Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Thursday, August 28, 2025

Remembering Vyaasa


వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

తాత్పర్యం:

వశిస్టుని మునిమనుమడు శక్తి యొక్క మనుమడు, పరాశరుని పుత్రుడు మరియు శుకుని పిత అయిన ఓ వ్యాసా, అమిత తపొబలం కలిగి, కల్మషం లేని నీకు ఇవే మా వందనములు.

వివరణ:

విష్ణు సహస్ర నామం మహాభారతంలోని అనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో వున్నది. ఇంతటి మహాగ్రంథాన్ని మనకి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. అతన్ని స్మరించకుండా సహస్ర నామాలు జపించడం కృతఘ్నత అవుతుంది. మనకి మేలు చేసిన వారిని తలుచుకోవడం, వారికి కృతజ్ఞత తెలుపుకోవడం సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకి అందించిన ఒక గొప్ప వరం. కాబట్టి ఇంత గొప్ప గ్రంథాన్ని మనకందించిన వ్యాసుల వారిని, వారి పూర్వీకులను మనం తప్పకుండా స్మరించాలి.

Vyaasam Vasistanapthaaram Sakthe pouthramakalmasham |
Parasaaraathmajam vande Sukathaatham taponidhim ||

Meaning:

O great grandson of Vasistha, O grandson of Sakthi the one without any faults, O son of Paraasaraa and father of Suka, we salute you, the one who is a treasure of knowledge.

Explanation:

Vishnu Sahasra Namam belongs to the 149th chapter of Anusasanika parva (section) of Mahabhaaratha. Vyasa composed Mahabhaaratha. We are being ungrateful if we just chant Vishnu Sahasra Namam without paying tribute to the great Vyasa. Paying respects and being grateful to our elders is an important part of Sanathana Dharma. It teaches us to be powerful yet humble.

So, let us remember Vyasaa, his ancestors and his lineage prior to reaping the benefits of Sahasra Namam.

Wednesday, August 27, 2025

Sunday, August 24, 2025

Akbar Exposed: Facts You Didn’t Know vs Myths Busted | అక్బర్ ది గ్రేట్?

 

అక్బర్ ది గ్రేట్? ఆడవారి మానప్రాణాలు తీయడంలోనా?
Akbar Exposed: Facts You Didn’t Know vs Myths You Still Believe Busted

ఆరడుగుల ఆజానుబాహుడు, ఆ కాలంలోని రాజులందరిలోకీ అందగాడు, గొప్ప పాలకుడు, హిందూ ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించిన ఉదాత్త చక్రవర్తి.. తనకంటే ముందు పాలించిన ముస్లిం రాజులు హిందువులను హింసించడానికి వేసిన జిజియా పన్నును తొలగించి, భారత దేశ చరిత్రలో మొట్ట మొదటి సెక్యులర్ నేతగా గుర్తింపు పొందిన మహా రాజు.. అసలు సెక్యులరిజం అనే పదం పుట్టిందే ఆయన దగ్గర నుంచి.. హిందూ రాజకుమార్తెలను పెళ్లి చేసుకుని, వారి మత నమ్మకాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సున్నిత మనస్కుడు.. ఇక ఆడవారిపై ఆయన చూపించే గౌరవం మాటల్లో చెప్పలేము.. ఇంతగా కీర్తింపబడుతున్న ఆ మహా రాజు ఎవరో కాదు..   చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకునే Akbar The Great.. నిజంగా.. Akbar అంతటి వాడా? చరిత్ర వక్రీకరణ అనే పదం చాలా సార్లు వినే ఉంటాము. కానీ అసలు అక్బర్ కు సంబంధించి ఆ పదం వాడుక వెనుక ఉన్న వాస్తవాలను ఈ రోజు తెలుసుకుందాము. ఏ పాఠ్యపుస్తకంలో వర్ణించనిది, కావాలని ఇన్నేళ్ళుగా దాచిపెట్టబడింది, హిందువుల నాశనం కోసం ఆయుధంగా వాడబడిన అటువంటి కఠోర సత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QiTACW3K2Ng ]


దాదాపు వెయ్యేళ్ల క్రితం Umayyad వంశ ఆధ్వర్యంలో ఏర్పాటైన 2వ Caliphate సమయం అది. సరిగ్గా ఆ సమయంలోనే Umayyad Caliphate లోని అత్యంత కౄరుడిగా పేరుతెచ్చుకున్న Muhammad bin Qasim అనే సైన్యాధిపతి, అఖండ భారతావనిపై చేసిన దాడితో ముస్లింల దండయాత్రలూ, వారి ఆక్రమణా మెల్ల మెల్లగా మన దేశంలో మొదలైంది. అలా Mamluk లు, Khilji లు, Tughlaq లు, Sayyid లు, Lodi లు, Bahmani లు, Ghoriలు, Qutb Shahi లు, మొఘలుల వంటి ముస్లింలు మన భారత దేశాన్ని ఆక్రమించి, ఈ భూవిపై ఉన్న ప్రత్యక్ష నరకంలా మార్చేశారు.

వారిలో అత్యంత పెద్ద రాజ్యాన్ని స్థాపించి, ఎక్కువ కాలం పాటు పాలించిన ముస్లింలలో మొఘలులు ప్రధమం. ఆ వంశంలో పుట్టిన ఆణిముత్యమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న Akbar. మన దేశాన్ని ఆక్రమించిన ముస్లింలందరిలో, అక్బర్ భిన్నమైనవాడని చరిత్ర నిరూపిస్తోంది. అతను కదనరంగంలో నేరుగా ఒక్కసారి కూడా కత్తి దూసింది లేదు. మన కుహనా చరిత్రకారులు మాత్రం, అతడిని ఏనుగులతో పోరాడే యోధుడిగా చిత్రీకరించారు. చారిత్రక వాస్తవాలను దాచేసి మనపై ఇంతకాలం రుద్దిన చరిత్రను పక్కనపెట్టి, అత్యంత ఘోరమైన, అసలైన అక్బర్ చరిత్ర గురించి ఈ రోజు తెలుసుకుందాము.

అక్బర్ జీవితం, హేమచంద్ర విక్రమాదిత్యుడి హత్యతోనే మొదలైందని చెప్పవచ్చు. భారత దేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ అతికొద్ది కాలంలోనే మరణించడంతో, ఆ పదవి అతని కొడుకైన హుమాయూన్ చేతికి వెళ్ళింది. అయితే రాజ్య విస్తరణలో భాగంగా, మన దేశంలోని వివిధ రాజ్యాలపై దండెత్తిన సమయంలో, Sher Shah Suri అనే మరో రాజు చేతిలో హుమాయూన్ ఘోరంగా ఓడిపోయి, ఢిల్లీ పీఠాన్ని వదులుకుని పారిపోయాడు. ఆ తర్వాతే అక్బర్ పుట్టడం, దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీపై పట్టు సాధించడం, అలా ఢిల్లీ గద్దెనెక్కిన హుమాయూన్ కొద్ది నెలలకే చనిపోవడం జరిగింది. ఆ సమయంలో ఢిల్లీ పీఠాన్ని లాగేసుకున్న వీరుడు, హేమచంద్ర విక్రమాదిత్యుడు. ఆయనను హేము అని కూడా పిలుస్తారు. నాటి పంజాబ్ రాజైన Muhammad Adil Shah Suri దగ్గర హేము సామంత రాజుగా, ముఖ్యమైన రాజకీయ సలహాదారుడిగా, సైన్యాధిపతిగా, అనేక బాధ్యతలు నిర్వహించేవాడు. Hemu నాయకత్వంలోనే Muhammad Adil Shah Suri సేనలు, దాదాపు 22 యుద్ధాలు గెలిచాయి.

హుమాయూన్ మరణం తర్వాత Muhammad Adil Shah Suri ని ఢిల్లీ సింహాసనం బాగా ఊరిచింది. అనుకున్నదే తడవుగా Hemu ని అడగగా, తన మిత్రుడి కోసం ఢిల్లీని బహుమతిగా ఇచ్చాడు. దాంతో అక్బర్ అతని పరివారంతో సహా హస్తినాపురిని వదిలి పారిపోవాల్సి వచ్చింది. అయితే కొద్ది నెలలలోనే అక్బర్ తన సైన్యాన్ని కూడగట్టుకుని, Hemu పై దండయాత్ర చేశాడు. ఆ సమయంలో అక్బర్ వయసు కేవలం 14ఏళ్ళు మాత్రమే. అక్బర్ కి మామ, సర్వసైన్యాధికారీ అయిన బైరం ఖాన్ ఆ యుద్ధాన్ని పర్యవేక్షించాడు. ఆ దండయాత్రలో విజయం చాలా సేపు Hemu వర్గం వైపే ఉందని అనిపించింది. అయితే, అనుకోకుండా ఓ బాణం హేము తలకి తగలగా, ఆ దెబ్బకి అతను మూర్ఛపోయి పడిపోయాడు. అది చుసిన అతని సేనలు, తమ రాజు చనిపోవడంతో చెల్లాచెదురయిపోయారు. దాంతో విజయం అక్బర్ ని వరించింది. అయితే కొంతసేపటికి Hemu కు మెలకువ రాగా, అది చుసిన అక్బర్ సేనలు అతన్ని బంధించి, తమ రాజు ముందు ప్రవేశ పెట్టారు. సంకెళ్లతో కట్టబడి, కంట్లో బాణం దిగబడి తీవ్రమైన గాయంతో ఉన్న Hemu దగ్గరకు మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వెళ్లిన అక్బర్, ఎంతో వీరోచితంగా, బందీగా ఉన్న హేము తల నరికి చంపాడు. అతనేదో యుద్ధంలో ఎదురెదురుగా కత్తి యుద్ధం చేసి hemu ను చంపినట్లు బిల్డప్ ఇస్తూ, హేము తలను కాబూల్ కి పంపించాడు. మొండాన్ని ఢిల్లీ కోట గుమ్మానికి వేలాడదీయించాడు. hemu సేనలను వెంటాడి వేటాడి చంపించి, వారి తలలతో ఒక మినార్ లా కట్టించాడు. అలా అక్బర్ ఢిల్లీ గద్దెనెక్కాడు.

Hemu తో చేసిన యుద్ధమే అక్బర్ చేసిన ఆఖరి యుద్ధం అని చరిత్రకారులు చెబుతారు. అంటే, ఆ తర్వాత ఎప్పుడూ అక్బర్ నేరుగా కదన రంగానికి రాలేదు. ఢిల్లీ కోటలో కూర్చుని తన బలగాలను పంపించడం మాత్రమే చేశాడు. ఒకటి రెండు సార్లు వెళ్లినా, యుద్ధం చివరలో వెళ్లి, కదనరంగానికి దూరంగా విలాసవంతమైన గుడారాలను వేసుకుని పర్వవేక్షించడం లాంటివి చేసినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి అక్బర్ ని శూరుడు, ధీరుడు అని బీరాలు పలికారు, మన కుహనా చరిత్రకారులూ, మేధావులూ.

అక్బర్ యుద్ధ రంగానికి ఎప్పుడూ రాకపోయినా, సమస్త భారత దేశాన్ని తన వశం చేసుకోడానికి వేసిన ఎత్తులు మాత్రం గొప్పవని చెప్పుకోవచ్చు. అటువంటి వాటిలో ఒకటి Mewar రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం. కానీ, అక్కడ ఉన్నది సామాన్యమైన వ్యక్తి కాదు. అతని పేరు చెబితేనే అక్బర్ వెన్నులో వణుకు పుట్టేది. ఆయనే మహారాణా ప్రతాప్. ఆయన రాజ్ పుత్ లలో పుట్టిన వెలకట్టలేని మాణిక్యం. ఆయన కేవలం ఒక రాజు కాదు. ఏడున్నర అడుగుల సజీవ యుద్ధం. ఆయన వీరత్వం, యుద్ధ కౌశలం, రాజ నీతి, పరమత సహనం, దేశంపై ప్రేమ వంటి విషయాలు వింటున్నప్పుడు, రోమాలు నిక్కపొడుచుకోక మానవు. అసలు ప్రపంచానికి గెరిల్లా యుద్ధ తంత్రాన్ని నేర్పిన మొట్ట మొదటి రాజు, మహారాణా ప్రతాప్. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే, ఛత్రపతి శివాజీ మహారాజ్, భారీగా ఉండే మొఘలులపై గెరిల్లా యుద్ధాలను చేసి, మహా మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ప్రతాపుడి యుద్ధ తంత్రమే, ఆధునిక కాలంలో అమెరికా దురాక్రమణను ఎదిరించి, అగ్రరాజ్యాన్ని తరిమికొట్టిన వియత్నాం సైన్యం పాటించింది. ఆ విషయాన్ని స్వయంగా నాటి వియత్నాం సైన్యాధికారి, యుద్ధం గెలిచిన తర్వాత ప్రెస్ తో చెప్పారు. కానీ మన కుహనా చరిత్రకారులు మాత్రం, అసలు వాస్తవాలను దాచిపెట్టి, మహారాణా ప్రతాప్ ని ఓ బందిపోటు గా, అక్బర్ ని ఉదార చక్రవర్తిగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు.

ఆ కాలంలో Mewar రాజ్యం, ముఖ్యమైన ట్రేడ్ రూట్ గా ఉండేది. ఉత్తర భారతం నుంచి మధ్య ఆసియాకూ, బయట నుంచి భారత దేశంలోకి వర్తకులు వాడే మార్గాలలో, Mewar రాజ్యం ముఖ్యమైనది. అందువల్ల అక్బర్, Mewar ని చాలా ముఖ్యంగా భావించాడు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తహతహలాడాడు. అందుకు ముందుగా సంధికోసం ప్రయత్నించినా, స్వతహాగా స్వాభిమాని అయిన మాహారాణా ప్రతాప్, అక్బర్ చెప్పు కింద కుక్కలా పడిఉండటం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పేశాడు. దాంతో అక్బర్ Mewar పై యుద్ధం ప్రకటించాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఆ రాజ్యంలో ముఖ్యపట్టణమైన Chittorgarh పై దాడి చేసి, 4 నెలలపాటు నిర్విరామంగా యుద్ధం చేసి, చివరకు ఆ కోటను సొంతం చేసుకున్నాడు.

ఈ దాడి చరిత్రలో నిలిచిపోయిన అతి హేయమైన దాడులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ రోజు Chittorgarh చూసింది కేవలం ఓటమిని మాత్రమే కాదు. ప్రత్యక్ష నరమేధాన్ని చూసింది. ఆ సమయంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 30 వేల మంది ఆ కోటలో తలదాచుకున్నారు. వారంతా స్థానికంగా నివసించే సామాన్య ప్రజలు.. రైతులుగా, కూలీలుగా, చేతి కళాకారులుగా బ్రతికే వారు. అటువంటి అమాయకులను అత్యంత కిరాతకంగా చంపించాడు. Chittorgarh లోని మహిళలు యుద్ధం ఓడిపోయామని తెలియగానే, అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. మిగిలి ఉన్న మగవారినీ, చిన్నపిల్లలనూ తలలు నరికి, మర్మాంగాలు కోసి, అత్యంత పైశాచికంగా చంపించాడు అక్బర్. మిగిలిన కొద్దిమందినీ బందీలుగా తీసుకెళ్లి, మధ్య ఆసియా దేశాలకు బానిసలుగా అమ్మాడు. ఇక మిగిలిన ఒకరిద్దరు ఆడవారిని హరంకు తరలించాడు. Chittorgarh పై తాను సాధించిన విజయాన్ని తన సామంత రాజులకూ, శత్రు రాజులకూ తెలిసే విధంగా Fatehnama e Chittor జారీ చేశాడు. ఇందులో తన విజయాన్ని, కాఫిర్ హిందువులపై నెగ్గిన ఇస్లాం గా చెప్పుకున్నాడు. ముస్లింలు ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ, ఇస్లాం పద్ధతులకు వ్యతిరేకంగా ఉండే హిందువులను చంపాలని కూడా ఆదేశించాడు. ఆ రోజు Chittorgarh లో ఉన్న మందిరాలన్నింటినీ నేలమట్టం చేశాడు. హిందూ దేవుళ్ళ మూర్తులను మాటల్లో చెప్పలేనంత జుగుప్సాకరంగా అవమానించి, నాశనం చేయించాడు. అలా Chittorgarh లో అక్బర్ చేసిన దారుణాలు చెప్పడానికి ఒక పుస్తకం సరిపోదు. ఇవేమీ మన చరిత్ర పుస్తకాలలో రాయబడలేదు. పైగా అక్బర్ అన్ని మతాలనూ గౌరవించేవాడని చాలా గొప్పగా రాసుకొచ్చారు.

ఇక ఆడవాళ్లను హరంకు తరలించాడన్న మాట విన్నారుకదా.. అసలు ఈ హరం గురించి తెలుసుకుంటే చాలు, అక్బర్ ఎంత నీచుడో అర్ధం అవుతుంది. ఆ రోజు Chittorgarh లోని స్త్రీలంతా ఆత్మాహుతి చేసుకోవడానికి కారణం, ఈ హరం గురించి తెలుసుకునే అని చెప్పవచ్చు. అక్బర్ చేసిన ఎన్నో దారుణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది, హరం. స్త్రీలను తన భోగ సుఖాల కోసం బంధించి ఉంచే ఓ ప్రదేశమే ఈ హరం. అక్కడ ఏకంగా 5 వేల మంది ఆడవారిని బంధించి ఉంచాడు. ఈ హరంనే నాడు అక్బర్ మోచేతి నీళ్లు తాగి బ్రతికిన Abu'l-Fazl లాంటి వాళ్ళు Janana అని పిలిచేవారు. అక్బర్ ను పొగుడుతూ Abu'l-Fazl రాసిన Akbarnama లో ఈ విషయాలను ప్రస్తావించాడు. Janana అంటే Pashto భాషలో my love, i am your devotee అనే అర్ధాలున్నాయి. అక్కడున్న 5 వేల మంది స్త్రీలూ, కేవలం అక్బర్ కామ దాహాన్ని తీర్చే బానిసలు. వారిలో ప్రతి ఒక్కరికీ ఒక ఇల్లు ఏర్పాటుచేసి, కాపలాగా నపుంసకులను పెట్టాడు. వారిలో కొంతమంది పుట్టుకతో నపుంసకులు కాగా, యుద్ధ ఖైదీలుగా దొరికిన కొంతమందికి శిక్షగా వారి అంగాన్ని కత్తిరించి నపుంసకుడిగా మార్చి, ఆ Janana లో కాపలాగా పెట్టేవాడు. ఇక అదే Akbarnama ప్రకారం, Janana పక్కన ఒక భారీ మద్యశాల ఉండేది. అక్కడ ఎన్ని వేలమంది వేశ్యలుండేవారో లెక్కేలేదని Abu'l-Fazl స్వయంగా రాశాడు. janana లోని మహిళలను తన రాజకీయ అవసరాల కోసం ఇతర దేశాల ముస్లిం రాజులకు తార్చే వాడు. ఆయా దేశాలలో ఎవరైనా అందమైన స్త్రీలుంటే వాళ్ళను కొనుక్కు తెచ్చుకుని, తన janana లో ఉంచుకుని భోగించేవాడు. అలా స్త్రీలను తన వాంఛ తీర్చే ఉంపుడు గత్తెలుగా, తన రాజకీయ అవసరాలు తీర్చే భోగ వస్తువులుగా చూసేవాడు.

ఇక్కడ గుండెల్ని కలచివేసే మరో విషయం ఏమిటంటే, ఈ ఆడవారంతా హిందువులే. నాడు అక్బర్ ఏ రాజ్యంపై దాడి చేసినా, అక్కడి హిందూవుల భార్యలనూ, తోబుట్టువులనూ సజీవంగా బంధించి తెచ్చి, వారిలో అందమైన వారిని తన Janana లో ఉంచి, మిగిలిన వారిని వేశ్యలుగా మార్చి తన కోటలోని ముఖ్యమైన వారి కామవాంఛలు తీర్చడానికి ఏర్పాటు చేసేవాడు. వీరే కాకుండా అక్బర్ కి 32 మంది భార్యలు ఉన్నారు. వారిలో చాలా మంది హిందూ రాజకుమార్తలే. నాటి రాజ్ పుత్ రాజులను సంధి పేరుతో మభ్యపెట్టి, వారి కుమార్తెలలో అందమైన వారిని పెళ్లి చేసుకునేవాడు.

అక్బర్ చేసిన మరో పరమ నీచకృత్యం ఏమిటంటే, తనను చిన్ననాటినుంచీ పెంచి పెద్ద చేసి, చక్రవర్తిని చేయాలని అహర్నిశలూ పాటు పడిన తండ్రి సమానుడైన Bairam Khan భార్య Salima Sultan Begum ని కూడా వదలలేదు ఆ ప్రబుద్ధుడు. ఆమె Bairam Khan కంటే వయసులో చాలా చిన్నదే అయినా, ఆమె అందానికి ముగ్ధుడైన Bairam Khan ఆమెను రెండవ వివాహం చేసుకున్నాడు. అంతటి అందగత్తె Bairam Khan దగ్గర ఉండటాన్ని చూసి ఓర్వలేకపోయిన అక్బర్, అతడిని చంపించి, తల్లితో సమానమైన Salima ను వశపరుచుకున్నాడు.

ఇప్పటికీ రాజస్థాన్ లో స్థానికంగా వినిపించే ఓ గాధ, అక్బర్ లోని కామ దాహానికి పరాకాష్టగా నిలుస్తుంది. అందమైన స్త్రీలు ఎక్కడున్నా, వారిని నయానో భయానో సొంతం చేసుకోవాలనుకునే అక్బర్ కన్ను, Mewar మహారాజైన రాణాప్రతాప్ చెల్లెలిపై పడింది. రాణాప్రతాప్ చెల్లెళ్ళలో ఒకరైన Maan Kanwar కి గొప్ప అందగత్తెగా పేరుంది. Mewar తో సంధి చేసుకుని, ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు అక్బర్. అయితే సంధి ప్రయత్నాలను రాణాప్రతాప్ తిరస్కరించడంతో, Maan Kanwar ని ఎలాగైనా దక్కించుకోవాలని అక్బర్ చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఒకనాడు ఆమె చేతిలో తన్నులు కూడా తిన్నాడు. అప్పట్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన బజార్లు ఏర్పాటు చేసేవారు. ఆ బజార్లలో అమ్మేవారూ, కొనేవారూ, ఆఖరికి కాపలా కాసే వ్యక్తులు కూడా స్త్రీలే ఉండేవారు. అటువంటి బజారుకు Maan Kanwar తరచూ వస్తుందని తెలుసుకున్న అక్బర్, స్త్రీ వేషంలో వెళ్ళి ఆమెను అక్కడి నుంచి ఎత్తుకెళ్లాలని ప్రయత్నించాడు. అయితే రాజ్ పుత్ మహిళలు సామాన్యమైన వారు కాదనే విషయం నాడు అక్బర్ కి తెలియదు. Maan Kanwar నడి బజారులో అక్బర్ ని కుక్కను కొట్టినట్లు కొట్టింది. భటుల రాకతో బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి తప్పించుకు పారిపోయాడు అక్బర్. వీరుడు, శూరుడని చరిత్ర పుస్తకాలలో రాయించుకునే అక్బర్, నాడు ఒక మహిళ చేతిలో తన్నులు తిన్నాడనే విషయానికి ప్రచారం జరిగితే పరువు గంగలో కలిసిపోతుందని తెలిసి, ఆ ఘట్టం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ ఆ విషయం ఇప్పటికీ రాజస్థాన్ జనబాహుళ్యంలో బుర్ర కథగా ప్రాచుర్యంలోనే ఉంది.

ఇక చరిత్రకారులు కుతంత్రంతో అల్లిన ఓ కట్టు కథ, జోధా అక్బర్ ప్రేమ కథ. కామం తప్ప మరొకటి ఎరుగని అక్బర్ కి మన కుహనా చరిత్రకారులు ఎంతో చక్కని ప్రేమ కథను పుట్టించారు. దానిని ఆధారం చేసుకుని, పాకిస్థాన్ ISI విసిరే కుక్క బిస్కెట్లకు కక్కుర్తిపడి సినిమాలు తీసే మన బాలివుడ్ బడా నిర్మాతలూ, దర్శకుల నుంచి, సీరియల్ నిర్మాణ సంస్థలు కూడా జోధా అక్బర్ పేరుతో చిత్రాలు తీసి, ఆ అబద్ధపు చరిత్రను బలవంతంగా రుద్దారు. జోధా అక్బర్ కథ వెనుక వున్న అసలు కుట్ర, హిందూ మహిళలను లవ్ జిహాద్ పేరుతో మతం మార్చడం. అందమైన ఈ అబద్ధపు ప్రేమ కథను చూపించి, హిందూ అమ్మాయిలు వారిని ఆ కథలో అక్బర్ లా ఊహించుకుని, ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చాలన్నదే వారి అసలు కుట్ర. ఆ కుట్రకి మన బాలీవుడ్ కుక్కల సహకారం తెలిసిందే.

వారి పవిత్ర గ్రంథం ప్రకారం, మహిళలను వేశ్యలుగా చేయడం, వేశ్యలతో సంభోగించడం, మత్తు పానీయాలు సేవించడం, నపుంసకులతో పడుకోవడం వంటివి అన్ని హరామ్ గా పరిగణించబడతాయి. అలాంటి పనులు చేసేవారు వారిలెక్కలో శిక్షార్హులు. కానీ అక్బర్, అతని వంశీయులంతా, వారి పవిత్ర గ్రంథంలో ప్రస్థావించబడిన చేయకూడని పనులన్నీ చేశారు. అయినా అతడిని నాటి వారి మత పెద్దలు ఎదిరించలేకపోయారు. మతాన్ని అక్బర్ అవసరం కోసం వాడుకున్నాడని చరిత్రకారులు గుర్తించారు. పైగా అక్బర్ Din-i Ilahi అనే కొత్త మతాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. ఆ మతానికి తాను మొదటి ప్రవక్తగా ప్రచారం చేసుకున్నాడు. తననితాను పవిత్రమైన వ్యక్తిగా, దైవ దూతగా కూడా ప్రచారం చేసుకున్నాడు.

‘ఘాజీ’ అంటే ముస్లిమేతరులను చెంపిన వీరుడని అర్ధం వస్తుంది. Hemu ని చంపినప్పుడు అక్బర్ కి ఆ బిరుదు వచ్చింది. ఇలాంటి బిరుదుగల వ్యక్తులు ఆ కాలంలో చాలా మంది ఉండే వారు. ఘాజీ అనే బిరుదు బాబర్ కాలం నుంచి వస్తున్నట్లు చరిత్రకారులంటున్నారు. ఈ ఘాజీల ప్రధాన లక్ష్యం, హిందువుల నుంచి జిజియా పన్ను వసూలు చేయడం, హిందూ మహిళలను చెరపట్టడం, మగవారిని చంపడం. అయితే వీరు జిజియా పన్ను కట్టేవారిని మాత్రం ఏం చేసేవారు కాదు. జిజియా పన్నును అక్బర్ రద్దు చేశాడని నేటి కుహనా చరిత్రకారులు చెబుతారు కానీ, అసలైన చరిత్ర ప్రకారం, Ranastambhapura రాజ్యంతో జరిగిన చర్చల్లో భాగంగా మాత్రమే, జిజియా పన్ను రద్దు చేస్తానని అక్బర్ చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా రాచరిక స్త్రీలను తన Janana కు బహుమతిగా ఇస్తేనే జిజియా పన్ను రద్దు చేస్తానని చెప్పినట్లు చరిత్ర విదితం. ఇప్పుడు ఆ Ranastambhapura కోటనే, Ranthambore Fort గా పిలుస్తున్నారు. ఆ ప్రాంతాన్ని Ranthambore National Park గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అలా జీవితాంతం ఎన్నో దారుణాలు చేసిన అక్బర్ తన చివరి రోజుల్లో కొడుకు సలీమ్ చేతుల్లో కుక్కచావు చచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కథనం ప్రకారం, స్వయంగా సలీమ్, అక్బర్ జబ్బును తగ్గించే మందు పేరుతో విషం ఇచ్చి చంపినట్లు తెలుస్తోంది. సలీమ్ అలా చేయడం వెనుక తన తల్లి Mariam-uz-Zamani పగ కారణమని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అక్బర్ భార్య Mariam-uz-Zamani అసలు పేరు Harkha Bai. ఆమెను జియా రాణి అనికూడా పిలిచేవారు. ఒకనాడు రాజ్ పుత్ రాజ్యాలలో ఒకటైన Amber రాజ్యాన్ని అక్బర్ సేనలు ఓడించాయి. ఆ క్రమంలో అంబర్ రాజ్యానికి రాజైన Bihari Mal ని సంధి నెపంతో మభ్యపెట్టి, అతని కూతురైన Harkha Bai ని పెళ్లి చేసుకోవాలని చూశాడు అక్బర్. అయితే హైందవ సంప్రదాయాలను ఎంతో నిష్టగా పాటించే Harkha Bai కి అక్బర్ తో వివాహం ఇష్టం లేక, కోటను విడిచి పారిపోయింది. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న Bihari Mal కి Harkha Bai పోలికలతో ఉన్న ఒక దాసీ కూతురు కనిపించింది. ఒకప్పుడు Bihari Mal కి ఆ దాసితో ఉన్న సంబంధం కారణంగా జన్మించిన ఆమెనే Harkha Bai గా నమ్మించి అక్బర్ కిచ్చి పెళ్లి చేశాడు.

కొంతకాలం తరువాత ఒకనాడు మద్యం మత్తులో ఉన్న Bihari Mal అసలు నిజాన్ని అక్బర్ సన్నిహితుడి దగ్గర చెప్పడంతో, అక్బర్ అగ్గిమీద గుగ్గిలమై, వెంటనే కడుపుతో ఉన్న దాసీ కూతురిని ఎత్తైన మినార్ పై నుంచి తోయించి చంపించాడు. ఈ పాపపు కర్మ కారణంగానే అక్బర్ కి పుట్టిన పిల్లలలో ఒక్క సలీమ్ తప్ప ఎవరు ఎక్కువ కాలం బ్రతకలేదని చరిత్రకారులంటున్నారు. ఆ తర్వాత Harkha Bai తన మేనమామ దగ్గర తల దాచుకుందని తెలిసి, ఆ రాజ్యంపై దండెత్తాడు. ఆ యుద్ధం జరిగితే తన వల్ల తన మామ రాజ్య ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసి, గత్యంతరం లేక అక్బర్ తో వెళ్ళిపోయిందామె. ఆమెకు ఇష్టం లేకపోయినా మతం మార్చి, కడుపుతో ఉన్న దాసీ కూతురిని చంపి, వారి రాజ్యాలను తన గుప్పెట పెట్టుకున్న అక్బర్ పై Harkha Bai కి అంతులేని పగ ఉండేదని చరిత్రకారులు చెబుతారు.

తల్లి చెప్పిన విషయాలతోపాటు తాను ప్రత్యక్షంగా చుసిన అక్బర్ క్రూరత్వం కారణంగా, చిన్నప్పటి నుంచి సలీమ్ తన తండ్రిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. అయితే చంపే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు. కానీ అక్బర్ కి వయసుమళ్ళిన సమయంలో అవకాశం దొరకగానే, అక్బర్ కి సలీమ్ విషం ఇచ్చి చంపాడని చరిత్రకారులు చెబుతున్నారు. అక్బర్ మరణం తర్వాత, ‘సలీమ్’ జహంగీర్ అనే పేరుతో కొనసాగాడు. ఇక అక్బర్ ని ఎంతో పరమత సహనం కలిగిన వ్యక్తిగా, హిందూ మతాన్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా, అతనెప్పుడూ హిందూ ఆలయాలను నాశనం చేయలేదని కుహనా చరిత్రకారులు చెప్పుకొస్తారు. అది పచ్చి అబద్ధమని వాస్తవ చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు Nagarkot లోని ఒక గుడిలో అతడు చేసిన అకృత్యాల గురించి తెలిస్తే రక్తం మరగిపోతుంది. అక్బర్ తన సేనలను ఆదేశించి, Nagarkot లోని ఓ మందిరంలో పూజలు చేస్తున్న బ్రాహ్మణులను పైశాచికంగా చంపించాడు. అక్కడ ఉన్నవారి పరివారాలను కూడా తెగనరికించాడు. ఎప్పటిలాగానే ఆడవారిని తన janana కి తరలించాడు. ఇవి కాకుండా, అక్బర్ సేనలు ఆ మందిరంలోని 200 ఆవులను నరికి చంపి, ఆ రక్తాన్ని వారి చెప్పులలో పట్టి మందిరం గోడలపై విరజిమ్మించాడు.

హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలా ముఖి అమ్మవారి శక్తిని పరీక్షించ ప్రయత్నించి ఓడిపోయి, తోక ముడిచి ఢిల్లీ పారిపోయాడు. కొన్ని యుగాలుగా జ్వాలాముఖి మందిరంలో వెలుగుతున్న అమ్మవారి శక్తిని ఆర్పడానికి ప్రయత్నించాడు. ఆ తల్లి శక్తి ముంది అలాంటి నీచుల ఆటలు సాగవుకదా! అక్కడ చావుతప్పి కన్ను లొట్టబోయినా కూడా, అక్బర్ ఆగడాలు ఆగలేదు. ప్రయాగ్ రాజ్ వంటి ఎన్నో క్షేత్రాలపై దాడి చేశాడు. అంతేకాదు, ప్రయాగ్ రాజ్ పేరు అలహాబాద్ గా మార్చాడు. ఇలా చెప్పుకుంటూ పొతే అక్బర్ చేసిన అకృత్యాలను రాయడానికి పుస్తకాలు సరిపోవు. అలాంటి నీచ ప్రవృత్తి గలవాడిని మన కుహనా మేధావులు గొప్పవాడిగా కీర్తిస్తూ తప్పుడు చరిత్ర రాయడం బాధాకరం. ఈ దేశం కోసం, ఇక్కడి స్త్రీమూర్తుల మాన ప్రాణాలను రక్షించడం కోసం పాటుబడిన రాజ్ పుత్ ల చరిత్రను మొత్తం కాలగర్భంలో కలిపేశారు. కాలచక్రంలో బయటికి వచ్చే ఇలాంటి వాస్తవాలను ప్రతి ఒక్కరికీ చేర్చడం మనందరి కర్తవ్యం. నా వంతు బాధ్యత నేను నెరవేర్చుకున్నాను. మీరందరూ కొనసాగిస్తారనే ఆశిస్తున్నాను.

ధర్మో రక్షతి రక్షితః

akbar facts, akbar myths, akbar the great history, akbar truth, mughal emperor akbar, akbar vs birbal myths, akbar real story, akbar biography, akbar exposed, indian history facts, akbar documentary, Akbar Exposed, Real Akbar, Untold Facts, Truth vs Myth, Fact or Fiction?, Hidden Truths, Myths Busted, Separating Facts from Myths, Facts & Misconceptions,

Thursday, August 21, 2025

Prasanna vadanam dhyaayeth sarva vighnopasaanthayeth


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోపశాంతయేత్ ||

తాత్పర్యం:

తెల్లని వస్త్రములు ధరించినవాడు విష్ణువు. చంద్రుని వర్చస్సు కలవాడు నాలుగు చేతులవాడు.
ప్రసన్న వదనం కల విష్ణువుని ధ్యానిద్దాం అన్ని అడ్డంకులు తొలగిపోవును.

వివరణ:

ఏ పని అయినా నిర్విఘంగా జరగాలంటే స్థిరమైన మనస్సు ముఖ్యం. స్థిరమైన మనస్సు ధ్యానం చేసినప్పుడే లభిస్థుంది. ధ్యానానికి ఒక మూలం కావాలి. అందుకే ఆ మూలానికి ఒక రూపం ఇచ్చి మనస్సుని ప్రశాంత పరిచే విధంగా వివరించారు వ్యాసులవారు.

Suklaambaradharam Vishnum Sasivarnam Chathurbhujam |
Prasanna vadanam dhyaayeth sarva vighnopasaanthayeth ||

Meaning:

Let us meditate on Lord Vishnu who wears white clothes and has four hands. He has the bright and peaceful appearance of the moon. Meditate on Him and all obstacles will be removed.

Explanation:

We need a stable mind in order to accomplish anything. A Stable mind can only be obtained through meditation. We need an object of reference in order to meditate properly. For this reason, our ancestors gave a pleasant appearance to the Object of reference adorned in white clothes with a pleasant and peaceful appearance and four hands which depict both power and protection. All this combined give a meditator an object of reference that is easy and also powerful to meditate on. If we meditate with such an object of reference, every task that is set about will be accomplished without any obstacles.

Sunday, August 17, 2025

Perception of DEATH! మృత్యువు!


మృత్యువు! Perception of DEATH!
రెండు జన్మల మధ్య అత్యధిక అంతరం ఎన్ని సంవత్సరాలో మీకు తెలుసా?

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।

పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించినవానికి మరల జన్మము తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ విషయాన్ని గురించి శోకించ వద్దని అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం, మనం ఏదో ఒకరోజు మృత్యువు ఒడికి చేరాల్సిందే అన్నది. తప్పించుకోలేనిది, ఎప్పుడు వచ్చేదీ తెలియనిది ‘మరణం’. కాబట్టి, అనివార్యమైన మృత్యువును గూర్చి తెలివైన వాడు శోకించడని, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. కల్పాంతరాల జీవాత్మ ప్రయాణంలో, ఇప్పుడు మనం చూస్తున్న జీవితం ఒకానొక మజిలీ మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎందరో మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నా, ఏదో ఒక రోజు మనమూ చనిపోతామని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. అసలు ఈ జీవితం ఏమిటి? జీవన ప్రక్రియ యొక్క ముగింపును సూచించే ఆ మరణం సంభవించిన తరువాత ఏం జరుగుతుంది? వంటి విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/sHDOobD-Ks8 ]


జీవన ప్రవాహం అనంతం. మనం అనంతకాలం నుండి మనుగడ సాగిస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా అనంతకాలం వరకు సాగిస్తూనే ఉంటాము. కానీ మనం తల్లిగర్భంలోకి ప్రవేశించిన దగ్గరనుంచే మన మనుగడ మొదలయిందనీ, హృదయ స్పందన ఆగిపోగానే మరణం సంభవిస్తుందనీ భ్రమపడుతూ ఉంటారు చాలామంది. అది మన అజ్ఞానంతో కూడుకున్న అంధవిశ్వాసము. ఆధునిక భౌతిక విజ్ఞానం ప్రకారం, జీవుడు స్వతంత్ర శక్తి కాదనీ, శరీరమే జీవమనీ, మృత్యువు అనంతరం దానికి అస్థిత్వం ఉండదనేది, దానికున్న పరిమిత జ్ఞానం. దీనిని బట్టి భౌతిక విజ్ఞానం యింకా బాల్యావస్థలోనే ఉన్నదని తెలుసుకోవాలి. విద్యుత్తు యొక్క గతికి సంబంధించి యిప్పటివరకు మూడు పదుల పైబడిన సిద్ధాంతాలు ప్రతిపాదింపబడ్డాయి. ప్రతి కొత్త సిద్ధాంతమూ అంతకు ముందు ప్రతిపాదింపబడిన సిద్ధాంతాలను ఖండిస్తుంది. కానీ యింతవరకు విద్యుత్ గతి యొక్క వాస్తవ పరిస్థితి మనకు తెలియదు. ఆధ్యాత్మిక విషయాలను భౌతిక శాస్త్రంతో ముడిపెట్టడం వలన మనకీ దుర్గతి సంభవించింది. శరీరమే జీవమని ఒక శాస్త్రజ్ఞుడంటాడు. ఇంకొక శాస్త్రజ్ఞుని కథనం ప్రకారం, మృతాత్మ యొక్క ఆశ్చర్యకరమైన గతి విధులు ప్రామాణికం చేయబడతాయి. మూడవ వైజ్ఞానికుడు, ఒక అబోధ బాలుడి నోట పూర్వజన్మ కథనం విని ఆశ్చర్యచకితుడవుతాడు. అది పునర్జన్మ సిద్ధాంతానికి బలం చేకూర్చుతుంది. శిశువు జన్మించగానే పాలు త్రాగడం ప్రారంభిస్తుంది. పూర్వస్మ్రుతి లేకుండా అది ఎలా సాధ్యం? చాలా మంది పసిపిల్లలలో ఎన్నో అద్భుతమైన గుణగణాలు కనిపిస్తాయి. అటువంటి జ్ఞానం పూర్వజన్మకు సంబంధించినదేకానీ, ఈ జన్మకు సంబంధించినది కాదు.

జీవము, శరీరము ఒకటి కాదు. శరీరానికి దుస్తులు తొడిగినట్లుగానే జీవము శరీరాన్ని తొడుక్కుంటుంది. జీవితమంతా ఒకే దుస్తులు సరిపోనట్లుగానే ఆత్మ యొక్క అనంత ప్రయాణంలో ఒకే దేహం పనికి రాదు. తడవ తడవకూ మార్చవలసిన అవసరం అనివార్యం. సాధారణంగా దుస్తులు జీర్ణమైన తర్వాతనే వదలివేయబడతాయి. కానీ కొన్ని సందర్భాలలో కాలిపోయినప్పుడో, కొర్రుబట్టి చినిగిపోయినప్పుడో, ఎలుకలు కొట్టేసినప్పుడో, మరే ఇతర కారణాలవల్లనో, కొద్ది కాలంలోనే వదిలివేయడం జరుగుతుంది. శరీరం కూడా సాధారణంగా వృద్ధాప్యం వల్ల జీర్ణమైనప్పుడు మాత్రమే, జీవుని చేత వదలివేయబడుతుంది. కానీ కొన్ని ఆకస్మిక కారణాలవల్ల అల్పాయువులోనే విసర్జించబడుతుంది.

మనిషిలో మృత్యువు ఏ విధంగా వస్తుందనే జిజ్ఞాస ఉండటం సహజమే. తత్వవిదులయిన యోగుల కథనం ప్రకారం, మృత్యువు ఆసన్నమయ్యే కొద్ది కాలం ముందు, మానవులకు మనో వేదన, పీడ కలుగుతాయి. దీనికి కారణం, నాడులలోని ప్రాణం కదిలి, ఒకే చోట ఏకత్రితం కావటమే. కానీ పూర్వాభ్యాస దోషం వలనా, ఆ ప్రాణశక్తి తిరిగి మరలిపోవటం వలనా, అఘాతం ఏర్పడుతుంది. అది పీడకు కారణం. రోగం వల్లనో, దెబ్బల వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో మృత్యువు కలిగితే, దాని కారణంగా కూడా పీడ కలుగుతుంది. మరణానికి ముందు జీవి చాలా అవస్థలను పడి, కొద్దిసేపటికి మూర్ఛావస్థకు చేరుతుంది. అటువంటి అచేతనావస్థలో ప్రాణం శరీరాన్ని వదిలి బయటకు పోతుంది. మరణ సమయంలో మనుష్యుని సమస్త బాహ్య శక్తులూ అంతర్ముఖమవుతాయి. తరువాత స్థూల శరీరాన్ని వదిలి బయుటకు పోతుంది. పాశ్చాత్య మతాల ప్రకారం, జీవుని సూక్ష్మ శరీరం కప్ప రంగులో బయటకు పోతుంది. భారతీయ యోగులు మాత్రం, అది శుభ్ర శ్వేతవర్ణ జ్యోతిలాగా బయటపడుతుందని తెలియజేస్తారు.

జీవితంలో జరిగిన చాలా విషయాలను మరచిపోయి, మస్తిష్కంలోని సుషుప్తావస్థలో ఉంచుకోవడం జరుగుతుంది. మరణకాలంలో అవన్నీ ఒక్కసారిగా జాగృతి చెంది, మూకుమ్మడిగా బయటకు వస్తాయి. ఆ కారణంగా, కొన్ని క్షణాలలోనే, జీవితకాలంలో జరిగిన సంఘటనలన్నీ, సినిమా చూసినట్లు చూడటం జరుగుతుంది. ఆ సమయంలోనే మనస్సుకు గల ఆశ్చర్యకరమైన శక్తిని గురించి తెలుస్తుంది. అప్పుడు చూసే సంఘటనలలో సగం మానసిక దృశ్యాలను చూడటానికే, సహజంగా ఒక జీవితకాలం సరిపోదు. కానీ ఆ సమయంలో కొద్ది క్షణాలలోనే అన్నీ కనిపిస్తాయి. మరణానంతరం ఆ సంఘటనలన్నీ ఘనీభవించి, సంస్కారాలుగా మృతాత్మ వెన్నంటే ఉంటాయి. ఆ సమయంలో మనస్సుకు కలిగే వ్యధ వర్ణనాతీతమే. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఒక్కసారి వెయ్యి తేళ్ళు కుట్టినంత బాధ కలుగుతుంది. ఒకానొకప్పుడు ఒకడు సగం స్పృహలో తన కుమారుడి తలను కత్తితో ఖండించాడు. ఆ తరువాత అతని మానసిక వ్యధ వర్ణనాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితే ఇప్పుడు మృతాత్మకు కలుగుతుంది. జీవితంలో ఎంతో సమయాన్నీ, అందివచ్చిన ఎన్నో ధార్మిక అవకాశాలనూ సద్వినియోగ పరచుకోలేకపోయామే అనే బాధ క్రుంగదీస్తుంది.

పుత్ర మరణానంతరం శరీరానికి కష్టం లేకపోయినా, మనస్సుకు అపరిమిత బాధ కలిగినట్లే, మరణానంతరం కూడా శారీరక వేదన లేకపోయప్పటికీ, మానసిక వ్యధ భరించలేనంతగా ఉంటుంది. రోగం మొదలైన శారీరక పీడలు మనస్సు అంతర్ముఖం కాగానే అదృశ్యమయిపోతాయి. మృత్యువుకు పూర్వ క్షణాలలో, శరీరం తన కష్టాలను సహించగలుగుతుంది. రోగం వల్ల గానీ, దెబ్బల వల్ల గానీ, శరీరానికీ, ఆత్మకూ గల బంధాలు క్రమ క్రమంగా తొలగిపోనారంభిస్తాయి. మగ్గిన పండు చెట్టునుండి రాలే అవస్థ చందాన, శరీరం శిధిలమై, అచేతనత్వ స్థితికి చేరగానే మృత్యువు సంభవిస్తుంది. నోరు, కళ్ళు, చెవులు, నాసికా రంధ్రాల ద్వారా ప్రాణ శక్తి నిష్క్రమిస్తుంది. దుష్ప్రవృత్తి గలవారు మరణించేటప్పుడు మాత్రం, అది మలమూత్ర రంధ్రాల గుండా నిష్క్రమిస్తుంది. యోగులు బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణత్యాగం చేస్తారు. మన చుట్టూ జరిగే మరణాలలో ఇటువంటి విషయాలు గమనించవచ్చు.

శరీరము నుండి నిష్క్రమించిన వెంటనే జీవము ఒక విచిత్రమైన అవస్థలో పడుతుంది. కష్టపడి చాకిరీ చేసిన తరువాత మెత్తటి శయ్యపై పడుకోగానే గాఢ నిద్ర పట్టినట్లుగా ఉంటుంది ఆ సమయంలో ఆత్మ పరిస్థితి. మృతాత్మ జీవితమంతా పడిన శ్రమకు అటువంటి నిద్రావస్థ అవసరం. ఈ నిద్ర వల్ల జీవునికి గొప్ప శాంతి కలుగుతుంది. మునుముందు చేయవలసిన పనులు చేయడానికి తగిన శక్తి లభిస్తుంది. మరణించిన వెంటనే నిద్ర రాదు. కొంత సమయం ఉంటుంది. దానికి ఇంచుమించు ఒక నెల రోజులు పడుతుంది. అందుకు కారణం, మరణించిన తర్వాత కూడా మృతాత్మకు తన జీవిత వాసనలు దృఢంగా ఉంటాయి. నిదానంగా అవి శిధిలమై, అదృశ్యమవుతాయి. ఎక్కువగా శ్రమ చేసిన వెంటనే సహజంగా రక్త ప్రసరణ తీవ్ర గతి నందుకుంటుంది. అటువంటి సమయంలో పక్కమీద పడుకున్న తరువాత కూడా, మెలకువగా ఉన్నంతసేపూ తీవ్రంగానే ఉంటుంది.

మృతాత్మ స్థూల శరీరాన్ని వదిలిన తరువాత, సూక్ష్మ శరీరంలో ప్రస్ఫుటితమవుతుంది. సూక్ష్మ శరీర నిర్మాణం కూడా అచ్చంగా స్థూల శరీరంలానే ఉంటుంది. మృతాత్మకు శరీరం తెలికయిపోయినట్లూ, పక్షిలాగా గాలిలో ఎగురుతున్నట్లూ అనిపించి, ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్థితిలో మృతాత్మ, కోరుకున్న విధంగా, కోరుకున్న చోటకు వెళ్ళగలుగుతుంది. స్థూల శరీరాన్ని వదిలిన తరువాత, అది కొంత కాలం వరకు మృత శరీరం సమీపంలోనే సంచరిస్తుంది. చుట్టూ చేరి ఏడుస్తున్న బంధువులను ఓదార్చాలనీ, తన శరీరంలోకి తిరిగి ప్రవేశించాలనీ ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యం కాదు. ఒక ప్రేతాత్మ ఇలా అన్నది.. "నేను మరణానంతరం గొప్ప నిర్జీవ స్థితిలో పడి ఉన్నాను. స్థూల శరీరం మీదా, బంధుజనుల మీదా ఉన్న మోహం కారణంగా, వారితో మాట్లాడాలని ఏదో ఆరాటం. నేను అందరినీ చూస్తూనే ఉన్నాను కానీ, ఎవ్వరూ నన్ను గమనించటం లేదు. నేను అందరి మాటలూ వింటూనే ఉన్నాను కానీ, నా మాటలను వినేవారే లేకపోవడం, చాలా బాధ కలిగింది. అలాంటి సమయంలోనూ సంతోషం కలిగించే విషయం, నా శరీరం చాలా తేలిక కావటం, ఎంతో వేగంతో అన్ని వైపులకూ ప్రయాణం చేయగలగటం. జీవితమంతా నేను మరణమంటే భయపడుతూనే ఉన్నాను కానీ, ఇప్పుడు నాకు భయమంటే ఏమిటో తెలియదు. సూక్ష్మ శరీరంలో ప్రస్ఫుటితం కావటంవల్ల, ఇప్పుడు నాకిక స్థూల శరీరం మీద మమకారం లేదు. దానికి కారణం, నా నూతన శరీరం. పూర్వ శరీరంతో పోలిస్తే చాలా బావుంది. నా అస్థిత్వంలో మార్పేమీ కనిపించడంలేదు. నా చేతులూ, కాళ్ళు ఆడిస్తుంటే మామూలుగానే ఉంది. మరణించినట్లేమీ లేదు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చిన విషయం, మరణం అంటే ఒక శరీర పరివర్తన ప్రక్రియ మాత్రమేగానీ, భయపడనవసరం లేదు.

మృత శరీరానికి అంత్యేష్టి జరిగేంత వరకూ, మృతాత్మ మృత శరీరం దరిదాపులలోనే తిరుగుతూ ఉంటుంది. శరీర దహనమైన తరువాత నిరాశ చెంది, మనస్సును మరో ప్రక్కకు మరలుస్తుంది. అయినప్పటికీ చాలా రోజుల వరకు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అధిక అజ్ఞానం వల్లా, మాయా మోహాల కారణంగా, మృతాత్మ శ్మశానాలలోనే ఎక్కువగా సంచరిస్తుంది. తరువాత తనకు ప్రియమైన వారి దగ్గర ఉండటానికి ప్రయత్నిస్తుంది. వృద్ధాప్యంలో మరణించిన వారికి ఈ వాసనలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వారు త్వరలోనే నిద్ర లోకి వెళ్ళిపోతారు. స్త్రీలలో వాసనలు అధికంగా ఉండటం వల్ల, చాలా కాలం విలపిస్తూ ఉంటారు. వారిలో ఎక్కువమంది అకాల మృత్యువు వాత బడిన వారో, లేక ఆత్మహత్యలు చేసుకున్న వారో అయ్యి ఉంటారు. హఠాత్తుగా, ఉగ్రవేదన తర్వాత మృత్యు వాత పడడం వలన, సూక్ష్మ శరీరంలో స్థూల శరీరానికి సంబంధించిన పరమాణువులు ఎక్కువ పరిమాణంలో అంటిపెట్టుకుని ఉంటాయి. అందువల్ల మరణానంతరం వారి శరీరం కొంత జీవించి, కొంత మరణించి, కొంత స్థూలంగా, కొంత సూక్ష్మంగా ఉంటుంది. అటువంటి ఆత్మలు ప్రేత స్వరూపంలో కనిపించి అదృశ్యమవుతూంటాయి. సాధారణ మృత్యు వాత బడిన వారికి ఈ విధంగా జరగదు. అందుకు విశేష ప్రయత్నం, తపస్సు కావాలి.

ఇక అపఘాతం అంటే, ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శక్తివంతమైన ప్రేతాత్మ రూపంలో తిరుగుతుంటుంది. ఈ వివరాలను మనం గతంలో చేసిన గరుడపురాణం వీడియోలలో చెప్పుకున్నాము. చూడనివారికోసం ఆ Playlist ను పొందుపరుస్తున్నాను. అటువంటి ప్రేతాత్మ విషమ మానసిక పరిస్థితి, నిద్రను దరిజేరనీయదు. ప్రేతాత్మలు ఇంద్రియ వాసనా తృప్తి కోసమో, లేక ఏదో కసి తీర్చుకోవటానికో ప్రయత్నం చేస్తూంటాయి. అటువంటి ప్రేతాత్మలను కొందరు తాంత్రికులు వశపరచుకుని, తమ బానిసలను చేసుకుంటారు. అలాంటి సమయంలో ఆ ప్రేతాత్మలు ఆ తాంత్రికులపై ప్రసన్నతతో ఉండక, విపరీతమైన క్రోధంతో రగలి పోతూ ఉంటాయి. అవకాశం దొరికితే వాడిని చంపివేస్తాయి. బంధమనేది ఎవరికీ ఇష్టముండదు. బంధం తొలిగించుకోలేక కొన్ని ప్రేతాత్మలు తాంత్రికుడి ఆజ్ఞనల మేరకు సర్కస్ లో సింహాలలాగా అణిగిమణిగి ప్రవర్తిస్తూ ఉండటం, వాటికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. కట్టి వేయబడిన ప్రేతం ఒకే చోట ఉంటుంది. మాటిమాటికీ తన నివాస స్థానాన్ని మార్చుకోదు.

తక్కువ వాసనలు కలిగిన, లేదా ప్రబుద్ధ చిత్తము కలిగిన ధార్మికులు అంటే, అంత్యేష్టి అనంతరం పాత సంబంధాలన్నింటినీ వదులుకుని, ఉదాసీన వైఖరిని అవలంభిస్తారు. ఉదాసీనత కలుగగానే నిద్ర వస్తుంది. విశ్రాంతి వలన నూతన శక్తి కలుగుతుంది. కాబట్టి, విశ్రాంతికి అటువంటి నిద్ర అవసరం. ఆ నిద్ర ఎంత కాలం ఉంటుందనేది ఒక నియమానికి కట్టుబడి ఉండదు. అది జీవుని యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. చిన్న పిల్లలకూ, కష్టపడి పనిచేసే వారికీ నిద్ర ఎక్కువ మోతాదులో అవసరం. వృద్ధులకూ, విశ్రాంతిగా గడిపే వారికీ తక్కువ మోతాదులో నిద్ర సరిపోతుంది. సాధారణంగా మరణాంతరం కలిగే నిద్ర మూడు సంవత్సరాలు ఉంటుంది. అందులో ఒక సంవత్సరం గాఢ నిద్ర కలుగుతుంది. అప్పుడు సూక్ష్మేంద్రియాల సంవేదనను గ్రహించటం సాధ్యపడుతుంది. రెండవ సంవత్సరం నిద్రాభంగమై, మునుపటి తప్పులను సరిచేసుకోవటం, ముందుకాలానికి అవసరమైన యోగ్యతను సంపాదించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మూడవ సంవత్సరం కొత్త జన్మను ధరించే అన్వేషణలో గడుస్తుంది. ఇది సామాన్యంగా జరిగేది. కొందరు విశిష్ఠ వ్యక్తులు ఆరు నెలలలోనే తిరిగి తల్లి గర్భంలో ప్రవేశిస్తారు, మరి కొందరికి ఆయిదు సంవత్సరాలు పడుతుంది. ప్రేతాత్మలు పన్నెండు సంవత్సరాల వరకూ ఉండవచ్చు. ఆ విధంగా రెండు జన్మల మధ్య అత్యధికమైన అంతరం పన్నెండు సంవత్సరాలు.

ఇందులో అత్యుత్తమమైన జననమరణ చక్రాన్ని పొందడానికి మనకున్న ఏకైక మార్గం, భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. ఈ వీడియో చూసిన వారందరూ అవకాశం ఉండగానే జాగ్రత్త పడమని కోరుకుంటున్నాను.

కృష్ణం వందే జగద్గురుం!

Thursday, August 14, 2025

Yasya smarana maathrena janma samsaara bandhanaath

 


యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ||

తాత్పర్యం:

కేవలం స్మరించినంత మాత్రమే జనన మరణ సంసార బంధనములనుంచి విముక్తినిచ్చే విష్ణువుకు ఇవే మా వందనములు.

వివరణ:

మహాభారత యుద్ధం ద్వాపరయుగం చివరిలో జరిగింది. రాబోయే కలియుగంలోని పరిస్థితులను గ్రహించి వ్యాసులవారు ఒక చక్కని మార్గం సూచించారు. కలియుగంలో దైవభక్తి తగ్గిపోయి ప్రజలు సన్మార్గం విడిచి చాలా సులభంగా పక్కదార్లు పడతారు. అందుకే వ్యాసులవారు అలాంటి వారికోసమే, "నాయనలారా, మీరు మొత్తం సహస్ర నామం పఠించనక్కరలేదు. కేవలం హరినామస్మరణ చేయండి చాలు" అన్నారు. నిరంతరం ఆ దేవుడిని స్మరిస్తే చాలు. మనస్సు నిలకడగా వుంటుంది. నిశ్చలమైన మనస్సు ఎప్పుడూ సన్మార్గంలోనే నడుస్తుంది.


Yasya smarana maathrena janma samsaara bandhanaath |
Vimuchyathe namasthasmai Vishnave prabha Vishnave ||

Meaning:

My salutations to the superior Vishnu. by merely thinking of Him, we can free ourselves from the cycle of life-and-death. My salutations to the all-powerful Vishnu.

Explanation:

Mahabharatha war was fought almost towards the end of Dwaparayuga. Veda Vyasa anticipated the state of affairs in the upcoming Kaliyuga. In Kaliyuga, people would become less and less associated with spiritual aspects and could be very easily misled. For that reason Vyasa gave an easy way out and said, "just chant His name. That is enough". Chanting His name will lead to a stable mind. A stable mind is less likely to go astray.

Monday, August 11, 2025

SIVAGALAI rewrites the past: Exposes Colonial Lies! | శివగలై!


శివగలై! ఆ ఊరు బయటపెట్టిన చారిత్రక వాస్తవాలు!
Sivagalai rewrites the past: Unfolds the truth on iron's antiquity!

భారతీయ నాగరికత, హరప్పా, మొహేంజొదారో నుంచే మొదలైంది. కేవలం ఉత్తర భారత దేశంలోనే నాగరికత పురుడుపోసుకుంది. దక్షిణ భారత దేశంలో కేవలం అనాగరికులైన ఆటవిక మనుషులు మాత్రమే ఉండేవారు. అసలు భారత దేశానికి నాగరికత తెచ్చిందే యూరోప్ లో పుట్టి, వలస వచ్చిన ఆర్యులు. ఆర్యుల రాకవరకు, వారికసలు ఇనుమంటే ఏమిటో కూడా తెలియదు. ఆర్యులు తమ జ్ఞానాన్ని ఉత్తర భారతీయులకు పంచితే, కాలక్రమంలో ఆ జ్ఞానం దక్షిణ భారతం వరకు పాకింది... ఇవన్నీ గత రెండు వందల ఏళ్లుగా, భారతీయలకు నూరిపోసిన అభూత కల్పనలు. స్వతంత్ర భారతంలో పాఠ్య పుస్తకాలుగా మారిన పాఠాలు. జనాల మొదళ్ళలోకి ఎంతో మంది కుహనా మేధావులు ఎక్కిస్తున్న అవాస్తవాలు. భూమిలో మరిగిపోతున్న లావా ఎప్పటికైనా బయట పడాల్సిందే అన్నట్టు, చీకటి గర్భంలో కప్పివుంచిన అసలైన చరిత్ర కూడా ఎదో ఒకరోజు సత్యాన్వేషకుల ద్వారా బయటకు వచ్చి తీరాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి సత్యాన్ని ఒక చిన్న ఊరు బయల్పరచింది. ఆ సత్యం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసి, ఏళ్ల తరబడీ తుచ్చులు ఎంతో చాకచక్యంగా నిర్మించుకున్న అసత్యపు చరిత్ర గోడలను పునాదులతోసహా కూల్చివేసింది. ఆ సత్యం భారత దేశంపై ఇన్నేళ్ళుగా జరుగుతున్న కుట్రను సమూలంగా బయటపెట్టేసింది. ఈ మాటలు వింటుంటే ఎన్నో సందేహాలు కలుగుతాయి. అది ఏ ఊరు..? అక్కడ బయటపడిన నిజం ఏమిటి..? ఇనుము గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది..? హరప్పా సంస్కృతి పురాతమైనది కాదా..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/G7d3Tt5TIn4 ]


ఏదైనా ఒక అబద్ధాన్ని వందమంది కలిసి ఎంతో నమ్మకం నటిస్తూ వందసార్లు చెబితే, వారి ముందున్న వెయ్యి మందీ ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేసే అవకాశం ఉంది. కానీ ఈ వెయ్యి మంది నమ్మినంత మాత్రాన, ఆ అబద్ధం శాశ్వతంగా నిజం కాబోదు. దాదాపు వెయ్యేళ్ళుగా మన దేశంలో జరుగుతోంది అదే. అయితే తెల్ల దొరలు గత రెండు వందల ఏళ్లుగా ఆ అబద్ధాలను మరింత బలంగా భారతీయుల బుర్రలలోకి చొప్పించే ప్రయత్నాలు ఎన్నో చేశారు, వారి తొత్తులద్వారా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారికి మన కుహనా మేధావి వర్గం వంత పాడుతూనే ఉంది.

ఇలా వారు చెప్పిన అతి పెద్ద అబద్ధం, భారతీయ నాగరికత హరప్పా మొహేంజొదారో నుంచే మొదలైందని. ఈ మాట వినగానే, చాలా మంది హరప్పా నాగరికత పురాతనమైనది కాదా! అనే సందేహం వ్యక్తం చేస్తారు. హరప్పా నాగరికత పురాతనమైనదే. దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఆ ప్రాంతంలో దాగి ఉంది. వేల ఏళ్ల నాటి భారతీయ నాగరికత యొక్క అద్భుత పరిజ్ఞానం గురించి హరప్పా నాగరికత తెలియజేస్తుంది. కానీ అక్కడ దొరకని ఒక వస్తువు, యావత్ భారత చరిత్రను అణగదొక్కడానికి ప్రయత్నించే వెస్ట్రన్ శక్తులకు బలం అయ్యింది. అది మరేదో కాదు ‘ఇనుము’.

సాధారణంగా చరిత్రకారులు మానవ నాగరికత క్రమాన్ని వివరించేటప్పుడు, వివిధ కాలాలలో మానవులు వాడిన పనిముట్లను ప్రామాణికంగా చూపిస్తారు. చరిత్రకారుల అంచనాలను బట్టి, నాగరికతకు మూలం ఒకటి అగ్ని అయితే, మరొకటి ఆయుధం. ఏనాడైతే మానవుడు ఆయుధాన్ని కనిపెట్టాడో, అక్కడి నుంచే వేటాడే విధానంలో మార్పు వచ్చిందనీ, ఆ మార్పే మానవుల ఒంటిపైకి బట్టలను కూడా తెచ్చిందనీ చెబుతారు.

రాయికి పదును పెడితే అది మంచి ఆయుధంగా మారుతుందని మానవులు భావించారు. అలా కనిపెట్టిన రాతి ఆయుధాలతో జంతువులను వేటాడేవారు. ఈ క్రమంలో అప్పటి వరకు ఎండొచ్చినా, వానొచ్చినా, మంచు కురిసినా, చెట్టునో, పుట్టనో, ఏ గుహనో మాత్రమే ఆశ్రయించిన మానవుడు, రాతి పనిముట్లతో జంతువుల చర్మాన్ని వలిచి వస్త్రంలా కప్పుకుంటే, అన్ని వేళలా గుహల అవసరం ఉండదని గమనించాడు.

అలా మొదలైన మానవ నాగరికత మెల్ల మెల్లగా పరిణతి చెంది, మట్టిలో దాగున్న లోహాన్ని వెలికి తీసి, దానితో తనకు కావలసిన ఆయుధాలనూ, పనిముట్లనూ తయారు చేయడం మొదలు పెట్టాడు. అలా చరిత్రలో మానవులు వాడిన పనిముట్ల ఆధారంగా, మానవ జీవన క్రమాన్ని మూడు వరుసలలో విభజించారు చరిత్రకారులు. మొదటిది రాతి యుగం అయితే, రెండవది కాంస్య యుగం, ఆఖరిది ఇనుప యుగం.. ఆ తర్వాత వచ్చినది మొత్తం ఆధునిక యుగంగానే పరిగణించాలని చరిత్రకారులంటున్నారు.

ఇప్పటి వరకు దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం, మనిషి మట్టిలోని లోహాలలో ముందుగా రాగి, తరువాత కంచును కనిపెట్టి, వాటితో ఆయుధాలనూ, పనిముట్లనూ, ఆభరణాలను కూడా తయారుచేయడం మొదలుపెట్టినట్లూ, ఆ తర్వాతే ఇనుమును కనిపెట్టినట్లూ తెలుస్తోంది. సరిగ్గా ఇక్కడే పాశ్చాత్య పరిశోధకులు ఒక పన్నాగం పన్నారని చెప్పవచ్చు.

Smelting.. అంటే, మట్టిలో దాగున్న వివిధ రకాల లోహాలను, కొన్ని రకాల కెమికల్స్ వాడి, అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి బయటకు తీసే విధానాన్ని Smelting అని అంటారు. ఈ విధానం ద్వారానే దాదాపు సామాన్య శకానికి 1500 సంవత్సరాల పూర్వం, ఇనుమును కనుగొన్నారు. అది కూడా యూరోప్ కి దగ్గరగా ఉండే ప్రదేశాలలో ఈ ఆవిష్కరణ జరిగింది. అక్కడి నుంచి అది ప్రపంచం మొత్తం పాకింది. భారత దేశానికి కూడా అలాగే వచ్చిందని చరిత్రకారులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. హరప్పా, మొహేంజొదారో ప్రాంతాలలో దొరికిన వస్తువులలో ఎక్కడా ఇనుముతో చేసిన పనిముట్లు దొరకలేదని చరిత్ర కారులు చెబుతున్నారు.  హరప్పా, మొహేంజొదారోలో రాగి, కంచుతో చేసిన పనిముట్లూ, ఆయుధాలూ, ఆభరణాలూ, వంట సామానూ వినియోగించినట్లు మాత్రమే తెలిసిందనీ, ఎక్కడా ఇనుమనేది కనిపించలేదని చరిత్ర కారులు చెప్పుకొచ్చారు.

అలాగే, భారతీయ పురాతన ఆచార వ్యవహారాలలో కూడా, రాగి, కంచుతో చేసిన వివిధ రకాల వస్తువులకు, పాత్రలకు, దేవుడి విగ్రహాలకూ ప్రాధాన్యతను ఇచ్చేవారు. వంట చేసుకునే ప్రాత్రలలో కూడా పూర్వం మట్టి, లేదా రాగితో చేసిన వస్తువులనే వాడేవారు. ఇనుము వాడకం పెద్దగా ఉండేది కాదు. ఇలా కొన్ని అంశాలను చూపించి మన దేశ చరిత్రను అణగదొక్కాలని చూశారు. హరప్పా, మొహేంజోదారోలో నిజంగా ఇనుప వస్తువులు దొరకలేదో, లేక ఒకవేళ దొరికినా అది బయటి ప్రపంచానికి తెలియకుండా చేశారో తెలియదు కానీ, ఇప్పుడు బయటపడ్డ నిజం యావత్ ప్రపంచాన్నీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.

ఆ నిజం పేరే ‘Sivagalai’. ఇది దక్షిణ తమిళనాడు లోని ఓ చిన్న ఊరు. ఒక రోజు పొలం పని చేస్తున్న స్థానిక వ్యక్తికి తానెప్పుడూ చూడని ఓ వింత వస్తువు భూమిలో దొరకడంతో, ఆ విషయాన్ని అధికారులకి తెలియజేశాడు. అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, పురావస్తు శాఖ వారితో అక్కడ త్రవ్వకాలు జరిపించగా, వారికి మరి కొన్ని పురాతన వస్తువులు లభించాయి. వాటిలో తుప్పుపట్టిన స్థితిలో కుండలు, ఇనుముతో చేసిన కత్తులు, బాణాలు కనిపించాయి. దాదాపు 84 వస్తువులను వెలికితీసిన పురావస్తు శాస్త్రవేత్తలకు, అక్కడ ఒక అంశం మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అదే smelting చేసిన ఆనవాళ్లు. అక్కడ దొరికిన కుండల్లో వివిధ రకాల ధాతువులతో కూడిన పదార్ధం కనిపించింది. దాన్ని పరిశీలించి, ఇనుప ఖనిజం నుంచి ఇనుమును బయటకు తీసే ప్రక్రియ వాడినట్లు వారు నిర్ధారించారు. వెంటనే వారికొచ్చిన సందేహాన్ని నిర్ధారించుకోడానికి, Sivagalai లో దొరికిన సాంపిల్స్ ని మూడు వేర్వేరు ల్యాబ్స్ కి పంపించి, అవి ఏ కాలానికి చెందినవో పరిశోధించమన్నారు.

అలా వారు పంపిన మూడు సాంపిల్స్ లో, ఒకటి అమెరికాకూ, ఇంకొకటి Ahmedabad కూ, మరొకటి Lucknow కూ వెళ్లాయి. ఆ మూడు ప్రదేశాలలో చేసిన Carbon dating ప్రక్రియలో విస్తుపోయే నిజం బయట పడింది. ఆ నిజం, ఇప్పటి వరకూ పాశ్చాత్య నాయకులూ, చరిత్రకారులూ చేస్తున్న ఓ తప్పుడు ప్రచారానికి సమాధి కట్టే విధంగా ఉంది. పురావస్తు అధికారులకు ఆ మూడు టెస్ట్ రేపోర్ట్స్ ఒకే కాలాన్ని సూచించాయి. అదే సామాన్య శకానికి పూర్వం 3345 వ సంవత్సరమని. అంటే ఇంచుమించు 5 వేల 500 ఏళ్ల పూర్వమే మన దేశంలో ముడి ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి, ఇనుప వస్తువులను తయారు చేసినట్లు ఆ పరిశోధన నిరూపించింది.

ఇప్పటివరకూ పాశ్చాత్య చరిత్రకారులు చెప్పినదాని ప్రకారం, అసలు ఇనుమును కనుగొన్నది 3500 ఏళ్ల క్రితం మాత్రమే. అది కూడా వారి ప్రకారం పశ్చిమ దేశాలలోనే కనుగొనబడింది. అక్కడి నుంచి ఆ పరిజ్ఞానం ప్రపంచానికి వ్యాపించిందని వారి వాదన. హరప్పా, మొహేంజోదారోలో ఇనుప వస్తువులు దొరకకపోవడంతో, భారత దేశం దగ్గర కూడా ఆ పరిజ్ఞానం లేదని వారికి వారే నిర్ధారించుకుని, తామే మొట్టమొదటి ఇనుము వాడకం దారులమని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు Sivagalai లో దొరికిన ఆధారాలు, ఆ తప్పుడు ప్రచారాన్ని పూర్తిగా పటాపంచలు చేసేసింది.

చరిత్రను సరిగ్గా గమనిస్తే, కొన్ని అంశాలు ఎంతో వివరంగా, కాస్తంత గుప్తంగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిలో మొదటిది, స్థానిక లభ్యత. సాధారణంగా స్థానికంగా దొరికే వివిధ వస్తువులను మనం విరివిగా వాడటంతో పాటు, వాటిని ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. స్థానికంగా లభించే ముడి పదార్ధాలతోనే వస్తువులను తయారు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండే చోటినుంచి కొబ్బరి కాయల ఎగుమతితో పాటు, కొబ్బరి నూనె తయారు చేసి అమ్మడం, కొబ్బరి పీచుతో వివిధ వస్తువులను తయారు చేసి అమ్మడం లాంటివి చూస్తూ ఉంటాము. ఖనిజాల విషయంలోనూ అదే పద్ధతి వర్తిస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు, పూర్వం నుంచి Sivagalai పరిసర ప్రాంతాలలో ఇనుముతో కూడుకున్న ఖనిజం దొరికేది. ఆ పరిసరాలలో ఎక్కడా రాగి, కాంస్యం లేదు. అలా Sivagalai వాసులకు ఆదినుంచే ఇనుముతో వస్తువులు చేయడం అలవాటు.

అయితే మన దేశంలో iron-ore ను smelting చేసిన పురాతన ఆధారాలు Sivagalai తో పాటు, తమిళనాడులోని Mayiladuthurai, Kodumanal అనే ఊర్లలోనూ, కర్ణాటకలోని Hallur లోనూ దొరికినట్లు, పురావస్తు అధికారులు చెబుతున్నారు. వాటన్నిటిలోకీ Sivagalai లో దొరికిన ఆధారాలు అత్యంత పురాతనమైనవని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో దొరికిన ఆధారాలను బట్టి, అప్పట్లో ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, తమంతట తామే ఇనుమును వేరు చేసి, వివిధ వస్తువులను తయారు చేసేవారు. ముఖ్యంగా స్థానికం ఆయుధాలను తయారు చేసి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని, చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.

పూర్వం వస్తువుల తయారీ రెండు విధాలుగా జరిగేది. ఆ దేశ రాజ సంస్థానం కోసం పనిచేసే వారు ప్రత్యేకంగా కొంతమంది ఉంటే, మరికొంతమంది తమ కుటుంబాలతో నివసిస్తూ, తమకు తెలిసిన కళలతో వస్తువులను తయారు చేసి, దేశ విదేశాలకు అమ్మేవారు. Sivagalai లోని నాటి వ్యక్తులు ఆ రెండవ కోవకు చెందిన వారని నిపుణులంటున్నారు. ఇక పాశ్చాత్య చరిత్రకారుల తప్పుడు కథ అయిన ఆర్య సిద్ధాంతం విషయానికి వస్తే, వారి ప్రకారం పశ్చిమ దేశాలలో పుట్టిన ఆర్యులు ముందుగా భారత దేశంలోకి వచ్చి, ఇక్కడి స్థానిక ఆటవిక తెగలను educate చేశారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు ఆర్యుల వల్లనే నాగరికులుగా మారారని ప్రచారం చేశారు. ఇప్పుడు Sivagalai లో దొరికిన ఆధారాలన్నీ, పాశ్చాత్యులు ప్రచారం చేసిన ఆర్య సిద్ధాంతాన్ని పటాపంచలు చేసేశాయి. అసలు ఐరన్ smelting గురించి ఎవరు ఎవరికి నేర్పించారు..? అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పటి వరకు పశ్చమ దేశాల వారు ప్రపంచానికి నేర్పించారనే సమాధానం వచ్చేది. ఇప్పడు దానికి సమాధానం మారింది.

మన చరిత్రనూ, పురాణాలనూ పరిశీలించినా ఇనుము గురించిన ఆధారాలు దొరుకుతాయి. సూర్య వంశ రాజులూ, చంద్ర వంశ రాజులూ మొదటి నుంచీ ఇనుముతో చేసిన కత్తులూ, వివిధ రకాల ఆయుధాలనూ వాడినట్లు మన పురాణాలను పరిశీలిస్తే తెలుస్తుంది. రాముడు వేసిన సాధారణ బాణాలు కూడా ఇనుముతో చేసినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది. మహా భారత కాలంలో కూడా ఆయుధాలలో ఇనుము విరివిగా వాడినట్లు తెలుస్తుంది.

చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచ వింతలలో ఢిల్లీలో ఉన్న Iron Pillar ఒకటి. రెండవ చంద్రగుప్తుడి కాలంలో తయారు చేసిన ఆ ఇనుప స్థంభం ఇప్పటికీ చెక్కు చెదరకుండా, తుప్పు కూడా పట్టకుండా ఎంతో దృఢంగా నిలబడి ఉంది. సాధారణంగా ఇనుమును సరైనా జాగ్రత్తలు తీసుకోకపోతే, కొద్ది రోజులకే తుప్పు పట్టడం సహజం. కానీ ఆ Iron Pillar మాత్రం ఈ సూత్రాలను పూర్తిగా చెరిపేసింది. ఇప్పటికి ఆ pillar తయారీ విధానం ఏమిటనేది ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడ మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఆ iron pillar ని తమిళనాడు లోని మధురైలో తయారు చేశారు. అది కూడా పూర్తి స్థంబంలా కాకుండా, సుదూర ప్రాంతాలకు సులువుగా తీసుకువెళ్ళడానికి వీలుగా, చిన్న చిన్న భాగాలుగా తయారు చేసి, వాటిని మధురై నుంచి ఢిల్లీ వరకు తీసుకువచ్చి, అక్కడ పూర్తి స్థంభంగా అతికించి నిలబెట్టారనీ చరిత్రకారులు చెబుతున్నారు. కానీ  ఆ స్థంభాన్ని పరిశీలిస్తే ఎక్కడా అతుకుల ఆనవాళ్లు కనిపించవు. దీనిని బట్టే లోహాలపై మన పూర్వీకుల పరిజ్ఞానం ఎంత ఆధునాతనంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

మరోమాట, పాశ్చాత్యులు ఎంతో గొప్పగా చెప్పుకునే రోమన్ రాజులు, మన దేశంలో తయారు చేయబడిన కత్తుల కోసం వెంపర్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే, నాటి రోమన్ రాజులూ, సైన్యాధికారులూ, ధనవంతులందరి దగ్గరా ఉన్న కత్తులు తయారైంది మన దేశంలోనే. రోమన్స్ మన దేశ కత్తులపై మోజు పెంచుకోడానికి కారణం వాటి దృఢత్వం, నాణ్యత. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన లోహం మన దగ్గర దొరికేది. దానినే wootz steel అని పిలుస్తారు. ఈ wootz steel ని కూడా మన దక్షిణ భారతీయులు ఇనుముతో తయారు చేసేవారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో, ఈ wootz steel తయారీ విరివిగా ఉండేది. ముందుగా ఇనుప ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి, అందులో కొన్ని మిశ్రమాలు కలిపి, కొన్ని ప్రత్యేక పద్ధతులలో wootz steel ని తయారు చేసేవారు. అలా వచ్చిన ఇనుముతో కత్తులు తయారు చేసేవారు. బ్రిటిషర్లు మన దేశంపై దాడి చేసి, ఇక్కడ ఉన్న తయారీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేంత వరకు, ప్రపంచంలోనే అత్యంత పదునైన, దృఢమైనవిగా ఉండేవి ఆ కత్తులు.

ఇలా చెప్పుకుంటూ పొతే, లోహాలపై మనకున్న పరిజ్ఞానం, ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదనేది నిర్వివాద అంశం. పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నట్లు, ఇనుమును వారే కనుగొంటే, మరి వారి దగ్గర ఈ పరిజ్ఞానం ఎందుకు లేదు. ఇక ఇనుమును మొదటిసారి తయారు చేసిన ప్రదేశంగా భావిస్తున్న Anatolia ప్రాంతంలో ఎక్కడా, పెద్ద ఎత్తున ఇనుప పనిముట్లు, ఆయుధాలు చేసినట్లు ఆధారాలేవీ ఇప్పటివరకూ దొరకలేదు. మన దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కర్ణాటకలో కనుగొనబడిన ప్రతి పురాతన ప్రదేశంలోనూ ఇనుమును పెద్ద ఎత్తున తయారు చేయడమే కాకుండా, వాటితో భారీ మొత్తంలో రకరకాల వస్తువులను తయారు చేసి, వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసినట్లు ఆధారాలున్నాయి.

పురావస్తు అధికారుల ప్రకారం, వారు కనుగొన్న ప్రదేశాలలో పెద్ద ఎత్తున ఇనుమును తయారు చేసి, దానితో వివిధ రకాల పనిముట్లు చేసేవారనీ, అదంతా ఒక కమ్యూనిటీ లేదా కొన్ని వంశాల వాళ్ళు తరతరాలుగా చేసిన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన 5 వేల సంవత్సరాలు కాదు, అంతకు ముందు నుంచే మన దగ్గర ఇనుము తయారీ, వాడకం ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా మన వారు పాశ్చాత్యులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని పక్కకు నెట్టి, అసలైన చరిత్రను భావి తరాలకు అందేలా చేయాలని కోరుకుందాము.

ధర్మో రక్షతి రక్షితః

Sunday, August 3, 2025

A Fight, A Boon & A Curse led to MAHABHARATA War


ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం!
ఈ మూడే కురుక్షేత్ర సంగ్రామానికి అసలు కారణాలా?

భారతీయ చరిత్రలో ఓ ఉత్కృష్ట ఘట్టం, 5000 ఏళ్ల పూర్వం సంభవించిన ‘కురుక్షేత్రం’. ప్రపంచ మానవాళి గతిని మార్చిన ఘట్టమది. ఈ భూమిపైనున్న రాజ్యాలన్నిటి సేనలనూ ఒక్క చోటికి చేర్చిన ఘట్టం.. మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసిన ఘట్టం, కలియుగారంభానికి బాటలు వేసిన ఘట్టం.. ఇలా కురక్షేత్ర సంగ్రామం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అంతటి మహోన్నత ఘట్టానికి దారి తీసిన విషయాలు మాత్రం, ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం అని ఎంతమందికి తెలుసు? ఈ మాటలు వినగానే, అదేంటి? దుర్యోధనుడు శకునితో కలిసి పన్నిన మయోపాయం కారణంగా ధర్మ రాజు జూదంలో ఓటమి పాలై, చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసిందని మన గ్రంధాలు చెబుతున్నాయి కదా! మరి ఈ యుద్ధం, వరం, శాపం కారణంగా కురుక్షేత్ర యుద్ధానికి బాటలు పడడమేమిటి? అనే సందేహం కలగడం సహజం. అది ఎలాగో తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/GO-ga4EWTfI ]


భారత దేశ చరిత్రలో జరిగిన మహోన్నత చారిత్రక ఘట్టం మహాభారతం. కురు వంశ మూల పురుషుడైన పురూరవుడి ప్రేమ గాథ నుంచి, కరుక్షేత్ర యుద్ధం వరకు జరిగిన ఎన్నో సంఘటనలూ, మధురమైన ప్రేమ గాథలూ, మహా యుద్ధాలూ, చరిత్ర ఎరుగని నిర్ణయాలూ, ఇలా సంపూర్ణ వ్యాస లిఖిత మహా భారతం ఆద్యంతం అమోఘం, మహాద్భుతం. మాహాభారతమంటే, కేవలం కురు పాండవుల మధ్య తగాదా మాత్రమే కాదు.. యుగయుగాల చరిత్ర, మానవ లోకానికి నాంది, ధర్మాధర్మ విచాక్షణను తెలియజేసే వాస్తవిక గాధలకు అది మూల శాస్త్రం. దేవతల నుంచి మొదలై, చంద్రవంశ స్థాపనతో ఒక దారికి వచ్చి, అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తు మహారాజు దగ్గర దాదాపుగా ముగిసింది ద్వాపర యుగం.

పరీక్షిత్తు మహారాజు తర్వాత కూడా చంద్ర వంశం కొనసాగినా, ఆ చరిత్రను మహాభారత కావ్యంలో ప్రస్తావించలేదు. ఒక విధంగా చెప్పాలంటే, పరీక్షిత్తు మహారాజు మరణంతోనే కలియగం మొదలై, కలి తన ప్రభావాన్ని మానవ లోకంపై పూర్తిగా వ్యాప్తి చేయడం మొదలు పెట్టినట్లు, మహాభారత, భాగవత గ్రంధాలు పేర్కొంటున్నాయి. మహాభారతం యొక్క సంపూర్ణ చరిత్రను గురించిన కనీస అవగాహన ఉంటేనే, కురుక్షేత్ర యుద్ధానికి కారకమైన ఆ మూడు విషయాల వెనకవున్న కారణాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకున్నాము.

ఇక కరుక్షేత్ర ఘట్టానికి దారి తీసిన ఆ మూడు కారణాల విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికీ తెలిసిన ఘట్టం, దుర్యోధన, ధర్మ రాజుల మధ్య జరిగిన మాయాజూదం. మనం చెప్పుకోబోతున్న ఆ మూడు విషయాలకూ మూలం ఒక విధంగా ఇక్కడి నుంచే మొదలైంది. చిన్న తనం నుంచీ పాండవులపై అమిత ఈర్ష్యాద్వేషాలను పెంచుకున్న దుర్యోధనుడు, వాళ్ళను ఎప్పటికైనా తుదముట్టించి, కురు సామ్రాజ్యాన్ని పూర్తిగా తానొక్కడే ఏలాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో ఎన్నో సార్లు వారిపై హత్యా యత్నాలు కూడా చేయించాడు. అయితే ధర్మపరులైన పాండవులను ఎప్పటికప్పుడు దేవతలే కాపాడుతూ వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే.

లక్క గృహ దహనంతో పాండవులు చనిపోయారని అందరూ భావించారు. కానీ, ఆ విపత్తు నుండి బయటపడిన పాండవులు కొంత కాలం అజ్ఞాతంగా జీవించి, ద్రౌపది పరిణయంతో తిరిగి తమ బలాన్ని పుంజుకుని, అత్యంత శక్తి వంతులుగా మళ్ళీ కౌరువుల ముందుకు వచ్చారు. అలా తిరిగి వచ్చిన పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకుని, తమ బ్రతుకులు తాము బ్రతకడం మొదలు పెట్టారు. అయితే తన కుయుక్తి దెబ్బతినడం, పైగా అతిలోక సుందరి అయిన ద్రౌపదిని వారు సొంతం చేసుకోవడం, ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకోవడం వంటివి చూసి సహించలేక పోయిన దుర్యోధనుడు శకునితో కలసి పన్నిన దుష్ట పన్నాగమే మాయాజూదం.

ఎంతటి మహా పురుషుడిలోనా ఏదో ఒక లోపం ఉన్నట్లు, ధర్మరాజులో కూడా ఒక లోపం ఉంది. అదే జూదంపై ఉన్న మక్కువ. ఆ బలహీనతను గురించి తెలిసిన శకుని, స్వతహాగా తంత్ర శాస్త్ర నిపుణుడై ఉండటం చేత, తాను చెప్పినట్లు ఆడే పాచికలను తయారు చేసి, అవి దుర్యోధనుడికి ఇచ్చి, వాటి చేత ధర్మ రాజును ఓడించడం లోక విదితమే. ఆ సమయంలో పాండవుల ఆస్తిపాస్తులన్నీ హస్తగతం చేసుకోవడమే కాకుండా, వారిని అత్యంత అమానవీయంగా అవమానించాడు. ఇక్కడ అందరనీ విస్మయపరిచే మరో విషయం ఏమిటంటే, ఆ దుర్మార్గపు ప్రక్రియలో ప్రముఖ భూమికను పోషించినవారిలో కర్ణుడు కూడా ముఖ్యుడన్నది, కర్ణుడి గుడ్డి అభిమానులకు తెలియాల్సిన కఠోర సత్యం. ఈ మధ్య కర్ణుడిని గొప్పవాడిగా, పాండవులను అన్యాయ పరులుగా చూపించే కలి ప్రభావిత ప్రయత్నంలో, అరకొర జ్ఞానంతో పని చేసే దర్శక రచయితలు చాలా మందే ఉన్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, నాడు ద్రౌపదికి జరిగిన అవమానంలో, ఒక మహిళను నిండు సభలో అత్యంత దారుణంగా, అందరికంటే ఎక్కువగా దూషించిన వ్యక్తి కర్ణుడు. ఇలా ఓటమితో, అవమాన భారంతో అడవి బాట పట్టిన పాండవులు, జూదంలో ఓడి, ఇచ్చిన మాట ప్రకారం 12 సంవత్సరాలు అరణ్య వాసం, 1 ఏడాది అజ్ఞాత వాసం చేశారు.

అలా వారు వనవాసానికి వెళ్ళిన 13 మాసాల తర్వాత ఒక నాటి సాయంత్రం, పాండవ పరివారమంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, ద్రౌపది, భీముడు, కౌరవులతో యుద్ధం చేసి తమ రాజ్యాలను తామెందుకు దక్కించుకోకూడదన్న సందేహాన్ని వెలిబుచ్చారు. శకుని మాయతో తమను మోసం చేసి గెలిచినా, ఆ షరతులకు ఒప్పుకుని వనవాసానికి వచ్చి 13 మాసాలు గడిపేసిన తరువాత, అప్పుడు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళడం ధర్మం కాదని వారించాడు, ధర్మరాజు. పైగా ఆ సమయంలో యుద్ధం చేస్తే అది దుర్యోధనుడికే లాభిస్తుందనీ, తాము చిత్తుగా ఒడిపోతామనీ విశ్లేషించి చెప్పాడు. దుర్యోధనుడు అధికారంలో ఉన్నాడు, పైగా అతడి పక్షాన, సర్వాస్త్ర సంపన్నులైన భీష్మ పితామహుడూ, ద్రోణాచార్యుల వంటి వారితో పాటు, కర్ణుడు, భూరిశ్రవుడు, జరాసంధుడు, అశ్వత్థామ వంటి అనేక పరాక్రమ వంతులున్నారు. తమ పక్షాన పనిజేసిన సమర్ధవంతమైన అధికారులనూ, మిత్రులను సైతం కానుకలతో మభ్యపెట్టో, భయపెట్టో తన వైపుకు తిప్పుకున్నాడు దుర్యోధనుడు. అలా పరిస్థితులు తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆవేశం తగదనీ, తమ పరాక్రమం చూపించడానికది సరైన సమయం కాదనీ నచ్చజెప్పాడు ధర్మజుడు. అన్నగారి మాటలకు వారు అంగీకరించినా, తమ రాజ్యాన్ని తాము తిరిగి పొందడానికి మునుముందు వారు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై చర్చలను  కొనసాగించారు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస భగవానుడు, ధర్మ రాజుతో ఏకాంతంగా మాట్లాడాలని ఆయనను పక్కకు తీసుకెళ్ళాడు. దైవం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందని చెప్పి, రానున్న యుద్ధం చరిత్రలో ఎన్నడూ చూడని మహా సంగ్రామం. అందుకు వారు ముందునుంచే సిద్ధంగా ఉండాలని చెప్పి, “ప్రతి స్మృతి” అనే విద్యను నేర్పించాడు, ధర్మరాజుకు. ఆ విద్యను సరైన సమయంలో అర్జునుడికి నేర్పించమని ఆదేశించాడు. ఆ విద్యతో అర్జునుడు దేవతలను మెప్పించి, అనేక వరాలనూ, దివ్యాస్త్రాలనూ పొందగలడని తెలియజేశాడు. వాటి సహాయంతో యుద్ధంలో విజయం వారి వైపే ఉంటుందని సెలవిచ్చాడు.

ఆ తర్వాత వ్యాసుడి ఆదేశం మేరకు, పాండవులు అప్పుడు వారున్న ద్వైత వనాన్ని విడిచి పెట్టి, కామ్యక వనం అనే మరో కారడివిలో తమ బసను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక రోజు అర్జునుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి, వ్యాసుడు తనకు ప్రసాదించిన రహస్య విద్యను బోధించి, ఆయన వివరించిన విషయాల గురించి చెప్పాడు. ఆ తరువాత అర్జునుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఇంద్రుడు అర్జునుడి దీక్షా తత్పరతను పరీక్షించ దలచి, ఒక ఋషి రూపంలో అక్కడికి వచ్చాడు. ప్రతి జీవికీ అంతిమ లక్ష్యం మోక్షమేననీ, ఆ మోక్షాన్ని నేరుగా ప్రసాదించే శక్తి తనకు ఉందనీ, గాండీవాన్ని విడిచి పెడితే అతడికి మోక్షం ప్రసాదిస్తాననీ చెప్పాడు. వీరుడైన వాడు తుది శ్వాస వరకూ తన ఆయుధాన్ని విడువకూడదనే సూత్రానికి కట్టుబడిన అర్జునుడు, ఋషి ప్రసాదిస్తానన్న వరాన్ని తిరస్కరించాడు. అర్జునుడి సంకల్పబలానికి సంతోషించిన ఇంద్రుడు తన నిజరుపాన్ని ధరించి, దివ్యాస్త్రాల కోసం పరమ శివునికై తపస్సు చేయమని ఉపదేశించాడు.

ఇంద్రుడి ఉపదేశం మేరకు ఇంద్రకీలాద్రి పర్వతంపై, తన కాలి బొటన వేలిపై నుంచుని, ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు అర్జునుడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్షించదలచి, పార్వతీ సమేతంగా కిరాతుడి రూపంలో అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ఒక రాక్షసుడు అడవి పంది రూపంలో అర్జునుడిని చంపడానికి వచ్చాడు. అది గమనించిన అర్జునుడు దానిని సంహరించడానికి పూనుకున్నాడు. సమాంతరంగా కిరాతుడు కూడా బాణం వేయడంతో, వారి రెండు బాణాలూ ఒకేసారి ఆ వరాహం ప్రాణాలను బలిగొన్నాయి. అది చూసి వారిద్దరి మధ్యా వాదోపవాదాలు పెరిగి, పోరుకు సమాయత్తమయ్యారు. భీకర పోరు కొనసాగింది.

అర్జునుడు కిరాతుడిని ఏమీ చేయలేకపోయాడు. తనవద్దనున్న దివ్యాస్త్రాలను వాడినా, ఆఖరికి బ్రహ్మాస్త్రమే ప్రయోగించినా, అన్నీ కిరాతుడి రూపంలో ఉన్న శివుడిలో విలీనమైపోయాయి. అర్జునుడు తన దుస్థితికి మ్రాన్పడిపోయాడు. తనను ఆ దుస్థితి నుంచి రక్షించగల వాడు ఆ పరమ శివుడొక్కడే అని గ్రహించి, అప్పటికప్పుడు మట్టితో సైకత లింగాన్ని తయారుచేసి, అందుబాటులో ఉన్న పుష్పాలను మాలగా కూర్చి ఆ లింగంపై వేసి ప్రార్ధించడం మొదలు పెట్టాడు. అయితే విచిత్రంగా ఆ లింగంపై వేసిన మాల, దూరంగా ఉన్న కిరాతుడి మెడలో ప్రత్యక్షమవ్వడంతో, వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుని, ఆనందాశ్రువులతో స్వామి కాళ్ళపై పడి శరణు వేడాడు. స్వామి అర్జునుడి భుజాలు పట్టుకుని పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. శివుడి తేజస్సు అర్జునుడి శరీరాన్ని తాకినవెంటనే అతడి గాయాలు మాయమై, అత్యంత బలశాలిగా రూపాంతరం చెందాడు. అర్జునుడి పరాక్రమానికీ, భక్తికీ ప్రసన్నుడైన శివుడు, అన్ని అస్త్రాలలో కెల్లా అత్యుత్తమమైన, అంత వరకూ దేవతలవద్ద కూడా లేని పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. దానిని మాట చేతకాని, ఏదైనా శస్త్రంపై గానీ, చిన్న గడ్డి పరక పైనైనా మంత్రించి ప్రయోగించవచ్చనీ, అది ముల్లోకాలలో ఎటువంటి ప్రాణినైనా సంహరించగలదు కాబట్టి, అల్పులపై వాడవద్దనీ చెప్పి, దానిని ప్రయోగించే తీరునూ, ఉపసంహరించే విధానాన్నీ తెలియసి అంతర్ధానమయ్యాడు.

పరమశివుడే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన తరువాత, దేవతలందరూ అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించారు. ఆ తర్వాత వజ్రాస్త్రాన్నీ, దేవదత్తం అనే శంఖాన్ని కూడా ఇచ్చి,  స్వర్గానికి తీసుకెళ్ళి సకల మర్యాదలూ చేశారు. అక్కడితో అర్జునుడు ఎవరూ ఓడించలేని దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడు. ఇక్కడి వరకు చెప్పుకున్న వివరాలన్నీ వ్యాస భారతంలోని కిరతార్జునీయ ఘట్టంలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక విధంగా మహా భారతాన్ని పూర్తిగా మార్చిన ఘట్టంగా కవులు అభివర్ణిస్తారు.

అలా స్వర్గానికి వెళ్ళిన అర్జునుడు అక్కడ చాలా రోజులుండి, దేవతల వద్ద యుద్ధ రీతులలో శిక్షణ పొందడమే కాకుండా, సకల కళలలోనూ ప్రావీణ్యం పొందాడు. ఇదిలా ఉండగా ఒకనాడు, దేవతలు సైతం జయించలేకపోయిన నివాతకవచులనే రాక్షసులను హతమార్చమని ఇంద్రుడు అర్జునుడిని కోరాడు. ఇంద్రుడి కోరిక మేరకు వారిని సంహరించడానికి వెళ్ళిన అర్జునుడు ఆ నివాతకవచులుతో ఘోర యుద్ధం చేసి, చివరకు వారిని సంహరించాడు.

విజయుడై స్వర్గానికి తిరిగి వస్తున్నసమయంలో, దారిలో బంగారు తాపడం పోసిన భారీ భవనాలతో మెరిసిపోతున్న వింత నగరాన్ని చూశాడు అర్జునుడు. ఇంద్ర సారథిని వివరాలడుగగా, అది కాలకేయులనబడే రాక్షసులు నివసించే హిరణ్య పురమనే నగరమనీ, బ్రహ్మ వరం పొందడం వలన వారిని జయించడం దేవతల వల్ల కాలేదనీ వివరించాడతడు. ఆ నగరం గాలిలో తేలుతూ, ఎక్కడికైనా వెళ్లగల వింత నగరమనీ, అది వారికి కావలసిన విధంగా రూపాంతరం చెందగలదనీ చెప్పాడు. అంతటి అద్భుతమైన నగరంలో ఉంటూ, బ్రహ్మ వరాన్ని ఆసరాగా తీసుకుని ఆ కాలకేయులు, అదను చిక్కినప్పుడల్లా దేవతలను హింసిస్తూ ఉంటారని చెప్పడు.

అది విన్న అర్జునుడు వారితో పోరుకు సిద్ధమయ్యాడు. కాలకేయులు దాదాపుగా 60 వేల మందిదాకా ఉంటారనీ, వారికి లక్షల సంఖ్యలో సైన్యం ఉందనీ, వారు మాయా యుద్ధంలో ఆరితేరిన వారనీ, మహాభారతంలో ప్రస్తావించబడివుంది. దాంతో అర్జునుడికి పోరులో నిలదొక్కుకోవడం కష్టతరమై, చివరకు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కొన్ని కోట్ల అస్త్రాలుగా, మృగాలుగా, యక్ష రాక్షసులుగా, వింత ఆకారాలున్న జీవులుగా పుట్టుకొచ్చి, ఆ హిరణ్య పురంలో ఉన్న ప్రతి ఒక్కరినీ వెంటాడి వేటాడి చంపేసింది. దాంతో దేవతలకు పట్టిన కాలకేయుల పీడ విరగడయ్యింది.

అలసిపోయిన అర్జునుడు స్వర్గలోకం చేరి తన విడిదిలో నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో, అతిలోక సౌందర్యవతి అయిన ఊర్వశి అక్కడికి వచ్చింది. అర్జునుడి వీరత్వం గురించి విని, అంతటి వీరుడితో కామించాలనే కోరికతో రగిలిపోయింది ఊర్వశి. కానీ, ఆమెను తల్లిగా భావించి కీర్తిస్తూ ఆమెకు నమస్కారం చేశాడు అర్జునుడు. ఆ పరిణామాన్ని చూసి అయోమయంలో పడింది ఊర్వశి. అప్పుడు అర్జునడు, ఆమె తమ వంశానికి మూల పురుషుడైన పురూరవుడి భార్య అనీ, వారి కలియికతో కలిగిన సంతానం కారణంగానే తాను ఆ రోజు అక్కడ ఉన్నాననీ చెప్పి, అందుకే ఆమె తనకు తల్లితో సమానమనీ గుర్తు చేశాడు. దానికి విపరీతమైన కోపానికి గురైన ఊర్వశి, అది దేవ లోకమనీ, తానొక దేవ వేశ్య అనీ, వేశ్యలకు వావివరుసలతో పనిలేదనీ అన్నది. కానీ అర్జునుడు మాత్రం తాను మానవుడు కాబట్టి, భూలోక ధర్మాన్ని పాటించక తప్పదని తెగేసి చెప్పాడు. ఆ మాటలకు క్రోధావేశాలతో రగిలిపోయిన ఊర్వశి అర్జునుడిని నపుంసకుడివయిపోతావని శపించి వెళ్ళిపోయింది.

మర్నాడు ఉదయం ఇంద్రుడు అర్జునుడి దగ్గరకి వచ్చి,  ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించే శక్తి తనకు లేకపోయినా, దాన్ని అతనికి వరంగా మారుస్తానని అన్నాడు. వారు పాటించాల్సిన 12 ఏళ్ల వనవాసం తరువాత 1 ఏడాది అజ్ఞాత వాస సమయంలో అది అతడికి ఉపయోగపడే విధంగా ఆ శాపాన్ని సవరించాడు.

అలా పాండవుల పన్నెండేళ్ళ వనవాసం పూర్తయిన తర్వాత, అజ్ఞాత వాసానికి సిద్ధమై కౌరవులు అస్సలు ఊహించని విధంగా అతి చిన్న సామంత రాజ్యమైన విరాటుడి కొలువులో చేరారు. నాడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడి చేత వరంగా మార్చుకున్న అర్జునుడు బృహన్నలగా మారి, ఇంద్రలోకంలో నేర్చుకున్న నాట్య విద్యనే అక్కడి రాచ కన్యలకు నేర్పిస్తూ, అజ్ఞాత వాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడు, సాక్ష్యాత్తు ఇంద్ర తేజస్సు కలిగినవాడు, మహా శక్తిశాలి, అతడి తేజస్సుని ఎక్కడ ఉన్నా కనుగోవచ్చనేది శకుని ఆలోచన. అందుకే వాళ్ళు అజ్ఞాత వాస సమయంలో మనకి చిక్కుతారనే దీమా కౌరవులలో ఉండేది. అయితే బృహన్నలలా అర్జునుడంతటి వాడు మారతాడని, దుర్యోధనుడి వేగులేవరూ ఊహించలేకపోయారు. ఆ కారణం చేతనే వారు పాండవుల అజ్ఞాత వాసాన్ని చేధించలేక పోయారు. పైగా జగమెరిగిన యుగపురుషుడు ఆ కృష్ణ పరందాముడి అండదండలు ఎలాగూ పాండవులపైనే ఉన్నాయి.

ఈ విధంగా ముందు చెప్పినట్లు అర్జున కిరాత యుద్ధం, పాశుపతాస్త్ర వరం, ఊర్వశి ఇచ్చిన శాపం.. ఈ మూడు మహా భారతాన్ని పూర్తిగా తిప్పిన మహోన్నత ఘట్టాలుగా వ్యాస భారతం చెబుతుంది.

ధర్మో రక్షతి రక్షితః!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...