Posts

Showing posts with the label Kanuma Festival

కనుమ పండుగ Kanuma Festival

Image
అందరికీ 'కనుమ పండుగ' శుభాకాంక్షలు 🙏                  కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. అంటుంది శాస్త్రం..! పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు,అల్లుళ్ళు,ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. [ కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలో తెలుసా?: https://youtu.be/HEeD4ulBfK0 ] మనకు ఉన్నవి ఐదు కనుమలు. సంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదని అంటారు... కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం... "శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని" 1. శవదహనం జరిగిన మరుసటి రోజు.. 2. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు.. 3. సపిండీకరణమైన మరుసటి రోజు.. 4. గర్భస్రావం మరుసటి రోజు.. మరియు  5. సంక్రాంతి మరుసటి రోజు. వీటిని ' ఐదు కనుమలు ' అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్ర వచనం.  కనుమ రోజు పశువులను  పూజించడం ఒక సాంప్రదాయం!  దీని వెనుక కూడా ఓ కథ ఉంది... ఒకసారి శివుడు నందిని పిలిచి “భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి”  అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీస