మనిషి జన్మ! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ Garuda Puranam
మనిషి జన్మ! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ ఏమిటో తెలుసా? మన సనాతన ధర్మంలోని పురాణాలు, మన మహర్షులు మనకు అందించిన వరాలు. అందులోనూ వ్యాస భగవానుడి కృతులైన అష్టాదశ పురాణాలలోని గరుడ పురాణం, మనిషి జీవన గమనానికి మార్గ దర్శకం. సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్లభమైన మనుష్య జన్మకు సంబంధించి, గరుడుడికి సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు తెలియజేసిన ఆ విషయాలలో, మనిషిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు? అప్పుడు ఇంద్రియాలు ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ, ఎలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి, ఎలా వెళ్తాడు? యమలోకానికీ విష్ణులోకానికీ ఏయే మార్గాలలో వెళతాడన్న గరుడుడి సందేహాలకు, శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2eMvV6mcSnU ] “ఓయీ వినతనందనా! పరస్త్రీనిగానీ, బ్రాహ్మణుని ధనాన్నిగానీ అపహరించినవాడు, నిర్జన ప్రదేశంలో గాన