Posts

Showing posts with the label శ్రీ కృష్ణ లీలలు

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

Image
శ్రీ కృష్ణ లీలలు!  అది మండు వేసవి. మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. పండు ముదుసలి, రామ భక్తురాలు అయిన ఒక అవ్వ, తలపై బరువైన పళ్ళ బుట్టతో, వేణు గోపాల స్వామి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందామని వచ్చింది. మెల్లగా బుట్టను క్రిందికి దించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ, "నాయనా గోపాలా! ఊరంతా తిరిగాను. ఒక్క పండు కూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా స్వామీ?" అని ఆ వేణు గోపాలుని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది. [ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! https://youtu.be/AbSSImIw2-4 ] ఇంతలో ఒక బాలుడు, నుదుటిపై కస్తూరీ తిలకం, వక్ష స్థలంపై కౌస్తుభ హారం, నాసాగ్రమున నవమౌక్తికం,  కంఠాన ముత్యాలహారం, చేతిలో పిల్లన గ్రోవి, శిఖలో నెమలి పింఛంతో, ఆ అవ్వ వైపుగా వస్తున్నాడు. ఆ బాలుడు ఎవరోకాదు, వేణు గోపాలుడే.. ఎవరా అన్నట్లు, ఆ అవ్వ అలా చూస్తోంది. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. తాదాత్మ్యంతో ఆ లీలా మానుష రూపధారిని చూస్తూ, 'అయినా కలియుగంలో భగవంతుని దర్శనం ఏమిటిలే' అనుకున్నది.  "అవ్వా, ఈ పళ్ళు తీయగా ఉంటాయా?" అడిగాడు బాలుడు. "అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో" అన్నది