Posts

Showing posts with the label శివగలై!

SIVAGALAI rewrites the past: Exposes Colonial Lies! | శివగలై!

Image
శివగలై! ఆ ఊరు బయటపెట్టిన చారిత్రక వాస్తవాలు! Sivagalai rewrites the past: Unfolds the truth on iron's antiquity! భారతీయ నాగరికత, హరప్పా, మొహేంజొదారో నుంచే మొదలైంది. కేవలం ఉత్తర భారత దేశంలోనే నాగరికత పురుడుపోసుకుంది. దక్షిణ భారత దేశంలో కేవలం అనాగరికులైన ఆటవిక మనుషులు మాత్రమే ఉండేవారు. అసలు భారత దేశానికి నాగరికత తెచ్చిందే యూరోప్ లో పుట్టి, వలస వచ్చిన ఆర్యులు. ఆర్యుల రాకవరకు, వారికసలు ఇనుమంటే ఏమిటో కూడా తెలియదు. ఆర్యులు తమ జ్ఞానాన్ని ఉత్తర భారతీయులకు పంచితే, కాలక్రమంలో ఆ జ్ఞానం దక్షిణ భారతం వరకు పాకింది... ఇవన్నీ గత రెండు వందల ఏళ్లుగా, భారతీయలకు నూరిపోసిన అభూత కల్పనలు. స్వతంత్ర భారతంలో పాఠ్య పుస్తకాలుగా మారిన పాఠాలు. జనాల మొదళ్ళలోకి ఎంతో మంది కుహనా మేధావులు ఎక్కిస్తున్న అవాస్తవాలు. భూమిలో మరిగిపోతున్న లావా ఎప్పటికైనా బయట పడాల్సిందే అన్నట్టు, చీకటి గర్భంలో కప్పివుంచిన అసలైన చరిత్ర కూడా ఎదో ఒకరోజు సత్యాన్వేషకుల ద్వారా బయటకు వచ్చి తీరాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి సత్యాన్ని ఒక చిన్న ఊరు బయల్పరచింది. ఆ సత్యం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసి, ఏళ్ల తరబడీ తుచ్చులు ఎంతో చాకచక్యంగా నిర్మించుకున్న అసత్య...