Posts

Showing posts with the label The Khmer Empire

Origin of Hinduism in Cambodia - The Khmer Empire | హిందూ రాజు పేరుమీద ఏర్పడిన మరో దేశ చరిత్ర!

Image
  హిందూ రాజు పేరుమీద ఏర్పడిన మరో దేశ చరిత్ర! 2000 ఏళ్ల నాడు వ్యాపార నిమిత్తం చేసిన ప్రయాణం ఒక దేశ ఆవిర్భావానికి కారణం అయ్యిందా? మన దేశం భారత దేశంగా పిలవబడడానికి కారణం, కొన్ని యుగాలకు పూర్వం ఈ దేశాన్ని ఏలిన భరత చక్రవర్తి అనే విషయం తెలిసిందే. పరిపాలనా దక్షత, వీరత్వం, మంచి మనస్సు, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ వంటి సూక్ష్మాలను పాటిస్తూ, ప్రజలు ఏ విధంగా ఉండాలి, రాజులు ఏ విధంగా పాలించాలనే విషయాలను భావితరాలకు అందించిన యుగ పురుషుడాయన. అందుకే మన దేశానికి భారత దేశం అనే పేరు స్థిరపడింది. ఆయన పాలనలో అఖండ భారతావని ఆవిష్కృతం అయ్యింది. దాదాపుగా అటు మధ్య ఆసియా దేశాలుగా పిలవబడే ఇరాక్, సిరియా నుంచి ఇటు ఫిలిప్పీన్స్ ద్వీప దేశం వరకు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకే ఆయన పాలించిన రాజ్యాన్ని భారత దేశం అని కాకుండా, భరత ఖండం అని పిలిచేవారు. మరి ఈ ప్రపంచంలో మన హిందూ రాజు పేరుపై నిర్మితమైన మరో దేశం గురించి మీరెప్పుడయినా విన్నారా? ఎక్కడో ఉన్న మరో దేశానికి ఒక హిందువు రాజు ఎలా అయ్యాడు? ఆయన పేరుమీద ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? వంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూస...