రాజస్థాన్ లోని Marwari ప్రాంతానికి చేరుకున్నారు.

ఆ Marwari ప్రాంతాన్నే పూర్వం Maru Pradesh.. Maruwar అని కూడా పిలిచేవారు. Maru అంటే ప్రాణం లేనిది, పూర్తిగా మరణించినదని అర్ధం. రాజస్థాన్ లో అత్యధిక శాతం ఎడారి ప్రాంతం కావడం చేత, ఆ ప్రాంతానికి Maruwar అన్న పేరు స్థిరపడింది. కాలగమనంలో అది Marwar, Marwari గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. ఇక Ghori కారణంగా అధిక సంఖ్యలో Marwar ప్రాంతానికి తరలివచ్చిన Agroha ప్రజలు, అక్కడ వ్యవసాయం చేయడానికి వీలు లేక పోవడంతో, కుటుంబ పోషణ కోసం వారికి తెలిసిన ఇతర పనులపై ఆధారపడ్డారు. హస్తకళాలు, కులవృత్తులతో పాటు, అవకాశం ఉన్న ప్రతి దానితో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. చాలా మంది, స్థానిక రాజ్ పుత్ రాజుల సేనలో పనిచేయడం, ముఖ్య సలహదారులుగా కూడా మెలిగేవారు. అలా రాజస్థాన్ లోని నాటి ప్రాంతాలను సుసంపన్నమైన రాజ్యాలుగా మార్చడంలో వారు ముఖ్య భూమికను పోషించారు.

ఇదిలా ఉంటే, 13 వ శతాబ్దంలో నాటి రాజస్థాన్ లోని Mewar రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి ఆ రాజ్యాన్ని దోచుకోవడంతో, Agroha వాసుల పరిస్థితి మరోసారి అగమ్యగోచరంగా మారింది. పెద్ద సంఖ్యలో రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్న వారు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళి, అక్కడ కూడా వ్యాపారం, సైన్యంలో చేరడం వంటివి మొదలుపెట్టారు. అలా నాడు Marwari ప్రాంతం నుంచి వచ్చిన వారు కావడంతో, వారిని మార్వాడీలని పిలిచేవారు. Agroha పతనంతో ప్రయాణం మొదలై, ఎడారి ఇసుకలో కూడా బంగారం పండించవచ్చు, వజ్రాలు వెలికి తీయవచ్చని ప్రపంచానికి చాటిన మార్వాడీలు, దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడుతూ, వ్యాపారాలు చేస్తూ సంపన్నులుగా మారడమే కాకుండా, ఆయా రాజ్యాల ఆర్ధిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.

వారి వ్యాపార దక్షతకు ముచ్చటపడిన ముస్లిం రాజులు కూడా, తక్కిన హిందూ సముదాయంతో పోలిస్తే, వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ముస్లిం రాజులు అలా చేయడం వెనుకవున్న ముఖ్యకరాణాలలో, మార్వాడీలు చేసే వడ్డీ వ్యాపారం ఒకటి. తమ దగ్గరున్న డబ్బును వృద్ధి చేయడానికి వారు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి నుంచి, రాజ్యాలనేలే రాజులవరకూ వడ్డీకి డబ్బులిచ్చే వ్యాపారం మొదలుపెట్టారు. అలా ఇచ్చిన అప్పు కట్టని వారి నుంచి దాన్ని రాబట్టుకునే ఎన్నో విధానాలు కూడా కనిపెట్టారు. నేటికీ మన బ్యాంకింగ్ రంగంవారు ఆ విధానాలనే అనుసరిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆజ్యం పోసింది మార్వాడీ కమ్యూనిటీకి చెందిన Jagat Seth అనే వ్యాపారి.

ఆయన ఒక జైన మార్వాడీ. అసలు మార్వాడీ అంటే ఒక కులం కాదు.. మార్వాడీలు అనేక కులాలకూ, మతాలకూ చెందిన ఒక కమ్యూనిటీ. ముందు చెప్పుకున్నట్లు, రాజస్థాన్ లోని Marwari ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ మార్వాడీలనే పిలుస్తారు. కాలగమనంలో వారు జైన, బౌద్ధ మతాలలోకి కూడా వెళ్లారు. అసలు బ్రిటీషర్లు వచ్చిన తర్వాత వాటిని వేరే మతాలుగా పేర్కొన్నారు కానీ, అంతకు పూర్వం హిందూత్వంలోని రెండు సంప్రదాయలుగా మాత్రమే వాటిని చూసేవారు. ఉదాహరణకు శైవ, వైష్ణవ సంప్రదాయాలలాగానే.. అయితే ఈ రెండు సాంప్రదాయాలలో శివకేశవులను కొలిస్తే, జైన, బౌద్ధాలలో గురువులను ఆరాధిస్తారు. సిక్కు కమ్యూనిటీ కూడా జైన, బౌద్ధం లాగానే. అలా జైన సంప్రదాయాన్ని ఆచరించిన వంశంలో పుట్టిన వ్యక్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న Jagath Seth.

అసలు Seth అనే పదంలోనే ఆయన కుటుంబ నేపద్యం దాగి ఉంది. Seth అనే పదానికి వ్యాపారి, banker, ఖజానా రక్షకుడు, ఖజానా అధికారి వంటి పలు అర్ధాలున్నాయి. పూర్వం వడ్డీ వ్యాపారం చేసేవారినీ, ఖజానా అధికారులుగా వ్యవహరించే వ్యక్తులనూ Seth లని పిలిచేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, Seth అంటే ఆ వ్యక్తి చేసే పని. అదే కాలగమనంలో ఇంటిపేరుగా మారింది. పూర్వం ఎక్కువగా మార్వాడీ సముదాయానికి చెందిన వ్యక్తులే ఖజానా బాధ్యతలను చూసుకోవడంతో, ఆ కమ్యూనిటీ వారికే Seth అనే పేరు నిలిచిపోయింది. Jagat Seth వంశం కూడా అలాంటి వారే అవ్వడంతో, ఆయన చిన్నప్పటి నుంచే సిరిసంపదల మధ్య పెరిగాడు. ఆ సంపదలను ఆయన వృద్ధిచేయడంతో పాటు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. నిజానికి Jagat Seth అసలు పేరు Fateh Chand. ఆయన వ్యాపార దక్షత, బ్యాంకింగ్ నైపుణ్యం చూసి బెంగాల్ నవాబు ఇచ్చిన బిరుదు Jagat Seth. అప్పటి నుంచి ఆయనను అందరూ Jagat Seth గా పిలవడమే కాకుండా, ఆయన వంశానికి Seth అని ఇంటిపేరుగా మార్చేశారు. Jagath Seth అంటే అర్ధం, Banker Of The World అని. పూర్వం నుంచి Jagat Seth కుటుంబం లోని వారు వడ్డీ వ్యాపారం చేయడంతో పాటు, రాజుల కోశాగారాలను చూసుకునే అధికారులుగా వ్యవహరించడంతో, ఆయనకు డబ్బును వృద్ధి చేసే మెళకువలు వెన్నతో పెట్టిన విద్యగా అబ్బాయి.

ఆంగ్లేయుల దగ్గర గన్ పౌడర్ కొని అమ్మడంతో వ్యాపారం మొదలుపెట్టిన Jagat Seth, కొద్ది సంవత్సరాలలోనే రాజులకు సైతం అప్పులు ఇచ్చే వ్యక్తిగా ఎదిగాడు. అంతేకాకుండా, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా ఉన్న బెంగాల్ రాజ్యాన్ని, అలా సుసంపన్నంగా మార్చిన వ్యక్తే ఈ Jagat Seth. నాడు ఆయన తీసుకొచ్చిన ఎన్నో ఆర్ధిక సంస్కరణలు బెంగాల్ రాజ్యపు GDP పెరగడంలో ఎంతగానో దోహద పడ్డాయి. దాంతో అమితంగా సంతోషించిన నాటి బెంగాల్ మొఘల్ చక్రవర్తి Muhammad Shah, ఆయనకు Jagat Seth అనే బిరుదును ఇచ్చాడు. ఆయన కేవలం తన రాజుకే కాకుండా, మన దేశానికి వ్యాపరం పేరుతో వచ్చి, తమ వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పిన బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వారికి కూడా అప్పులు ఇచ్చేవాడంటే, ఆయన దగ్గర ఎంత సంపద ఉండేదో అర్ధంచేసుకోవచ్చు. అసలు బ్యాంకింగ్ లోని మెళకువలను బ్రిటీషర్లు నేర్చుకున్నది కూడా ఆయన దగ్గరే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కాలంలో ఆయన దగ్గరున్నంత డబ్బు, ఇంగ్లాండ్ లోని అన్ని బ్యాంకులలోనూ కలిపినా సరితూగేది కాదని చరిత్రకారులంటున్నారు. ఇక ఎంత సంపన్నుడో, అంతటి దాన గుణం గల వ్యక్తిగా ఆయనను చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన ఎన్నో ఆలయాల పునర్నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవాడు. నిత్యం అన్నదానం చేయించేవాడు. అవసరం ఉన్న వ్యక్తులకు డబ్బు దానం కూడా చేసేవాడు. ఇలా దాన ధర్మాలు చేసినా, ఆయన వ్యాపార దక్షత ఆయనను ప్రపంచంలోనే No 1 బ్యాంకర్ ని చేసింది.

సాధారణంగా మార్వాడీలు పిసినారులు, డబ్బు కోసం శత్రువులతో కూడా చేతులు కలుపుతారని ప్రచారం చేస్తూ ఉంటారు కొందరు. అదే నిజమైతే రాజస్థాన్ లో విలాసవంతమైన కోటలు, భవనాలు వెలిసేవే కావు. అదే నిజమైతే మార్వాడీల పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా జరగవు. అదే నిజమైతే, అసలు స్వాతంత్ర్య ఉద్యమానికి అంతటి శక్తి కూడా ఉండేది కాదని చరిత్ర చెబుతుంది. డబ్బును సంపాదించే వ్యక్తి దాన్ని ఖర్చుపెట్టే విషయంలో కొంత జాగ్రత్తగానే ఉంటాడు. అలాగే మార్వాడీలు కూడా.. డబ్బు సంపాదించడం వారి నరనరాలలో ఇమిడి ఉంది. మరి అలా సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కూడా ముఖ్యమేకదా.. అందుకే వారు అడిగిన ప్రతి ఒక్కరికీ డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ, అవసరమైన చోట, అవసరమైన సమయంలో ఆ డబ్బును విరివిగా పంచడంలో ఏ మాత్రం సంకోచించరని ఎన్నో సంఘటనలు తెలియజేస్తాయి. ఉదాహరణకు, నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి కావలసిన డబ్బును సమకూర్చడంలో బిర్లా కుటుంబీకులదే పై చేయిగా పేరు తెచ్చుకున్నారు.

బ్రిటిషర్లకు వంతపాడి మార్వాడీలు బాగా డబ్బులు పోగేశారని నిందించేవారూ ఉన్నారు. కానీ, ఇదే మార్వాడీలు నాటి బ్రిటిష్ ఇండియా వ్యాపారాన్ని ఛాలెంజ్ చేసి, మన దేశంలో బ్రిటిష్ వారి కంపెనీల ఎదుగుదలకు బ్రేకులు వేశారు. ‘Ghanshyam Das Birla’.. ఈయన GD Birla గా సుపరిచితం. నాడు బ్రిటిష్ కంపెనీలతో పోటీ పడి, కాటన్, షుగర్, జూట్ ఇండస్ట్రీలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ‘Ramakrishna Dalmia’.. Cement, Paper, News Paper, Banking, Aviation, Railways వంటి ఎన్నో రంగాలలో బ్రిటిష్ కంపెనీలను వెనుకకు నెట్టి, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఆఖరికి ప్రపంచ ట్రేడింగ్ తమ గుప్పెట్లో ఉందని విర్రవీగిన బ్రిటీషర్లకు, Trading Firm పెట్టి, పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తి, మార్వాడీ కమ్యూనిటీకి చెందిన Bhagoti Ram Poddar. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మార్వాడీలు అత్యంత కఠినమైన సమయాల్లో కూడా సామ దాన దండోపాలను ప్రయోగించి, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచగలిగారు. నాడు వారే లేకపోతే నేడు భారత దేశంలోని సంస్థలన్నీ విదేశీయులవే అయ్యి ఉండేవి.

మరి ఇంత చేసి, ఇంత గొప్ప నేపద్యం ఉన్న మార్వాడీలపై సమాజంలో ఎందుకీ వ్యతిరేకత వచ్చిందనే సందేహం సహజమే. అందుకు సమాధానం ‘కుట్ర’. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగే మార్వాడీ కమ్యూనిటీకి చెందినవారు కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అలాగని ఒక్కరు చేసిన తప్పులను మొత్తం కమ్యూనిటీకి ఆపాదించి, వారిపై వ్యతిరేకత పెంచుకోవడం అంటే, మనగొయ్యి మనం తవ్వుకున్నట్లే. పూర్వం నుంచి ఆర్ధికంగా బాగా బలపడిన మార్వాడీ కమ్యూనిటీని దెబ్బతీస్తే, భారత దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసినట్లే. ఈ సూత్రాన్ని ఎప్పుడో బ్రిటిష్ వారు రచించి, నేటికీ మన దేశంలో అమలు అయ్యేలా చూస్తున్నారు. దానికి మన కుహనా మేధావులు వంత పాడుతున్నారు. అందుకు మార్వాడీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కొంతమంది చేసిన చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించి, రాజకీయ స్వలాభాలను పొందుతున్నారు. నేడు తెలంగాణాలో జరుగుతున్న గొడవ కూడా అటువంటిదే.

మార్వాడీలలో ఒక కట్టుబాటు ఉంది. వారి కమ్యూనిటీకి చెందిన వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి, తక్కువ వడ్డీతో అప్పులు ఇచ్చి, ఏదో ఒక వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తారు. అదంతా ఒక అవగాహనతో జరిగే వ్యవహారం. అటువంటి వారిలోనూ విభేదాలు ఉంటాయి. ఒకరి వ్యాపారాన్ని ఒకరు కులదోసుకోవాలని చూస్తారు. మరి వారు కూడా మనుషులే కదా. కానీ అధికశాతం, తోటి మార్వాడీలను ఆర్ధికంగా నిలబెట్టాలనే ప్రయత్నిస్తారు. ఇతర కమ్యూనిటీలలో ఇటువంటి తోడ్పాటు లేక, వ్యాపార పరంగా అంతగా రాణించలేకపోతున్నారు. దాంతో మార్కెట్ లో ఏర్పడిన ఆ గ్యాప్ ని మార్వాడీలు ఫిల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు చిన్న చిన్న ఊర్లకి కూడా చేరుకున్నారు. ఈ విషయంలోనే అసూయలూ, కోప తాపాలూ పుట్టుకొచ్చాయి. అవి అవకాశవాద రాజకీయాలు చేసేవారికీ, దేశ ఆర్ధిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనుకునే దుష్టశక్తులకూ తోడ్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని, పక్కవాడి ఎదుగుదలను చూసి అసూయ పడకుండా, దేశ విచ్ఛిన్న రాజకీయ ఎత్తుగడలకు లొంగకుండా, స్వీయ అభివృద్ధీకీ, తద్వారా దేశ అభివృద్ధికీ నడుం బిగిద్దాము..

జై భారత్!

Thursday, September 4, 2025

Salutations to Vishnu


అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ||

తాత్పర్యం:

ఏ విధములైనటువంటి ఆకార వికారములు లేని వాడు, పరిశుద్ధుడు, యెల్లప్పుడు ఎల్లవేళల యందు వుండెడివాడు, పరమాత్ముడు, అన్నిరూపములందు ఒకే రూపము ధరించినవాడు, అందరిని జయించినవాడు అయిన విష్ణువుకు ఇవే మా వందనములు.

వివరణ:

గురువు తరువాత మనం ధ్యానించేది దేవుడిని. ఈ శ్లొకం మన ధ్యాన స్థితిని తెలియచేస్తుంది. మొట్టమొదటి శ్లొకంలొ మనం దేవుడిని తెల్లని వస్త్రాలు ధరించినవాడుగా, నాలుగు చేతులవాడుగా ధ్యానించాము. ఇప్పుడు మనం అదే దేవుడిని రూపము లేని వాడు, శుద్ధుడు లాంటి కొంచం కష్టమైన విశేషణలతో పోలుస్తున్నాము. అంటె మనం ధ్యానం రెండో మెట్టులో వున్నామన్నమాట. "సదైక రూప రూపాయ..." అన్నది సనాతన ధర్మం మనకందించే అతి ముఖ్యమైన సందేశాలలో ఒకటి. ప్రాణులు అనేకం కానీ అందులో నివసించే జీవిడు మాత్రం ఒకడే. అతడే పరమాత్ముడు. ఆందుకే సనాతన ధర్మం ప్రకారం మనం ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్క జీవిని గౌరవించాలి.

సహస్ర నామాల్లోని ప్రత్యేకత ఏమిటంటే పఠించే వారిని మెట్లవారిగా చక్కగా సరైన ధ్యాన స్థితికి తెచ్చి మనసా వాచా కర్మణా చక్కగా అనుసంధానం చేస్తుంది. ఈ విషయంపై మనం వేదవ్యాసుడికి చేతులెత్తి దండం పెట్టుకోవచ్చు.

avikaaraaya suddhaaya nityaaya paramaatmane |
sadaikaroopa roopaaya Vishnave sarvajishnave ||

Meaning:

My salutations to Vishnu who is devoid of all forms, pure, eternal, sublime and endowed with a presence that is same at all times and the one who is victorious over all.

Explanation:
 
We bow to God after we bow to our teacher. This verse indicates the state of meditation. In the very first verse, we meditate on God by giving Him a very specific form such as white clothes, four hands, pleasant face etc. That helps us settle down initially. Now that the initial "warm up" is over, we try to meditate on the more abstract form of God. "sadaika roopa roopaaya..." is a profound statement that forms the very essence of Sanathana Dharma. There are several million species of living beings on earth but the essential spirit that lives in them is the same. That is God. Sanathana Dharma teaches us to respect every living being on earth.

One special aspect of Sahasra Namam chanting is that it gradually brings us to the correct meditative state in a well-designed approach. All praise should go to Veda Vyasa for compiling this in such a beautiful manner.

Monday, September 1, 2025

Millions of Years Ago: The Manifestation of Kashi Vishweshwara | కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం!


కోట్ల సంవత్సరాల క్రితం కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం!
‘కాశీ’ గురించి ఈ ఆశ్చర్యకర నిజాలు మీకు తెలుసా?

ఆ పరమేశ్వరుడు వెలసిన పరమ పుణ్య క్షేత్రాలలో కాశీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జీవికి ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా, మోక్షాన్ని ఇచ్చే పవిత్ర స్థలంగా కాశీని పేర్కొంటారు.

న గాయత్య్రా సమో మంత్రమ్‌ న కాశీ సదృశీ పురీ !
న విశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునః !!

గాయత్రీ మంత్రంతో సరిసమానమైన మంత్రమూ, కాశీ నగరానికి సరితూగే పుణ్య క్షేత్రమూ, అక్కడి విశ్వేశ్వర లింగంతో పోల్చదగ్గ శివస్వరూపమూ మరొకటి లేదని ఈ శ్లోక తాత్పర్యం. కాశీ ఎంత పురాతనమైనదో అంత సనాతనమూ, ఎంత పవిత్రమైనదో అంత మహిమాన్వితమైనదని శాస్త్ర విదితము. సాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడే కొలువైన భూ కైలాసము. జీవన్మరణ చక్రంలో జీవికి ముక్తిని ప్రసాదించే జీవన్ముక్తి కారకం కాశీ, లేక వారణాసి గా వాడుకలో ఉన్న వారాణసి. కాశీనే మహా శ్మశానము అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టమని అంటారు. ఇది మహా పవిత్ర క్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రములో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు కూడా ఉన్నారు. అందుకే ప్రతి హిందువూ జీవితంలో ఒక్కసారైనా పొందాలని కోరుకునేది కాశీ దర్శనం. వీలయితే చివరిరోజులలో అక్కడే గడపాలనీ, కాశీ మట్టిలోనే కలిసిపోవాలనీ ప్రతి హైందవుడి లక్ష్యం. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశ్యాన్తు మరణాన్ ముక్తిః అని శాస్త్ర వచనం కాబట్టే చివరి దశ జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. కానీ, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప కాశీక్షేత్ర పాలకుడైన బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. అయితే కాశీకి వెళ్ళకపోయినప్పటికీ, అక్కడికి వెళదామని అనుకుంటే చాలు, వెళ్ళినంత ఫలం అందుతుంది. కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలం కలుగుతుంది. అటువంటి మహిమాన్విత వారణాసిలో ఎన్నెన్నో మహిమలూ, మరెన్నో ఆశ్చర్యకర వాస్తవాలూ దాగున్నాయనే విషయం ప్రతివొక్కరికీ ఎంతోకొంత అవగాహన ఉండే ఉంటుంది. కానీ నవతరంలో ఆ విషయాలు పూర్తిగా తెలిసిన వారు అరుదే. మరి అటువంటి అద్భుత విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/UR-QsRuWLZA ]


ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం, ఈ భువిపై తొలి నాగరిక మహా నగరం కాశీపురమేనని మన పురాణాలూ వేదాలూ పేర్కొంటాయి. ఆధునిక పురావస్తు పరిశోధకులు కూడా ఈ మాటలను ధృవీకరిస్తున్నారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే, సాక్ష్యత్తు పరమేశ్వరుడే మానవుల కోసం నిర్మించిన పరమ పుణ్య క్షేత్రం కాశీ అని శాస్త్ర విదితం. అటువంటి కాశీ పుర నిర్మాణం నుంచి, చరిత్ర ఆద్యంతమూ ఎన్నో వింతలూ ఎన్నెన్నో రహస్యాలూ దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ఆ నగర నిర్మాణం ప్రధమం.

ఈ భూమిపై గొప్ప నాగరికతగా పాశ్చాత్యలు ప్రచారం చేసుకునే గ్రీకు సామ్రాజ్యానికి అంకురార్పణ జరగక ముందే కాశీ క్షేత్రం భాసిల్లినట్లు ఆధారాలున్నాయి. ప్రపంచంలో గొప్ప కట్టడాలు కేవలం ఈజిప్ట్ లోనే ఉన్నాయని చెప్పే విదేశీ పరిశోధకులు సైతం, కాలాంతరాలలో కాశీ యే అతి పురాతన, అత్యద్భుత మహా నగరంగా ఒప్పుకోక తప్పలేదు. కాశీ అంటే కేవలం ఓ పుణ్య స్థలమో, పురాతన కట్టడాలున్న మహానగరమో కాదు. అది మానవ మేధస్సుకందని అద్భుత నగర ప్రణాళికకు నాంది పలికిన దివ్య క్షేత్రం. అలాంటి ప్రాణాళికలతో కాశీ కంటే ముందు కానీ, ఆ తర్వాత కానీ, యుగాంతరాలలో మరో నగరం నిర్మితం కాలేదంటే, ఆదినుంచీ మనవారి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం మన ఆయుర్వేదం. అందులో చెప్పబడిన ప్రకారం, మన శరీరంలో 108 మర్మ స్థానాలు ఉన్నాయి. వాటి వల్లనే మానవ శరీరం ఇంత గొప్పగా పనిచేయగలుగుతుందని చెప్పబడింది. ఆ విషయం దృష్టిలో ఉంచుకునే, కాశీలో మొత్తం 108 మూల క్షేత్రాలు నిర్మించబడ్డాయి. ఇవన్నీ మానవ శరీరంలో ఉండే మర్మ స్థానాలలానే ఒకదానికొకటి ఓ క్రమ పద్ధతిలో అనుసంధానమై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ 108 మూల క్షేత్రాలలో 54 శివుడికీ ఆయన గణాలకూ సంబంధించినవైతే, తక్కిన 54 శక్తి క్షేత్రాలు. అంటే ఇక్కడ సగం పురుషుడూ, సగం స్త్రీ శక్తీ కలిగిన అర్ధనారీశ్వర తత్వం ఆధారంగా కాశీ క్షేత్రం నిర్మితమయ్యిందని తెలుస్తోంది. అందుకే ఇలాంటి పుర ప్రణాళిక ‘న భూతో న భవిష్యతి’ అని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకుంటున్నారు.

అసలు సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణమున్నదని చెబుతారు. తేజో రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించదలచి, నిరాకారుడిగా ఉన్న తను సాకారుడయ్యాడు. ఆ తరువాత తన నుండి శక్తిని బయటకు పంపాడు. అదే ప్రకృతి శక్తి. అలా ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది. వీరిద్దరూ సంచరించటానికి కొన్ని యోజనాల విస్తీర్ణము కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు. ప్రళయ కాల రుద్రుడూ, లయకారుడూ ఆ పరమేశ్వరుడు. అంతటి స్వామి స్వయంగా కొలువైన క్షేత్రం, ఎటువంటి జల ప్రళయానికీ చెక్కు చెదరకుండా ఉండే విధంగా సృష్టించబడిందని అంటారు. ఈ కారణాల వల్లనే కాశీ నగరం దైవ నిర్మితమనీ, మహా యుగాలకు పూర్వం అంతటి జ్ఞానం మానవులకు ఉండే అవకాశం లేదని చెప్పేవారూ లేకపోలేదు.

అలా పురుషుడు నిరాకార పరబ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి ఆరంభం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. ఆయన తపస్సు చేస్తుండగా ఆయన శరీరము నుంచి నీరు కాల్వలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయిన పురుషుడు  ఒక్కసారిగా తల విదిలించాడు. ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేలమీద పడింది. ఆ కమ్మ పడిన ప్రదేశాన్నే 'మణికర్ణిక' అంటారు. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం.

విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు. ఆయన నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు. ఆయన పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యక్రమము మొదలు పెట్టాడు. మొదటగా ఐదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు. దానికి నాలుగు వైపులా పధ్నాలుగు లోకాలను సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలి ఆడుతోంది. దానిని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయి. ఈ బ్రహ్మాండంలో సగభాగం భూలోకము, పావు వంతు ఊర్ధ్వలోకము, మరో పావు వంతు అధోలోకము.

ఆది నారాయణుడూ, బ్రహ్మాది దేవతలూ, మహర్షులందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్ధించారు. వారి ప్రార్ధనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. వారంతా ముక్త కంఠంతో ఆ నిరాకార పరబ్రహ్మాన్ని కాశీ పట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి, శాశ్వతంగా పూజలందుకొమ్మని కోరారు. భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు. అలా వెలసిన పరమాత్మనే విశ్వేశ్వరుడిగా మనం కాశీలో దర్శించుకోవచ్చు.

ఇక కాశీ క్షేత్రానికున్న మరో పేరు వారాణసి. ఆ నగరానికి ఆ పేరు రావడం వెనుకవున్న కారణం, కాశీకి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో వరుణ, అసి అనే రెండు నదులు ప్రవహిస్తూ వెళ్ళి గంగలో కలుస్తాయి. ఆ రెండు నదుల పేరుమీదనే ఆ ప్రాంతానికి వారాణసి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది కాస్తా వారణాసిగా రూపాంతరం చెందింది. అసి అనే నదిలో స్నానం చేసిన వారికి దోషాలు నశించేలా, వరుణ నదిలో స్నానం చేసిన వారికి విఘ్నాలు తొలగేలా దేవతలు అనుగ్రహించారు. ఆ రెండు దివ్య నదులూ అలా ప్రయాణించి, దివి నుండి భువికి దిగి వచ్చిన గంగా నదిలో కలిసే ప్రదేశం కావడం చేత, కాశీ లోని గంగలో మునక వేసినంత మాత్రానే సర్వ దోషాలూ, సకల పాపలూ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆధునిక పరిశోధకులు కూడా కాశీలో ప్రవహించే గంగలో అద్భుతమైన ఔషధీ గుణాలున్నాయనీ, అందువల్లనే ఆ నీటిలో స్నానం చేసిన వారికి సర్వ రోగాలూ నయమవుతాయనీ నిరూపించారు.

కాశీపురాన్ని ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచి ఉండడు కాబట్టి, దానికి అవిముక్త క్షేత్రం అని పేరొచ్చింది. అటువంటి క్షేత్రం ఓ జ్యోతిర్లింగంతో పాటు, దక్ష యజ్ఞం తర్వాత సతీ దేవి శరీరం భాగం పడి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా నిలిచింది. ఈ కారణాలవల్ల ఆ క్షేత్ర మహిమ అనంతం అని ఆర్యోక్తి. కాశీ నగరం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు.. అదో మహా జ్ఞాన భాండాగారం. అందుకే ప్రతి నిత్యం దేవతలు అక్కడ అదృశ్య రూపంలో సంచరిస్తూ ఆ జ్ఞాన సంపదకు నిత్య పూజలు చేస్తారు. కురుక్షేత్ర మహా సంగ్రామం తర్వాత తమకు అంటిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు, పాండవులు కాశి క్షేత్రంలోనే కొన్నేళ్లపాటు యజ్ఞ యాగాదులు నిర్వహించారని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. బుద్ధుడు తన విద్యాభ్యాసం కాశిలోనే పూర్తి చేశాడు. ఆది శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాన్నీ, భజ గోవింద స్తోత్రాన్నీ, వేద వ్యాసుడు విభజించిన వేదాలకు భాష్యాలనూ కాశీ క్షేత్రంలోనే రచించారు.

వారణాసి కేవలం ఆద్యాత్మిక పరంగానే కాకుండా, సంగీతం, చిత్ర లేఖనం వంటి కళలతోపాటు, ఆ కాలంలో వ్యాపారానికి కూడా ముఖ్య పట్టణంగా ఉండేదని చరిత్రద్వారా తెలుస్తోంది. అందుకే పూర్వం వాణిజ్యపరంగా కాశీ నగరంలో, అఖండ భారతావని నుంచే కాకుండా, ఇటు ఆసియా నుంచీ, అటు ఆఫ్రికా, ఐరోపా ఖండాలలోని వ్యాపారులతో కూడా వాణిజ్య లావాదేవీలు జరిపిన చరిత్ర పదిలంగా ఉంది. నేటి కాలంలో గొప్ప శాస్త్రవేత్తగా చెప్పబడే ‘అల్బర్ట్ ఐన్ స్టీన్’ స్వయంగా, ఆధునిక సాంకేతికతకు అవసరం అయ్యే గణిత పరిజ్ఞానం, భారత దేశం నుంచే లభిస్తుందని పేర్కొన్నారు. అటువంటి గణితానికి పుట్టినిల్లు కాశీ క్షేత్రమే అని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక కాశీ క్షేత్రంలో నేటికీ కనిపించే కొన్ని వింతల విషయానికి వస్తే, కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.  కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది. అలాగే, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత భక్తుల చేతి రేఖలు మారి పోతాయని అంటారు. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణా దేవి నివాస స్థలం. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా, అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీ లోనే వున్నది.

కాశీలో మరణిస్తే చాలు, ఎంతటి క్రూరకర్ముడైనా సరే కైలాసం చేరతాడని ఆర్యోక్తి. రామేశ్వరములోని ఇసుకను తెచ్చి కాశీలోని విశ్వేశ్వరుడికి అభిషేకం చేసినవాడికి పునర్జన్మ ఉండదని అంటారు. అంతెందుకు! యజ్ఞ యాగాదులు చేసి స్వర్గసుఖాలూ అనుభవించేకన్నా కాశీలో పిశాచమై తిరగడం మిన్న అని చెబుతారు. అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలోని జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలవబడుతోంది. ఇలా సనాతన కాశీ క్షేత్రం గురించి చెప్పుకుంటూ పోతే వినడానికి మన జీవిత కాలం సరిపోదు. ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో..? ఈ సంక్షిప్త వివరణ సముద్రంలో నీటి బిందువు లాంటిదే అయినా, హిందువులందరికీ ఉపయోగ పడుతుంది. 

శుభం భూయాత్!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...