కులవ్యవస్థ! Casteism భగవద్గీత Bhagavad Gita Chapter 18
కులవ్యవస్థ! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రుల గురించి శ్రీకృష్ణుడేం చెప్పాడు? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (37 – 41 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 37 నుండి 41 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/uyfTaY-i77Q ] సత్వ గుణ ఆనందం, రజో గుణ ఆనందం, తామసిక ఆనందం ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము.. 00:49 - యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ । తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 37 ।। మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే, సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానము యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. ఉసిరికాయ, ఆరోగ్యానికి లాభకారియైన అత్యుత్తమ ఆహారపదార్ధాలలో ఒకటి. దానిలో, 10 నారింజ పళ్ళకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ, అది పుల్లగా ఉంటుంది కాబట్టి, పిల్లలకు అది ఇష్టం