Posts

దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? భగవద్గీత Bhagavad Gita

Image
దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/8AVAHaPcbmw ] రజో గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము.. 00:45 - శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః । అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ।। 17 ।। భక్తి-శ్రద్ధలు కల వ్యక్తులు, అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులనూ, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులని అంటారు. శారీరక, వాక్కు, మరియు మనస్సులకు సంబంధించిన తపస్సులను వేర్వేరుగా, స్పష్టంగా వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, సత్త్వ గుణములో చేసే వాటి లక్షణములను వివరిస్తున్నాడు. భౌతిక ప్రతిఫలములను ఆశించి చేయబడితే, తపస్సు దాని

శ్రీ కృష్ణుడు – హిజ్రాలు! Why did Lord Krishna become a woman for one night?

Image
శ్రీ కృష్ణుడు – హిజ్రాలు! శ్రీ కృష్ణుడి గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! శ్రీ కృష్ణ భగవానుడు చేసిన మాయలూ, లీలలూ అనంతం. వాటిలో కొన్ని మనకు తెలుసు. రాక్షసులను సంహరించడం, అష్ట భార్యలను వివాహం చేసుకోవడం, గోపికలతో బృందావన రాస లీలలూ, వీటన్నింటి గురించీ మన హిందువులకు తెలుసు. కృష్ణుడి గురించిన సంఘటనలు చెప్పుకుంటూ పోతే, కోకొల్లలు. వాటిలో కొన్ని... అనునిత్యం కృష్ణ నామ స్మరణలోనే ఉండీ, ఆయన అనుగ్రహానికి ఆ భక్తుడు ఎందుకు నోచుకోలేదు? శ్రీ కృష్ణుడి తలనొప్పిని, గోపికలు ఎలా తగ్గించగలిగారు? శ్రీ కృష్ణుడు స్త్రీగా మారి ఎవరిని వివాహం చేసుకున్నాడు? శ్రీ కృష్ణుడికీ, హిజ్రాల వివాహానికీ, ఒక్క రోజులో వైధవ్యానికీ సంబంధం ఏమిటి - వంటి ఆసక్తికరమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ukbzIKYaO1Y ] ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఎంతో సంతోషంతో, సత్యభామ ఆయనకు వడ్డిస్తోంది. అయితే, భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి, చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరుగెత్తా

బ్రాహ్మణులని ఎవరిని అంటారు? భగవద్గీత Bhagavad Gita

Image
బ్రాహ్మణులని ఎవరిని అంటారు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/w2ANVXD63co ] ఎటువంటి యజ్ఞము, తమో గుణములోనికి వస్తుందో ఇప్పుడు చూద్దాము.. 00:47 - విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ । శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ।। 13 ।।  శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నదని పరిగణించబడును. జీవితంలో, అనుక్షణం వ్యక్తులకు ఏ పనులు చేయాలన్న విషయంలో, ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మన సమాజానికి, మరియు మన సంక్షేమానికి దోహదపడే మంచి పనులు ఉంటాయి. అదే సమయంలో, ఇతరులకూ మనకూ హానికరమైన త

Did Lakshman kill his son-in-law? #ramayana | లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా?

Image
లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా? ‘సమాధి కళ’ను పొందిన ఇంద్రజిత్తు మరణ రహస్యం ఏంటి? రామాయణం ప్రకారం, రావణ మండోదరిలకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు, మేఘనాథుడు. మేఘనాథుడు, శైవ యాగం చేసి శివుని మెప్పించి, ‘సమాధి కళ’ను పొందాడు. దీని వల్ల అతడు అందరిలో ఉన్నా, ఎవరికీ కనిపించడు. అతనికి మాత్రం, అందరూ కనిపిస్తారు. అమోఘమైన శక్తులను పొందిన మేఘనాధుడు, ఇంద్రజిత్తుగా ఎలా మారాడు? లక్ష్మణుడి చేతిలో ఎలా వధింపబడ్డాడు? ఇంద్రజిత్తుకు తన మరణం గురించి ముందే తెలుసా? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_xD_6-POHho ] మేఘనాధుడు ఇంద్రుణ్ణి జయించడం వల్ల, ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. రావణుడు ఒకనాడు దేవలోకంపై దండెత్తాడు. రాక్షస సేన దేవలోకాన్ని చుట్టుముట్టింది. ఇంద్రుడు రావణుడితో తలపడ్డాడు. మేఘనాథుడు, శివుడు తనకు వరంగా ఇచ్చిన మాయా రూపంలో, ఇంద్రుని కుమారుడు జయంతుని, అస్త్రాలతో ముంచెత్తగా, అతడు పడిపోయాడు. ఇంద్రుడి తండ్రి పులోముడు, జయంతుడిని తీసుకుని వెళ్ళి, సముద్రంలో దాచాడు. ఈ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన ఇంద్రుడు, వజ్రాయుధంతో రావణ

'2023 శ్రావణ మాసం' ప్రారంభమైంది..

Image
2023 శ్రావణ మాసం ప్రారంభమైంది.. ఈ నెలలో నాగ పంచమి, రాఖీతో సహా ఏయే పండుగలొచ్చాయో తెలుసా? మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మాసానికీ ఒక ప్రత్యేకత ఉంది. అయితే, శ్రావణ మాసానికి ఉన్న విశిష్ఠతే వేరు. ఈ మాసాన్ని, ఉపవాసాలూ, పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లూ, ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులూ, వంకలూ, సరస్సులూ, చెరువులూ, నదులూ పొంగి పొర్లుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం, ఆగస్టు 17వ తేదీ నుంచి, నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది. ఈ సందర్భంగా, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలూ, వ్రతాలేంటి? అవి ఏయే తేదీలలో వచ్చాయి? వాటి ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాము.. శ్రావణ సోమవారం.. పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఇదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి, ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మంగళవారం.. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పె

అశ్వత్థ వృక్షం! Significance of Ashvattha (Peepal) Tree

Image
అశ్వత్థ వృక్షం! మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ! అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!! అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపమే కాకుండా, సర్వదేవతా స్వరూపం. ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చు. అమావాస్య  నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలదీ అంటే, 21, 108 ప్రదక్షిణలు చేసి పూజిస్తే, సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది. విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు.  మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తు౦ది. ఉదక కుంభం (నీళ్ళ చెంబు) తీసుకుని గర్భిణీ స్త్రీలా మ౦దగతితో ప్రదక్షిణ చేస్తే, అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తు౦ది. రావి చెట్టును పూజించటం వలన కలిగే ఫలితములు: అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించాడు. అశ్వత్ధమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క 'మూలము – బ్రహ్మ', 'మధ్య భాగం – విష్ణువు', 'చివరి భాగము – శివుడు' కనుక, దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో, ఇంద్రాది దేవతలో, సప్త సముద్రాలో, అన్ని పుణ్య నదుల

మాంసాహారం! భగవద్గీత Bhagavad Gita Chapter 17

Image
మాంసాహారం! బాధలనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగజేసే ఆహారములేవి? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (09 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 09 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/xi3aiY2qQeA ] ఎటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగ చేస్తాయో, శ్రీకృష్ణుడిక్కడ వివరిస్తున్నాడు.. 00:50 - కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః । ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ।। 9 ।। అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు, రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధనూ, శోకమునూ, మరియు వ్యాధులనూ కలుగచేస్తాయి. ఎప్పుడైతే శాకాహార పదార్థములను మితిమీరిన కారం, చక్కెర, ఉప్పు వంటివి వేసి వండుతారో, అవి రాజసికమైనవి అవుతాయి.