Posts

Showing posts from September, 2023

కర్తవ్య కర్మలు! Regulated Action భగవద్గీత Bhagavad Gita

Image
కర్తవ్య కర్మలు! సన్న్యాసమంటే బాహ్యమైన కర్మలను త్యజిస్తే సరిపోతుందా? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. భగవంతుడి ఖచ్చితమైన, మరియు సర్వోత్కృష్ట తీర్పు ఏంటో చూద్దాం.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qLSH6cHlzmQ ] 00:47 - ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ । కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ।। 6 ।। ఓ అర్జునా, ఫలములపై మమకారాసక్తి లేకుండా, మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు. యజ్ఞము, దానము, మరియు తపస్సులు, పరమేశ్వరుని పట్ల భక్తియుక్త భావముతో చేయబడాలి. ఆ దృక్పథం ఇంకా రానప్పుడు, వాటిని తప్పకుండా, అవి తన కర్తవ్యమన్న భావనతో, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఒక తల్లి తన స్వార్థ సుఖాలను త్యజించి, బిడ్

గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! Garuda Purana - Ghosts

Image
గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! ప్రేతాత్మలు మనకు ఏం చెబుతాయి? ఎలా తెలియబరుస్తాయి? మనలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయం, ‘ప్రేతాత్మలు’. ఏ కారణం లేకుండా జ్వరం వచ్చి తగ్గలేదంటే, గాలి శోకిందని భావిస్తాము. ఒక కుంటుంబంలో ఎవరైనా చనిపోయిన తరువాత ఆ ఇంట్లో కీడు జరిగిందంటే, ప్రేతాత్మే కారణమని, పరిహారాలు చూసుకుంటాం. ఈ ప్రేత్మాతల గురించి, శ్రీ మహా గరుడ పురాణం, ధర్మకాండలో, గరుడుడు, విష్ణుమూర్తిని అడుగగా, అందుకు భగవానుడే స్వయంగా సమాధానాలిచ్చాడు. ఎలాంటి మరణాలు పొందిన వారు ప్రేతాత్మలవుతారు? ఎటువంటి వారిని ప్రేతాత్మలు ఆవహిస్తాయి? ప్రేతాత్మల వలన మనకు ఎటువంటి కీడు కలిగే అవకాశం ఉంది? ప్రేతం ఆవహించిన వారు ఎటువంటి చర్యలకు పాల్పడతారు? ప్రేతాల బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయలి? వంటి ముఖ్య విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dZKCW8TLpHw ] బ్రహ్మాండాధి నాయకుడిని గరుడుడు ఇలా అడుగుతున్నాడు.. ‘అసలు ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా తిరుగుతాయి? వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి? అవెక్కడుంటాయి? వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? ప్రసన్న చిత్తుడ

సన్యాసం – త్యాగం! భగవద్గీత Bhagavad Gita Chapter 18

Image
సన్యాసం – త్యాగం! మనో-ఇంద్రియములను నియంత్రణ లోకి తెచ్చుకోవటం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/DDbEuJl80CU ] నిత్యసనాతనమైన సూత్రములనూ, మరియు శాశ్వత సత్యమునూ గూర్చిన వివరణను చూద్దాము.. 00:47 - అర్జున ఉవాచ । సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ । త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ।। 1 ।। అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మహా బాహువులు గల కృష్ణా.. 'సన్యాసము', కర్మలను త్యజించటము, 'త్యాగము', మరియు కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము యొక్క స్వభావాన్ని, తెలుసుకో గోరుతున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది ఓ కేశినిషూదనా.. అర్జునుడు శ్రీ కృష్ణుడిని

బేతాళుడు! బేతాళుని పూర్వ జన్మ వృత్తాంతం! Past Life of Betala (Vikramarka Betala)

Image
బేతాళుడు! బేతాళుని పూర్వ జన్మ వృత్తాంతం! మనం చిన్నప్పటి నుండి చాలా కథలు విని ఉంటాము. కానీ, వాటిలో ప్రత్యేకతను సంతరించుకున్న కథలు అంటే, విక్రమార్క బేతాళ కథలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి రాబోయే తరాలకు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన కథలే అయినా, అవన్నీ నేటికీ ఆచరణీయమే. విక్రమార్క – బేతాళుల గురించి, మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, అసలు బేతాళుడు ఎవరు? సకల విద్యా పారంగతుడూ, దిక్‍దిగంతాలకూ వ్యాపించిన ఖ్యాతిని పొందినవాడూ, సుగుణ వంతుడూ అయిన విక్రమార్కుడంతటి వాడిని పరీక్షపెట్టేటంతటి శక్తి బేతాళుడికి ఎక్కడిది? విక్రమార్క-బేతాళ కథల మూలం, స్మశానమా, అరణ్యమా? బేతాళుడి గత జన్మ చరిత్ర ఏంటి? అనేటటువంటి ఉత్సుకతను కలిగించే, వ్యాస భగవానుడు రచించిన ‘భవిష్య పురాణం’లోని అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/c3qWnvxsmtI ] గోదావరీ నదీ తీరాన, ప్రతిష్టానపురానికి రాజైన విక్రమార్కుడికి ఒక భిక్షువు, రోజూ ఒక పండు లోపల రత్నాన్ని పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని ర

వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రులతో ఎందుకు పూజిస్తారు? Vinayaka Chaviti

Image
మిత్రులందరికీ వినాయకచతుర్థి శుభాకాంక్షలు 🙏   వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రులతో ఎందుకు పూజిస్తారు? వినాయక చవితి పూజలో కూడా ఎన్నో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి విధానం. వినాయకుడి ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త' మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రులతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. 21 రకాల పత్రులనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైన , శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడం, కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలీ, మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తాయి. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలన్న సందేహానికి శాస్త్రీయ వివరణ.. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వ సాధారణం. ఆ పూడిక తీసి, వీటిని శుభ్రం చేయడానికి, 21 పత్రులతో చేసే పూజయే సమాధానం. అందుక

వైదిక కర్మలు! Vaidika Karma భగవద్గీత Bhagavad Gita

Image
వైదిక కర్మలు! స్వంత మనోబుద్ధుల ఆధారంగా నమ్మకం ఉండకూడదంటూ ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (25 – 28 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 25 నుండి 28 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/flwDZn97klA ] ఓం తత్ సత్ అనే పదాలకు అర్థాలను ఇప్పుడు చూద్దాం.. 00:46 - తదిత్యనభిసంధాయ ఫలం యఙ్ఞతపఃక్రియాః । దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ।। 25 ।। ప్రతిఫలములను ఆశించని వారు కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారూ, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు, ‘తత్’ అన్న పదమును ఉచ్ఛరిస్తారు. సమస్త కర్మల ప్రతిఫలములూ, ఆ భగవంతునికే చెందుతాయి. కాబట్టి, ఏ యజ్ఞమయినా, తపస్సయినా, లేదా దానమైనా, ఆ పరమేశ్వరుని ప్రీతికోసమే అర్పించి, పవిత్రం చేయబడాలి. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, బ

వశీకరణ విద్య! ఈ విద్య ఇప్పటికీ ఉందా? Vashikarana

Image
వశీకరణ విద్య! ఈ విద్య ఇప్పటికీ ఉందా? ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లో నడిపించుకోవడానికి ఉపయోగించే విద్యే ‘వశీకరణం’. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా ఉపయోగించే వాళ్లు. ఎక్కువ సందర్భాలలో వశీకరణ విద్యను, ప్రేమ, జీవితంలో ఎదగడానికీ, పనులలో ఆటంకాలు లేకుండా పూర్తవడానికీ ఉపయోగించారు. తమకు కావాల్సినట్టు, తమకు అనుకూలంగా ఉండేలా పని పూర్తి చేసుకోవడానికి, ఈ వశీకరణ మంత్రాలు సహాయ పడతాయి. అయితే ఇదంతా నిజమేనా? వశీకరణం ఈ మోడ్రన్ యుగంలో ఉపయోగించవచ్చా? వశీకరణ మంత్రాలు నిజంగానే పనిచేస్తాయా? వశీకరణం అనేది, మంచి మార్గమా? చెడు మార్గమా? అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NL8QPIrBwOA ] గమనిక: ఈ వీడియో ద్వారా వశీకరణ శక్తిని సమర్ధించడం గానీ, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం గానీ నా ఉద్దేశ్యం కాదు. కేవలం అతీంద్రయ శక్తి అయినటువంటి వశీకరణం గురించి, సమాచారాన్ని అందించడం మాత్రమే నా ప్రయత్నం. వశీకరణం ఆమోద యోగ్యమే కానీ, చెడు పద్ధతిలో దీనిని ఆచరించడం శాస్త్ర నిషిద్ధమని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. చీకటి-వెలుతురూ, మంచి-చెడు, ధర్మం-అధర్మం, ఎలా అవిన

దానాలు – ఓంకారం! భగవద్గీత Bhagavad Gita

Image
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! దానాలు – ఓంకారం! ఎటువంటి దానాన్ని రజోగుణ దానమని చెప్పాడు శ్రీకృష్ణుడు? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/GJw5wFkmEcs ] తామసిక దానముగా ఏది పరిగణించబడుతుందో ఇప్పుడు చూద్దాము.. 00:47 - యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః । దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ।। 21 ।। కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఎదో తిరిగి వస్తుందనే ఆశతో, లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది. అడగక ముందే ఇవ్వటమే, దానము చేయుటకు అతిశ్రేష్ఠమైన పద్దతి. అలా చేయకపోతే, ద్వితీయ శ్రేణి శ్రేష్ఠ పద్దతి ఏమిటంటే, అడిగినప్పుడు సంతోషముగా ఇవ్వటం. మూడవ స్థాయి దానం చేసే స్వభావం

శివుడు గొప్పా - విష్ణువు గొప్పా? Who is the Supreme Lord?

Image
శివుడు గొప్పా - విష్ణువు గొప్పా? శైవులకూ వైష్ణవులకూ మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం. ఆదిశంకారాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పాటించారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. మన పురాణాలను చూసుకున్నట్లయితే, ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని ఎక్కడా వివరించబడిలేదు. ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అంటే, శివుడు, విష్ణువు, ఒక్కటే అని అర్థం. విష్ణు స్వరూపమైన కృష్ణుడు, సంతానాన్ని పొందడానికి పరమశివునికై తపస్సు చేశాడు. సతీ దేవిని కోల్పోయి విరాగిగా మారిన శివుడికి సహాయం చేసింది, విష్ణువు. మన పురాణాలలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ, నేటి సమాజంలో శివుడు గొప్పా, విష్ణవు గొప్పా అనే మీమాంసలో జీవిస్తున్నాము. కొన్ని శతాబ్దాల క్రితం శివ భక్తులకూ, విష్ణు భక్తులకూ మధ్య వైరం ప్రజ్వరిల్లింది. ఈ ఆహుతిలో రామానుజాచార్యుల వారు కూడా బలయ్యారు. శైవ రాజులు ఎంతో మంది, వైష్ణవులను నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. వైష్ణవ రాజులు కూడా శివ భక్తులతో కఠినంగా వ్యవహిరించారు. అసలు ఈ గొడవకూ, రామానుజాచార్యుల వారికీ సం