The Real Tipu Sultan | Debunking Myths & Revealing Hidden History | టిప్పు సుల్తాన్!
టిప్పు సుల్తాన్! ఈ మైసూర్ మహారాజు మహానియుడా, లేక నీచుడా? ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. ఒకొక్కడు మహాహంతకుడు.. అని మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు.. అయినా, హిందూ ఆలయాల పునరుద్ధరణ చేసిన మహామనీషి, శృంగేరీ పీఠానికి ఆర్ధిక తోడ్పాటు అందించిన సహృదయుడు, హిందువులను తన కొలువులో పోషించిన గొప్ప లౌకికవాది, బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడిన భారతీయ యోధుడు, మైసూర్ మహా రాజు టిప్పు సుల్తాన్ అని వామపక్ష చరిత్రకారులూ, సెక్యులర్ నేతలూ ముక్త కంఠంతో అబద్ధాలను చాటుతుంటారు. కొందరు వాస్తవ చరిత్రకారులు మాత్రం, దాదాపు ఎనిమిది వేల ఆలయాలను కూల్చివేసి, లక్షలాది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, శాస్త్రం తెలిసిన వేలాది మంది పండితుల ప్రాణాలను దుర్మార్గంగా హరించిన కర్కోటకుడు టిప్పు సుల్తాన్ అని చెబుతారు. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వర్ధంతీ, జయంతి రోజులను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జరిగే చర్చ ఇది. ఇవన్నీ వింటూ ఉంటే మనలో చాలా మందికి అతను అసలు నిఖార్సైన నాయకుడేనా? లేక కరుడుగట్టిన రాక్షసుడా? అసలైన టిప్పు సుల్తాన్ వాస్తవ...