Posts

Showing posts with the label Headless Goddess in Varanasi Teaser

Chinnamasta: The Self-Decapitated Goddess of Tantra in Varanasi Teaser | స్వయం శిరః ఖండిత!

Image
  స్వయం శిరః ఖండిత!  వారణాసి చిత్రం టీజర్ లో కనిపించిన ‘తల లేని దేవత’ ఎవరు?  ఆవిడ రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? వారణాసి మూవీ టీజర్ లో కనిపించిన తల లేని దేవత విగ్రహం ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశం. ఆ విగ్రహం, చిత్రం యొక్క కథనానికి లోతైన సంబంధాన్ని సూచించే విధంగా, ముఖ్యంగా రుద్రుడి పాత్రకు సంబంధించి ప్రాముఖ్యత కలిగినట్లుగా చిత్రీకరించబడింది. విగ్రహం ఉనికి, అనుబంధ సన్నివేశాలు, దాని ప్రతీక వాదం మరియు చిత్రం యొక్క ఇతివృత్తాల గురించి ఎన్నో చర్చలకూ, ఊహాగానాలకూ దారితీసింది. టైమ్ ట్రావెల్ మరియు పునర్జన్మల యొక్క అన్వేషణలో సాగే ఈ చిత్రంలో చూపించబడిన ఆ దేవత ఎవరో ఈ రోజు తెలుసుకుందాము. ఆది అంతం లేని ఓ మహా శక్తి ఆ ‘దైవం’. సమస్త లోకాలనూ సృష్టించడమే కాకుండా, వాటి స్థితీ లయ కారక భాధ్యతలు కూడా ఆ నిరాకార పరబ్రహ్మమే నిర్వహిస్తాడని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ మహత్తర కార్యం క్రమబద్ధంగా కొనసాగడానికి ఎన్నో విభాగాలూ, వాటి క్రింద మరెన్నో శాఖలూ, ఉపశాఖలూ ఉంటాయి. ఆయా విభాగాలూ, శాఖలూ సమర్ధవంతంగా పనిచేయడానికే ముక్కోటి దేవతలూ వెలిశారని మన వేదాలు తెలియబరుస్తున్నాయి. ఆ దేవీ దేవతలల...