శివుడు గొప్పా - విష్ణువు గొప్పా? Who is the Supreme Lord?
శివుడు గొప్పా - విష్ణువు గొప్పా? శైవులకూ వైష్ణవులకూ మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం. ఆదిశంకారాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పాటించారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. మన పురాణాలను చూసుకున్నట్లయితే, ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని ఎక్కడా వివరించబడిలేదు. ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అంటే, శివుడు, విష్ణువు, ఒక్కటే అని అర్థం. విష్ణు స్వరూపమైన కృష్ణుడు, సంతానాన్ని పొందడానికి పరమశివునికై తపస్సు చేశాడు. సతీ దేవిని కోల్పోయి విరాగిగా మారిన శివుడికి సహాయం చేసింది, విష్ణువు. మన పురాణాలలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ, నేటి సమాజంలో శివుడు గొప్పా, విష్ణవు గొప్పా అనే మీమాంసలో జీవిస్తున్నాము. కొన్ని శతాబ్దాల క్రితం శివ భక్తులకూ, విష్ణు భక్తులకూ మధ్య వైరం ప్రజ్వరిల్లింది. ఈ ఆహుతిలో రామానుజాచార్యుల వారు కూడా బలయ్యారు. శైవ రాజులు ఎంతో మంది, వైష్ణవులను నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. వైష్ణవ రాజులు కూడా శివ భక్తులతో కఠినంగా వ్యవహిరించారు. అసలు ఈ గొడవకూ, రామానుజాచార్యుల వారికీ సం