తపస్సు బ్రాహ్మణులు మాత్రమే చేయగలరా? పురాణాలలో ఏం ఉంది? Who is Satyatapas?
తపస్సు బ్రాహ్మణులు మాత్రమే చేయగలరా? పురాణాలలో ఏం ఉంది? బోయవాడిగా పుట్టి, బ్రాహ్మణుడిగా ఎదిగిన ‘సత్యతపుడు’ ఎవరు? మన పురాణాలలో అత్యుత్తమ గాథలు కోకొల్లలు. ఒక్కో గాథలో, మానవ జీవితాన్ని సార్థకం చేసుకునే నీతి ఎంతో గోచరిస్తుంది. బోయవాడిగా పుట్టి, బ్రాహ్మణుడిగా ఎదిగి, ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్న ముని గురించి తెలుసుకుందాము.. బోయవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా సంపాదించాడు? దుర్వాస మహార్షి చేత నామకరణం చేయబడిన ఆ బోయవాడి వృత్తాంతం ఏమిటి? సత్య దీక్షతో ఇంద్రుడిని మెప్పించి, వరాలను పొందిన ఆ బోయవాడి గాధను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/CrrnCM18VWI ] శాప వశాన సర్పంగా జన్మించిన బ్రాహ్మణ కుమారుడు, సత్యతపుడిగా ప్రసిద్ధి చెందినట్లు, ‘దేవీ పురాణం’లో వివరించబడి ఉంది. ప్రాచీన కాలంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడూ, అతని భార్య రోహిణికీ సంతానం లేదు. అందుకతడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఎందరో సాధువులు అందులో పాల్గొన్నారు. సుహోత్రుడు బ్రాహ్మణుడిగా, యాజ్ఞవల్క్యుడు పురోహితుడిగా, బృహస్పతి యజ్ఞకర్తగా, పైలుడు వేదాలు చదువుతుండగా, గోడిలుడు స్తోత్రాలు గానం చేశాడు. అతడ