Posts

Showing posts from January, 2023

వంటింటి వాస్తు - Kitchen Vasthu - వంట గదిలోని వస్తువులను ఈ విధంగా పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది!

Image
వంట గదిలోని వస్తువులను ఈ విధంగా పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది! ఏ ఇంటి వాస్తు సరిగ్గా ఉంటుందో, ఆ ఇంట్లోని వారికి ఏ కొరతా ఉండదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందులోనూ, ఇంటి మొత్తానికీ ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్నీ కలిగించే వంటింటి విషయంలో, ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, వంటగదిలో ఉండే వస్తువుల విషయంలో, వాస్తును తప్పనిసరిగా పాటించాలని శాస్త్ర వచనం. తెలిసీ తెలియక వంట గదిలోని వస్తువులు తప్పుగా పెడితే, ఆ ఇంట్లోని వారు ఎన్నో ఇక్కట్లకు గురికాక తప్పదు. అందువల్ల, వంట గదిలోని వస్తువులు ఏ విధంగా అమర్చుకోవాలనే విషయాన్ని, స్పష్టంగా తెలుసుకుని, అందరూ లాభం పొందండి. ఇంట్లోని వారికి ఆరోగ్య ప్రదాయినీ, మొదటి చికిత్సాలయంగా, వంట గదిని పేర్కొంటారు. అందువల్ల, ఆ వంట గదిలోని వస్తువులు ఎంత వాస్తు రీత్యా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఆ ప్రకారంగా, నేడు ప్రతి ఇంటిలోనూ కనిపించే వస్తువులలో, ఫ్రీడ్జ్ కూడా ఒకటి. ఈ ఫ్రీడ్జ్ లను ఆగ్నేయంలో ఉన్న వంటగదిలో, ఉత్తర వాయువ్యం దిక్కున పెట్టుకోవడం శుభదాయకం. ఇక మంచి నీళ్ళను ఇచ్చే ఫిల్టర్ ని, వంటి గది ఈశాన్యం దిక్కున గోడకి తగిలిస్తే మంచిది. ఎందుకంటే, ఈశాన్యం జల స్థానం అంటారు. అందుకే

గడప విషయంలో ఇవి పాటిస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది! Main Door Gadapa

Image
గడప విషయంలో ఇవి పాటిస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది! ఇల్లే సకల సౌఖ్యలనూ, అష్టైశ్వర్యాలనూ, ఆయురారోగ్యాలనూ ప్రసాదించే దివ్యమైన ప్రదేశమని మన పెద్దలు చెబుతుంటారు. అందువల్ల, ఇంట్లో మనం చేసే పనులే, మన జీవితాన్ని నిర్ణయిస్తాయని, శాస్త్ర వచనం. అందులోనూ, ఇంటి నుంచి బయటి శక్తులను దూరంగా ఉంచి, మనల్ని ఎల్ల వేళలా కాపాడే గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ధర్మం ప్రకారం, గడపను సాక్ష్యత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తాము. అదువల్ల, ఆ గడప దగ్గర చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయనీ, వాటిని తెలుసుకుంటే, ఆ లక్ష్మీ మాత అనుగ్రహం మన వెంటే ఉంటుందనీ, పండితుల మాట. మన పురాణాలలో, వేదాలలో, శాస్త్రాలలో, గడపకు ఎంతో విశేషమైన స్థానం కల్పించబడింది. అందువల్ల, గడప విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలని కూడా, చెప్పబడి ఉంది. ఆ విధంగా చెప్పిన వాటిలో, గడప దగ్గర పాల ప్యాకెట్లను పెట్టం. మనలో చాలా మంది, పాల ప్యాకెట్లను వేయించుకుంటూ ఉంటాము. ఆ పాల ప్యాకెట్లు డెలివర్ చేసేవారు, వాటిని గడపపై కానీ, గడప ముందు నేలపై కానీ పెట్టి వెళ్లిపోతారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఇక్కడ పాలు కూడా లక్ష్మీ సమానం కాబట్టి, వాటిని కింద పెడితే మంచిది

దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? Lizard Shastra

Image
  దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? భగవంతుడు ఈ భూమిపై తిరిగే ప్రతి జీవికీ ఓ శక్తిని ఇచ్చాడని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మనం ప్రతి జీవినీ గౌరవించాలనీ, ప్రతి జీవికీ మేలు జరిగే పనులు చేయాలనీ, మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, మన చుట్టూ ఉండే జీవులలో కొన్ని మాత్రం కాస్త ప్రత్యేకమైనవిగా పండితులు చెబుతున్నారు. అటువంటి జీవులలో, బల్లి ఒకటి. మన ఇళ్ళలో ఎక్కువగా కనిపించే ఈ బల్లుల విషయంలో, మనకు ఎన్నో భయాలూ, అనుమానాలూ ఉంటాయి. అటువంటి అనుమానాలలో, ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలోకీ, దేవుడి పటాల మధ్యకీ బల్లులు రావచ్చా? అనేది ఒకటి. ఒకవేళ దేవుడి పటాల మధ్యలోకి బల్లులు వస్తే, మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని ఎంతో మంది సందేహపడుతుంటారు. ఆ విషయాలు స్పష్టంగా తెలుసుకోడానికి, ఈ శీర్షికను పూర్తిగా చదవండి. మన హైందవ ధర్మం ప్రకారం, బల్లికి కొన్ని శక్తులు ఉన్నాయనీ, దాని ప్రకారం అవి మనిషి జీవితంలో జరగబోయే విషయాలను ముందుగానే తెలియచేస్తాయనీ, ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందుకోసం మన ధర్మంలో, ఈ సృష్టిలో మరే ప్రాణికీ లేని విధంగా, ఏకంగా బల్లి శాస్త్రం అని ఓ శాస్త్రమే ఉంది. అటువంటి బల్లిని మనం చ

కాకులు ఇంటిపై తిరిగినా ఈ విధంగా అరిచినా ఏం జరుగుతుందో మీకు తెలుసా? Significance of Crows

Image
  కాకులు ఇంటిపై తిరిగినా, ఈ విధంగా అరిచినా ఏం జరుగుతుందో మీకు తెలుసా? .. ఈ సృష్టిలో ఉన్న కొన్ని జీవులకు, మన భవిష్యత్తును చెప్పే శక్తి ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, అది మూఢ నమ్మకం అని కొంతమంది హేతువాదులు కొట్టి పారేస్తారు. కానీ ఆ జీవులు ఇచ్చే సూచనలు నిజంగా జరిగినట్లు ఎన్నో ఆధారాలున్నాయని పెద్దలు చెబుతారు. అటువంటి శక్తివంతమైన జీవులలో, కాకులు కూడా ఒకటనీ, జగరబోయే మంచినీ, చెడునూ ముందే చెప్పే శక్తి ఉన్న కాకులు, మన ఇంట్లో ఆ దిక్కున చేరి అరిస్తే జరిగే అనర్ధం, వెన్నులో వణుకు పుట్టిస్తుందనీ, ఆ సంకేతాన్ని గుర్తించి మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టం మాటల్లో చెప్పలేమనీ పండితులు చెబుతున్నారు. కాకి ఏ దిక్కున కూర్చుని అస్సలు అరవకూడదు? అలా అరిస్తే ఏం జరుగుతుంది? వంటి సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ప్రకృతిలోని జీవులలో కాకి ఓ శక్తివంతమైన జీవి అని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, అది శని భగవానుడి వాహనం అనీ, అవి యమ దూతల ప్రతిరూపాలని కూడా చెబుతుంటారు. అందుకే వాటిని చూడగానే మనలో చాలా మందికి ఓ రకమైన భీతి కలుగుతుంది. అంతేకాదు, అవి మన ఇంటి గోడమీద చేరి పదే పదే అరుస్తూ ఉంటే, కాస్త