మంగళసూత్రం!!! Mangal Sutra
మంగళసూత్రం!!! క్షీర సాగర మధన సందర్భంలో మాంగళ్యవివరణ.. “మ్రింగెడివాడు విభుండని, మ్రింగెడిదియు గరళమ్మనియు, మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మదినమ్మినదో! పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే, అది ఆయన గొప్ప కాదట.. అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా । కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ।। 'ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి, నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు.. అంటే, పుణ్యస్త్రీగా, ముత్తయిదువగా, సకల సౌభాగ్యాలతో జీవించు' అని స్పష్టముగా తెలుస్తున్నది. పూర్వం భారత దేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు, ఎటువంటి ఆచారాలూ కట్టుబాట్లూ ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, థగ్గుల వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకుపోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు, ఏ హానీ చేయకుండా విడిచి పెట్టేసేవారు. కిరాతకులు కూడా ఈ